Search This Blog

Friday, 9 August 2019

Indian triblals- famous tribe persons -భారత దేశం లోని ముఖ్యమైన ఆదివాసీ తెగలు..ఆదివాసీ ప్రముఖులు

కొండ కోనల్లో  ఉండే ఆదివాసీ గూడెంలే.. నేటి సమాజానికి అసలు మూలాలు..!  ఆధునిక ప్రపంచం వారిని విస్మరించినా.. ఇప్పటికీ తమ  సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూనే ఉన్నారు. తమ జాతి, మనుగడ కోసం నిత్యం పోరాడుతూనే ఉన్నారు. ఇవాళ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం.1982లో ఐక్యరాజ్యసమితి .. UNWGIP (United Nations Working Group on Indigenous Populations)  కమిటీని ఏర్పాటు చేసింది. ఆదివాసీల పరిరక్షణే దీని ముఖ్య ఉద్దేశం. 1982 ఆగస్టు 9న UNWGIP తొలి సమావేశం జరిగింది. 1994 నుంచి ప్రతి ఏటా అదే రోజున   ప్రపంచవ్యాప్తంగా  ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.  ప్రపంచ ఆదీవాసీ దినోత్సవం సందర్భంగా భారత్‌లోని  పలు ఆదీవాసీ తెగలకు చెందిన సంప్రదాయలను, ఆసక్తికర విషయాలతో పాటు ప్రముఖ వ్యక్తుల గురించి తెలుసుకుందాం.
Indian triblals- famous tribe persons -భారత దేశం లోని ముఖ్యమైన ఆదివాసీ తెగలు..ఆదివాసీ ప్రముఖులు

1. బిర్సా ముండా: భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖంగా వినిపించి పేరు ఇది. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. జార్ఖండ్‌లోని ముండా తెగకు చెందిన యోధుడు.  బీహార్‌లో ఆదివాసీ ఉద్యమానికి నాయకత్వం వహించారు.  25 ఏళ్ల వయసులో ఉన్న ఆయన్ను బ్రిటిష్ సైన్యం అరెస్ట్ చేసిన రాంచీ జైల్లో పెట్టింది. 1900లో ఆయన చనిపోయారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఒకేఒక్క గిరిజన నేత ఫొటో ఉంటుంది. అది బిర్సా ముండాదే..!
2. బినై మినాషె: ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, మిజోరాం రాష్ట్రాల్లో ఈ గిరిజన తెగ కనిపిస్తుంది. వందల ఏళ్ల  కింద ఇజ్రాయెల్ నుంచి భారత్‌కు వలస వచ్చారు. ఒకానొక కాలంలో బినై మినాషెలు తమ మూలాలను మరిచిపోయారు. ఆ తర్వాత కొన్నేళ్లకు తమ మూలాలను తిరిగి తెలుసుకొని.. యూదుల సంప్రదాయాలను పాటిస్తూ వస్తున్నారు. 2005  ఇజ్రాయెల్ యూదు మత గురువు  వీరిని యూదు వంశీయులుగా గుర్తించారు.
3. పరశురాం: ఈయన చత్తీస్‌గఢ్‌లోని ఓ మారుమూల గిరిజన గ్రామానికి చెందిన వ్యక్తి. 1890ల్లో తమ ప్రాంతాల్లో రామనామం సంప్రదాయాన్ని తీసుకొచ్చారు.  భక్తి ఉద్యమం  సందర్భంగా అక్కడి గిరిజనులు రాముడి గుడిలోని వెళ్లేందుకు ప్రయత్నించారు. ఐతే వారిని ఆలయంలోని అనుమతించ లేదు. దాంతో తమ జాతికి జరిగిన అవమానంపై ప్రతీకారం తీర్చుకునేందుకు... తన శరీరంపై రామనామాన్ని పచ్చబొట్టు పొడిపించుకున్నారు. ఇప్పటికే ఆ తెగవారు ఇదే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు.  రామనామం ఉన్న దుస్తులను ధరిస్తారు. ఇంటి గోడలపైనా రామనామమే కనిపిస్తుంది.  అంతేకాదు ఇతరులను పలకరించాలన్నా.. రామ్..రామ్ అనే అంటారు.
శరీరంపై పచ్చబొట్టు పొడిపించుకున్న రామనామకుడు

