Friday, 18 January 2019

Jyoti basu biography(July 8, 1914-January 17, 2010 -aged 95)-జ్యోతిబసు-విప్లవ జ్యోతి - మానవతావాది - ఆదర్శమూర్తి -దేశం గర్వించదగ్గ నాయకుడు-పోరాట యోధుడు-జ్యోతిబసు జీవిత విశేషాలు

Jyoti basu biography(July 8, 1914-January 17, 2010 -aged 95)-జ్యోతిబసు-విప్లవ జ్యోతి - మానవతావాది - ఆదర్శమూర్తి -దేశం గర్వించదగ్గ నాయకుడు-పోరాట యోధుడు-జ్యోతిబసు జీవిత విశేషాలు

జ్యోతిబసు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పాటు పనిచేసిన జ్యోతి బసు
జూలై 8, 1914న కోల్కతాలో జన్మించారు. కమ్యూనిస్టు (మార్క్సిస్టు) పార్టీకి చెందిన జ్యోతిబసు 1977 నుండి 2000 వరకు వరుసగా 5 సార్లు ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టినారు. అంతకు ముందు 1967-69 కాలంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు. సి.పి.ఐ (యం) పోలిట్ బ్యూరో నిర్ణయం వల్ల 1996లో దేశ ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని కోల్పోయినాడు. 2000లో మఖ్యమంత్రి పదవి నుండి వైదొలిగిన జ్యోతిబసు జనవరి 17, 2010న 96 సంవత్సరాల వయస్సులో మరణించాడు.
Jyoti basu biography(July 8, 1914-January 17, 2010 -aged 95)-జ్యోతిబసు-విప్లవ జ్యోతి - మానవతావాది - ఆదర్శమూర్తి -దేశం గర్వించదగ్గ నాయకుడు-పోరాట యోధుడు-జ్యోతిబసు జీవిత విశేషాలుJyoti basu biography(July 8, 1914-January 17, 2010 -aged 95)-జ్యోతిబసు-విప్లవ జ్యోతి - మానవతావాది - ఆదర్శమూర్తి -దేశం గర్వించదగ్గ నాయకుడు-పోరాట యోధుడు-జ్యోతిబసు జీవిత విశేషాలు

బాల్యం

జ్యోతిబసు 1914 జూలై 8న కోల్‌కత్తాలో బెంగాలీ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి నిశికాంత్ బసు వైద్యుడిగా పనిచేసేవాడు. తల్లి హేమలతా బసు. స్థానికంగా కలకత్తా (ఇప్పటి కోల్‌కత) లోనే జ్యోతిబసు విద్యాభ్యాసం కొనసాగింది. ఇతని అసలుపేరు జ్యోతికిరణ్ బసు కాగా పాఠశాల దశలో ఉన్నప్పుడు తండ్రి జ్యోతిబసుగా పేరును తగ్గించాడు. ప్రెసిడెన్సీ కళాశాల జ్యోతిబసు తన డిగ్రీ పూర్తిచేశాడు. ఉన్నత చదువుల కోసం 1935లో ఇంగ్లాండు బయలుదేరాడు. ఇంగ్లాండులో న్యాయశాస్త్రంలో విద్యనభ్యసించుదశలోనే గ్రేట్‌బ్రిటన్ కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితుడై రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నాడు. 1940లో న్యాయశాస్త్రవిద్య పూర్తిచేసుకొని మిడిల్ టెంపుల్ వద్ద బారిస్టర్‌గా అర్హత పొందినాడు.అదే సంవత్సరంలో భారతదేశానికి తిరిగివచ్చాడు. 1944లో ట్రేడ్ యూనియన్ ఉద్యమాలలో పాలుపంచుకొని ఆ తరువాత యూనియన్ ప్రధాన కార్యదర్శి అయ్యాడు.

