Thursday, 30 May 2019

No Bag Day- What is No Bag Day?-వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి శనివారం ‘బ్యాగ్‌ లేని రోజు’(నో బ్యాగ్‌ డే)

No Bag Day
To reduce the burden of carrying textbooks and to encourage creative thinking among children at the Primary level from this Academic year.

What is No Bag Day?
Learning is a very important task for every one. Speciallv Primary Kids. So to create interest and anxiety among
the kids we are teaching them with play way methodology with the help of creative Activities. Students can participate individually in a team students
will participate activities Group activities

No Bag Day- What is No Bag Day?-వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి శనివారం ‘బ్యాగ్‌ లేని రోజు’(నో బ్యాగ్‌ డే)

పాఠశాలల్లో ‘బ్యాగ్‌ లేని రోజు’
ఈనాడు, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి శనివారం ‘బ్యాగ్‌ లేని రోజు’(నో బ్యాగ్‌ డే) నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. విద్యార్థులకు రోజువారీ పాఠాల బోధన, పుస్తకాల మోతలకు భిన్నంగా ఆట, పాటలతో వారిలో పాఠశాలంటే భయం పోగొట్టడం, పాఠశాలలో వారిని ఆనందంగా ఉంచేందుకు దీన్ని తీసుకొస్తున్నారు. ప్రతిపాదనలను త్వరలో ప్రభుత్వానికి పంపనున్నారు. దీంతోపాటు ఆనందవేదిక తరగతులను ప్రవేశపెట్టనున్నారు. ప్రతిరోజు ఉదయం అర్ధగంటపాటు ఈ తరగతులు నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే భూటన్‌తో విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. విద్యావార్షిక ప్రణాళికలో వీటికి స్థానం కల్పించనున్నారు. ఈ ప్రణాళిక రూపకల్పనపై జూన్‌ 3న గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.
నేపథ్యం...
విద్యార్థులకు కాస్త ఉపశమనం కలిగించే విధంగా గత తెలుగు దేశం ప్రభుత్వం మునిసిపల్ స్కూల్స్ లో గత  సంవత్సరం ఏపీ లో 'నో బ్యాగ్ డే'ను అమలు చేశారు. ఏపీలోని 59 మున్సిపాలిటీలలో డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రూపొందించిన నిబంధనల ప్రకారం  ప్రాథమిక పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు నో బ్యాగ్ డేను ఉత్సాహంగా అమలుచేశారు.
ఇప్పటికే ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం అమలుచేస్తున్న 'నో స్కూల్ బ్యాగ్ డే'ను ఏపీలోనూ అమలుచేసింది. రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలన్నింటిలో 1-12వ తరగతి వరకు చదివే విద్యార్థులు శనివారం నాడు పాఠశాలలకు స్కూల్ బ్యాగు తీసుకురావాల్సిన అవసరం లేదని గతేడాది యూపీ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఏపీ ప్రభుత్వం మున్సిపాలిటీల్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 'నో బ్యాగ్ డే' అమలు చేసింది. విద్యార్థులకు విద్యా భారం లేని పాఠ్య పుస్తకాల మోత బరువు తగ్గించాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం నెలలో రెండో, నాలుగో శుక్రవారాల్లో విద్యార్థులు పుస్తకాల్లేకుండా పాఠశాలకు రావాల్సి ఉంటుంది. ఆ రోజుల్లో ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఆ రోజుల్లో చిత్రాలు, ఎక్సర్‌సైజ్ సహా ఇతర పద్ధతుల్లో ఉపాధ్యాయులు బోధిస్తారు. పిల్లల్లో చురుకుదనం పెంపొందిస్తారు.

రేపు


*నో బ్యాగ్ డే శనివారం ఆనందపాఠాలు*

⛹‍♀🏋🏻‍♀🤾‍♂🏌🏻🚴🏻‍♀🧚🏻‍♀👯‍♂💃🏻🏃‍♀

*ఉదయం పూట నాలుగు పీరియడ్ లు*

*👉మొదటి పీరియడ్ : నీతి కథలు*

📻📺🎥🗣🧖‍♀🎤🎬

*👉రెండవ పీరియడ్ :*

📉📈✏📝🖌✒

 *చిత్రలేఖనం*

*👉మూడవ పీరియడ్ :*

💒🕍🕌👨🏻‍🏫👩🏻‍🏫👨🏻‍🎓👩‍🎓


*నైతిక విలువలు , సేవా కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలియజేయుట*

*👉🏻నాల్గవ పీరియడ్ :*

🌴🌳🌲🌿🍀🌱🎋🌵

*మొక్కలు పెంచటం, పాఠశాలను శుభ్రంగా  ఉంచటం*

*👉🏻భోజన విరామం తరువాత :*

🎲🧘🏻‍♀🎮🎯🧘🏻‍♂♟🧩

క్రీడలు ( ఇన్ డోర్ గేమ్స్ ), యోగాసనాలు, లెక్కలు, సైన్స్ , పజిల్స్ , చదరంగం*

*👉🏻చివరి పీరియడ్ :*

⚽🏸🥍⚾🏈🥎

వివిధ రకాల ఆటలు ( వాలీబాల్ ,టెన్నికాయిడ్ ,షటిల్ మొదలైనవి)*

* జనగణమనతో ముగింపు *

0 comments:

Post a Comment

ADD

AP UPDATES

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top