4. ప్రపంచవ్యాప్తంగా దాదాపు  అన్నిచోట్లా పితృస్వామ్య వ్యవస్థే నడుస్తుంది. కానీ ఈశాన్య భారత్‌లోని ఖాసి, జయంతియా, గరో వంటి తెగలు మాతృస్వామ్య వ్యవస్థను పాటిస్తాయి. పెళ్లైన యువకులు.. భార్య వంశం, ఇంటి పేరును స్వీకరిస్తారు.
5. జారావ: అండమాన్ నికోబార్ దీవుల్లో వీరు కనిపిస్తారు. ఈ తెగలో 'బో' బాష మాట్లాడే ఆఖరి మహిళ చనిపోయింది. అండమాన్‌కు వచ్చే టూరిస్టులు ఇక్కడి ప్రజలను ఎక్కువగా కలుస్తారు. ఆ ప్రభావంతో తమ భాషతో పాటు సంప్రదాయాలు అంతమవుతున్నాయని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో  జారావ ప్రజలను కలవకూడదని.. వారు నివసించే ప్రాంతాలకు వెళ్లకూడదని.. చట్టం తీసుకొచ్చింది ప్రభుత్వం.
6. ఓరం: తూర్పు, మధ్య భారతదేశంలో ఈ తెగకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జౌల్ ఓరం, మాజీ కేంద్రమంత్రి కార్తిక్ ఓరం ఈ తెగకు చెందిన నేతలే. ఈ ప్రజలు కురూఖ్ భాష మాట్లాడుతారు. గిరిజన తెగలకు చెందిన భాషలను రాంచీలోని యూనివర్సిటీలో బోధిస్తారు. నరబలి వంటి సంప్రదాయ మూఢనమ్మకాలు ఈ తెగలో ఉన్నాయి.
7. భీల్:   పశ్చిమ, తూర్పు భారత దేశంలో వీళ్ల కనిపిస్తారు. రాజుల కాలంలో ఈ తెగవారిని యుద్ధాలు చేయడానికి ఉపయోగించేవారు. ప్రస్తుతం వీరంతా గ్రామాల్లో స్థిరపడిపోయారు. ఘూమర్ అనే గిరిజన నృత్యం రాజస్థాన్‌లోని భీల్ తెగ నుంచే వచ్చింది. ఈ తెగల్లో ఓ వెరైటీ సంప్రదాయముంది. పెళ్లి చేసుకోబోయే యువకుడు అత్తింటి వారికి 10 మేకలు కానుకగా ఇవ్వాల్సి ఉంటుంది.
8. గడ్డి: భారత్‌లో  సంచార గిరిజన తెగల్లో  ఇదొకటి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లో వీళ్లు ఎక్కువగా కనిపిస్తారు.  17వ శతాబ్ధంలో మొగల్ చక్రవర్తి  ఔరంగజేబుకు భయపడి ఈ తెగకు చెందిన ప్రజలంతా పర్వత ప్రాంతాలకు వెళ్లిపోయి.. అక్కడే స్థిరపడిపోయారు.
9.  ఖాసీ: మేఘాలయాలో వీరు నివసిస్తారు. ఈ తెగకు చెందిన ప్రజలు చిరపుంజిలో చెట్ల వేళ్లతో బ్రిడ్జ్‌ను నిర్మించారు. దీనిపై ఒకేసారి 50 మంది వెళ్లినా ఎలాంటి ప్రమాదం ఉండదు. ఈ  సహజసిద్ధ బయో ఇంజినీర్లు యావత్ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచారు.

చిరపుంజిలో చెట్ల వేళ్లతో గిరిజనులు నిర్మించిన బ్రిడ్జి ఇదే.

10. దిమాస తెగ: వీరిని నదీ పుత్రులగా వ్యవహరిస్తారు. ఈ ప్రజలు తమ ఆస్తిని మూడు భాగాలుగా విభజిస్తారు. డబ్బు, భూమి, జంతువులను తండ్రి ఆస్తిగా,  ఆభరణాలను తల్లి ఆస్తిగా, ఇంట్లోని ఇతర వస్తువులను ఉమ్మడి ఆస్తిగా భావిస్తారు. వాటిలో తండ్రి ఆస్తి మాత్రమే కుమారులకు వస్తుంది.  బాల్య వివాహాలకు ఈ తెగ వ్యతిరేకం

0 comments:

Post a Comment

AP UPDATES

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top