Search This Blog

Monday, 5 August 2019

🌈ఆనంద వేదిక కార్యక్రమాలు.... రోజు వారీ కార్యక్రమాలు... తరగతి గదిలో అమలుచేయుటకు అనుసరించవలసిన సూచనలు రూపొందించిన వారు.... 🔹 Dr.మురహరరావు.ఉమాగాంధి (SRP) ,ఆనందవేదిక (లెవెల్ 1,2 మరియు 3 కార్యక్రమాలు... ) మరియు 🔹ఎం.శంకర ప్రసాద్ ,రిసోర్స్ పర్సన్ ,ఆనందవేదిక వారి (లెవెల్ 4 కార్యక్రమాలు...)...

🌈ఆనంద వేదిక కార్యక్రమాలు....రోజు వారీ కార్యక్రమాలు...తరగతి గదిలో అమలుచేయుటకు అనుసరించవలసిన సూచనలు  రూపొందించిన వారు....

🔹Dr.మురహరరావు.ఉమాగాంధి (SRP) ,ఆనందవేదిక (లెవెల్ 1,2 మరియు 3 కార్యక్రమాలు... ) మరియు

🔹ఎం.శంకర ప్రసాద్ ,రిసోర్స్ పర్సన్ ,ఆనందవేదిక వారి (లెవెల్ 4 కార్యక్రమాలు...)




ఆనంద వేదిక( గురువారం,తేదీ.8/8/2019)పూర్తి కృత్యము 

(లెవెల్-1-2)1నుండి 5 తరగతులు(  లెవెల్ ..3 )6నుండి 8 తరగతులు

Dr.మురహరరావు ఉమాగాంధీ


మనం చూసిన విన్న  చదివిన దానికంటే కృత్యం ద్వారా లభించిన జ్ఞానం ఎల్లప్పుడూ..గుర్తుండి పోతుంది. విద్యార్థి తనకు తాను వ్యక్తిగా ఎదుగుతూ..తనపట్ల తాను అవగాహన ఏర్పరచుకుంటూ..
కుటుంబం పట్ల సమాజం పట్ల  ప్రకృతి పట్ల ఒక సంపూర్ణావగాహన పెంచుకోవడమే..లక్ష్యం కావాలి.

కృత్య నిర్వహణ గురు శుక్రవారాలలో ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే.
 నిన్న . విద్యార్థులు విన్నకథ లోని మౌళిక విలువల ఆధారంగా..కృత్యాల నిర్వహణ ఉంటుంది.ఆటలంత ఆనందంగా..
పాటలంత ఉత్సాహంగా .కృత్య నిర్వహణ జరిగేలా చూసే బాధ్యత ఉపాధ్యాయునిదే.

కృత్యము 1-2 లెవెల్( 1 నుండి5 తరగతులు)
***************************
సహకరించుకుందాం

**************************
ఉద్దేశ్యం; విద్యార్థులలో. .  సహాయం సహకారం లక్షణాలను పెంపొందించడం.
*******************************
కృత్యం; 3వ లెవెల్; (6 నుండి 8 తరగతులు) 
*****************************                                   నాకు మీరు తెలుసు

****************************
ఉద్దేశ్యం;విద్యార్థుల మధ్య సంబంధాలను పెంపొందించడం.

 ముందుగా ...

మైండ్ ఫుల్ యాక్టివిటీ (ధ్యాన ప్రక్రియ)

 మూడు నిమిషాలు చేయించాలి
* సాధారణ శ్వాసలు
* వాటి కొనసాగింపు
* దీర్ఘ శ్వాసలు
* వాటి కొనసాగింపు
* తిరిగి సాధారణ శ్వాసలు
* నెమ్మదిగా. కళ్ళు తెరవడం

 కృత్యం నిర్వహణ.
******************
రేపటినుండి  పాఠశాలలకు వరుసగా సెలవులు గావున కృత్యం పూర్తిస్థాయిలో...
ఈరోజు నిర్వహించాలి.


