Search This Blog

Monday, 5 August 2019

Hiroshima Day August 6 -మానవుని మేధస్సు నుంచి పుట్టిన మహావినాశనం,మహాప్రళయం సృష్టించిన రోజు.హిరోషిమా " నగరం పై అటంబాంబ్ ను జారవిడిచినరోజు. ..

సరిగ్గా 74సంవత్సరాలక్రితం మానవుని మేధస్సు నుంచి పుట్టిన మహావినాశనం,మహాప్రళయం సృష్టించిన రోజు., ఏమైందో తెలిసేలోపలే వళ్ళంతా బగబగ మంటలు, ఊపిరి ఆగిపోతున్నట్లు ఫీలింగ్ ,కళ్ళుమసకబారుతూ  ఏమైందో తెలుసుకొనే లోపలే ఎందరో అమాయకుల ప్రాణాలు అనంత విశ్వంలో కలిసిపోయినరోజుది..అదే 1945 ఆగష్టు 6 వ తేదిన దాదాపు ఓటమి అంచున వున్న జపాన్ మీద కక్షతో హిరోషిమా " నగరం పై అమెరికా  అటంబాంబ్ ను జారవిడిచినరోజు. మానవచరిత్రలోనే ఒక సామూహిక హింసాకాండ అది.మానవత్వమే సిగ్గుతో తలదించుకున్నరోజు. ఆ బాంబు విస్పోటనం పేట్ బాయ్ గొడుగులాగ 18km ఎత్తు అంటే 11మైళ్ళు,60000 అడుగులకు మబ్బు బుడగలాగ లేచింది. దాని ప్రభావంతో దాదాపు లక్షా అరవైవేలమంది జనం చనిపోయారు.ఎందరో రేడియేషన్ ప్రభావానికి గురై అంగవైకల్యం పొందారు. పచ్చదనం కూడా కనుమరుగైపోయింది. భవనాలన్నీ నేలమట్టం అయిపోయాయి.అంతా శ్మశానవాతావరణం తాండవించింది. ఏది ఏమైనా ఇది మానవచరిత్రలోనే మాయనమచ్చగానూ,ఒక చీకటిరోజుగానూ, మానవుని భుజబలం కంటే మేధస్సుయే ఎక్కువ వినాశనం సృష్టించగలదని గుర్తింపుగా ఉండిపోయింది. చేయని పాపానికి అమాయక ప్రాణులెన్నో బలైపోయారు. వారందరికీ శ్రద్దాంజలి.....

జపాన్‌లోని హిరోషిమా నగరంపై అమెరికా అణు బాంబు జారవిడిచింది. ప్రపంచంలోనే తొలి అణు బాంబు దాడి ఇది కాగా.

* హిరోషిమా అంటే జపనీస్ బాషలో విశాలమైన దీవి అని అర్థం. దీవుల సమాహారమైన జపాన్‌లోని అతిపెద్ద దీవిలో ఉన్న పెద్ద నగరం ఇది.
* ‘ఎనోలా గే’ అనే విమానం ద్వారా అమెరికన్ ఎయిర్‌ఫోర్స్ ఉదయాన్నే 8.15 గంటలకు ఈ బాంబును హిరోషిమాపై జారవిడిచింది. ఈ బాంబును మోసుకెళ్లిన విమానం ముగ్గురు సిబ్బంది మాత్రమే ఉన్నారు. 
* యురేనియం ఆధారితమైన ఈ అణుబాంబుకు లిటిల్ బాయ్ అనే పేరు పెట్టారు. దీని బరువు 9 వేల పౌండ్లు, పొడవు 10 అడుగులు. ఈ బాంబు నేలను తాకడానికి ముందే, 1750 అడుగుల ఎత్తులోనే పేలింది. 
* బాంబు దాడికి ముందు హిరోషిమా జనాభా దాదాపు 3.4 లక్షలు కాగా, తర్వాత అది 1.37 లక్షలకు పడిపోయింది. 

* అణు బాంబు దాడికి గురైన తర్వాత హిరోషిమాలో పూసిన తొలి పుష్పం ఓలియెండర్. అందుకే దీన్ని హిరోషిమా నగర అధికారిక పుష్పంగా ప్రకటించారు. 

* బాంబు పేలిన ప్రాంతానికి కిలోమీటర్ దూరంలో పెరుగుతున్న ఆరు గింక్గో చెట్లు అణు విధ్వంసాన్ని తట్టుకొని మనుగడ సాగించాయి. రేడియేషన్ ప్రభావం నుంచి వేగంగా తేరుకొని తిరిగి చిగురించాయి. వీటిని సజీవ శిలాజాలు అంటారు. సిటీలోని ట్రామ్ వ్యవస్థ బాంబు దాడి తర్వాత కూడా పని చేసింది. గాయపడిన వారిని అందులో తరలించారు. వాటిలో కొన్ని నేటికీ పని చేస్తున్నాయి. 

0 comments:

Post a Comment

AP UPDATES

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top