Saturday, 19 January 2019

Indian Army Day‘(జాతీయ సైనిక దినోత్సవం’)-january 15-Information about Army Day-History of the glorious Indian army day


స్వాతంత్ర్యానంతరం నెహ్రూ నాయకత్వం‌లో భారత ప్రభుత్వం, సైనికాధికారులు భారత సైనికదళాలకు ముఖ్యాధిపతి ఎంపిక విషయమై చర్చిస్తున్నారు. “మన సైనికాధికారులకు పూర్తిస్థాయి అనుభవం లేదు. కొంతకాలం వరకు బ్రిటిష్ అధికారినే ముఖ్య సైన్యాధిపతిగా నియమించడం బాగుంటుందేమో?’ పండిట్ నెహ్రూ తన అభిప్రాయం వెలిబుచ్చాడు.
Indian Army Day‘(జాతీయ సైనిక దినోత్సవం’)-january 15-Information about Army Day-History of the glorious Indian army day

“సార్! అనుభవజ్ఞులైన నాయకులులేరని మనం బ్రిటిష్‌దేశస్తుణ్ణి ప్రధానిగా చేసుకోగలమా? సైనికాధిపతి నియామకం దేశ రక్షణలో అత్యంత ముఖ్యమైన విషయం. ఇందులో విచక్షణ లొపిస్తే మనం ఇతరదేశాలకు లోకువైపోతాము. మనసైన్యం‌లోని అనుభవజ్ఞులైన అధికారులను నియమించండీ” సమావేశం‌లోనున్న లెఫ్టినెంట్ జనరల్ నాతూరాం సింగ్ రాధోడ్ నిలబడి చెప్పాడు.

“సరే! మీరా బాధ్యతలు స్వీకరించండి” అంటూ నెహ్రూ ప్రతిపాదించాదు.

“ధన్యవాదములు సార్! మన సైన్యం‌లోని జనరల్ కరియప్ప ఈ అత్యున్నత స్థానానికి అన్నివిధాలుగా అర్హుడు” రాధోడ్ చెప్పాడు.
అలా నియమించబడ్డ కరియప్ప జనవరి 15 (1949) న బ్రిటిష్ అధికారియైన జనరల్ సర్ ఫ్రాంసిస్ బుచర్ నుండి భారత ప్రధాన సైన్యాధిపతి బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా ‘జాతీయ సైనిక దినోత్సవం’గా జరుపుకుంటున్నాము.

కర్ణాటకలోని కూర్గ్ ప్రాంతానికి చెందిన కరియప్ప, ముద్దుగా పిలువబడే కిప్పర్ జనవరి 28 1900 సం.లొ జన్మించాడు. 15 మే 1993న మరణించారు.

సరిహద్దుల్లో దేశరక్షణయేతోపాటు దేశం‌లో ప్రకృతివిపత్తులు భూకంపాలు, వరదలు, పెనుప్రమాదాలు సంభవించినపుడు సైనికులు పరిస్థితులను వీలైనంత త్వరగా అదుపులోకి తెస్తారు.
ఈ సందర్భంగా సైనిక ప్రధాన కార్యాలయం‌, దేశ మరియు రాష్ట్రరాజదానుల్ల్లోనూ సైనిక కవాతు నిర్వహిస్తారు.

దేశరక్షణలో అసువులుబాసిన వీర సైనికులకు ఢిల్లీలోని ఇండియాగేట్ సమీపం‌లో నిరంతరం ప్రజ్వలించే ‘అమర్ జవాన్ జ్యోతి’ వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తారు.నివాళులర్పించిన పిదప పెద్దఎత్తున సైనిక కవాతు నిర్వహించి సైన్యం పొదిలో చేరిన ఆదునిక సాంకేతిక ఆయుధాలనూ, గత సం’వత్సరం సాధించిన విజయాలనూ, అసువులు బాసిన అమర సైనికులనూ స్మరిస్తారు. జమ్ముకాశ్మీర్‌లో జరిగే సైనిక దినోత్సవం‌లో గత సంవత్సరం అమరులైన సైనికులకుటుంబాలకు సేవామెడల్, విశిష్హ్ట సేవామెడల్ ప్రదానం చేస్తారు. వివిధ విభాగాలకు సైతం సేవామెడల్స్ అందజేస్తారు.
‘దేశప్రజలకు శత్రువు దేశం‌లోనున్నా, దేశంబయటనున్నా మట్టుబెట్టి దేశసమగ్రతనూ, దేశప్రజలనూ రక్షిస్తామని’ సైనిక ప్రతిజ్ఞ చేస్తారు.

0 comments:

Post a Comment

ADD

AP UPDATES

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top