⚡ FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్⚡

MORE TO VIEW

Sunday, 11 August 2019

Mobile Apps- గూగుల్ ప్లే స్టోర్ లోని మొబైల్ యాప్స్ ఎంత వరకు సేఫ్...సంపూర్ణ విశ్లేషణ....


మొబైల్ యాప్స్ ఎంత వరకు సేఫ్...సంపూర్ణ విశ్లేషణ....

బ్యాంకు లావాదేవీలకో యాప్‌, ఫుడ్‌ ఆర్డర్‌ చేయడానికో యాప్‌, సినిమా టిక్కెటు బుకింగ్‌కో యాప్‌... ఇలా ప్రతి పనికి ఓ యాప్‌ను వాడుతున్నాం. అయితే యాప్స్‌ విషయంలో చాలా మందికి సరైన అవగాహన ఉండదు. గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేయడం, ఇన్‌స్టాల్‌ చేసుకోవడం తప్ప వాటి గురించి ఏమాత్రం తెలుసుకొనే ప్రయత్నం చేయరు. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్‌ అప్లికేషన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌ ప్లే స్టోర్‌లో లభించే చాలా అప్లికేషన్లను రెండో ఆలోచన లేకుండా ఇన్‌స్టాల్‌ చేస్తూ ఉంటాం. ప్లే స్టోర్‌లో పొందుపరచబడే అప్లికేషన్ల విషయంలో గూగుల్‌ తగినంత జాగ్రత్త తీసుకుంటుంది అన్న నమ్మకంతోనే ఇన్‌స్టాల్‌ చేసుకుంటుంటాం. చాలా వరకు ఇది నిజమే. ప్రమాదకరమైన అప్లికేషన్లను గుర్తించడం కోసం గూగుల్‌ సంస్థ ‘బౌన్సర్‌’ అనే మెకానిజం వాడుతుంది. ఇది ఒక అప్లికేషన్‌ని ఎవరైనా యాప్‌ డెవలపర్‌ ప్లే స్టోర్‌లోకి అప్‌లోడ్‌ చేసే సమయంలోనే అందులో ఉండే సోర్స్‌ కోడ్‌ మొత్తాన్నీ నిశితంగా పరిశీలించి అనుమానాస్పదంగా ఉన్నట్లయితే వెంటనే ఆ అప్లికేషన్‌ కు ప్లే స్టోర్‌లో చోటు లేకుండా తిరస్కరిస్తుంది. అంతేకాదు, మరింత అనుమానాస్పదమైన అప్లికేషన్లని గూగుల్‌ సంస్థ ప్రత్యేకంగా నియమించిన ఉద్యోగులు పరిశీలించి చూస్తారు కూడా!

గూగుల్‌ ప్లే ప్రొటెక్ట్‌
కేవలం బౌన్సర్‌ ద్వారా మాత్రమే కాదు, ఒక అప్లికేషన్‌ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారుల ఫోన్లలో ఇన్‌స్టాల్‌ చేసిన తర్వాత, అది ఆశించిన విధంగా పని చేస్తోందా? లేదా? ఏమైనా ఇబ్బంది పెడుతోందా? ప్రమాదకరమైన అంశాలకు దారితీస్తోందా? అన్నది పరిశీలించడం కోసం గూగుల్‌ సంస్థ ‘గూగుల్‌ ప్లే ప్రొటెక్‌’్ట అనే ప్రత్యేకమైన ఏర్పాటు చేసింది. దాదాపు మనందరి ఫోన్లలో ఉండే గూగుల్‌ ప్లే సర్వీసెస్‌లో అంతర్భాగంగా ఈ సర్వీస్‌ రన్‌ అవుతూ ఉంటుంది.
ఇది ప్రపంచంలో ఉన్న ఆండ్రాయిడ్‌ వినియోగదారులు అందరి ఫోన్లని తరచూ స్కాన్‌ చేస్తూ, వారి ఫోన్లలో ఇన్‌స్టాల్‌ అయిన అప్లికేషన్లు ఎలా ప్రవర్తిస్తున్నాయనే అంశాన్ని గమనిస్తూ, అవే అప్లికేషన్లు ప్రపంచంలో ఇతర ఫోన్లలో కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నట్లు అయితే, ఆయా అప్లికేషన్ల మీద చర్యలు తీసుకుంటుంది. అలాగే వాటిని తొలగించమని యూజర్‌కి నోటిఫికేషన్‌ కూడా చూపిస్తుంది.

