Search This Blog

Tuesday, 16 July 2019

There is no such ‘Scooty Yojana’ scheme launched by the Modi Government

There is no such ‘Scooty Yojana’ scheme launched by the Modi Government   పీఎం స్కూటీ యోజన.. పది పాసైన బాలికలకు స్కూటీలు ఫ్రీగా ఇస్తున్నారా?    కాలేజీలకు వెళ్లే అమ్మాయిలు, ఆఫీసులకు వెళ్లే మహిళల కోసం కేంద్రం స్కూటీ యోజనను ప్రారంభించిందని ప్రచారం జరుగుతోంది. కానీ ఇదంతా తప్పుడు ప్రచారం. కేంద్రం అలాంటి పథకాన్ని అసలు ప్రవేశపెట్టలేదు.  ‘‘మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తోన్న కేంద్ర సర్కారు మరో అడుగు ముందుకేసింది. పదో తరగతి పాసైన బాలికలకు ఉచితంగా స్కూటీలను అందజేసే.. ‘పీఎం స్కూటీ యోజన’ను ప్రారంభించింది’’ అని గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. పదోతరగతి పాసైన అమ్మాయిలు పై చదువులు చదువుకోవడం కోసం, చిరు ఉద్యోగాలు చేసే మహిళలు పని ప్రదేశాలకు వెళ్లి రావడానికి అనువుగా.. ఈ పథకాన్ని ప్రారంభించారని ప్రచారం చేస్తున్నారు.  సర్కారీ యోజన వెబ్‌సైట్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని.. టెన్త్ మెమో, రేషన్ కార్డు, ఆధార్, ఇన్‌కమ్ సర్టిఫికెట్‌‌లతోపాటు.. ఎల్ఎల్ఆర్ లైసెన్స్ కూడా దరఖాస్తు సమయంలో సమర్పించాలనేది సదరు వార్త సారాంశం. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసుండి, రూ.2.50 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న మహిళలు మాత్రమే దరఖాస్తుకు అర్హులని ప్రచారం జరుగుతోంది. ఇదంతా నిజమేనని నమ్మిన చాలా మంది దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఎల్ఎల్ఆర్ లైసెన్స్ కోసం కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు. కానీ ఇది ఫేక్ న్యూస్.  మరీ ఈ ప్రచారమంతా ఏంటని అనుకుంటున్నారా..? గత ఏడాది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులో ‘అమ్మ స్కూటర్ స్కీమ్’ను ప్రారంభించారు. అది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ పథకం. కేవలం ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన ఈ పథకం ప్రకారం లబ్ధిదారులకు స్కూటీ ధరలో 50 శాతం లేదా రూ.25 వేలు సబ్సిడీగా ప్రభుత్వం అందజేస్తుంది.
There is no such ‘Scooty Yojana’ scheme launched by the Modi Government

పీఎం స్కూటీ యోజన.. పది పాసైన బాలికలకు స్కూటీలు ఫ్రీగా ఇస్తున్నారా?

కాలేజీలకు వెళ్లే అమ్మాయిలు, ఆఫీసులకు వెళ్లే మహిళల కోసం కేంద్రం స్కూటీ యోజనను ప్రారంభించిందని ప్రచారం జరుగుతోంది. కానీ ఇదంతా తప్పుడు ప్రచారం. కేంద్రం అలాంటి పథకాన్ని అసలు ప్రవేశపెట్టలేదు.
‘‘మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తోన్న కేంద్ర సర్కారు మరో అడుగు ముందుకేసింది. పదో తరగతి పాసైన బాలికలకు ఉచితంగా స్కూటీలను అందజేసే.. ‘పీఎం స్కూటీ యోజన’ను ప్రారంభించింది’’ అని గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. పదోతరగతి పాసైన అమ్మాయిలు పై చదువులు చదువుకోవడం కోసం, చిరు ఉద్యోగాలు చేసే మహిళలు పని ప్రదేశాలకు వెళ్లి రావడానికి అనువుగా.. ఈ పథకాన్ని ప్రారంభించారని ప్రచారం చేస్తున్నారు.
సర్కారీ యోజన వెబ్‌సైట్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని.. టెన్త్ మెమో, రేషన్ కార్డు, ఆధార్, ఇన్‌కమ్ సర్టిఫికెట్‌‌లతోపాటు.. ఎల్ఎల్ఆర్ లైసెన్స్ కూడా దరఖాస్తు సమయంలో సమర్పించాలనేది సదరు వార్త సారాంశం. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసుండి, రూ.2.50 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న మహిళలు మాత్రమే దరఖాస్తుకు అర్హులని ప్రచారం జరుగుతోంది. ఇదంతా నిజమేనని నమ్మిన చాలా మంది దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఎల్ఎల్ఆర్ లైసెన్స్ కోసం కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు. కానీ ఇది ఫేక్ న్యూస్.
మరీ ఈ ప్రచారమంతా ఏంటని అనుకుంటున్నారా..? గత ఏడాది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులో ‘అమ్మ స్కూటర్ స్కీమ్’ను ప్రారంభించారు. అది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ పథకం. కేవలం ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన ఈ పథకం ప్రకారం లబ్ధిదారులకు స్కూటీ ధరలో 50 శాతం లేదా రూ.25 వేలు సబ్సిడీగా ప్రభుత్వం అందజేస్తుంది.


