ఎకరాకు 2,500 -అన్నదాతా సుఖీభవ’ కింద రైతుకి తక్షణ సాయం - కౌలు రైతులకు వాటా-వచ్చే ఏడాది నుంచి 10 వేలు
సామాజిక పింఛన్లు రెట్టింపు చేయడం, డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ కింద రూ.10వేల చొప్పున ఆర్థికసాయం.. ఇలా వివిధ వర్గాలపై ఇటీవల వరాలజల్లు కురిపించిన రాష్ట్ర ప్రభుత్వం, అదే బాటలో రైతాంగాన్ని ఆదుకునేందుకు భారీ పథకాన్ని ప్రకటించనుంది. రైతులకు తక్షణ పెట్టుబడి సాయంగా ఎకరానికి రూ.2,500 చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఎన్నికల ప్రకటనకు ముందే ఈ మొత్తాన్ని అందజేయనుంది. అలాగే నిరుద్యోగులకు భృతి పెంచే విషయాన్నీ యోచిస్తోంది. ‘నిరుద్యోగ భృతి కింద ప్రస్తుతం నెలకు రూ.1,000 ఇస్తున్నాం. దీన్ని రూ.2,000 చేయాలని ఆలోచిస్తున్నా’ అని బుధవారం పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
‘అన్నదాతా సుఖీభవ’లో భాగంగా
రైతుల ఆర్థిక వెసులుబాటుకు రాష్ట్ర ప్రభుత్వం ‘అన్నదాతా సుఖీభవ’ పేరుతో భారీ పథకానికి రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా తక్షణ సాయంగా రాష్ట్ర్రంలో సాగులో ఉన్న 2 కోట్లకుపైగా ఎకరాలకు, రూ.2,500 చొప్పున సుమారు రూ.5వేల కోట్లు అందజేయనుంది. ఈ మొత్తాన్ని అసలు రైతులు(భూయజమానులు), కౌలు రైతులకు ఎలా పంచాలన్న అంశంపై సర్కారు తుది కసరత్తు చేస్తోంది. అసలు రైతులకు, కౌలు రైతులకు మధ్య స్పర్థలూ తలెత్తకుండా, సామరస్యంగా కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ చేపట్టాలని భావిస్తోంది. అసలు రైతులే సాగుచేస్తున్న చోట ఎకరానికి రూ.2,500 చొప్పున వారికే చెల్లిస్తారు. కౌలు రైతులున్న చోట.. 50:50 లేదా 60:40 నిష్పత్తిలో ఇద్దరికీ పంచాలని భావిస్తోంది. ‘అన్నదాతా సుఖీభవ’ పథకాన్ని వచ్చే ఖరీఫ్ నుంచి అమలుచేయాలని మొదట భావించినా.. కష్టాల్లో ఉన్న రైతుల్ని వెంటనే ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఎకరానికి రూ.2,500 చొప్పున ఇప్పుడే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు అధికార వర్గాల సమాచారం. ఈ పథకాన్ని వచ్చే ఖరీఫ్ నుంచి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయనుంది. అప్పుడు ప్రతి సీజన్లో ఎకరానికి రూ.5,000 చొప్పున ఏడాదికి ఎకరానికి రూ.10వేలు ఆర్థికసాయం అందజేయాలన్నది ప్రతిపాదన. ఆ లెక్కన 2కోట్ల ఎకరాలకు ఏటా రూ.20వేల కోట్లు అందజేయాల్సి ఉంటుంది. పథకం వల్ల రాష్ట్రంలోని 96 లక్షలకుపైగా ఉన్న రైతులు, కౌలు రైతులకు మేలు జరగనుంది.

0 comments:
Post a Comment