Search This Blog

⚡ FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్⚡

MORE TO VIEW

Sunday, 24 March 2019

Sakanya Samriddhi Yojana (SSY) Rules - చాలా మంది సుకన్య సమృద్ధి యోజన పథకంలో పెట్టుబడి పెట్టి ఉండవచ్చు. అయినప్పటికీ, ఈ పథకానికి సంబంధించిన నియమాల గురించి మీకు తెలుసా? మెచ్యూరిటీకి ముందే నగదు ఉపసంహరణకు నియమాలు-సుకన్య సమృద్ధి యోజన బదిలీ:

Sakanya Samriddhi Yojana (SSY) Rules
సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి తెలుసుకోవాల్సిన వాస్తవాలు

 Sakanya Samriddhi Yojana (SSY) Rules - చాలా మంది సుకన్య సమృద్ధి యోజన పథకంలో పెట్టుబడి పెట్టి ఉండవచ్చు. అయినప్పటికీ, ఈ పథకానికి సంబంధించిన నియమాల గురించి మీకు తెలుసా?   మెచ్యూరిటీకి ముందే నగదు ఉపసంహరణకు నియమాలు-సుకన్య సమృద్ధి యోజన బదిలీ:

ఈ పథకంలో గరిష్టంగా ఒక ఆర్ధిక సంవత్సరానికి కేవలం రూ. 1,50,000 మాత్రమే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది

చాలా మంది సుకన్య సమృద్ధి యోజన పథకంలో పెట్టుబడి పెట్టి ఉండవచ్చు. అయినప్పటికీ, ఈ పథకానికి సంబంధించిన నియమాల గురించి మీకు తెలుసా? 
వీటి గురించి కింద తెలుసుకుందాం. 
సుకన్య సమృద్ధి యోజన ఖాతా అనేది ఆడ పిల్లల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన చిన్న పొదుపు డిపాజిట్ పథకం. ఈ పథకాన్ని ఆడ పిల్లల ఉన్నత విద్యా, వివాహానికి కావలసిన మొత్తాన్ని సమకూర్చుకునేందుకు ప్రత్యేకంగా రూపొందించారు. ఒకవేళ మీరు ఈ పథకంలో సంవత్సరానికి రూ. 1,50,000 కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే ఏమవుతుంది?సాధారణంగా చాలా మందికి తెలిసిన విషయం ఏమిటంటే, ఈ పథకంలో గరిష్టంగా ఒక ఆర్ధిక సంవత్సరానికి కేవలం రూ. 1,50,000 మాత్రమే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ, ఒక సంవత్సరం అనగా ఆర్ధిక సంవత్సరం మొదలయ్యే ఏప్రిల్ 31 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు అని అర్ధం.

ఒకవేళ మీరు తెలియక రూ. 1,50,000 కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే ఏమవుతుంది సాధారణంగా బ్యాంకులు లేదా పోస్ట్ ఆఫీస్లు రూ. 1,50,000 కంటే ఎక్కువ డిపాజిట్ ను అంగీకరించవు. ఒకవేళ ఖాతాలో ఏదైనా సాంకేతిక లోపం ఏర్పడితే, అలాంటి సందర్భాల్లో మాత్రమే రూ. 1,50,000 కంటే ఎక్కువ డిపాజిట్ ను అంగీకరిస్తారు. కానీ మీరు డిపాజిట్ చేసిన అధిక మొత్తంపై ఎలాంటి వడ్డీని మీరు పొందలేరు.

గరిష్ట పరిమితి కంటే ఎక్కువగా చేసిన డిపాజిట్లను ప్రభుత్వం పక్కన పెడుతుంది. తెలియకుండా రూ. 1,50,000 కంటే ఎక్కువ డిపాజిట్ చేసిన మొత్తాన్ని పెట్టుబడిదారుడు ఎప్పుడైనా ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది.

అందువలన మీరు సంవత్సరానికి ఎంత మొత్తాన్ని డిపాజిట్ చేస్తున్నారో గమనిస్తూ ఉండండి. లేదంటే మీరు చేసే అధిక డిపాజిట్ ఒక్క రూపాయి వడ్డీని కూడా సంపాదించదు. పొదుపు ఖాతా వడ్డీ రేటును డీఫాల్ట్ ఖాతా 15 సంవత్సరాల తర్వాత మాత్రమే సంపాదిస్తుంది.

ఈ పథకంలో మీరు సంవత్సరానికి కనీసం రూ. 250 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. ఒకవేళ మీరు ఈ కనీస మొత్తాన్ని డిపాజిట్ చేయకపోతే, అప్పుడు మీ ఖాతాను డీఫాల్టర్ ఖాతాగా పరిగణిస్తారు. మరలా దానిని యాక్టీవేట్ చేసుకోడానికి కనీస మొత్తంతో పాటు సంవత్సరానికి రూ. 50 పెనాల్టీగా చెల్లించాల్సి ఉంటుంది.

