⚡ FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్⚡

MORE TO VIEW

Thursday, 17 January 2019

"The Greatest" -Muhammad Ali-(1942,జనవరి 17- 2016, జూన్ 4 )American professional boxer-life history-విశ్వ విఖ్యాత బాక్సర్ ముహమ్మద్ ఆలీ- బాక్సింగ్‌ అంటే ఆలీ, ఆలీ అంటే బాక్సింగ్‌ అన్న స్థాయిలో గుర్తింపు -జీవితవిశేషాలు

ముహమ్మద్ ఆలీ
"The Greatest" -Muhammad Ali-(1942,జనవరి 17- 2016, జూన్ 4 )American professional boxer-life history-విశ్వ విఖ్యాత బాక్సర్ ముహమ్మద్ ఆలీ- బాక్సింగ్‌ అంటే ఆలీ, ఆలీ అంటే బాక్సింగ్‌ అన్న స్థాయిలో గుర్తింపు -జీవితవిశేషాలు

మహమ్మద్ అలీ విశ్వ విఖ్యాత బాక్సర్. మూడు సార్లు హెవీవెయిట్ బాక్సింగ్ ప్రపంచ విజేతగా నిలిచిన శక్తిశాలి. ఇతని అసలు పేరు క్లాషియస్ క్లే. తరువాత ఇస్లాం మతాన్ని స్వీకరించి తనపేరును మార్చుకున్నాడు. ఇతని కూతురు లైలా అలీ కూడా మహిళా విభాగంలో ప్రపంచ విజేత. ఇతను కొన్ని చిత్రాలలో కూడా నటించాడు.
"The Greatest" -Muhammad Ali-(1942,జనవరి 17- 2016, జూన్ 4 )American professional boxer-life history-విశ్వ విఖ్యాత బాక్సర్ ముహమ్మద్ ఆలీ- బాక్సింగ్‌ అంటే ఆలీ, ఆలీ అంటే బాక్సింగ్‌ అన్న స్థాయిలో గుర్తింపు -జీవితవిశేషాలు


జీవితవిశేషాలు

ఇతడు 1942,జనవరి 17వ తేదీన కెంటకీలో జన్మించాడు. ఇతని అసలు పేరు కాసియస్ మార్సెలస్ క్లే జూనియర్. ఇతడు తన 12వ ఏట నుండి బాక్సింగ్ శిక్షణ పొందాడు. 1960లో రోమ్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణపతకం సాధించడంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అదే సంవత్సరం ప్రొఫెషనల్‌గా మారి 21 సంవత్సరాల పాటు బాక్సింగ్‌లో తిరుగులేని విజయాలను సాధించాడు. ఇతడు 1964లో ఇస్లాం మతం స్వీకరించి తన పేరును ముహమ్మద్ అలీగా మార్చుకున్నాడు. తాను ఆచరించిన ధర్మం కోసం నేరుగా అమెరికా ప్రభుత్వంతోనే తలపడ్డాడు. అప్పటి నిబంధనల ప్రకారం ఆలీ కూడా సైన్యంలో చేరి వియత్నాం యుద్ధానికి వెళ్లాల్సి ఉండగా తాను నమ్మిన ఇస్లాం అమాయకులను చంపనీయదంటూ సైన్యంలో చేరడానికి వ్యతిరేకించాడు.దానితో అమెరికా ప్రభుత్వం అతని హెవీవెయిట్ టైటిల్స్ అన్నీ రద్దు చేసి అరెస్ట్ కూడా చేసి జైలుకు పంపింది. దీనిపై కోర్టులో పోరాటం తర్వాత ఇతడికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇతడు 1964లో సోంజి రాయ్‌ను, 1967లో బెలిండా బాయ్డ్‌ను,1977లో వెరోనికా పోర్షేను వివాహం చేసుకుని వారికి విడాకులు ఇచ్చి 1986లో లోనీ విలియమ్స్‌ను నాలుగో వివాహం చేసుకున్నాడు. ఇతనికి తొమ్మిది మంది సంతానం. వీరిలో లైలా అలీ బాక్సర్ కాగా, హనా అలీ రచయిత్రిగా పేరు పొందింది.

