ఉపాధ్యాయులకు త్వరలో గుర్తింపు కార్డులు
రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఈ విద్యాసంవత్సరం ప్రారంభమైన అనంతరం గుర్తింపు కార్డులు ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఏపీలోని అన్ని పాఠశాలల్లో కలిపి 2,86,818 మంది విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఇప్పటి వరకు పాఠశాల విద్యాశాఖ తరఫున ఎలాంటి గుర్తింపు కార్డులు లేవు. దీంతో మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న కొందరు ఉపాధ్యాయులు విధులకు పూర్తిగా గైర్హాజరవుతున్నారు. అంతేగాకుండా, తమ తరఫున ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని వారిచేత విద్యార్థులకు పాఠాలు చెప్పిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులందరికీ గుర్తింపుకార్డులు జారీ చేస్తే.. పాఠశాలల తనిఖీ సమయంలో ఈ తరహా అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉందని సంబంధిత శాఖ అధికారులు భావిస్తున్నారు.
ఏపీలో మధ్యాహ్న భోజనం పథకం పేరు మార్పు
అమరావతి:మధ్యాహ్న భోజనం పథకం పేరును వైఎస్ఆర్ అక్షయపాత్రగా మార్పు చేశారు సీఎం జగన్. అంతేకాదు మధ్యాహ్న భోజనం పథకం ఏజెన్సీలకు గౌరవవేతనం రూ.3వేలకు పెంచారు. అక్షయపాత్ర ట్రస్ట్ ప్రతినిధులు, ఉన్నతాధికారులతో మధ్యాహ్న భోజన పథకంపై సమీక్షించిన సీఎం జగన్ ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మకమైన మార్పులు తేవాలని సూచించారు. ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు మొగ్గు చూపేలా పాఠశాలల్ని తీర్చిదిద్దాలని చెప్పారు. స్కూళ్లలో మౌలిక సదుపాయాలు వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యతలో రాజీపడొద్దని, సౌకర్యవంతమైన వంటశాలలు నిర్మించాలని తెలిపారు. ఇది ప్రాథమిక సమావేశమని, తర్వాత సమావేశం నాటికి పూర్తిస్థాయి ప్రణాళికలతో రావాలని జగన్ ఆదేశించారు.

If the reforms are really brought about there would be substantial change in the system of education.Really applaudable
ReplyDelete