కార్యాచరణ సోపానాలు:
*********************
కరపత్రిక లో...కృత్యం రెండు రోజులకి ఇవ్వబడింది. కానీ పాఠశాలలకు సెలవులు కారణంగా ..కృత్యం ఈరోజే పూర్తి చేయాల్సి ఉంటుంది.


ఉపాధ్యాయుడు ఇచ్చే ఆదేశానుసారంగా
విద్యార్థులు ప్రతిస్పందించాలి

.విద్యార్థులతో ..వారి అభిరుచులపై...ఈకృత్యం వల్ల వచ్చే మార్పులపై కొన్ని ప్రశ్నలు
ఉపాధ్యాయుడు చర్చించాలి.

‌*విద్యార్థులందరూ..ఆనందవేదికలో పాల్గొనాలి.

ఉపాధ్యాయులకు సూచనలు:
**************************
ఇందులో...విద్యార్థులందరూ..పాల్గొన్నట్లు చూడాలి

* ఉపాధ్యాయుడు వీలైతే  విద్యార్థులతో సహజంగా..స్వేచ్ఛగా..మాట్లాడేలా.. చేయాలి.
* తరగతి వాతావరణం ఉల్లాసంగా ఉండే లా.. చూడాలి.

మౌనప్రక్రియ:
************
విద్యార్థులందరినీ... రెండు నిమిషాలపాటు కళ్ళు మూసుకొని కూర్చోమనాలి. కళ్ళు మూసుకొని ఉంచలేనట్లయితే...కళ్ళు తెరచి కిందకి చూడమనవచ్చు.
* ఈ కృత్యాన్ని ఇంట్లో..తల్లి దండ్రులతోనూ...స్నేహితుల తోనూ చెప్పి వారితో కలసి ఉన్నప్పుడు వారికి సహకరించాలని విద్యార్థులకు తెలియజేయాలి
ధన్యవాదాలతో..
Dr. మురహరరావు.ఉమాగాంధి
(SRP)
ఆనందవేదిక

ఆనంద వేదిక 4 లెవల్ 9 /10 తరగతుల వారికి .....మాల్లారెడ్డి .శంకర ప్రసాద్.

 రేపు ఎల్లుండి సెలవు. అదేవిధంగా వచ్చే వారంలో కూడా సోమవారం మరియు ఆగస్టు 15 సెలవు. కనుక ఈ ఈవారం నైపుణ్యం ఈరోజుతో పూర్తి చేయాల్సి ఉంది. ఇందులో ఈరోజు రేపు ఎల్లుండి చేయాల్సిన కార్యక్రమాలు కలిసి ఉన్నాయి.
- శంకర్ ప్రసాద్


Ananadavedika programme - suggestions by Dr. Nirahara rao Uma Gandhi - ఆనంద వేదిక కార్యక్రమాలు తరగతి గదిలో అమలుచేయుటకు అనుసరించవలసిన సూచనలు  రూపొందించిన వారు....Dr. మురహరరావు.ఉమాగాంధి (SRP) ,ఆనందవేదిక
ఆనందవేదికకు స్వాగతం🙏🏼
**************************

ఆనందవేదిక తేదీ 7/8/2019 మంగళ వారం - ఆనందవేదిక -2 వ నెల మొదటి వారం  రెండవ రోజు కథా కార్యక్రమం. తేదీ.7.8 2019 బుధవారం


కథ:1-2 లెవెల్:  "నేనున్నానుగా"
కథ: 3వ లెవెల్: " గొప్ప వ్యక్తి"

1-2-3 లెవెల్స్ వారు ఈక్రింది విధంగా.... కథాకార్యక్రమాన్ని అనుసరించాలి ఆనందవేదిక లో....ఇచ్చిన సూచనలు పాటిస్తూ..ఆటలంతా ఆనందంగా..
పాటలంతా కమణీయంగా..జరిపే బాధ్యత ఉపాధ్యాయునిదే...!

