Search This Blog

Saturday, 13 July 2019

100 సంవత్సరాల క్రితమే భూ గర్భం లో ఏర్పడ్డ అండర్ గ్రౌండ్ టౌన్ కూబర్ పేడీ.... ఇంతకు ఆ భూగర్భ పట్టణం ఎక్కడ ,ఎలా ఏర్పడింది....ఏమా కధ....-Coober Pedy, the underground town..Coober Pedy was established in 1915 .-Details

Coober Pedy, the underground town has featured in several films including The landscape Mad Max Beyond Thunderdome, and The Adventures of Priscilla: Queen of the Desert.
They don’t call it Down Under for nothing.

Welcome to Coober Pedy, a bustling Australian town 846 km north of Adelaide, where everyone lives underground.

On the surface, the place looks pretty deserted. With just a few hotels and, randomly, a golf course dotted around, the place has the air of an abandoned town.

In fact, around 3,500 people live there. It’s just that most of them (60 per cent) live below the surface – in homes burrowed out of caves.
Coober Pedy was established in 1915 following the discovery of opal there. Ninety five per cent of the world’s opal comes from the area.

But, people who flocked there to mine the previous stones soon discovered life above ground was pretty tough – because of the scorching temperatures. In the summer, the temperature often exceeds 40 degrees Celsius (104 degrees Fahrenheit).

Check out the Coober Pedy video here (if anyone’s seen Aussie cult film The Castle, it’s sort of like that but underground).

 నేల కింద ఓ ఊరుంది!

నేల... నేలమీద ఇల్లు... ఇంటిమీద ఆకాశం... ప్రపంచంలో ఏ మనిషైనా ఇదే చెబుతాడు. కానీ ఆస్ట్రేలియాలోని ఓ గ్రామస్థులు దీనికి రివర్స్‌లో చెబుతారు... ఆకాశం... ఆకాశం కింద నేల... నేల కింద ఇల్లు అని. ఎందుకంటే అక్కడ ఇళ్లన్నీ నేల కింద ఉంటాయి మరి!

దక్షిణ ఆస్ట్రేలియాలోని ఆ గ్రామానికి దగ్గరల్లో, హైవేకు కాస్త దూరంగా ఓ బోర్డు కనిపిస్తుంది. దానిమీద ఇలా రాసి ఉంటుంది... ‘చూసుకుని నడవండి. వెనక్కి నడవకండి. పరుగులు పెట్టకండి. ఇక్కడ పెద్ద పెద్ద గోతులున్నాయి. పడిపోతే ప్రమాదం’? రోడ్డు మీద నుంచి చూస్తే అలాంటివేం కనిపించవు. కానీ జాగ్రత్తగా అటువైపు వెళ్తే ఎక్కడ చూసినా పెద్ద పెద్ద గోతులు కనిపిస్తుంటాయి. నిజానికవి మామూలు గోతులు కావు, ‘కూబర్ పెడీ’ గ్రామ ప్రవేశద్వారాలు.


నేల అడుగున ఎందుకు?

కూబర్ పెడీ అనే పదం ‘కుప-పిటి’ అనే మాట నుంచి వచ్చింది. అంటే ‘వైట్‌మ్యాన్స్ హోల్’, ‘వాటర్ హోల్’ అనే అర్థాలున్నాయి. 1915లో విల్లీ హషిన్సన్ అనే వ్యక్తి... అక్కడ ఒపెల్ అనే విలువైన రాళ్లు అధికంగా ఉన్నట్లు గుర్తించాడు. తర్వాత ఆ విషయంపై పలు పరిశోధనలు జరిగాయి. విల్లీ చెప్పినట్లుగా అక్కడ ఒపెల్ గనులు ఉన్నట్లు నిర్ధారణయ్యింది.

దాంతో 1916 నుంచీ ఒపెల్ తవ్వకాలు మొదలయ్యాయి. 1999 నాటికి ఆ ప్రదేశమంతా డ్రిల్ చేసి, ఒపెల్ రాళ్లను తవ్వేశారు. దాంతో గనులు తరిగిపోయాయి. దాదాపు పదిహేను మీటర్ల లోతు గల పెద్ద పెద్ద గోతులు మిగిలాయి. ఇవే తర్వాతి కాలంలో నివాస స్థలాలుగా మారాయి.

