Search This Blog

⚡ FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్⚡

MORE TO VIEW

Saturday, 19 January 2019

Satish Dhawan-(1920 సెప్టెంబరు 25 – 2002 జనవరి 3)-The Legend Who Shaped India's Space Programme- సతీష్ ధావన్-భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు. ఆయన్ను భారత ఎక్స్పెరిమెంటల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ కు పితామహుడిగా పరిగణిస్తారు

Satish Dhawan-(1920 సెప్టెంబరు 25 – 2002 జనవరి 3)-The Legend Who Shaped India's Space Programme- సతీష్ ధావన్-భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు. ఆయన్ను భారత ఎక్స్పెరిమెంటల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ కు పితామహుడిగా పరిగణిస్తారు

Satish Dhawan-(1920 సెప్టెంబరు 25 – 2002 జనవరి 3)-The Legend Who Shaped India's Space Programme- సతీష్ ధావన్-భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు. ఆయన్ను భారత ఎక్స్పెరిమెంటల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ కు పితామహుడిగా పరిగణిస్తారు

సతీష్ ధావన్ (1920 సెప్టెంబరు 25 – 2002 జనవరి 3) భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు. ఆయన్ను భారత ఎక్స్పెరిమెంటల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ కు పితామహుడిగా పరిగణిస్తారు. శ్రీనగర్లో  జన్మించిన ధావన్,  భారత్‌ లోను,  అమెరికా లోనూ తన  విద్యాభ్యాసాన్ని  పూర్తి చేసాడు.  టర్బులెన్స్, బౌండరీ  లేయర్స్ రంగాల్లో ఆయన్ను అత్యున్నత స్థాయి పరిశోధకుల్లో ఒకరిగా  పరిగణిస్తారు. ఈ రంగాల్లో  ఆయన  శక్తి సామర్థ్యాలు  భారత  స్వదేశీ  అంతరిక్ష  కార్యక్రమ అభివృద్ధికి  దోహదపడింది. 1972 లో  ఎమ్.జి.కె. మీనన్ తరువాత,  ఇస్రో ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాడు.

విద్య

ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న లాహోరు లోని యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్ నుండి బాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ, మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ, ఇంగ్లీషు సాహిత్యంలో ఎమ్.ఏ డిగ్రీ పొందాడు. 1947 లో మిన్నియాపోలిస్ లోని యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగులో ఎమ్.ఎస్., కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఏరోనాటికల్ ఇంజనీరింగులో డిగ్రీ, ఆ తరువాత 1951 లో డా. హాన్స్ డబ్ల్యు లేప్‌మ్యాన్ మార్గదర్శకుడిగా గణితం, ఏరోస్పేస్ ఇంజనీరింగుల్లో డబల్ పి.హెచ్.డి పొందాడు.

ఇస్రో ఛైర్మనుగా (1972–1984)

డా. ధావన్ స్పేస్ కమిషను ఛైర్మనుగా, ఇస్రో ఛైర్మనుగా భారత ప్రభుత్వ అంతరిక్ష శాఖలో సెక్రెటరీగా బాధ్యతలు స్వీకరించాడు.  బాధ్యతలు  తీసుకోగానే  అణుశక్తి  కమిషనులో  ఉన్న బ్రహ్మ ప్రకాష్‌ను  తిరువనంతపురంలో  ఉన్న విక్రం సారాభాయ్  అంతరిక్ష  కేంద్రానికి  ఛైర్మనుగా  నియమించాడు. ఇస్రో శీఘ్రగతిన ఎదగడానికి ఈ చర్య ఎంతో తోడ్పడింది. ఆ తరువాత భారత తొలి ఉపగ్రహ  వాహక  నౌక  ఎస్‌ఎల్‌వి  అభివృద్ధి  కార్యక్రమానికి  అబ్దుల్  కలాంను నాయకుడిగా నియమించాడు.
1975 లో ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ నాయకత్వంలో ఎస్‌ఎల్‌వి అభివృద్ధి జరుగుతోంది. దాని మొదటి ప్రయోగం విఫలమైంది. వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఆనాటి పత్రికా సమావేశంలో పాల్గొని వైఫల్యాన్ని స్వీకరించాడు. రెండవ ప్రయోగం విజయవంతమైనపుడు ఆనాటి పత్రికా సమావేశాన్ని అబ్దుల్ కలాం చేత చేయించాడు

ఐఐఎస్‌సి ఛైర్మను (1962–1981)

1951 లో ధావన్ భారత్ శాస్త్ర విజ్ఞాన సంస్థలో ఉపాధ్యాయుడిగా చేరాడు. 1962 దాని డైరెక్టరుగా నియమితుడయ్యాడు. తాను ఇస్రో ఛైర్మనుగా ఉన్నప్పటికీ, బౌండరీ లేయర్ పరిశోధనలో తన శక్తియుక్తులు నియోగించాడు.  ఆయన చేసిన పరిశోధనలను హెర్మన్ ష్లిక్టింగ్, తాను రాసిన బౌండరీ లేయర్ థియరీ పుస్తకంలో వివరించాడు. ధావన్ ఐఐఎస్‌సి లో భారతదేశపు మొట్టమొదటి సూపర్‌సోనిక్ విండ్ టన్నెల్‌ను నిర్మించాడు.

అంతరిక్ష పరిశోధనలో సహకారం

ధావన్ గ్రామీణ విద్యలోను, రిమోట్ సెన్సింగు, ఉపగ్రహ సమాచారాల లోను పరిశోధనలు చేసాడు. వాటి ఫలితంగానే ఇన్‌శాట్, ఐఆర్‌ఎస్, పిఎస్‌ఎల్‌విలు రూపొందాయి.

గౌరవాలు

2002 లో ధావన్ మరణించాక, నెల్లూరు జిల్లా శ్రీహరికోట లోని అంతరిక్ష ప్రయోగ కేంద్రానికి ఆయన పేరుతో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంగా పేరు పెట్టారు. లూఢియానా లోని ప్రభుత్వ కళాశాలను ఆయన పేరిట మార్చారు.

సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం

భారతదేశంలో రాకెట్‌, ఉపగ్రహ ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంగా ఏర్పడిందే శ్రీహరికోట రాకెట్‌ లాంచింగ్‌ కేంద్రం. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ, ఇస్రో అధీనంలో ఉన్న ఈ కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లో పులికాట్ సరస్సు- బంగాళాఖాతాల నడుమ 175 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇది భూమధ్యరేఖకు 13 డిగ్రీల 43 సెకండ్ల అక్షాంశంలో ఉంది. భౌగోళికంగా, సాంకేతికంగా, ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్న ఫ్రెంచి గయానాలోని కౌరు రాకెట్ ప్రయోగ కేంద్రం భూమధ్య రేఖకు కేవలం ఏడు డిగ్రీల అక్షాంశంలో ఉండగా, 13డిగ్రీల అక్షాంశంతో శ్రీహరికోట కేంద్రం భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న క్లేంద్రాల్లో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇలా భూమధ్య రేఖకు దగ్గరగా ఉండటం వలన ఇక్కడి నుండి ప్రయోగించిన రాకెట్ తక్కువ ఇంధనం ఖర్చుతో భూమ్యాకర్షణ శక్తిని అధిగమించగలదు.

0 comments:

Post a Comment

Teachers INFO

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top