Search This Blog

⚡ FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్⚡

MORE TO VIEW

Monday, 28 January 2019

Kalpana Chawla (17 March,1962– 1 February,2003)- Life History and Her Space Journey-కల్పన చావ్లా… నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగిరి…..నక్షత్రాలతో కలిసిపోయింది.-మరణాన్ని సైతం చిరునవ్వుతో స్వీకరించింది....కల్పనా చావ్లా మరణం వెనుక అసలు రహస్యం?

నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగిరి…..నక్షత్రాలతో కలిసిపోయింది.-మరణాన్ని సైతం చిరునవ్వుతో స్వీకరించింది


Kalpana Chawla (17 March,1962– 1 February,2003)- Life History and Her Space Journey-కల్పన చావ్లా… నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగిరి…..నక్షత్రాలతో కలిసిపోయింది.-మరణాన్ని సైతం చిరునవ్వుతో స్వీకరించింది

కల్పన చావ్లా… ఒక కాంతులీనుతూ రాలిపోయిన నక్షత్రం. అనంతానంత విశ్వాన్ని ఎంతగా ప్రేమించిందో ఆమె ఒక్కోపాల పుంతలోని నక్షత్రాన్ని ప్రేమగా హత్తుకునేందుకు ఉండిపోయిందామె. నింగికెగిరిన ఈ తార మళ్ళీ భూమి మీద అడుగే పెట్టలేదు. తాను ప్రేమించీ,తపించిన నక్షత్ర మండలాల్లోనే ఆడుకునేందుకు వెళ్ళిపోయింది… ఇది ఒక నక్షత్రం పుట్టుక కథ-ఆమె పేరు కల్పనా చావ్లా..

2003 ఫిబ్రవరి 1వ తేదీన “కొలంబియా” మంటల్లో కాలుతూ నేలమీదికి రాలుతూ తునకలైనప్పుడు అమెరికాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్‌లో సమయం ఉదయం 8.53. ఇండియాలో అది సాయంత్రం 7 గంటలు. ఒక్క దుర్ఘటన వార్తతో కేబుళ్లు జామ్ అయ్యాయి. ఈ దేశ నక్షత్రమొకటి రాలిపోయిందనే వార్తతో తడవని కళ్ళు లేవు. కల్పనకు నివాళి అర్పిస్తూ ఉత్తరాది హిందీ న్యూస్ చానెల్ ‘ఆజ్‌తక్’కు కేవల మూడు గంటల్లో లక్ష సందేశాలు అందాయి! ఆమెకు శ్రద్ధాంజలి ఘటించేందుకు ప్రపంచ దేశాలన్నీ మౌనం పాటించాయి.

ఆమె పేరు కల్పన కానీ ఆమే సంకల్పం,ఆమె ధైర్యం,ఆమె నడిచిన జీవితం ఏదీ కల్పన కాదు ఆఖరికి ఆమె మరణం కూడా నిజమే…. . కల్పనకు కరాటే ఇష్టం, జుట్టును కత్తిరించుకోవడం ఇష్టం, ఫ్లైయింగ్ ఇష్టం, తొలి భారతీయ పైలట్ జెఆర్‌డి టాటా ఆమె రోల్ మోడల్. ఆ కలలతోనే ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లని చదివిందీ “మోంటూ” (ముద్దుపేరు) నోటు పుస్తకాల్లో విమానాల బొమ్మలు,ఆడుకోవటానికి బార్బీ బొమ్మలు కాదు అవీ విమానాలే. ఒక మధ్యతరగతి ఇంట్లో పుట్టినా తన కలలు మాత్రం ఎప్పుడూ ఆకాశం లోనే. “నేను భూమి మీద బతికేందుకు కాదు పుట్టింది” అనేదట వాళ్ళమ్మతో.

పంజాబ్ ఇంజినీరింగ్ కాలేజీలో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తిచేసిన కల్పనా చావ్లా ఎంఎస్ కోసం 1980లో అమెరికా వెళ్లారు. టెక్సాస్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తయిన తర్వాత, 1988లో కొలరాడో యూనివర్సిటీ నుంచి ఏరోస్పేస్ ఇంజినీరింగ్  లో  పీహెచ్ పట్టాను స్వీకరించారు. అదే ఏడాది నాసా పరిశోధన కేంద్రంలో చేరిన కల్పన పవర్ లిఫ్ట్ కాంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ విభాగంలో వైస్-ప్రెసిడెంట్ గా  బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత నాసాకు వైస్-ప్రెసిడెంట్ గా  సేవలు అందించారు.1983 లో విమానయాన శిక్షకుడు మరియు విమాన చోదక శాస్త్ర రచయిత ఐన జీన్-పియర్ హారిసన్ ను వివాహం చేసుకున్నారు.

