రెండు నిమిషాల్లోనే నిండు వ్యాయామం!
ఉద్యోగం లేదా వ్యాపారం పరుగులతోనే సరిపోతోంది. ఇక వ్యాయామాలు చేసేందుకు సమయం ఎక్కడిది? అనే మాట ఎక్కువ మంది నోట వినిపిస్తుంది. అయితే, నిమిషాల్లోనే శరీరమంతటికీ మేలు చేసే వ్యాయామాన్నాయి ...
పుషప్స్నే తీసుకుంటే అవి చేయడానికి రెండు నిమిషాల సమయమే సరిపోతుంది. పాదాల నుంచి, తలదాకా మొత్తం శరీరంలోని ప్రతి అవయవాన్నీ ప్రభావితం చేసే శక్తి ఈ పుషప్స్కు ఉంది. పురుషులైతే ఓ 40, స్త్రీలైతే 20 పుషప్స్ చేస్తే చాలు. దీంతో శరీరానికి సరిపోయే వ్యాయామం అవుతుంది. గుండె రక్తనాళాలను పుషప్స్ ఉత్తేజితం చేస్తాయి. రోజుకు 10 పుషప్స్ చేసే 40 ఏళ్ల వాళ్లను పరిశీలించారు. ఇతరులతో పోలిస్తే, వారిలో గుండె రక్తనాళాల సమస్యలు చాలా తక్కువగా ఉండడం గమనించారు. అదే సమయంలో 40కి మించి పుషప్స్, చేసేవారిలో 96 శాతం మందికి అసలు గుండె సమస్యలే తలెత్తలేదని తేలింది. అతి తక్కువ సమయంలో ఇంత ఎక్కువ ప్రయోజనం ఉన్న పుషప్స్ రోజూ చేస్తే నిండు ఆరోగ్యంతో జీవించవచ్చు.
0 comments:
Post a Comment