ప్రభలతీర్థం -. ఇది కోనసీమలో ఎనభై నాలుగు ప్రదేశాలలో జరుగుతుంది. జగ్గన్నతోటలో జరిగే ప్రభలతీర్థం ప్రముఖమైనది,అత్యంత ప్రాచీనమైనది. దీనికి 400 సంవత్సరాల చరిత్ర వుంది.తెలుసుకుందాం....
సంక్రాంతి వేడుకల్లో భాగాలైన రంగవల్లులు, భోగిమంటలు, గాలిపటాలు , హరిదాసులు వీటన్నింటి తో పాటు కనుమ నాడు కోనసీమలో జరిగే “ప్రభల తీర్థం” ప్రత్యేక ఆకర్షణ. ఈ ఉత్సవం శివునికి జరిగే ఉత్సవాలలో తలమానికం. ఇది కోనసీమలో ఎనభై నాలుగు ప్రదేశాలలో జరుగుతుంది. కొత్తపేట,రావులపాలెం, ఉప్పలగుప్తం,అవిడి, కాట్రేనికోన, తొండవరం, అంబాజీపేట మండలాల్లో జరుగుతుంది. ప్రధానంగా జగ్గన్నతోటలో జరిగే ప్రభలతీర్థం ప్రముఖమైనది,అత్యంత ప్రాచీనమైనది. దీనికి 400 సంవత్సరాల చరిత్ర వుంది.
ఈ సంబరం ప్రభను తయారుచేసేందుకు ముహూర్తం నిర్ణయించడంతో మొదలవుతుంది. సంప్రదాయంగా ఒకే వంశానికి చెందినవారు ప్రభను తయారుచేస్తారు. తయారీలో, ప్రభ అలంకరణలో ఊరు ఊరంతా ఉత్సాహంగా పాలు పంచుకుంటారు. వాటిని పువ్వులతోనూ, రంగు రంగుల కాగితాలతోనూ అలంకరిస్తారు.
ఈ ఏకాదశ రుద్రులు కొలువైన గ్రామాలు ఆ రుద్రుల పేర్లు వరుస గా
1-వ్యాఘ్రేశ్వరం-శ్రీ వ్యాఘ్రేశ్వర స్వామి(బాలాత్రిపురసుందరీ)
2-పుల్లేటికుర్రు-అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి(బాలా త్రిపుర సుందరి)
3-మొసలపల్లి-మధుమానంత భోగేశ్వర స్వామి
4-గంగలకుర్రు-చెన్నమల్లేశ్వరుడు
5-గంగలకుర్రు(అగ్రహారం)-వీరేశ్వరుడు
6-పెదపూడి-మేనకేశ్వరుడు
7-ఇరుసుమండ-ఆనంద రామేశ్వరుడు
8-వక్కలంక-విశ్వేశ్వరుడు
9-నేదునూరు–చెన్న మల్లేశ్వరుడు
10-ముక్కామల-రాఘవేశ్వరుడు
11-పాలగుమ్మి-చెన్న మల్లేశ్వరుడు
భక్తి,ఆధ్యాత్మికతలతో పాటు ఇది సామాజికంగా కూడా ఒక చక్కని వేడుక. ఎక్కడెక్కడి నుండో బంధువులు, స్నేహితులు వచ్చి ఈ వేడుకలో పాలుపంచుకుంటారు. అందరూ ఆనందంగా గడుపుతారు. సంబంధాలు బలపడతాయి. ఇప్పటికీ ఇది పెళ్లి సంబంధాలకు ఒక చక్కని వేడుక.
సంక్రాంతి వేడుకల్లో భాగాలైన రంగవల్లులు, భోగిమంటలు, గాలిపటాలు , హరిదాసులు వీటన్నింటి తో పాటు కనుమ నాడు కోనసీమలో జరిగే “ప్రభల తీర్థం” ప్రత్యేక ఆకర్షణ. ఈ ఉత్సవం శివునికి జరిగే ఉత్సవాలలో తలమానికం. ఇది కోనసీమలో ఎనభై నాలుగు ప్రదేశాలలో జరుగుతుంది. కొత్తపేట,రావులపాలెం, ఉప్పలగుప్తం,అవిడి, కాట్రేనికోన, తొండవరం, అంబాజీపేట మండలాల్లో జరుగుతుంది. ప్రధానంగా జగ్గన్నతోటలో జరిగే ప్రభలతీర్థం ప్రముఖమైనది,అత్యంత ప్రాచీనమైనది. దీనికి 400 సంవత్సరాల చరిత్ర వుంది.
ప్రభ అనగా నేమి ?