డాక్టర్ కల్పన 1988 లో నాసా అమెస్ రీసెర్చ్ సెంటర్ లో చేరారు. విమాన యానానికి సంబంధించిన అనేకాంశాలపై పరిశోధనలు చేశారు. 1993 లో కాలిఫోర్నియా లోని లాస్ అల్టోన్ లో గల ఓవర్ సెట్ మెథడ్స్ ఇన్‌కార్పోరేటెడ్ లో ఉపాధ్యక్షురాలు (రీసెర్చి సైంటిస్ట్) గా చేరారు. అక్కది శాస్త్రవేత్తలతో కలిసి అంతరిక్షంలో శరీర కదలికలు, సమస్యలపై అనేక పరిసోధనలు చేశారు.ఏరో డైనమిక్స్ ఆప్టిమైసేషన్ కు సంబంధించిఅనేక టెక్నిక్స్ ను అభివృద్ధి పర్చారు. ప్రపంచవ్యాప్తంగా అనేక సెమినార్లలో పరిశోధనా పత్రాలను సమర్పించారు. అమెరికా జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం (నాసా)లో ఉద్యోగం సంపాదించారు. నాసాలో చేరిన రెండేళ్లకు… అంటే 1997 నవంబరు 19, కొలంబియా ఎస్‌టిఎస్- 87 వాహకనౌకలో మొదటిసారి అంతరిక్షయాణం. తన కల నెరవేరిన రోజు యావత్ భారత దేశ గౌరవాన్ని ఒక మహిళగా సగర్వంగా అంతరిక్షానికెత్తిన రోజు. తను భారతీయ వనిత అని ఈ దేశంలో పుట్టిన ప్రతీ వాడూ చెప్పుకున్నరోజు. దాదాపు ఐదునెలల పాటు అంతరిక్షంలో సాగిన అధ్యయనంలో భాగంగా ఆమె పదకొండు మిలియన్ కిలోమీటర్ల దూరం ప్రయాణించారు.చందమామలా తిరుగుతూ 252సార్లు భూమిని చుట్టారు మళ్ళీ భూమిని చేరారు. పరిశోధనల్లొ మునిగిపోయారు.

ఆ తర్వాత ప్రయాణం కొలంబియా ఎస్‌టిఎస్- 107 అంతరిక్షనౌకలో. ఇది కల్పన తొలి అంతరిక్ష పర్యటనలా నెలలపాటు సాగలేదు. నిండా పదిహేను రోజుల పర్యటన. జనవరి నెల పూర్తయింది. తిరిగి భూమిని చేరాల్సిన రోజు రానే వచ్చింది. అది ఫిబ్రవరి ఒకటవ తేదీ. కక్ష్య నుంచి భూవాతావరణంలోకి వస్తున్నామనే భావన వ్యోమగాములను ఉత్కంఠకు గురిచేస్తోంది. ఇక 16 నిమిషాలలో భూమిని చేరాలి. దాదాపు భూకక్ష్య లోకి చేరే కొన్ని నిమిషాల్లోనే హ్యూస్టన్‌ లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌ ఇంజనీర్లతో కొలంబియా స్పేస్‌షటిల్‌కి సిగ్నల్స్ తెగిపోయాయి. జరగకూడనిదేదో జరగనుందని గ్రహించేలోపే కొలంబియా అంతరిక్ష నౌకలో పేలుడు. గాల్లో సంభవించిన పేలుడు ఏడుగురు వ్యోమగాముల ప్రాణాలను గాల్లో కలిపేసింది.అయితే ఆ నౌక ఇక తిరిగిరాదని. వారి ప్రాణాలు పోతాయని నాసా అధికారులకి ముందే తెలుసట.కానీ వారు ముందుగా ఈ విషయాన్ని తెలపలేదు. ఇదే రోజు. స్పేస్ షటిల్ కొలంబియాకు లాంచింగ్ లోనే ఏదో ప్రాబ్లమ్ వచ్చిందని , లాండింగ్ అనుకున్న విధంగా జరక్కపోవచ్చని వార్తల్లో చెప్తూనే వున్నారు. కానీ అంత ప్రమాదం జరుగుతుందని ఎవరు ఊహించగలరు? కల్పన తాను కోరుకున్న లోకానికే మళ్ళీ తిగివెళ్ళిపోయింది….. ఒక కల కొన్ని ఙ్ఞాపకాలనే కాదు మనకోసం ఎన్నో పరిశోధనా ఫలాలను కూడా ఇచ్చి ముగిసిపోయింది…. కల్పనా చావ్లా చనిపోయింది.ఇప్పుడు ఆకాశంలో దృవ నక్షత్రానికి ధీటుగా మరో తార చేరింది. ఆ నక్షత్రం పేరు కల్పన…. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘ఇస్రో’ ప్రయోగించిన వాతావరణ ఉపగ్రహానికి కల్పన-1 అని ప్రధాని నామకరణం చేశారు. విద్యార్థినుల కోసం కల్పనా చావ్లా స్కాలర్‌షిప్‌ను ప్రారంభించినట్లు హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. కల్పన స్మృతికి ఒక వైద్య కళాశాలను అంకితం చేస్తామని కేంద్ర హోమ్ శాఖ మంత్రి ప్రకటించారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ‘నాసా’… ‘అపురూపమైన యువతి’ అని కల్పనకు శ్రద్ధాంజలి ఘటించింది.

