Thursday, 24 January 2019

January 25th National Voters Day-National Voters day Plange - 25 జనవరి జాతీయ ఓటర్ల దినోత్సం

25 జనవరి జాతీయ ఓటర్ల దినోత్సం (National Voters Day)

National Voters' Day
In order to encourage more young voters to take part in the political process, Government of India has decided to celebrate January 25 every year as "National Voters' Day. It started from January 25, 2011 to mark Commission's foundation day.

January 25th National Voters Day-National Voters day Plange - 25 జనవరి జాతీయ ఓటర్ల దినోత్సం


National Voters day Plange



ఈ సందర్భంగా ఓటర్ గా మన బాధ్యతలేమిటో తెలుసు కుందామా...
రాజకీయ ప్రక్రియలో మరింత మంది యువకులు భాగస్వాములయ్యేందుకు వీలుగా ప్రతి ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం 2011 సం.లో నిర్ణయించింది.

దేశవ్యాప్తంగా 8.5 లక్షల పోలింగ్ కేంద్రాల పరిధిలో 18 సంవత్సరాలు దాటిన యువతీ యువకులను గుర్తించే కార్యక్రమాన్ని మరింత వేగవంతంగా అమలు జరపాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. ప్రతి ఏటా పేర్లు నమోదు చేసుకున్న ఓటర్లకు జనవరి 25 నాటికి ఫోటో గుర్తింపు కార్డులిచ్చేందుకు ప్రణాళికను రూపొందించారు.

1950 జనవరి 25వ తేదీన భారత ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేయడాన్ని స్ఫురణకు తెచ్చేలా..కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) తొలిసారి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మంగళవారం 25 జనవరి 2011నాడు నిర్వహించి ప్రతీసంవత్సరం ఓటు హక్కు విలువను చాటి చెప్పేలా ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. గత సంవత్సరం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని వజ్రోత్సవ వేడుకలు నిర్వహించుట జరిగింది.

ప్రజాస్వామ్య పటిష్టత ఎన్నికలపైననే ఆధారపడి ఉంది. ఎన్నికైన ప్రజాప్రతినిధుల చేతిలో దేశ భవిష్యత్తును ఓటర్లు పెడుతున్నారు.
ఆ ప్రజాప్రతినిధులే కర్కోటకులైతే, వారే లంచగొండులు, భూబకాసురులైతే ఇక ప్రజాస్వామ్యం అధోగతే. అందుకే ప్రజాస్వామ్య పరిరక్షణలో ఎన్నికల కమిషన్‌ కీలక పాత్ర వహిస్తోంది. ఏ రాజకీయ పక్షానికి తలవంచక, స్వతంత్రంగా తన విధులను నిర్వహిస్తోంది. కేంద్ర స్థాయిలో భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఎన్నికల సంఘాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ప్రజాస్వామ్య మనుగడ, పటిష్టం ఓటరుపై ఆధారపడి ఉన్నందున కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలు ఓటర్లను చైతన్యం చేస్తున్నాయి.

ప్రతి సంవత్సరం జాతీయ ఓటర్ల దినోత్సవం జనవరి 25న నిర్వహణకై పిలుపునిస్తూ స్థానిక అధికారులచే వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
ఓటరుగా బాధ్యత నిర్వహించుటకే ఓటరు గుర్తింపు కార్డు పొందాలని, ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని పటిష్టపర్చాలని పిలుపునిస్తోంది.

అదే రోజు ఓటర్ల దినోత్సవ వేడుకల్లో కొత్తగా నమోదైన ఓటర్లను సన్మానిస్తారు. ఓటర్ల దినోత్సవం రోజు బూత్‌ స్థాయి అధికారి, పాఠశాలలు, కళాశాలలు, యూనివర్శిటీలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు ప్రజాస్వామ్య పటిష్టతకు ప్రతిజ్ఞ చేసేందుకు పిలుపునిస్తారు. ఓటు నమోదుకు సంభందించి రెండు పాస్‌ పోర్టు సైజు ఫోటోలు, జనన దృవీకరణ పత్రం, తల్లితండ్రుల ఆఫిడివిట్‌ ఆధారంగా ఓటును నమోదు చేసుకోవచ్చు.
విద్యార్థులను ఓటర్లుగా నమోదు చేయించేందుకు వారిలో స్పూర్తిని కలిగించే విధంగా ప్రతి కళాశాలలోనూ విద్యార్థులకు ఓటరుగా నమోదు, ఓటు హక్కు విలువ, ప్రజాస్వామ్య పరిరక్షణ వంటి అంశాలతో కూడిన పలు పోటీలు నిర్వహించాలన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు నిర్వహించి ప్రతిభావంతులకు జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు అందజేస్తారు.
అంతేకాకుండా, ఓటరుగా ఉన్నందుకు గర్వపడుతున్నా- ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నా అనే నినాదంతో బాడ్జీలను కూడా అందజేస్తారు....
మనం మన ఓటును నిర్భయంగా, స్వేచ్ఛగా,ప్రజాస్వామ్య బద్దంగా వినియోగిద్దాం*సమర్ధవంతమైన ప్రభుత్వాలఏర్పాటుకు మన ఓటు ఓ వజ్రాయుధమని మరవొద్దు.....

0 comments:

Post a Comment

ADD

AP UPDATES

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top