ఆర్చీల వంటి నిర్మాణాలు వెదురుకర్రలతో, నూతన వస్త్రాలతో తయారుచేస్తారు. . ఈ ప్రభల తయారీని ప్రతీ గ్రామం వారూ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటారు. పోటా పోటీగా ఈ ప్రభలను ఎత్తుగా,అందంగా తయారుచేస్తారు. ఈ ప్రభలలో శివుని ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. తరువాత ఆ ప్రభలను ఊరేగింపుగా తీసుకుని వెళ్లి ఒకచోట కొలువు దీర్చి, భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.ఈ సంబరం ప్రభను తయారుచేసేందుకు ముహూర్తం నిర్ణయించడంతో మొదలవుతుంది. సంప్రదాయంగా ఒకే వంశానికి చెందినవారు ప్రభను తయారుచేస్తారు. తయారీలో, ప్రభ అలంకరణలో ఊరు ఊరంతా ఉత్సాహంగా పాలు పంచుకుంటారు. వాటిని పువ్వులతోనూ, రంగు రంగుల కాగితాలతోనూ అలంకరిస్తారు.
ఏమిటీ ఉత్సవం?
దీని గురించి ఒక ఆసక్తికరమైన కథనం వాడుకలో వుంది. పూర్వం కోనసీమ ప్రాంతంలో తీవ్రమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు అన్ని గ్రామాల్లోని రుద్రులు ఒకచోట సమావేశమై లోక రక్షణ గావించారనీ, అప్పటినుండీ ఈ కనుమ రోజున అన్ని గ్రామాల్లోని ప్రజలు ఈ రుద్రులను సమావేశపరచడం ఆనవాయితీగా వస్తోంది.ఏకాదశ రుద్రుల ప్రాశస్త్యం
అంబాజీపేట మండలం, మొసలపల్లి గ్రామం లోని జగ్గన్న తోటలో జరిగే ఈ తీర్థంలో ఏకాదశ (11) రుద్రులు పాలుపంచుకుంటారు. ఆ గ్రామాలు మొసలపల్లి, పెదపూడి,పుల్లేటి కుర్రు,ముక్కామల,ఇరుసుమండ, నేదునూరు, వక్కలంక, వ్యాఘ్రేశ్వరం, పాలగుమ్మి, గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం. ఈ గ్రామాల ప్రభలన్నీ తోటల్లోనుండీ, పొలాల్లోనుండీ జగ్గన్నతోటకు వస్తాయి. అలా దేవుడు తమ పొలాలను తొక్కుతూ వస్తే తమకు మంచి జరుగుతుందనేది రైతుల నమ్మకం. మరొక ఒళ్ళు గగుర్పొడిచే, ఆనందంతో పులకరించే సంఘటన గంగలకుర్రు, అగ్రహారం ప్రభలను కౌశిక లోనుండి తీసుకు రావడం మరలా తిరిగి సాయంకాలం తీసుకువెళ్లడం. ఈ సమావేశాలకు ఆతిధ్యం ఇచ్చేది మొసలపల్లి ఈశ్వరుడు. వ్యాఘ్రేశ్వరుడు అధ్యక్షత వహిస్తాడు.ఈ ఏకాదశ రుద్రులు కొలువైన గ్రామాలు ఆ రుద్రుల పేర్లు వరుస గా
1-వ్యాఘ్రేశ్వరం-శ్రీ వ్యాఘ్రేశ్వర స్వామి(బాలాత్రిపురసుందరీ)
2-పుల్లేటికుర్రు-అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి(బాలా త్రిపుర సుందరి)
3-మొసలపల్లి-మధుమానంత భోగేశ్వర స్వామి
4-గంగలకుర్రు-చెన్నమల్లేశ్వరుడు
5-గంగలకుర్రు(అగ్రహారం)-వీరేశ్వరుడు
6-పెదపూడి-మేనకేశ్వరుడు
7-ఇరుసుమండ-ఆనంద రామేశ్వరుడు
8-వక్కలంక-విశ్వేశ్వరుడు
9-నేదునూరు–చెన్న మల్లేశ్వరుడు
10-ముక్కామల-రాఘవేశ్వరుడు
11-పాలగుమ్మి-చెన్న మల్లేశ్వరుడు
భక్తి,ఆధ్యాత్మికతలతో పాటు ఇది సామాజికంగా కూడా ఒక చక్కని వేడుక. ఎక్కడెక్కడి నుండో బంధువులు, స్నేహితులు వచ్చి ఈ వేడుకలో పాలుపంచుకుంటారు. అందరూ ఆనందంగా గడుపుతారు. సంబంధాలు బలపడతాయి. ఇప్పటికీ ఇది పెళ్లి సంబంధాలకు ఒక చక్కని వేడుక.
0 comments:
Post a Comment