AP Modal schools 6th class Admissions 2019 - Notification ,Online application process ,Schedule Dates
ఆదర్శ విద్యాలయాల్లో 2019-20 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి ప్రభుత్వం ప్రవేశ ప్రకటన విడుదల.
★ పేద కుటుంబాల పిల్లలకు ఉచితంగా ఆంగ్ల మాధ్యమ విద్యను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా164 ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు.
★ ఆరో తరగతిలో ప్రవేశానికి ఫిబ్రవరి 9వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం.
★ ప్రవేశం పొందిన బాల, బాలికలకు ఇంటర్మీడియట్ వరకు అన్ని సౌకర్యాలతో ఉచితంగా విద్యను అందిస్తారు.
దరఖాస్తు చేసుకోవడం ఇలా..
★ ఏపీ ఆన్లైన్ లేదా మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి.
★ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సీఎస్ఈ.ఏపీ.జీవోవి.ఇన్ లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఎంఎస్.ఏపీ.జీవోవి.ఇన్లో దరఖాస్తు చేసుకోవాలి.
★ దరఖాస్తు ప్రింట్ తీసుకొని ఆయా మండలాల్లోని ఆదర్శ బడుల్లో సమర్పించాలి.
★ ఆధార్, కులం, ఆదాయం, ఇతరత్రా ధ్రువీకరణ పత్రాలను దరఖాస్తుతో పాటు ఇవ్వాలి.
★ ప్రవేశ రుసుం ఓసీ, బీసీలకు రూ.100లు, ఎస్సీ, ఎస్టీలకు రూ.50లను ఏపీ ఆన్లైన్, మీ సేవ కేంద్రాల్లో చెల్లించాలి.
★ రాత పరీక్ష మార్చి 31వ తేదీన ఉదయం 9 నుంచి 11 వరకు ఆయా మండలాల్లోని ఆదర్శ పాఠశాలల్లో నిర్వహణ.
★ ఈ పరీక్ష తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది.
★ ఆయిదో తరగతి సామర్థ్యాల స్థాయికి అనుగుణంగా తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం, ఆంగ్ల పాఠ్యాంశాలపై 25 మార్కులు చొప్పన ఐచ్చిక తరహాలో ప్రశ్నలు ఉంటాయి.
★ ఓసీ, బీసీ విద్యార్థులు కనీస అర్హతగా 50 మార్కులు.
★ ఎస్సీ, ఎస్టీలు 40 మార్కులు విధిగా సాధించాలి.
అర్హులు ఎవరంటే..
★ ప్రభుత్వ పాఠశాలల్లో 4, 5 తరగతులు చదివిన వారు అర్హులు.
★ వయసు ఓసీ, బీసీలు 01.09.2007 నుంచి 31.08.2009 మధ్య,
★ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01.09.2005 నుంచి 31.08.2009 మధ్య జన్మించి ఉండాలి.
★ ఎంపిక పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశం ఉంటుంది.
0 comments:
Post a Comment