సినిమాలలో

అలీ జీవితం ఓ సినిమాకథ లాంటిది. అందుకే ఆయనపై హాలీవుడ్‌లో ఎన్నో సినిమాలు వచ్చాయి. కొన్నిటిలో తనపాత్ర తానే ధరించడం విశేషం. 1977లో తీసిన గ్రేటెస్ట్‌లో అలీ తనపాత్ర తానే పోషించి మెప్పించాడు. 2001లో తీసిన అలీ సినిమాలో విల్‌స్మిత్ మహమ్మదలీ పాత్ర వేస్తే ఆస్కార్ నామినేషన్ దక్కింది. హోవర్డ్ ఫాస్ట్ నవల ఆధారంగా 1979లో తీసిన ఫ్రీడంరోడ్‌లో అలీయే హీరో. ఆటలో మెడల్స్ లాగే ఇంకా కొంచెం గట్టిగా పట్టుబడితే ఆస్కార్ కూడా వచ్చేదేమో అంటారు. కొన్ని సినిమాలు ఇండియాలో కూడా విడుదలై బాగానే ఆడాయి. అందుకే ఎలాగైనా బాక్సింగ్ లెజెండ్‌ను బాలీవుడ్ సినిమాల్లోకి దించాలనే ఆలోచనలు కూడా జరిగాయి. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ 1980లలో లాస్ ఏంజిల్స్‌కు వెళ్లి మహమ్మద్ అలీని కలిశారు. ఆయన వెంట దర్శక నిర్మాత ప్రకాశ్ మెహ్రా కూడా ఉన్నారట. అలీని, తనను పెట్టి సినిమా తీయాలని మెహ్రా అనుకున్నారని బిగ్‌బీ ట్విట్టర్‌లో వెల్లడించారు. 1980లో ఇండియా వచ్చినప్పుడు చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఎగ్జిబిషన్ ఫైట్ ఏర్పాటైంది. ఆ సందర్భంగా స్టేడియంకు వచ్చిన తమిళనాడు సినీ, పొలిటికల్ సూపర్‌స్టార్ ఎమ్జీ రామచంద్రన్‌తో అలీ చేతులు పైకెత్తినప్పుడు స్టేడియం హర్షధ్వానాలతో దద్దరిల్లడం చాలామంది ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు

బాక్సింగ్ ప్రస్థానము

12వ ఏట బాక్సింగ్ లో శిక్షణ ప్రారంభించిన అలీ, 22 ఏళ్లకే ప్రపంచ హెవీ వెయిట్ ఛాంపియన్ గా ఎదిగారు. 1964లో దిగ్గజ బాక్సర్ సోనీలిస్టన్ పై గెలుపుతో ప్రపంచ ఛాంపియన్ గా మహ్మద్ అలీ నిలిచారు. తర్వాత ఇస్లాం మతం స్వీకరించి మహ్మద్ అలీగా పేరు మార్చుకున్నారు. 1967లోనూ హెవీవెయిట్ టైటిల్ సొంతం చేసుకున్నారు. 1964, 1974, 1978ల్లో ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్ గా నిలిచారు.గొప్ప ఛాంపియన్ గా, మానవతావాదిగా పేరొందినప్పటికీ ఆయన కెరీర్ వివాదాస్పదంగా కొనసాగింది. 1967లో అమెరికా-వియత్నాం యుద్ధ సమయంలో అలీని అమెరికా ఆర్మీలో పనిచేయడానికి ఎంపిక చేశారు. కానీ, ఆర్మీ ఆఫర్ ను అలీ తిరస్కరించారు. శక్తివంతమైన అమెరికా కోసం పేద ప్రజలపై పోరాడనని తేల్చి చెప్పారు. మరికొన్ని వివాదాలతో అలీ బాక్సింగ్ టైటిల్ వదులుకున్నారు. ఐదేళ్ల జైలుశిక్ష కూడా అనుభవించారు.
"The Greatest" -Muhammad Ali-(1942,జనవరి 17- 2016, జూన్ 4 )American professional boxer-life history-విశ్వ విఖ్యాత బాక్సర్ ముహమ్మద్ ఆలీ- బాక్సింగ్‌ అంటే ఆలీ, ఆలీ అంటే బాక్సింగ్‌ అన్న స్థాయిలో గుర్తింపు -జీవితవిశేషాలు

న్యాయ పోరాటం తర్వాత తిరిగి బాక్సింగ్ రింగ్ లోకి దిగిన మహ్మద్ అలీ 1974లో ఫ్రేజియర్ పై గెలుపొంది ఛాంపియన్ షిప్ సొంతం చేసుకున్నారు. ప్రపంచ ఛాంపియన్ షిప్ తో పాటు మరెన్నో పోటీల్లో అద్భుత విజయాలు సాధించారు. తన బాక్సింగ్ కెరీర్ లో ఐదుసార్లు మాత్రమే మహ్మద్ అలీ ఓటమి చవిచూశారు.

మరణం

ఇతడు పార్కిన్సన్స్ మరియు శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతూ 2016, జూన్ 4వ తేదీన అమెరికాలోని ఫీనిక్స్ నగరంలో ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు
ఆలీ తన కెరీర్లో 56 గెలుపులతో, కేవలం ఐదంటే ఐదు సార్లు ఓటమిని చవిచూశాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచితీరాలంటూ ఆలీ బలవంతంగా కాచుకున్న దెబ్బలే అతని ఆరోగ్యాన్ని నాశనం చేశాయి. గత ముప్ఫై ఏళ్లుగా ఆలీ పార్కిన్‌సన్స్‌ అనే నరాల వ్యాధితో బాధపడుతూ వచ్చాడు. శత్రువుల మీద ముష్టిఘాతాలను కురిపించిన ఆ చేతులు తరువాత కాలంలో వణికిపోయేవి. అతని సింహగర్జనలు కాస్తా గుసగుసల స్థాయికి చేరుకున్నాయి. ఏది ఏమైనా చివరి వరకూ కూడా బాక్సింగ్‌ అంటే ఆలీ, ఆలీ అంటే బాక్సింగ్‌ అన్న స్థాయిలో గుర్తింపు పొందాడు ఆలీ. ఆలీ లేకున్నా మానవ చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని మిగిల్చి వెళ్లాడు.

0 comments:

Post a Comment

Teachers INFO

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top