ముందుగా...3 నిమిషాలపాటు ధ్యాన ప్రక్రియ చేయించాలి.
ధ్యాన ప్రక్రియ :
ధ్యాన ప్రక్రియలో...3 నిమిషాలు 
ఈ క్రిందివిధంగా అనుసరించాలి.
* కళ్ళుమూసుకుని కొన్ని సాధారణమైన శ్వాసలు తీసుకోమనాలి.
*  అలాగే సాధారణ శ్వాసలు కొనసాగించ మనాలి.
* శ్వాసపై ధ్యాస నిలపమనాలి
* కొన్ని దీర్ఘ శ్వాసలు తీసుకోమనాలి.

* దీర్ఘ శ్వాసలు కొనసాగించమనాలి.

* తిరిగి సాధారణ శ్వాసకు వచ్చి  పరిసరాలు గమనిస్తూ..కళ్ళు తెరవమనాలి.

5 వ వారం 2వ రోజు కథ:
************************



1-2 -లెవెల్స్ ..వారు నిన్న ఉపాధ్యాయుడు చెప్పిన"నేనున్నానుగా"అనే కథను ఈరోజు విద్యార్థులు చెప్పాలి.

ఉద్దేశ్యము: ఇందులో విద్యార్థులు జీవితంలో వచ్చు సమస్యలకు పరిష్కారం ఆలోచించుట నేర్చుకుంటారు

3వ లెవెల్ వారు ఉపాధ్యాయుడు చెప్పిన
" గొప్ప వ్యక్తి." అనే కథను విద్యార్థులు ఈరోజు చెప్పాలి.
ఉద్దేశ్యము: విద్యార్థులలో..తల్లి దండ్రుల పట్లగౌరవ భావం వంటి విలువల్ని పెంపొందించడం జరుగుతుంది.



రెండవరోజు కథానిర్వహణకు సూచనలు:
***********************************
* రెండవరోజు ఉపాధ్యాయుడు కధను విద్యార్థులతో చెప్పించాలి.
* అందరూ చెప్పలేక పోయినా.. కొంతమంది తోనైనా...తమ స్వంత మాటల్లో హావా భావాలు వ్యక్తీకరిస్తూ..విద్యార్థులు చెప్పాలి.
* ఉపాధ్యాయుడు  ఆదనంగా  తరగతి స్థాయిని బట్టి మరికొన్ని ప్రశ్నలు తయారు చేసుకోవచ్చు.
* పిల్లలతో..ఎక్కువ మాట్లాడించాలి.
* విద్యార్థుల అనుభవాల్ని వ్యక్తీకరించటానికి స్వేచ్ఛ ఇవ్వాలి.
* ఈ కథ ద్వారా విద్యార్థులు గ్రహించిన విషయాలను ప్రతీఒక్కవిద్యార్థిచెప్పగలగాలి.

అడిగే ప్రశ్నలలో... విద్యార్థికి               అవసరమయ్యేవిధంగా..
వారి నైపుణ్యాలను ఆలోచనలను 
పదును పెట్టేవిధంగా ప్రశ్నలు వేయాలి.

ఈ విషయాలపై తరగతిగది లో ఉపాధ్యాయుడు విద్యార్థులతో...కాసేపు చర్చించవచ్చు అందులో..ఉన్న విలువలను ..వారి అభిప్రాయాలను విద్యార్థులతో చర్చించాలి.

విద్యార్థులందరూ..ఇందులో పాల్గొనేలా.. .
 ఉపాధ్యాయుడు చూడాలి.

చివరగా ...మౌన ప్రక్రియ:
***********************

 విద్యార్థులందరిని .   2 నిమిషాలు  
కళ్ళు మూసుకొని కూర్చోమని చెప్పాలి.

కళ్ళు తెరిచాక  నేర్చుకున్న కథను 
ఇంటికి వెళ్ళాక విద్యార్థులను  వారి తల్లిదండ్రులతో..స్నేహితులతో...చర్చించి మరుసటి రోజు రమ్మని చెప్పాలి.

