Search This Blog

⚡ FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్⚡

MORE TO VIEW

Thursday, 18 July 2019

DSC 2018 - UPDATES -డి ఎస్ సి 2018 - జాబితా వచ్చేసింది జిల్లా స్థాయి పోస్టుల భర్తీకి కసరత్తు జిల్లాకు చేరిన జాబితాలు తొలివిడతలో పాఠశాల సహాయకులకు అవకాశం


డి ఎస్ సి 2018 - జాబితా వచ్చేసింది

జిల్లా స్థాయి పోస్టుల భర్తీకి కసరత్తు

జిల్లాకు చేరిన జాబితాలు
  
తొలివిడతలో పాఠశాల సహాయకులకు అవకాశం

 డీఎస్సీ-2018 జిల్లా స్థాయి పోస్టుల భర్తీకి కసరత్తు ప్రారంభమైంది. తొలివిడతగా పాఠశాల సహాయకుల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ నుంచి బుధవారం ప్రొవిజినల్‌ జాబితాలు జిల్లాలకు చేరాయి. సహాయకుల ఆంగ్లం, గణితం, భౌతిక, జీవ, సాంఘికశాస్త్రం సబ్జెక్టుల్లో జాబితాలు వచ్చినట్లు అధికారులు ధ్రువీకరించారు.

జిల్లా స్థాయిలో ప్రభుత్వ, జడ్పీ, పురపాలక, గిరిజన సంక్షేమ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు.
పాఠశాల సహాయకులు, ఎస్జీటీ పోస్టులు వేర్వేరుగా భర్తీ చేస్తారు. భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులపై న్యాయస్థానంలో వ్యాజ్యం ఉన్నందున వీటి భర్తీపై స్పష్టత రావాల్సి ఉంది. పాఠశాల సహాయకుల పోస్టులకు సంబంధించి వచ్చిన ప్రొవిజినల్‌ జాబితాలను జిల్లా విద్యాశాఖ గతంలో అప్‌లోడ్‌ చేసిన రోస్టరు పాయింట్లు, మార్కుల జాబితా ఆధారంగా సరిగా ఉన్నాయా? లేవా? పరిశీలించి ఆమోదం నిమిత్తం పాఠశాల విద్యాశాఖకు పంపించనుంది. తదుపరి పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన జాబితాను జిల్లా ఎంపిక కమిటీ ప్రచురించనుంది.

రెండ్రోజుల్లో ఆన్‌లైన్లో.

ఎంపికైన అభ్యర్థులు ధ్రువపత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసుకోవాలి. ఇందుకు రెండ్రోజుల సమయం కేటాయించారు. అనంతరం స్థానికంగా (అప్‌లోడ్‌ చేసిన వివరాల ప్రకారం)ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. వీరిలో అనర్హులుంటే తొలగించి వారి స్థానాల్లో తదుపరి వారికి అవకాశం కల్పిస్తారు. అనర్హుల స్థానంలో ఎంపికై వారు ధ్రువపత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఇవీ పరిశీలించి ఎంపిక జాబితాను రూపొందిస్తారు. ఇలా పోస్టుల సంఖ్య మేరకు అభ్యర్థులు ఎంపికయ్యే వరకు ఈ ప్రక్రియ సాగుతుంది. పాఠశాల సహాయకులకు మూడు, ఎస్టీటీ కేడర్‌లో అయిదుసార్లు అనర్హుల స్థానంలో తదుపరి వారికి అవకాశం కల్పించేలా షెడ్యూల్‌ను రూపొందించారు. అనంతరం తుది జాబితాను ప్రచురించి, ఖాళీల ఎంపిక నిమిత్తం ఆప్షన్లు ఇచ్చుకునేందుకు రెండు రోజులు గడువును నిర్దేశించారు. తుదిగా ఉత్తర్వులు అందజేస్తారు.

షెడ్యూల్‌ ఇలా...


జులై 17 నుంచి ఆగస్టు 5 వరకు పాఠశాల సహాయకులు, ఆగస్టు 2 నుంచి సెప్టెంబరు 4 నాటికి ఎస్జీటీలకు కౌన్సెలింగ్‌ నిర్వహించి, నియామక ఉత్తర్వులు జారీ చేసేలా షెడ్యూల్‌ను రూపొందించారు. అయిదు దశల్లో నిర్వహిస్తున్న ప్రక్రియలో తొలుత రాష్ట్రం యూనిట్‌గా నిర్వహించిన ఆదర్శ, ఏపీ బీసీ సంక్షేమ పాఠశాలల ప్రధానాచార్యుల పోస్టులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. జోనల్‌ స్థాయిలో పీజీటీ, టీజీటీ పోస్టులకు కౌన్సెలింగ్‌ను ఇటీవలే పూర్తిచేశారు. షెడ్యూల్‌ మేరకు ప్రధానాచార్యులు పోస్టులకు జులై ఏడు, పీజీటీలకు జులై 14, టీజీటీలకు ఆగస్టు ఒకటికి నియామక ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. రాష్ట్ర యూనిట్‌గా నిర్వహించే పోస్టులకు జిల్లాలో ఎంపికైన వారి సర్వీసు ధ్రువపత్రాల నిజనిర్ధారణకు పంపించినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

నిబంధనలివీ..

● ఆన్‌లైన్‌లో నమోదు చేసిన వివరాల ఆధారంగా ధ్రువపత్రాలను పరిశీలిస్తారు.

● ధ్రువపత్రాలను తప్పుగా నమోదు చేస్తే మార్పులు, చేర్పులకు జిల్లా స్థాయిలో అవకాశం లేదు. అభ్యర్థులు నేరుగా న్యాయస్థానం, ఉన్నత స్థాయిలో (అమరావతి) అధికారులను సంప్రదించాలి.

● జిల్లా స్థాయిలో భర్తీచేసే పోస్టులు విద్యాశాఖ, పురపాలక, గిరిజన సంక్షేమ శాఖల అధికారుల సమన్వయంతో ధ్రువపత్రాల పరిశీలన, నియామక ప్రక్రియ జరుగుతుంది.

● అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఎంపికైతే వారు ఏ పోస్టుకు ప్రాధాన్యత (విల్లింగ్‌) ఇస్తారో తెలుసుకుని, రాతపూర్వకంగా తీసుకుంటారు. ఆ పోస్టులో తరువాత వారికి అవకాశం కల్పిస్తారు.

1 comment:

  1. SA Provisional list not released yet.........As per the schedule it's must be released on 17 th July.... But until not released.....

    ReplyDelete

Teachers INFO

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top