ఇతర చోట్ల నుంచి..
అందరూ భావిస్తున్నట్లు ఆండ్రాయిడ్‌ అప్లికేషన్ల కోసం కేవలం గూగుల్‌ ప్లేస్టోర్‌ మాత్రమే కాదు. అమెజాన్‌ యాప్‌ స్టోర్‌ ఫర్‌ ఆండ్రాయిడ్‌, గెట్‌జార్‌, మొబోజిని, స్లైడ్‌మీ, యాప్టోడ్‌, ఎఫ్‌-డ్రాయిడ్‌, యాప్‌ బ్రెయిన్‌, యాప్‌ప్యూర్‌ వంటి అనేక రకాల ప్రత్యామ్నాయ అప్లికేషన్‌ స్టోర్‌లు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా అధికారికంగా నిర్వహించబడుతున్నవే కాబట్టి అక్కడ లభించే అప్లికేషన్ల విషయంలో కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు. అయితే గూగుల్‌ ప్లేస్టోర్‌ దగ్గర ఉన్నంత సెక్యూరిటీ, స్కానింగ్‌ వ్యవస్థలు కచ్చితంగా ఇవి కలిగి ఉండవు అనే చెప్పుకోవాలి. ఇలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉండి అప్లికేషన్లను ఫోన్లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలంటే, తప్పనిసరిగా ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘ఇన్‌స్టాల్‌ ఫ్రమ్‌ అన్‌నోన్‌ సోర్సెస్‌’ అనే సెట్టింగ్‌ ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేసుకోవాలి. ఈ ప్రక్రియను సైడ్‌ లోడింగ్‌ అంటారు.

పైన చెప్పుకున్న ప్రత్యామ్నాయ అప్లికేషన్‌ స్టోర్లతో పాటు, ఇంటర్నెట్లోనే అనేక వెబ్‌సైట్లలో పెయిడ్‌ ఆండ్రాయిడ్‌ అప్లికేషన్లు ఉచితంగా లభిస్తుంటాయి. అయితే వీటి జోలికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకండి. పది లేదా వంద రూపాయలు ఖర్చుపెట్టి పెయిడ్‌ యాప్‌ వాడడానికి వెనకాడేవారు ఇలాంటి వెబ్‌సైట్లను ఆశ్రయిస్తుంటారు. క్రాక్డ్‌ ఏపికె పేరుతో ఇలాంటి సైట్లు చలామణి అవుతూ ఉంటాయి. వీటి ద్వారా మీరు డౌన్‌లోడ్‌ చేసుకునే అప్లికేషన్లలో అధికశాతం మాల్‌వేర్‌ పొందుపరచబడి ఉంటుంది. కొద్ది మొత్తంలో డబ్బులు ఆదా చేసుకుందామని ప్రయత్నించినపుడు, ఆ తర్వాత మీ ఫోన్లో మాల్‌వేర్‌ ప్రవేశించి.. మీ డెబిట్‌, క్రెడిట్‌ లేదా ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ అకౌంట్లు హ్యాక్‌ కావడం, లేదా మీ డేటా థెఫ్ట్‌ కావడం వంటి అనేక రకాల సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఎక్కువగా గేమ్స్‌ ఆడే వారు, ఉచితంగా లభించే కొద్దిపాటి లెవల్స్‌తో సరిపెట్టుకోలేక, అలాగని డబ్బులు పెట్టి ఆయా గేమ్స్‌ని పూర్తిస్థాయిలో కొనడం ఇష్టంలేక, ఇలాంటి పైరేటెడ్‌ గేమ్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల ప్రమాదం చేజేతులా కొనితెచ్చుకున్నట్లే అవుతుంది.

ఫ్రీ వల్ల లాభం?
అలాగే గూగుల్‌ ప్లే స్టోర్‌ని గమనిస్తే అందులో పెద్ద మొత్తంలో అప్లికేషన్లు, గేమ్స్‌ ఉచితంగా లభిస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. ప్రపంచంలో ఉన్న అప్లికేషన్‌ డెవలపర్లు అందరూ తమ కష్టం మొత్తం తాకట్టు పెట్టి, మనకు సేవ చేయడం కోసం ఉచితంగా అప్లికేషన్లు అందిస్తున్నారు అన్న భావన మరికొంత మందిలో ఉంటుంది. ఇక్కడ మీరు గమనించారో లేదో ప్రపంచంలో ఒక నియమం ఉంది. ఏదీ ఉచితంగా రాదు.. ముఖ్యంగా టెక్నాలజీ ప్రపంచంలో మనం ఏదైనా ఉచితంగా పొందుతున్నామంటే మనకు మనం ఆ సంస్థ కోసం ప్రోడక్ట్‌గా తయారయ్యాం అని అర్థం. ఈ లెక్కన చూస్తే, గూగుల్‌ ప్లే స్టోర్‌లో మనకు ఉచితంగా లభించే అన్ని అప్లికేషన్లు, ప్రతి పది సెకన్లకి ఒక ప్రకటన చూపిస్తూ, మన సహనాన్ని పరీక్షిస్తూ తద్వారా డబ్బు సంపాదించాలని తాపత్రయపడుతూ ఉంటాయి. ఉచితంగా అప్లికేషన్లు అందించాలనుకునే అప్లికేషన్‌ డెవలపర్లు ఆదాయం సమకూర్చుకోగలిగే విధంగా యాడ్‌ నెట్‌వర్క్‌ ఇంటిగ్రేషన్‌ని గూగుల్‌ సంస్థ అప్లికేషన్‌ డెవలపర్లకు అందిస్తుంది. వాటిని ఏ స్థాయిలో వాడాలో తెలియజేస్తూ కొన్ని నియమ నిబంధనలు పెడుతుంది.

