⚡ FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్⚡

MORE TO VIEW

Wednesday, 31 July 2019

No more Pay Commissions in future? Salary of employees may be set by new formulas

ఇక పే రివిజన్ కమిషన్లు ఉండవు.రాష్ట్రాల్లోనూ తదనుగుణంగా మార్పులు.



పదేళ్లకోసారి వేతన సవరణ సంఘాల్ని నియమించి, వాటి సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వోద్యోగుల జీతాల పెంపును నిర్ణయించే పాత పద్ధతికి కేంద్రం మంగళం పాడబోతోంది. 2016 నుంచి అమలవుతున్న ప్రస్తుత 7వ పే కమిషన్ చిట్టచివరిది. 8వ పే కమిషన్ ఉండబోదు. ఇక నుంచి జీవన వ్యయ సగటు, నిత్యావసర వస్తువుల ధరల సూచీల ఆధారంగా ‘యాక్రాయిడ్’ ఫార్ములాతో కేంద్ర ఉద్యోగుల జీతాల పెంపును నిర్ణయిస్తారు. బ్రిటిషర్ వాలెస్ రడుల్ యాక్రాయిడ్ (1899-1979) ప్రఖ్యాత పౌష్టికాహార నిపుణుడు, రచయిత. ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ (FAO)లోని ‘డిపార్ట్మెంట్ ఆఫ్ నూట్రిషన్’కు ఆయన తొలి డైరెక్టర్. ఇండియాలో 1935లో ప్రభుత్వ పౌష్టికాహార పరిశోధన సంస్థ (కూనూర్) డైరెక్టరుగా నియమితుడైన యాక్రాయిడ్, పౌష్టికాహార సమస్యలపై పరిశోధనలు నిర్వహించి విలువైన సూచనలు అందించారు. ఆహారం, దుస్తులు వంటి నిత్యావసరాలపై సగటు భారతీయుడు వెచ్చించే కనీస వ్యయాన్ని, నిత్యావసర వస్తువుల ధరల్లో కలిగే మార్పులు సామాన్యుడిపై చూపే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని యాక్రాయిడ్ పలు సిఫార్సులు చేశారు. నాడు కేంద్ర ప్రభుత్వోద్యోగుల పే ప్యాకేజి రూపకల్పనకు ‘యాక్రాయిడ్ మెథడ్’ ఆధారమైంది. ఇప్పుడూ అదే ప్రాతిపదిక కాబోతోంది. ప్రభుత్వోద్యోగుల వేతనాలు, కరవుభత్యం పెంపు  విషయంలో కేంద్ర సర్కారు అవలంబించే విధానాన్నే రాష్ట్రాల ప్రభుత్వాలూ పాటిస్తాయి. అంటే... మన రాష్ట్రంలో ప్రస్తుతం ఐదేళ్లకోమారు నియమిస్తున్న వేతన సవరణ సంఘాలు కూడా ఇకపై ఉండబోవు. ద్రవ్యోల్బణంతో ముడిపెట్టి వేతనాల్ని ఎప్పటికప్పుడు సవరించడంపై ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ... ఉద్యోగుల పనితీరు, ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా వేతనాలు, ప్రమోషన్లు, ఇక్రిమెంట్లు నిర్ణయిస్తామని కేంద్రం పేర్కొంటే మాత్రం... సర్కారీ ఉద్యోగులకు కష్టాలే....

0 comments:

Post a Comment

Teachers INFO

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top