L. V. Prasad - Biography and Life History - (జనవరి 17,1908 - 22 జూన్,1994 )ఎల్.వి.ప్రసాద్ -భారతీయ సినిమాకి నడకలు నేర్పిన మహనుభావుల్లో ఆయన ఒకరు-ఆయన గురించి తెలుసుకుందాం
భారతీయ సినిమాకి నడకలు నేర్పిన మహనుభావుల్లో ఆయన ఒకరు. తెలుగు సినిమాకు క్లాసిక్ అనదగ్గ సినిమాలు అందించిన దర్శకుడు ఆయన. సినీ నిర్మాతగా, దర్శకుడుగా, నటుడుగా సినీ డిక్షనరిలో తనకంటూ కొన్ని పేజిలు సృష్టించుకున్నా ఉద్దండుడు. ఇంతకీ ఆయన ఇంకేవరో కాదు భారతీయ సినీ రంగానికి ఎనలేని సేవలందించినందుకు గాను దాదాసాహేభ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు ఎల్.వి.ప్రసాద్
ఎల్.వి.ప్రసాద్ గా ప్రసిద్ధి చెందిన అక్కినేని లక్ష్మీవరప్రసాదరావు తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత .. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎల్.వి. ప్రసాద్ చలన చిత్రరంగానికి ఎనలేని సేవ చేశారు. హిందీ, తమిళ, తెలుగు భాషలలో తొలి టాకీ చిత్రాలయిన ఆలం ఆరా, కాళిదాస్ మరియూ భక్తప్రహ్లాద మూడింటిలోనూ ఆయన నటించాడు. తెలుగువారిలో బహుశా ఆయన ఒక్కరే ఈ ఘనత సాధించి ఉంటాడు. హిందీ, తమిళ, తెలుగు, కన్నడ వంటి పలు భారతీయ భాషలలో 50 చిత్రాల వరకు ఆయన దర్శకత్వం వహించటంగానీ, నిర్మించటంగానీ, నటించటంగానీ చేసారు.
ఈయన జనవరి 17,1908 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఏలూరు తాలూకాలోని సోమవరప్పాడు గ్రామమునందు అక్కినేని శ్రీరాములు, బసవమ్మ దంపతుల రెండవ సంతానముగా జన్మించాడు. రైతు కుటుంబంలో పుట్టిన ప్రసాద్ గారాబంగా పెరిగాడు. చురుకైన కుర్రవాడే కానీ చదువులో ఎప్పుడూ శ్రద్ధ చూపలేదు. ఉరూరా తిరిగే నాటకాల కంపెనీలు, డాన్సు ట్రూపుల డప్పుల చప్పుల్లు ప్రసాద్ ను ఆకర్షించేవి. పాత అరిగిపోయిన సినిమా రీళ్ళను ప్రదర్శించే గుడారపు ప్రదర్శనశాలల్లో ప్రసాద్ తరచూ వాటిని ఆసక్తిగా చూసేవాడు. స్థానిక నాటకాల్లో తరచుగా చిన్న చిన్న వేషాలు వేసేవాడు. ఇదే ఆసక్తి పెద్దయ్యాక కదిలే బొమ్మలు, నటనపై ఆసక్తిని పెంచి సినిమా రంగంలో ప్రవేశించడానికి పునాదులు వేసింది.
కష్టానికి నిర్వచనం ఎల్.వి ప్రసాద్. చురుకైన కుర్రవాడే కానీ చదువులో ఎప్పుడూ శ్రద్ధ చూపలేదు. ఉరూరా తిరిగే నాటకాల కంపెనీలు, డాన్సు ట్రూపుల డప్పుల చప్పుల్లు ప్రసాద్‌ను ఆకర్షించేవి ...స్థానిక నాటకాల్లో తరచుగా చిన్న చిన్న వేషాలు వేసేవాడు.. సినిమా రీళ్ళను ప్రదర్శించే గుడారపు ప్రదర్శనశాలల్లో ప్రసాద్ తరచూ ఆసక్తిగా చూసేవాడు. వంద రూపాయాలతో ముంబాయి నగరంలో అనామకుడిగా అడుగు పెట్టిన ప్రసాద్ సినీ రంగంలో అనితర సాధ్యుడినిపించుకున్నాడు
ఇక 1908 జనవరి 17న జన్మించిన ఎల్.వి.ప్రసాద్ వివాహం సౌందర్య మనోహరమ్మతో జరిగింది. ఒకరోజు ఆయన సినిమాల్లో నటించాలనే కోరికతో జేబులో 100రూ.లతో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయల్దేరాడు. ముంబయికి వెళ్లిన ఆయనకు ఎంతో కష్టపడగా చివరికి ఆలం అరా చిత్రంలో నటించే అవకాశం వచ్చింది.
ఎల్వీ ప్రసాద్ హిందీ, తమిళ, తెలుగు, కన్నడ వంటి పలు భారతీయ భాషలలో దర్శకత్వం, నిర్మాతగా, నటుడిగా 50 చిత్రాల వరకు చేశారు. హిందీ, తమిళ, తెలుగు భాషలలో తొలి టాకీ చిత్రాలయిన ఆలం ఆరా, కాళిదాస్ మరియూ భక్తప్రహ్లాద మూడింటిలోనూ ఆయన నటించడం విశేషంగా చెప్పవచ్చు. గృహప్రవేశం సినిమాతో దర్శకత్వం ప్రారంభించారు. ఈ చిత్రంలో భానుమతి సరసన హీరోగా నటించారు. 1950లో నాగిరెడ్డి, చక్రపాణిలు స్థాపించిన "విజయా సంస్థ" నిర్మించిన తొలిచిత్రం షావుకారుకు కూడా ప్రసాద్ దర్శకత్వం వహించారు. ఇతను దర్శకత్వం వహించిన మిస్సమ్మ, గృహప్రవేశం, షావుకారు, అప్పుచేసి పప్పుకూడు, పెళ్ళిచేసి చూడు లాంటి జనాదరణ పొందాయి. 1980లో 27వ నేషనల్ ఫిలిం అవార్డుల సెలెక్షన్ కమిటీకి చైర్మెన్‌గా వ్యవహరించారు.
ఆయన సినీరంగానికి చేసిన సేవలకు గాను భారత తపాలాశాఖ 2006లో ఆయన ముఖచిత్రంతో తపాలాబిళ్ళ విడుదల చేసింది. "ది క్లయింట్" లఘుచిత్రానికి 1970లో చికాగో ఫిలిం ఫెస్టివల్లో అవార్డు పొందారు. 1978-79లో తమిళనాడు ప్రభుత్వం నుంచి రాజాశాండో మెమోరియల్ అవార్డు, 1980లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తొలి రఘుపతి వెంకయ్య అవార్డు స్వీకరించారు. 1982లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొంది ఈ ఘనత పొందిన మూడవ తెలుగు వ్యక్తిగా కీర్తి పొందారు. 22 జూన్,1994న మరణించారు. ఆయన కుమారుడు రమేష్ ప్రసాద్ తండ్రి పేరిట హైదరాబాదులో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని, ప్రసాద్ ఐమాక్స్ థియేటర్, స్థాపించారు.
0 comments:
Post a Comment