Saturday, 19 January 2019

Krishna Kumari- Actress-life history-(1936 మార్చి 6- జనవరి 24 ,2018) కృష్ణకుమారి-అభినయానికి మారుపేరు.. తెలుగుదనానికి చిరునామా!

Krishna Kumari- Actress-life history-(1936 మార్చి 6- జనవరి 24 ,2018) కృష్ణకుమారి-అభినయానికి మారుపేరు.. తెలుగుదనానికి చిరునామా!


పాత తరం తెలుగు సినిమారంగానికి చెందిన కథానాయిక ‘కృష్ణకుమారి’ని ‘అభినయానికి మారుపేరు.. తెలుగుదనానికి చిరునామా’గా అభివర్ణిస్తారు. ఈమె మాతృభాష తెలుగు కాకపోయినప్పటికీ.. అచ్చు తెలుగమ్మాయిలా హావభావాలు పలుకుతూ, ప్రేక్షకులను అలరించింది. అనతికాలంలోనే తెలుగు భాషను నేర్చుకుని సినీజనాలను ఆశ్చర్యపరిచింది. నటిగా తన ప్రతిభ ఏంటో నిరూపించుకున్న ఈమె.. ఎందరో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Krishna Kumari- Actress-life history-(1936 మార్చి 6- జనవరి 24 ,2018) కృష్ణకుమారి-అభినయానికి మారుపేరు.. తెలుగుదనానికి చిరునామా!

కృష్ణకుమారి 1936 మార్చి 6న కలకత్తాలో జన్మించారు. ఆమె తండ్రి టేకుమళ్ల వెంకోజీరావు ఆంధ్రా పేపర్ మిల్లులో ఉద్యోగం చేస్తుండేవారు. తండ్రిది బదిలీలతో కూడిన ఉద్యోగం కావడంతో కృష్ణకుమారి బాల్యం వివిధ ప్రాంతాల్లో గడిచింది. ఆ తర్వాత వీరి కుటుంబం రాజమండ్రిలో స్థిరపడింది. ప్రముఖ నటి షావుకారు జానకి, కృష్ణకుమారి అక్కాచెల్లెళ్లు. చిన్నతనం నుంచి కళల పట్ల ఆసక్తిని కనబరిచే కృష్ణకుమారి భరతనాట్యం, కూచిపూడిలో ప్రావీణ్యాన్ని సంపాదించడమే కాకుండా అనేక నృత్యప్రదర్శనలిచ్చారు.

1951 సంవత్సరంలో నవ్వితే నవరత్నాలు సినిమాతో కృష్ణకుమారి సినీ జీవితం మొదలైంది. ఆమె అంగీకరించిన తొలి చిత్రమిదే అయినా మంత్రదండం ముందుగా విడుదలైంది. నవ్వితే నవరత్నాలు సినిమాలో కృష్ణకుమారికి కాకతాళీయంగా అవకాశం వచ్చింది. స్వప్నసుందరి సినిమా చూడటానికి పాండిబజార్‌లోని ఓ థియేటర్‌కు వెళ్లింది కృష్ణకుమారి. అదే సినిమా చూడటానికి వచ్చిన నిర్మాత సౌందరరాజన్ కూతురు.. కృష్ణకుమారిలోని అందం, అమాయకత్వాన్ని గమనించి తమ సంస్థ ద్వారా నిర్మిస్తున్న నవ్వితే నవరత్నాలు చిత్రంలో నటించే అవకాశాన్ని ఇచ్చారు. ఈ సినిమా ఆమెకు ఎనలేని గుర్తింపుతో పాటు చాలా అవకాశాల్ని తెచ్చిపెట్టింది. ఒకేసారి పద్నాలుగు సినిమాల్ని అంగీకరించారామె. నవ్వితే నవరత్నాలు సినిమాతో రామశర్మ, కృష్ణకుమారి విజయవంతమైన జోడీగా పేరుతెచ్చుకున్నారు

ఇలవేల్పుతో పునర్జన్మ

తొలి సినిమాలో చక్కటి అభినయంతో రాణించిన కృష్ణకుమారి ఆ తర్వాత ప్రియురాలు, మరదలు పెళ్లి, చిన్నమ్మకథతో పాటు సినిమాల్లో నటించారు. ఆమె పాత్రలకు మంచి గుర్తింపు లభించినా ఈ సినిమాలన్ని కమర్షియల్‌గా వైఫల్యాలుగా నిలవడంతో కృష్ణకుమారితో సినిమా అంటేనే నిర్మాతలు భయపడేవారు. ఎంతో నమ్మకం పెట్టుకున్న బంగారుపాప చిత్రం ఆమెకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఈ సినిమా పరాజయంతో కృష్ణకుమారి కెరీర్ ముగిసిపోయినట్లేనని అంతా భావించారు. ఎల్.వి. ప్రసాద్ నిర్మించిన ఇలవేల్పుతో కృష్ణకుమారి సినీ జీవితం కొత్త మలుపు తిరిగింది. నటిగా ఆమెకు ఈ సినిమాపునర్జన్మనిచ్చింది. ఇందులో రేలంగి సరసన హాస్యభరిత పాత్రలో నటించింది కృష్ణకుమారి. ఈ పాత్ర ఆమెకు మంచి పేరును తీసుకొచ్చింది. ఈ సినిమాలో రేలంగి, కృష్ణకుమారి కాంబినేషన్‌లో చిత్రీకరించిన చల్లని పున్నమి వెన్నలలోన గీతం అశేషప్రజాదరణను చూరగొన్నది.