రాజకీయ జీవితం

ఇంగ్లాండులో ఉన్నప్పుడే జ్యోతిబసు రాజకీయాలవైపు ఆకర్షితుడైనాడు. 1938లో జవహర్‌లాల్ నెహ్రూ లండన్ పర్యటన సమయంలో సదస్సు నిర్వహణ బాధ్యతను జ్యోతిబసు చేపట్టినాడు. సుభాష్ చంద్రబోస్ పర్యటన సమయంలో కూడా జ్యోతిబసు ఏర్పాట్లు చేసాడు. స్వదేశానికి తిరిగివచ్చిన పిదప 1946లో తొలిసారిగా బెంగాల్ శాసనసభకు ఎన్నికయ్యాడు. బి.సి.రాయ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శాసనసభలో ప్రతిపక్షనేతగా వ్యవహరించాడు. 1967లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో అజయ్ ముఖోపాధ్యాయ నేతృత్వంలోని ప్రభుత్వంలో 1967 నుండి 1969 వరకు పశ్చిమబెంగాల్ ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించాడు. 1972లో రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అదే సమయంలో జ్యోతిబసు కూడా తన శాసనసభ స్థానంలో కూడా ఓడిపోయాడు. 1977 జూన్ 21 నుండి 2000 నవంబరు 6 వరకు నిరాటంకంగా జ్యోతిబసు ముఖ్యమంత్రిగా కొనసాగినారు. దీనితో దేశంలో ఒక రాష్ట్రానికి అత్యధిక కాలం పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన రికార్డును కూడా జ్యోతిబసు స్వంతంచేసుకున్నాడు.
సి.పి.ఐ (యం) పోలిట్ బ్యూరో నిర్ణయం వల్ల 1996లో దేశ ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని వదులుకున్నాడు. 2000లో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి పదవిని నుండి వైదొలిగినాడు. 2010 జనవరి 17న కోల్‌కతలో మరణించాడు.

రాష్ట్ర ముఖ్యమంత్రిగా అత్యధిక కాలం పాటు కొనసాగిన చరిత్ర జ్యోతిబసు పేరిట గతంలో ఉండేది. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి జ్యోతి బసు ఐదు దఫాలు ముఖ్యమంత్రిగా కొనసాగారు. 1977 జూన్ 21న తొలిసారిగా జ్యోతిబసు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 2000 నవంబర్ 6వ తేది వరకు ఆయన ఈ పదవిలో కొనసాగారు. ఐదవ టర్మ్‌ను జ్యోతిబసు పూర్తి కాలం సీఎం పదవిలో లేడు. ముఖ్యమంత్రి బాధ్యతలను జ్యోతిబసు బుద్ధదేబ్ భట్టాచార్యకు అప్పగించారు

'జ్యోతిబసు' రికార్డ్ బద్దలు కొట్టిన 'పవన్‌ కుమార్‌'!


మన దేశంలో ఒక రాష్ట్రానికి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినది ఎవరంటే పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి 'జ్యోతిబసు' అని టక్కున చెప్పేస్తాం. అయితే ఇక నుంచి 'జ్యోతి బసు' కాకుండా 'పవన్ కుమార్ చామ్లింగ్' అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి 'జ్యోతి బసు' రికార్డును సిక్కీం ముఖ్యమంత్రి 'పవన్ కుమార్ చామ్లింగ్' బ్రేక్ చేశారు.

నేటితో పవన్‌ కుమార్‌.. జ్యోతి బసు రికార్డును సమం చేశారు. భారతీయ కమ్యునిస్ట్ పార్టీకు (మార్కిస్ట్) చెందిన 'జ్యోతి బసు' 1977 జూన్‌ 21 నుంచి 2000 సంవత్సరం నవంబరు 6 వరకు సీఎంగా ఉన్నారు. సిక్కిం డెమొక్రటిక్‌ ఫ్రంట్‌(ఎస్‌డీఎఫ్‌)కు చెందిన 'పవన్ కుమార్ చామ్లింగ్' 1994 డిసెంబరు 12 నుంచి సీఎంగా బాధ్యతలు చేపట్టి ప్రస్తుతం ఇంకా కొనసాగుతూనే ఉన్నారు. 'జ్యోతి బసు' పదవీకాల సమయం 23సంవత్సరాల నాలుగు నెలల 17రోజులు కాగా 'పవన్ కుమార్' పదవీకాలం నేటితో 23 సంవత్సరాల నాలుగు నెలల 17 రోజులు పూర్తి చేసుకుంది.

'జ్యోతి బసు' రికార్డును బద్దలు కొడుతోన్న 'పవన్ కుమార్‌' ఫేస్‌బుక్‌లో స్పందిస్తూ. తన వ్యక్తిగత జీవితంలో మరో మైలురాయిని చేరుకున్నానని, తనని ఇంత కాలం సీఎంగా ఆదరిస్తోన్న తమ రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. 'జ్యోతి బసు' రికార్డును తాను అధిగమించినందుకు సంతోషంగా ఉందని, అత్యంత ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా సేవలందిస్తోన్న రికార్డు తనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని 'పవన్ కుమార్‌' అన్నారు.

0 comments:

Post a Comment

ADD

AP UPDATES

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top