తమిళనాడులో మాత్రమే కాకుండా రాజస్థాన్, జమ్మూ కశ్మీర్లోనూ ఇలాంటి పథకం ఉంది. రాజస్థాన్లో మేధావి స్కూటీ యోజన, దేవనారాయణ ఛాత్ర స్కూటీ యోజన అనే రెండు పథకాలున్నాయి. వీటి అర్హతలు, అందే సౌలభ్యాలు వేరుగా ఉంటాయి. గూగుల్‌లో ఎంత గాలించినా.. పీఎం స్కూటీ యోజన పథకం వివరాలు లభ్యం కాలేదు. ఫ్యాక్ట్‌లీ.ఇన్ కూడా ఇది తప్పుడు ప్రచారమని తేల్చింది. ఫైనల్‌గా చెప్పొచ్చేది ఏంటంటే.. పీఎం స్కూటీ యోజన అనేది అసలు లేనేలేదు.


స్కూటీ కొనుక్కోవడానికి అమ్మాయిలకు 75,000 రూపాయిలు మోడీ ప్రభుత్వం ఇస్తుందని వస్తున్న వార్తల్లో నిజం లేదు
రెండవసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన మోడీ దేశంలోని అమ్మాయిల కోసం కొత్తగా ‘స్కూటీ యోజన’ ని మొదలుపెట్టారని చెప్తూ ఒక లింక్ తో కూడిన పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఉన్న విషయం....

పదో తరగతి పాస్ అయిన బాలికలకు ఫ్రీ స్కూటీ… సరికొత్త పథకం.....ఇదే వైరల్ అయిన ఫేక్ న్యూస్... చదవండి..

మహిళల సంక్షేమం కోసం ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. మరొక అడుగు ముందుకు వేసి అర్హత కలిగిన బాలికలకు స్కూటీలు ఇవ్వాలనే లక్ష్యంతో స్కూటీ యోజన ప్రవేశపెట్టారు. పదో తరగతి తర్వాత బాలికలు ఉన్నత విద్యను అభ్యసించాలని, ఎలాగైనా పై చదువులు చదవడం… ఆ తర్వాత చిన్నపాటి ఉద్యోగాలు చేసేందుకు వెళ్లి రావడానికి ఇబ్బందులు పడుతున్నారు.

♦ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీస్కూటీ యోజన పథకాన్ని సంబంధించి ఈ ఏడాది మే నెలలో శ్రీకారం చుట్టారు. ఈ పథకంలో బాలికలు, మహిళలకు స్కూటీలు ఉచితంగా ఇవ్వనున్నారు. సర్కార్ యోజన వెబ్‌సైట్‌లోకి వెళ్లి స్కూటీ యోజనకు సంబంధించిన దరఖాస్తు నింపాలి. పదో తరగతి మార్కుల జాబితా, రేషన్ కార్డు, ఆధార్‌, ఆధాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఎల్‌ఎల్‌ఆర్ లైసెన్స్ కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తుతో నమోదు చేయాలి.

♦అందుకు సంబంధంచి ధ్రువీకరణ పత్రాలు కూడా జత చేయాలి. ఈ నెల 30వ తేదీతో తరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుంది. అర్హత ఉన్న వారికే స్కూటీ ఇస్తారు. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే అవకాశం కల్పిస్తారు. పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాల్సి ఉంది. 18 నుంచి 40 సంవత్సరాల లోపు ఉండాలి. ఆదాయం రూ. 2.50 లక్షల లోపు ఉండాలి. ఆధార్‌, రేషన్ కార్డు, మార్కుల జాబితాలో ఒకే పేరు ఒకేలా ఉండాలి. ఏదైనా తేడా ఉంటే దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది

⌨తెలుగులో మెసేజ్  టైపు చేయుటకు ఒక మంచి యాప్....గూగుల్ ఇండిక్ కీ బోర్డ్....
ఇంగ్లీష్ లో టైప్ చేసినచో తెలుగు లోకి మార్చుతుంది..

Google Indic Keyboard -  Easy Telugu typeing App in mobile phone

డౌన్లోడ్ చేసి ఉపయోగించండి....
👇👇👇 

http://www.mannamweb.com/2017/12/google-indic-keyboard-easy-telugu.html

0 comments:

Post a Comment

AP UPDATES

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top