ఉపాధ్యాయ ఖాళీలపై సుప్రీం స్పందన
★ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలపై మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు ఆదేశం.★ మూడు రోజుల్లో నివేదిక ఇవ్వకపోతే ఇరురాష్ట్రాల సీఎస్‌లు తమ ఎదుట హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరిక.
★ ఏపీ, తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది.
★ ఇది వరకే దీనిపై నివేదిక ఇవ్వాలని సుప్రీం కోర్టు ఇరురాష్ట్రాలకు ఆదేశం.
★ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు వాయిదా కోరాయి.
★ దీంతో తాజాగా విచారణ చేపట్టిన అత్యున్నత ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ.
0 comments:
Post a Comment