Wednesday, 29 May 2019

PAN Card:how to check your PAN Card Activation - మీ పాన్ కార్డ్ యాక్టీవ్‌గా ఉందా? చెక్ చేయండి ఇలా



PAN Card: మీ పాన్ కార్డ్ యాక్టీవ్‌గా ఉందా? చెక్ చేయండి ఇలా

    🔹మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? అసలు ఆ పాన్ కార్డ్ యాక్టీవ్‌గానే ఉందా? ఇది తెలుసుకోవడం చాలా సులువు. మీరే ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. కంప్యూటర్ ఉంటే చాలు. మీ పాన్ నెంబర్‌ను వెరిఫై చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను శాఖ ఈ అవకాశం కల్పిస్తోంది. దీన్నే పాన్ వెరిఫికేషన్ లేదా నో యువర్ పాన్ అంటారు.

 🔸ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో పాన్ వెరిఫికేషన్ చేయొచ్చు. మీ పాన్ నెంబర్ యాక్టీవ్‌గా ఉంటే ఏ సమస్యా లేదు. ఒకవేళ మీ పాన్ నెంబర్ యాక్టీవ్‌గా లేకపోతే లావాదేవీల్లో సమస్యలు వస్తాయి. లేదా మీరు క్రెడిట్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ కోసం దరఖాస్తు చేసుకుంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశముంది.


ఆన్‌లైన్‌లో పాన్ వెరిఫికేషన్ చేయండి ఇలా...


🔸ముందుగా ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ incometaxindiaefiling.gov.in ఓపెన్ చేయండి.
🔹ఎడమవైపు లిస్ట్‌లో Verify your PAN details ట్యాబ్ పైన క్లిక్ చేయండి.
🔸కొత్త పేజీలో మీ పాన్ నెంబర్, పూర్తి పేరు, పుట్టిన తేదీతో పాటు క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి.
🔹చివరగా సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే మీ పాన్ యాక్టీవ్‌గా ఉందో లేదో తెలుస్తుంది.
🔸ఒకవేళ మీ పాన్ డీయాక్టివేట్ అయినట్టయితే ఆదాయపు పన్ను శాఖకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మీ పాత పాన్ కార్డ్ జిరాక్స్‌తో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే మీ పాన్ నెంబర్ యాక్టివేట్ చేస్తారు

incometaxindiaefiling.gov.in

0 comments:

Post a Comment

ADD

AP UPDATES

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top