ధన్యవాదాలతో...
Dr. మురహరరావు.ఉమాగాంధి
(SRP)
ఆనందవేదిక

ఆనంద వేదిక : తేదీ 7/8/2019, లెవెల్ 4 శంకర ప్రసాద్ ,వైజాగ్ 



ఆనందవేదిక 2 వ నెల మొదటి వారం  మొదటి రోజు కథా కార్యక్రమం. తేదీ.6.8 2019

1-2-3 లెవెల్స్ వారు ఈక్రింది విధంగా.... కథాకార్యక్రమాన్ని అనుసరించాలి ఆనందవేదిక లో....పైన ఇచ్చిన సూచనలు పాటిస్తూ..ఆటలంతా ఆనందంగా..
పాటలంతా కమణీయంగా..జరిపే బాధ్యత ఉపాధ్యాయునిదే...!

ముందుగా...3 నిమిషాలపాటు ధ్యాన ప్రక్రియ చేయించాలి.

ధ్యాన ప్రక్రియ :
**************
ధ్యాన ప్రక్రియలో...3 నిమిషాలు
ఈ క్రిందివిధంగా అనుసరించాలి.
* కళ్ళుమూసుకుని కొన్ని సాధారణమైన శ్వాసలు తీసుకోమనాలి.
*  అలాగే సాధారణ శ్వాసలు కొనసాగించ మనాలి.
* శ్వాసపై ధ్యాస నిలపమనాలి
* కొన్ని దీర్ఘ శ్వాసలు తీసుకోమనాలి.

* దీర్ఘ శ్వాసలు కొనసాగించమనాలి.

* తిరిగి సాధారణ శ్వాసకు వచ్చి  పరిసరాలు గమనిస్తూ..కళ్ళు తెరవమనాలి.

5వ వారం 1వ రోజు కథ:
************************


1-2 లెవెల్స్ ..వారికి "నేనున్నానుగా"అనే కథను చెప్పాలి.

ఉద్దేశ్యము: ఇందులో విద్యార్థులు జీవితంలో వచ్చు సమస్యలకు పరిష్కారం ఆలోచించుట.

3వ లెవెల్ వారికి

" గొప్ప వ్యక్తి." అనే కథను చెప్పాలి.
ఉద్దేశ్యము: విద్యార్థులలో.తల్లి దండ్రుల పట్లగౌరవ భావం వంటి విలువల్ని పెంపొందించడం జరుగుతుంది.

ఉపాధ్యాయుడు 5వవారం లో..1 నుండి 5 తరగతులకు "నేనున్నానుగా అనే" కథను 6 నుండి 8 తరగతులు " గొప్ప వ్యక్తి" అనే కథను (లెవెల్స్ వారీ కథలను)
మంచి హావా భావాలతో.. స్పష్టమైన ఉచ్ఛారణతో  ఆసక్తిని కలిగించేలా....
ఉపాద్యాయుడు.విద్యార్థులకు చెప్పాలి

అడిగే ప్రశ్నలలో... విద్యార్థికి               అవసరమయ్యేవిధంగా..
వారి నైపుణ్యాలను ఆలోచనలను
పదును పెట్టేవిధంగా ప్రశ్నలు వేయాలి.

ఈ విషయాలపై తరగతిగది లో ఉపాధ్యాయుడు విద్యార్థులతో...కాసేపు చర్చించవచ్చు అందులో..ఉన్న విలువలను ..వారి అభిప్రాయాలను విద్యార్థులతో చర్చించాలి.

విద్యార్థులందరూ..ఇందులో పాల్గొనేలా.. .
 ఉపాధ్యాయుడు చూడాలి.

చివరగా ...మౌన ప్రక్రియ:
***********************

 విద్యార్థులందరిని .   2 నిమిషాలు
కళ్ళు మూసుకొని కూర్చోమని చెప్పాలి.

కళ్ళు తెరిచాక  నేర్చుకున్న కథను
ఇంటికి వెళ్ళాక విద్యార్థులను  వారి తల్లిదండ్రులతో..స్నేహితులతో...చర్చించి మరుసటి రోజు రమ్మని చెప్పాలి.

ధన్యవాదాలతో...
Dr. మురహరరావు.ఉమాగాంధి
(SRP)
ఆనందవేదిక

లెవెల్ 4 - ఆనంద వేదిక 


0 comments:

Post a Comment

AP UPDATES

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top