ఒకవేళ డీఫాల్టర్ ఖాతా పథకంలో చేరిన రోజు నుంచి 15 సంవత్సరాల లోపు క్రమబద్ధీకరించకపోతే, డీఫాల్టర్ గా మారక ముందు వరకు మీరు చేసిన మొత్తం డిపాజిట్లను పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ వడ్డీ రేటు ప్రకారం మెచ్యూరిటీ సమయంలో పొందుతారు.

డీఫాల్టర్ గా ఉన్న ఖాతాలోకి వడ్డీ ద్వారా తప్పుగా క్రెడిట్ అయిన మొత్తాన్ని వెంటనే ప్రభుత్వ ఖాతాకు తిరిగి చెల్లిస్తారు.

సుకన్య సమృద్ధి యోజన ఖాతాను ప్రారంభించిన తేదీ నుంచి 15 సంవత్సరాలు దాటే వరకు చెల్లింపులను సక్రమంగా చేసినట్లయితే అది డిఫాల్ట్ అవదు.
ఏదేమైనా, ఖాతాదారుడి మరణం కారణంగా డీఫాల్టర్ గా మారిన సుకన్య సమృద్ధి యోజన (ఖాతా) లకు ఈ నియమం వర్తించదు.

మెచ్యూరిటీ తరువాత వడ్డీని పొందలేరు
సుకన్య సమృద్ధి యోజన ఖాతా మెచ్యూరిటీ అనేది ఖాతాను తెరిచిన తేదీ నుంచి 21 సంవత్సరాల వరకు లేదా 21 సంవత్సరాల లోపు అమ్మాయికి వివాహం అయినప్పుడని ( ఏది ముందుగా జరిగితే) చాలా మందికి తెలిసిన విషయమే.

అయినప్పటికీ, సుకన్య సమృద్ధి యోజన (ఖాతా) ఉత్తమ వడ్డీ రేటును అందిస్తోందని, అలాగే మెచ్యూరిటీ మొత్తానికి ఎలాంటి పన్ను వర్తించదని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు.

ఏదేమైనా, ఖాతాను తెరిచిన తేదీ నుంచి 21 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత ఎలాంటి వడ్డీని పొందలేరనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి.

ఒకవేళ సుకున్య సమృద్ధి యోజన ఖాతా 21 సంవత్సరాల తరువాత కూడా క్రియాశీలంగా ఉన్నట్లయితే, అప్పుడు మీ ఖాతా ఒక్క రూపాయి వడ్డీని కూడా సంపాదించదు. అందువలన, 21 సంవత్సరాలు పూర్తైన వెంటనే ఖాతాను మూసివేయడం ఉత్తమం.

మెచ్యూరిటీకి ముందే నగదు ఉపసంహరణకు నియమాలు
మీరు సుకన్య సమృద్ధి యోజన ఖాతాలోని మొత్తం నుంచి అమ్మాయి ఉన్నత విద్య కోసం 50 శాతం మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఉదాహరణకు
గత ఆర్థిక సంవత్సరానికి సుకన్య సమృద్ధి యోజన ఖాతాలోని బ్యాలన్స్ 10 లక్షలు అనుకుందాం, మీ కుమార్తె వయస్సు 18 సంవత్సరాల కంటే ఎక్కువ అయితే, అప్పుడు మీరు ఆమె ఉన్నత విద్య కోసం రూ. 5 లక్షలు ఉపసంహరించుకోవచ్చు.

ఏదేమైనప్పటికీ, ఆమెకు 18 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు లేదా 10 వ తరగతి పూర్తి చేసేవరకు నగదు ఉపసంహరణ చేసుకోవడం సాధ్యం కాదు.

ఒకవేళ మీరు అమ్మాయి ఉన్నత చదువుల కోసం నగదును ఉపసంహరించాలని భావించినట్లైతే, మీరు ఫీజు వివరాలకు సంబంధించిన రుజువులను అందించాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా మాత్రమే మీ ఖాతా నుంచి నగదును ఉపసంహరించుకునే వీలుంటుంది.

సుకన్య సమృద్ధి యోజన బదిలీ:

మీరు ఒకే పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకు లో 21 సంవత్సరాల వరకు ఖాతాను కలిగి ఉండాల్సిన అవసరం లేదు. భారతదేశంలో ఎక్కడికైనా మీ సుకన్య సమృద్ధి యోజన ఖాతాను బదిలీ చేసుకోవచ్చు. దాని కోసం ఖాతాదారుడు నివాస బదిలీకి సంబంధించిన రుజువులతో పాటు రూ. 100 ఫీజును పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకు కు చెల్లించాల్సి ఉంటుంది

0 comments:

Post a Comment

Teachers INFO

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top