యాప్‌ స్పేస్‌ అతి కీలకం
ప్రపంచంలో అనేక ప్రముఖ అప్లికేషన్లు ఒకదానితో మరొకటి పోటీ పడుతూ ఉంటాయి. మనలాంటి ఒక యూజర్‌ ఫోన్‌ స్ర్కీన్‌లో ఎలాగైనా స్థానం సంపాదించడం కోసం పలు రకాల ఎత్తుగడలు కూడా వేస్తూ ఉంటాయి. ఒక యూజర్‌ ఫోన్లో ఒక యాప్‌ స్థానం సంపాదించగలగడాన్ని ‘యాప్‌ స్పేస్‌’ అనే పేరుతో పిలుస్తుంటారు. వివిధ ఆన్‌లైన్‌ షాపింగ్‌ అప్లికేషన్లు మొదలుకొని ఛాటింగ్‌ చేసుకునే కమ్యూనికేషన్‌ అప్లికేషన్ల వరకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారుల ఫోన్లో స్థానం సంపాదించడం కోసం, వివిధ ఫోన్‌ తయారీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

అందుకే మనం కొత్త ఫోన్‌ కొనుగోలు చేసేటప్పుడు, మనకు అవసరం ఉన్నా లేకపోయినా, మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా కొన్ని అప్లికేషన్లు ఆల్‌రెడీ ఫోన్లో ఇన్‌స్టాల్‌ చేసి ఉంటాయి. ఫోన్‌ అమ్మేటప్పుడు వివిధ అప్లికేషన్లను పొందుపరిచి యూజర్లకు అందించడం కోసం, ఆయా ఫోన్‌ తయారీ కంపెనీలు అప్లికేషన్‌ డెవలపర్ల నుంచీ ఒక్కో ఇన్‌స్టాల్‌కి కొద్ది మొత్తంలో డబ్బులు కూడా వసూలు చేస్తూ ఉంటాయి. ఇదంతా మనకు తెలియకుండా జరుగుతున్న వ్యాపారం. ఇంతకు ముందు చెప్పుకున్నట్లు, ఎవరూ మనకు సేవ చేయడం లేదు. అందరూ మనల్ని ఒక ప్రొడక్ట్‌గా భావించి ఉపయోగించుకుంటున్నారు అంతే!

ప్రమాదాలు ఇలా!
ఇంతకు ముందు చెప్పుకున్నట్లు యాప్స్‌ సురక్షితంగా ఉండటం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎప్పటికప్పుడు గూగుల్‌ ప్లే స్టోర్‌లో లభించే అప్లికేషన్ల విషయంలో ప్రమాదకరమైన ప్రవర్తన వెలుగులోకి వస్తోంది. కొన్ని అప్లికేషన్లు చడీచప్పుడు కాకుండా థర్డ్‌ పార్టీ ఎస్‌డికె (సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ కిట్‌)లను తమ సోర్స్‌కోడ్‌లో పొందుపరిచి.. ఒకపక్క గూగుల్‌ కళ్ళు కప్పడంతో పాటు, యూజర్ల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఆదాయాన్ని ఆర్జించడానికి ప్రయత్నిస్తాయి. ఫొటోలను అందంగా తయారు చేసుకొనే బ్యూటీ ప్లస్‌, ఫోన్‌ వేగంగా తయారు చేయొచ్చు అని చెప్పే క్లీన్‌ మాస్టర్‌ వంటి యాప్స్‌ ఇలాంటి చర్యలకు పాల్పడడం గమనార్హం. కాబట్టి ఎప్పటికప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది.

0 comments:

Post a Comment

Teachers INFO

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top