Saturday, 5 January 2019

Kalavantin Durg- Prabalgad - the most dangerous fort in India -History- Mistery- భారతదేశం లోనే అత్యంత భయంకరమైన కళావతి కోట మిస్టరీ.. ఒళ్లు గగుర్పొడిచే నిజాలు!!కోట వద్ద తీసిన యూట్యూబ్ వీడియోస్...

Kalavantin Durg- Prabalgad - the most dangerous fort in India -History- Mistery -భారతదేశం లోనే అత్యంత భయంకరమైన కళావతి కోట మిస్టరీ.. ఒళ్లు గగుర్పొడిచే నిజాలు!!...





భారతదేశం లోనే అత్యంత భయంకరమైన కళావతి కోట మిస్టరీ.. ఒళ్లు గగుర్పొడిచే నిజాలు!!
ఎన్నో కట్టడాలు, కోటలు, మరెన్నో శిల్పాలు, అద్భుత శిలలున్న మన దేశం లో వాటి వెనక రహస్యాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. అలాంటి ఒక భయంకర రహస్యం ఉన్న ఒక కోట గురించి ఇపుడు తెలుసుకోబోతున్నాం.. మహారాష్ట్ర లో 500ఏళ్ల కిందట నిర్మించారు ప్రబల్ ఘడ్ కోట. దీనికి 7 ద్వారాలు వుంటాయి. ప్రబల్ ఘడ్ కోటను కళావతి కోట అని కూడా అంటారు. దీనిని 2300అడుగుల ఎత్తులో నిర్మించారు. భారతదేశంలోనే అత్యంత డేంజరస్ కోటగా దీన్ని చెప్పుకోవచ్చు.


అత్యంత ఎత్తులో ఉండడమే దీనికి కారణం. ఇక్కడ నీరు, కరెంటు తదితర ఎలాంటి సదుపాయాలూ ఏమాత్రం ఉండవు. రాత్రి కాగానే భయం కరమైన నిశ్శబ్దంతో ఆ ప్రాంతమంతా హర్రర్ సినిమాలో సీన్లు తలపించేవిధంగా చాలా భయానకంగా ఉంటుందట ఈ కోట, పరిసరాల్లోని పరిస్థితి. ఈ కోటలో రాత్రిపూట భార్యాభర్తల ఆత్మలు ఇక్కడ తిరుగుతాయని అనేక కథలు ప్రచారంలో వున్నాయి. అయితే దీని గురించి చరిత్రలో ఎలాంటి ఆధారాలు లేవు. కానీ కొన్ని పురాణ గాధలు, కథనాల ప్రకారం మాత్రం ఇక్కడ బాధతో పాడుతున్నట్టుగా అస్పష్టమైన ధ్వనులు వస్తాయని అంటారు. మరి దీని వెనుక ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రాజుల కాలంలో ఈ ప్రబల్ ఘడ్ అనేది మహారాష్ట్రలోని ఒక రాష్ట్రానికి రాజధానిగా వుండేది. ఆ రాజ్యంలో ఓ యువ జంట అద్భుత నాట్యం చేస్తూ ఆ ప్రాంతంలోని వారి దృష్టిమొత్తం వారివైపునకు తిప్పుకుంది. తాడుపై నడుస్తూ అత్యంత ఎత్తులో నడిచే సాహసాలు చేస్తారని, ఆ రాజ్యపు రాజుకు తెలిసింది. దీంతో ఆ రాజు కూడా ఆ సాహస ఘట్టాన్ని చూడాలని అనుకుంటాడు. దీంతో వారిని రాజదర్బారుకి రావాలని రాజు ఆజ్ఞను చేరవేస్తారు. అప్పుడు ఆ భార్యాభర్తలు రాజమహల్ కి వస్తారు. అందంగా వున్న ఆ నర్తకుడి భార్యను చూసి మోహితుడైన రాజు ఆమెనుపొందాలని అనుకుంటాడు. ఆ దుర్బుద్ధితో రాజు.. వారిరువురినీ అత్యంతఎత్తులో ఒక సాహసాన్ని చేయమని కోరతాడు.

ఆ సాహసంలో గనక అతడు విజయం సాధిస్తే సగం రాజ్యాన్ని ఇస్తానని కూడా ప్రకటిస్తాడు. ఆ సాహసం అంత సాధారణమైనది కాదు. ఖచ్చితంగా ప్రాణాలు కోల్పోవలసిందేనని అని రాజుకు తెలుసు, ఆ జంటకూ తెలుసు. అందుకే అలాంటి సాహసాన్ని చేయమని కోరతాడు. ఇంతకూ రాజు కోరిక ఏమిటంటే.. రాజుగారి కోట నుండి ప్రబల్ ఘడ్ కోట వరకు పైన తాడుపై నాట్యం చేస్తూ చేరుకోవాలనే సాహసాన్ని చేయమని కోరతాడు. అప్పుడు ఆ భార్యాభర్తలిద్దరికీ ఏంచేయాలో అర్ధంకాదు .ఎందుకంటే ఇంతకు ముందు ఎన్నడూ అలాంటి సాహసాన్ని ఎవ్వరూచేయలేదు. ఎవ్వరూ చేయబోరుకూడా. ఒక వేళ ఒప్పుకొనకపోతే ఆ రాజుకు కోపం వస్తుంది. చేస్తే ప్రాణాలకు చెలగాటం అవుతుంది. ఇక ప్రాణాలను ఒదులుకోవలసిందే. చివరికి సరేనని ఒప్పుకుంటాడు ఆ నర్తకుడు ఆ రాత్రి వారు నిద్రపోకుండా రాత్రంతా పాడుతూనృత్యం చేస్తూనే గడుపుతారు. ఎందుకంటే అదే వారిజీవితంలో ఇక చివరి రాత్రని వారికితెలుసు.

