Sunday, 24 March 2019

Sukanya Samriddhi Yojana (SSY) - Details- సుకన్య సమృద్ధి యోజన పథకం వివరాలు.-అర్హత - వడ్డీ రేటు-సుకన్య సమృద్ధి యోజన కాలిక్యులేటర్ - డిపాజిట్ పరిమితి - కాలపరిమితి -ప్రయోజనాలు

What is Sukanya Samriddhi Yojana (SSY)? All you need to know
A Sukanya Samriddhi Account can be opened any time after the birth of a girl till she turns 10, with a minimum deposit of Rs 1,000.

Sukanya Samriddhi Yojana (SSY) is a small deposit scheme for the girl child launched as a part of the 'Beti Bachao Beti Padhao' campaign. It is currently 8.1 per cent and provides income-tax benefit under section 80 C of the Income Tax Act,1961. Even the returns are tax free in the scheme.

A Sukanya Samriddhi Account can be opened any time after the birth of a girl till she turns 10, with a minimum deposit of Rs 250 (Earlier it was Rs 1,000). In subsequent years, a minimum of Rs 250 and a maximum of Rs 1.5 lakh can be deposited during the ongoing financial year.

The account can be opened in any post office or authorised branches of commercial banks.
Sukanya Samriddhi Yojana (SSY) - Details- సుకన్య సమృద్ధి యోజన పథకం వివరాలు.-అర్హత - వడ్డీ రేటు-సుకన్య సమృద్ధి యోజన కాలిక్యులేటర్ - డిపాజిట్ పరిమితి - కాలపరిమితి -ప్రయోజనాలు

సుకన్య సమృద్ధి యోజన పథకం వివరాలు..

ఆడ పిల్లల భవిష్యత్తు సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని “బేటీ బచావో బేటీ పడావో” కార్యక్రమం కింద జనవరి 2015 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకంలో ఆడ పిల్లల పేరు మీద వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు సంవత్సరానికి రూ. 250 మొదలుకుని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. పొదుపు పథకాలపై బ్యాంకులు అందించే వడ్డీ రేట్ల కన్నా సుకన్య సమృద్ధి యోజన పథకం అందించే వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది.

“బేటీ బచావో బేటీ పడావో” కార్యక్రమం కింద ఈ పథకం ఘన విజయం సాధించిందని ఈ సంవత్సరం మొదట్లో ప్రభుత్వం ప్రకటించింది. నవంబర్, 2017 నాటికి దేశం మొత్తం మీద ఈ పథకం కింద సుమారు 1. 26 కోట్ల మంది వారి పిల్ల పేరు మీద ఖాతాలను ప్రారంభించగా, రూ. 19183 కోట్లు నగదు జమైనట్లు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.

సుకన్య సమృద్ధి యోజన పథకానికి వడ్డీ రేటు:

సుకన్య సమృద్ధి యోజన పథకానికి సంవత్సరానికి 8.1 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ప్రభుత్వం ఈ వడ్డీ రేట్లను సంవత్సరానికి ఒకసారి సవరించి, దానిని కేంద్ర బడ్జెట్ సమయంలో ప్రకటిస్తారు.

సుకన్య సమృద్ధి యోజన కాలిక్యులేటర్:

సంవత్సరానికి రూ.1000 కనీస పెట్టుబడి పెట్టినట్లయితే, 21 సంవత్సరాల పూర్తయిన తర్వాత అనగా మెచ్యూరిటీ సమయంలో రూ. 46,821 పొందవచ్చు. అదేవిధంగా, సంవత్సరానికి రూ. 2000 కనీస పెట్టుబడి పెట్టినట్లయితే, 21 సంవత్సరాల తరువాత రూ. 93,642 సంపాదించవచ్చు. సంవత్సరానికి రూ. 5,000, రూ. 10,000, రూ. 20,000, రూ. 50,000, రూ. 1,00,000, రూ. 1,25,000 రూ. 1,50,000 చొప్పున డిపాజిట్ చేసినట్లయితే, 21 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వరుసగా రూ. 2,34,107, రూ. 4,68,215, రూ. 9,36,429, రూ. 23,41,073, రూ. 46,82,146, రూ. 58,52,683, రూ.70,23,219 పొందవచ్చు.

సుకన్య సమృద్ధి యోజనలో చేరడానికి అర్హత:

సుకన్య సమృద్ధి యోజన ఖాతాను 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆడ పిల్లల తరఫున ఒక చట్టపరమైన సంరక్షకుడు తెరవవచ్చు.

సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో గరిష్ట సంఖ్య:

ఒకే కుటుంబంలో ఇద్దరు అమ్మాయిలు లేదా ఒకవేళ ఒకే కాన్పులో ఇద్దరు ట్విన్స్ (ఇద్దరూ ఆడ పిల్లలై ఉండాలి) పుట్టిన సందర్భాల్లో లేదా మొదటి కాన్పులో ఒకేసారి ముగ్గురు ఆడ పిల్లలు పుట్టిన సందర్భంలో ముగ్గురు ఆడ పిల్లలు ఈ పథకంలో చేరవచ్చు. 21 సంవత్సరాల కాల పరిమితి పూర్తయ్యే ముందే అమ్మాయి వివాహం చేసుకున్నట్లైతే, ఖాతా ఆటోమాటిక్ గా మూతపడిపోతుంది.

సుకన్య సమృద్ధి యోజన డిపాజిట్ పరిమితి:

సంవత్సరానికి కనీస డిపాజిట్ రూ. 250, అలాగే గరిష్ట డిపాజిట్ రూ. 1,50,000.

సుకన్య సమృద్ధి యోజన డిపాజిట్ కాలపరిమితి:

ఖాతా తెరిచిన తేదీ నుంచి 21 సంవత్సరాలు ఉంటుంది. అలాగే ఖాతాను తెరిచిన తేదీ నుంచి గరిష్టంగా 15 సంవత్సరాల పాటు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

సుకన్య సమృద్ధి యోజన ఉపసంహరణ : ఎస్బీఐ బ్యాంకు ప్రకారం, ఆడ పిల్లకు 18 సంవత్సరాల వయస్సు వచ్చిన తరవాత ఆమె ఉన్నత చదువుల కోసం లేదా వివాహం కోసం ఖాతాలోని మొత్తం నుంచి 50 శాతం నగదును ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది.

సుకన్య సమృద్ధి యోజన పథకం అందించే పన్ను ప్రయోజనం:

సుకన్య సమృద్ధి యోజన ఖాతా మూడు రకాల పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. వాటిలో పెట్టిన పెట్టుబడిపై పన్ను మినహాయింపు, వడ్డీ రూపంలో సంపాదించిన మొత్తం, ఉపసంహరించిన మొత్తం.

సుకన్య సమృద్ధి యోజన ఖాతాను ఎక్కడ, ఎలా తెరవాలి?
సుకన్య సమృద్ధి యోజన ఖాతాను దేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన ప్రభుత్వ లేదా ప్రైవేటు బ్యాంకుల్లో తెరవచ్చు.

చాలా మంది సుకన్య సమృద్ధి యోజన పథకంలో పెట్టుబడి పెట్టి ఉండవచ్చు. అయినప్పటికీ, ఈ పథకానికి సంబంధించిన నియమాల గురించి మీకు తెలుసా?

0 comments:

Post a Comment

ADD

AP UPDATES

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top