అలా గోతుల్లో నివసించాలను కోవడానికి కారణం, అక్కడి ఉష్ణోగ్రత. మామూలు రోజుల్లో సైతం 40 డిగ్రీలకు దగ్గర్లో ఉండే వేడి, వేసవి వస్తే బాగా పెరిగి పోతుంది. గనుల తవ్వకాల్లో పాల్గొన్నవాళ్లు లోతైన గోతుల్లో పనిచేస్తున్నప్పుడు అక్కడ చల్లగా ఉండటం గమనించారు. తవ్వకాలు ముగిసిన తర్వాత వాళ్లే అక్కడ నివాసాలు ఏర్పరచుకున్నారని, అలా మెల్లగా ఆ గ్రామం వెలసిందని చెబుతారు అక్కడివాళ్లు.

లేనిదేం లేదు!

ప్రస్తుతం కూబర్ పెడీ జనాభా సుమారు రెండు వేలు. వీరిలో తొంభై శాతం మంది భూగర్భ గృహాల్లోనే నివసిస్తున్నారు. ఈ గృహాలను వాళ్లు డగౌట్స్ అని పిలుచుకుంటారు. అలా నివసించడం ఇష్టంలేని వాళ్లు కాస్త దూరంగా నేలమీద గృహాలు నిర్మించు కున్నారు. భూగర్భంలో ఇళ్లంటే ఏదో ఓ మాదిరిగా ఉంటాయనుకోవద్దు. చాలా ఆధునికంగా, విలాసవంతంగా ఉంటాయి. ప్రతి ఇంటికీ మూడు పడక గదులతో పాటు వంటగది, బాత్‌రూమ్, లాంజ్ ఉంటాయి.

నేల నుండి గుంతల్లోనికి దిగడానికి మెట్లలా ఉంటాయి. ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వెళ్లడానికి విశాలమైన సందులు ఉంటాయి. భూగర్భంలోనే వారికోసం ఓ చర్చ్, హోటల్, బుక్‌స్టాల్ కూడా ఉన్నాయి. ప్రతి ఇంటికీ కరెంటు ఉంది. టీవీలు, రేడియోలు వంటివి ఉన్నాయి. చాలా చల్లగా ఉంటుంది కాబట్టి ఏసీలతో పనిలేదు. ఈ మధ్యనే ప్రభుత్వం వీరికి కేబుల్, ఫోన్ కనెక్షన్లు కూడా ఏర్పాటుచేసింది. వారానికోసారి పక్కనున్న పట్టణాల నుంచి కూరగాయలు, పాలు, గుడ్లు, మాంసం వంటివన్నీ వస్తాయి.

ఆ రోజే అందరూ బయటికి వచ్చి వారానికి కావలసినవన్నీ తీసుకెళ్తూ ఉంటారు. హోటల్ ఎలాగూ ఉండనే ఉంది. మొత్తంగా వాళ్లకు ఏ లోటూ లేదనే చెప్పాలి. ‘‘మితిమీరిన ఉష్ణోగ్రత కారణంగా మేమీ ఏర్పాటు చేసుకున్నాం. దీనివల్ల మాకు ఏ ఇబ్బందీ లేదు. ఎలాంటి నష్టమూ లేదు. పైగా కాలుష్యం కూడా ఉండదు’’ అంటూ ఆనందంగా చెబుతున్నారు నివాసితులు.

కాకపోతే భూగర్భ గృహాలు కాబట్టి వీరు కాస్త జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఏదైనా ఇంట్లో అగ్నిప్రమాదం లాంటిది సంభవిస్తే మిగిలిన ఇళ్లు కూడా త్వరగా ప్రభావితమవుతాయి. అంతేకాక, చెత్త కూడా ఎక్కడ పడితే అక్కడ పారేయ కూడదు. ఒక్కసారి పురుగూ పుట్రా వచ్చా యంటే, వాటిని వదిలించుకోవడం అంత తేలిక కాదు. అందుకే చెత్తను మురిగి పోనివ్వకుండా నేలమీదికి వచ్చి, ప్రత్యేకంగా కేటాయించిన స్థలంలోనే పారబోస్తారు.

వేడిని తాళలేక వెతుక్కున్నఈ ప్రత్యామ్నాయ జీవనవిధానం ఎందరినో ఆశ్చర్యపరిచింది. మరెందరినో ఆకర్షించింది. 2006లో వచ్చిన ఒపల్ డ్రీమ్ చిత్రాన్ని ఇక్కడే తీశారు. అప్పట్నుంచీ ఇది మరింత పాపులర్ అయిపోయింది. ఓ వైవిధ్యభరిత జీవనశైలికి ఊపిరి పోసిన కూబర్ పెడీ... ఏడాది పొడవునా వచ్చే సందర్శకులతో సందడి సందడిగా మారిపోయింది.

- సమీర నేలపూడి

0 comments:

Post a Comment

AP UPDATES

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top