ఈ చిత్రంలో కనిపిస్తున్నది విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట మండల విద్యాశాఖాకారి కార్యాలయం. అక్కడ హెల్మెట్లు ధరించి పనిచేస్తున్నవారు మండల విద్యాశాఖాధికారి కేఎన్ గాంధీ, కార్యాలయ సిబ్బంది. కార్యాలయంలో హెల్మెట్లు ధరించి పనిచేయడం చూసిన వారికి చిత్రంగానే అనిపించవచ్చుగానీ.. అవి పెట్టుకోకపోతే తల పగలడం ఖాయమని వారికి తెలుసు. విద్యా శాఖ కార్యాలయ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. పైనుంచి శ్లాబు పెచ్చులు ఊడిపడుతున్నాయి. అందుకే ఈ రక్షణ ఏర్పాటు. వాహనం నడిపే సమయంలో హెల్మెట్ పెట్టుకోమంటేనే భారమనుకుంటున్న పరిస్థితుల్లో.. ఇక్కడ రోజంతా హెల్మెట్ పెట్టుకుని పనిచేయాల్సి రావడం నిజంగా బాధాకరమే!
- పాయకరావుపేట
0 comments:
Post a Comment