చివరి సారి రోదసీలోకి కి వెళ్ళే ముందు నాసా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో  కల్పన తన జీవితం ఎలా సాగిందో చెప్పారు.


“మేం ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నప్పుడు మేం కర్నాల్ అనే చిన్న ఊర్లో ఉండేవాళ్ళం. ఆ ఊర్లో ప్లయింగ్ క్లబ్ ఉండటం చాలా కలిసి వచ్చింది. నేనూ, మా సోదరుడూ సైకిల్ తొక్కుతూ ఊళ్ళో తిరుగుతుంటే ఆకాశంలో పుష్పక్ విమానాలు కన్పించేవి. ఇద్దరికీ వాటిల్లో ప్రయాణించాలని ఉండేది. ఒకసారి నాన్నను అడిగితే ప్లయింగ్ క్లబ్ కు తీసుకువెళ్ళి ఆ విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించారు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కు సంబంధించి ఇదే నా తొలి అనుభవం. ఎదిగే కొద్దీ జె.ఆర్.డి టాటా గురించి కూడా తెలిసింది. తొలిసారి మన దేశంలో విమానాలను నడిపింది ఈయనే. ఆనాడు టాటా నడిపిన విమానాన్ని కూడా చూశాను. విమానాన్ని చూసిన రోజుల్లో ఆయనేం చేసిందీ తెలుసుకోగానే నా ఆలోచనలు అలా అలా మబ్బుల్లో తేలిపోయాయి. హైస్కూలులో చదువుతున్నప్పుదు ‘నీవు ఏం కావాలని అనుకుంటున్నావు ‘ అని అడిగినపుడు ‘ఏరోస్పేస్ ఇంజనీర్ ‘ అని ఠక్కున చెప్పేదాన్ని. అది నాకింకా గుర్తే టెన్త్ క్లాసు తత్వాత ఇంటర్ లో చేరాలంటె ఇంటర్ లో ఏ గ్రూపు తీసుకోవాలన్నది ముందే నిర్ణయించుకోవాల్సి ఉండేది. నేను ఏరో స్పేస్ ఇంజనీర్ ని కావాలని అనుకున్నందున లెక్కలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదవాలని నిర్ణయించుకున్నాను. ఇంజనీరింగ్ ముందే లెక్కలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లెక్కల్లో ప్రావీణ్యం సపాదించాల్సి ఉంటుంది. తర్వాత పంజాబ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో సీటు వచ్చింది. అప్పట్లో నా లక్ష్యం ఏరోస్పేస్ ఇంజనీర్ కావడమే. వ్యోమగామి అవుతానని ఆ రోజుల్లో నేను ఊహించలేదు. ఎయిర్ క్రాప్ట్ ఇంజనీర్ కావాలని కోరుకున్నాను. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం కూడా క్లాసులో అడిగినప్పుడు ‘ప్లైట్ ఇంజనీర్ ‘ అవుతాను అని చెప్పాను. అప్పట్లో ప్లైట్ ఇంజనీర్ అంటే ఏం చేస్తారో కూడా నాకు అవగాహన లేదు. నేను అనుకొన్న ఎయిర్ క్రాప్ట్ డిసైనింగ్ కూ, ప్లైట్ ఇంజనీర్ కూ సంబంధం లేదు. వ్యోమగామిగా ఒక రకంగా చేస్తున్నది ప్లైట్ ఇంజనీర్ గానే కదా. ఇంజనీరింగ్ కాలేజీలో నాతో పాటే ఏడుగురే అమ్మాయిలం ఉండేవాళ్ళం. వాళ్ళల్లో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చేసింది నేనొక్కదాన్నే. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కావాలన్నప్పుడు మా ప్రిన్సిపాల్ వద్దన్నారు. చాలా కష్టమని, ఎలక్ట్రికల్ గానీ, మెకానికల్ గానీ తీసుకోమన్నారు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఇవ్వండి. లేదంటే ఇంటికి వెళ్ళిపోతానంటూ చెప్పాను. చివరికి ఇవ్వక తప్పిందికాదు. ‘నీకు అందుబాటులో ఉన్నదీ లేదూ అని కాదు. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్న తత్వాత ఆ వైపు మాత్రమే ప్రయాణించాలి ‘ అని మాత్రమే నేను యువతకు సూచించగలను

Kalpana Chawla Mysterious Death Facts!!! || కల్పనా చావ్లా మరణం వెనుక అసలు రహస్యం? || With SubtitlesAlso...

*⌨తెలుగులో మెసేజ్  టైపు చేయుటకు ఒక మంచి యాప్....గూగుల్ ఇండిక్ కీ బోర్డ్....*
*ఇంగ్లీష్ లో టైప్ చేసినచో తెలుగు లోకి మార్చుతుంది..*

*Google Indic Keyboard -  Easy Telugu typeing App in mobile phone*

*డౌన్లోడ్ చేసి ఉపయోగించండి....*
👇👇👇 http://www.mannamweb.com/2017/12/google-indic-keyboard-easy-telugu.html

0 comments:

Post a Comment

Teachers INFO

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top