150కిపైగా సినిమాల్లో...

ఇలవేల్పు తర్వాత తెలుగు చిత్రసీమలో అగ్రకథానాయికల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు కృష్ణకుమారి. వద్దంటే పెళ్లి, గంగా గౌరీ సంవాదం, సతీ సుకన్య, రమా సుందరి, జయవిజయ, పెళ్లి కానుక, దేవాంతకుడు, వినాయకచవితి, ఇరుగుపొరుగు,అగ్గిపిడుగు, మర్మయోగి, ఉమ్మడి కుటుంబం, లక్షాధికారి, బందిపోటు, బంగారుభూమి, గుణవంతుడు, జేబుదొంగ, యశోదకృష్ణ, దేవదాసు, నేరముశిక్ష, మానవుడు దానవుడు, భార్యబిడ్డలు, తల్లాపెళ్లామా, శ్రీకృష్ణావతారం, అంతస్తులు, గుడిగంటలు, డాక్టర్ చక్రవర్తి, చదువుకున్న అమ్మాయిలు ఎదురీత, కులగోత్రాలు, భార్యాభర్తలు, శభాష్‌రాజా, దీపావళితో పాటు పలు సినిమాలు ఆమె నటనాప్రతిభకు తార్కాణాలుగా నిలిచాయి. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ ప్రేక్షకులకు కృష్ణకుమారి సుపరిచితమే. మూడు భాషల్లో కలిపి దాదాపు 150కిపైగా సినిమాలు చేశారమే. చివరగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఫూల్స్ సినిమాలో అతిథి పాత్రలో నటించారు కృష్ణకుమారి. ఇదే ఆమె నటించిన చివరి సినిమా. సుదీర్ఘ సినీ ప్రయాణంలో తన అసమాన అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పించిన కృష్ణకుమారి మూడు జాతీయ అవార్డులను, రెండు నంది పురస్కారాలను దక్కించుకున్నారు.

కాంతారావుతో 28 సినిమాలు..

తెలుగు చిత్రసీమలో జానపద చిత్రాలంటే కాంతారావు, కృష్ణకుమారి జోడీనే గుర్తొస్తుంది. కాంతారావుతో కలిసి దాదాపు 28 జానపద చిత్రాల్లో నటించారు కృష్ణకుమారి. ఈ సినిమాలన్ని ప్రేక్షకాదరణను సొంతం చేసుకోవడంతో జానపద చిత్రాల కథానాయికగా కృష్ణకుమారి పేరు మారుమ్రోగిపోయింది. ఎన్టీఆర్‌తో 25 సినిమాలు, అక్కినేని నాగేశ్వరరావుతో 18 సినిమాల్లో జంటగా నటించారు కృష్ణకుమారి. వారితో పాటు రామశర్మ, కృష్ణంరాజు, జగ్గయ్య, రేలంగి, రమణామూర్తి తెలుగు సినీ పరిశ్రమలోని కథానాయకులందరితో సినిమాలు చేశారు.

వ్యక్తిగత విషయాలు :

అగ్రకథానాయికగా కొనసాగుతున్న తరుణంలో పెళ్లి చేసుకొని సినిమాలకు స్వస్తిపలికారు కృష్ణకుమారి. బెంగళూరుకు చెందిన అజయ్ మోహన్‌తో కృష్ణకుమారి  వివాహమాడింది. నిజానికి వీరిది ప్రేమవివాహం. స్నేహితుల ద్వారా అజయ్ తో పరిచయం అయిన కుమారి.. ఆ తర్వాత వారి పరిచయం ప్రేమగా మారింది. అది 1969లో వివాహబంధంగా మారింది. వీరికి ఒక అమ్మాయి - దీపిక. వీరి అల్లుడు విక్రం మైయా, మనవడు పవన్. వ్యాపారరీత్యా భర్త బెంగుళూరులో ఉండగా ఈమె కూడా మద్రాసు వీడి బెంగుళూరులో మకాం పెట్టారు. కొంతకాలం విరామం తర్వాత అత్తమామల ప్రొత్సాహంతో తిరిగి నటించడం మొదలుపెట్టింది.

అగ్రకథానాయకులందరితో కలిసి మరపురాని చిత్రాల్లో నటించిన కృష్ణకుమారి(85) బుధవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని తన స్వగృహంలో జనవరి 24 ,2018 ఉదయం తుదిశ్వాస విడిచారు. 

0 comments:

Post a Comment

ADD

AP UPDATES

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top