చాంగీ-4 అనే రోబోటిక్ అంతరిక్ష వాహనంలో ఇటీవల చంద్రుని మీదకు చైనా పంపిన పత్తి విత్తనాలు మొలకెత్తాయి. ఈ విషయాన్ని చైనా నేషనల్ స్పేష్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది.
చంద్రుని మీద ఇలాంటి జీవ సంబంధమైన పరిణామం చూడటం ఇదే తొలిసారి. దీంతో అంతరిక్షంలో మరింత విస్తృతమైన పరిశోధనలు జరిపేందుకు కీలక అడుగు పడినట్లేనని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
గతంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మొక్కలు పెరిగాయి. కానీ, చంద్రుని మీద విత్తనాలు మొలకెత్తడం మాత్రం ఇదే తొలిసారి.
చంద్రుడి ఆవలి వైపున, భూమిని ఎన్నడూ చూడని 'అంధకార' ప్రదేశంలో చాంగీ-4 విజయవంతంగా దిగిందని ఈ నెల 3న చైనా ప్రకటించింది.
ఆ ప్రాంతంలోని పరిస్థితులను విశ్లేషించేందుకు అవసరమైన సాంకేతిక పరికరాలను చాంగీ-4 వాహనం తీసుకుని వెళ్లింది.
అక్కడ జీవసంబంధమైన పరిశోధనలు జరిపేందుకు పత్తి విత్తనాలను, 3 కిలోల బరువున్న బంగాళాదుంపలు, అరబిడాప్పిస్ అనే పూల విత్తనాలు, యీస్ట్, పట్టుపురుగు గుడ్లను కూడా ఆ వాహనంలో చైనా శాస్త్రవేత్తలు పంపించారు.
తాజా పరిశోధన మున్ముందు అంగాకర గ్రహం మీద కూడా ఇలాంటి ప్రయోగాలు చేసేందుకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

0 comments:
Post a Comment