వారు విషాద గీతాలు ఆలపిస్తూ గడుపుతారు. రాత్రి గడిచిపోతే జీవితం ముగిసి పోతుందని బాధాకరమైన గీతాలను వారు ఆలపించారని చాలా మంది చెబుతారు. అయితే ఇప్పుడు కళావతి కోటలో ఆ భార్యా భర్తల విషాద గీతాలు ప్రతిధ్వనిస్తుంటాయని బలమైన నమ్మకం. ఇక కథలోకి వస్తే.. అదే రోజు రాత్రి రాజు కొడుకు రాజ్యాధికారం కోసం తన తండ్రిని చంపాలని అనుకుంటాడు. దీనికీ కారణం ఉంది.. నాట్యం చేసే ఆ జంటకు రాజు చేసిన సవాల్ ప్రకారం వారు కనుక సాహసం చేస్తే సగం రాజ్యం పోతుంది. రాజు భార్యకి, కొడుక్కి ఈ విషయం ఏమాత్రం జీర్ణం కాదు. అందుకే వారు తీవ్రమైన ఆగ్రవేశాలతో ఉన్నారు. ఇక అదే సమయంలో రాజు కూతురు తను ప్రేమించిన వ్యక్తితో రాజ్యాన్నివదిలి వెళ్ళిపోయేందుకు ఆ సంక్షోభ సమయమే కరెక్ట్ అని భావిస్తుందట. అయితే రాజు భార్య, కొడుకు, కూతురు ఆరోజు ఆ నాట్యపు జంట పాడిన ఆ బాధాకరమైన పాటను విని మనస్సును మార్చుకుంటారు. ఇక మరుసటిరోజు వేలమంది ప్రజల సమక్షంలో సాహస కృత్యం మొదలవుతుంది. చూడటానికి రాజ్యంలోని జనం మొత్తం పోగయ్యారు. ఈ కోటనుండి ప్రబల్ ఘడ్ కోట వరకు రెండు తాళ్ళను కట్టేసి సాహసాన్ని స్టార్ట్ చేస్తారు.

రాజు తన పరివారంతో రాజమహల్ పై నుండి ఈ సాహసాన్ని చూడసాగాడు. ఆ ఇద్దరి యువ జంట ఎంతో నేర్పుతో సగ దూరాన్ని చాలా చాకచక్యంగా పూర్తి చేస్తారు. అయితే నర్తకుడు నడిచే తాడును కట్ చేసి నర్తకిని తన సొంతం చేసుకోవాలనేది రాజు కుటిల పన్నాగం. ఆ సమయం కోసం రహస్యంగా తన సైనికులను నియమించి మరీ కూర్చున్నాడు రాజు. ఇక మహారాణి ఎత్తుగడ మరోలా ఉంది. వారు ఎక్కడ ఆ సాహసంలో విజయంసాధిస్తే సగ రాజ్యాన్ని ఇవ్వాల్సి వస్తుందేనని బాధపడుతూ ఆమె మరొక కుటిల పన్నాగాన్ని రెఢీ చేసిది.. అదీ రాజుకు తెలియకుండా.. ఈ సాహస కృత్యంలోనే ప్రమాదం జరిగిందని భ్రమింపజేసేలా నర్తకిని ఈ లోకంలో లేకుండా చేస్తే పీఢా విరగడవుతుందని ఆమె ఆలోచన. అందుకే నర్తకి నడిచే తాడును కట్ చేయిస్తుంది. దీంతో ఆ నర్తకి కిందపడి మరణిస్తుంది. భార్య అంటే అమితమైన ప్రేమ ఉన్న ఆ నర్తకుడు కూడా వెంటనే దూకి తన ప్రాణాలను అర్పిస్తాడు. ఈ విధంగా జరిగిన కొంత కాలానికే రాజు మరణిస్తాడు. రాజ్యం అంతా అస్తవ్యస్తం అయిపోతుంది. ఇక అప్పటి నుంచి ఆ కళావవతి కోటలో భయంకర, భీకర, అరాచకపు శబ్దాలు స్టార్ట్ అయ్యాయని అక్కడి ప్రజలు చెబుతుంటారు. రాత్రి అయితే ఆత్మలు, ప్రేతాత్మలు తిరుగుతుంటాయని, ముఖ్యంగా ఆ యువ నాట్యపు జంట పాడిన విషాద గీతాలు ఘీంకరంగా మోగుతుంటాయని చెబుతారు.
View  Kalavathi port video...


*🏹The Hidden Island- Sentinel Island - Story on Sentinelese🏹*

*సెంటినెలిస్*
 *దాదాపు 60,000 సంవత్సరాల నుంచీ ఈ అండమాన్ దీవుల్లో నివసిస్తున్న  ఆదిమ వాసులు*
*సెంటినలీస్‌ను కలవటం నేరం , వారిని ఫొటోలు, వీడియోలు తీయటం నిషిద్ధం*
*ఇప్పటికి లోహాల గురించి పెద్దగా తెలియదు*
*ఇప్పటివరకు సెంటినెలీస్ తెగ వారిని ఎవరూ కలవలేదా?*
*బాహ్య ప్రపంచంతో సంబంధాలు నెరపడానికి ఎందుకు ఆస్తకి కనబర్చరు?*

*అండమాన్ ఆదిమానవుల గురించి భయంకర నిజాలు...*
*అదో పెద్ద కథ.తెలుసుకుందాం....*
👇👇👇
http://www.mannamweb.com/2018/12/the-hidden-island-sentinel-island-story.html

0 comments:

Post a Comment

AP UPDATES

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top