Saturday, 19 January 2019

Andhra Pitamaha - Madapati Hanumantha Rao(జనవరి 22, 1885 -నవంబరు 11, 1970)-ఆంధ్ర పితామహుడు… మాడపాటి హనుమంతరావు

Andhra Pitamaha - Madapati Hanumantha Rao(జనవరి 22, 1885 -ప్నవంబరు 11, 1970)-ఆంధ్ర పితామహుడు… మాడపాటి హనుమంతరావు


Andhra Pitamaha - Madapati Hanumantha Rao(జనవరి 22, 1885 -నవంబరు 11, 1970)-ఆంధ్ర పితామహుడు… మాడపాటి హనుమంతరావు

ఆంధ్ర పితామహునిగా పేరుగాంచిన మాడపాటి హనుమంతరావు 1885 జనవరి 22 న కృష్ణా జిల్లా నందిగామ తాలూకా పొక్కునూరులో వెంకటప్పయ్య, వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. ఈయన ఆరు వేల నియోగి బ్రాహ్మణులు. ఆయన తండ్రి గ్రామాధికారిగా పనిచేసేవాడు. 1904లో మాడపాటి వారికి తమ చిన మేనమామ కుమార్తె అన్నపూర్ణమ్మతో వివాహమైంది.

వీరిరువురికి లక్ష్మిబాయి అనే కుమార్తె జన్మించింది. దురదృష్టవశాత్తూ అన్నపూర్ణమ్మ అకాల మరణం చెందారు. తదనంతరం, 1918లో గొల్లమూడి హనుమంతరావు కుమార్తె మాణిక్యమ్మను వివాహమాడారు. మాడపాటికి, మాణిక్యమ్మకు సుకుమార్‌ జన్మించాడు. 1964లో సుకుమార్‌కు సుచేతతో వివాహమైంది. సుచేత, వరంగల్‌ వాస్తవ్యులు ఎర్ర జగన్మోహన్‌ రావు, పద్మావతిల పెద్ద కుమార్తె. దురదృష్ట వశాత్తూ సుకుమార్‌ అకాలమరణం చెందారు.

సుచేత మాత్రం మాడపాటి హనుమంతరావు బాలికోన్నత పాఠశాలకు తమ సేవలను అర్పితం చేసారు. మాడపాటి గొప్ప కవి, రచయిత. మాడపాటి మొత్తం పదమూడు కథలు రాశారు. వీటిలో హృదయశల్యం, రాణీసారందా, ముసలిదాని ఉసురు, నేనే, అగ్ని గుండం, నాడు నీ పంతం, నేడు నా పంతం, ఆత్మార్పణం, తప్పు , ఎవరికి, విధిప్రేరణం అనే కధలు మల్లికాగుచ్చం పేరుతో 1911లో పుస్తక రూపం దాల్చాయి. మాడపాటికి రచయితగా శాశ్వత కీర్తిని అందించిన గ్రంధం తెలంగాణా ఆంధ్రోద్యమం.

మాడపాటి హనుమంతరావు బహుభాషావేత్త, సాంఘిక సంస్కర్త. తెలంగాణా ప్రాంతంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజలను మేల్కొలిపి సంఘటితం చేసి ఆంధ్ర మహాసభను నెలకొల్పాడు. హైదరాబాదు నగర తొలి మేయర్‌. అంతే కాదు. మన ర్రాష్ట్ర విధాన పరిషత్‌కు మొదటి అధ్యక్షుడు కావడం ఆయన రాజకీయ దక్షతకు నిదర్శనం. భారతదేశంలో ప్రప్రథమ బాలికల పాఠశాలలో ఒకటైన మాడపాటి హనుమంతరావు బాలికోన్నత పాఠశాల హైదరాబాదులోని నారాయణగూడలో స్థాపించాడు.

రైతాంగ జీవితంపై 1912లో తొలి కథానిక ‘ఎవరికి’ రచించిన మాడపాటి హనుమంతరావు జీవితం కేవలం సాహిత్యరంగానికే పరిమితం కాలేదు. తెలుగువారి సాంస్కృతిక, సాంఘిక, రాజకీయ జీవనాన్ని ఆయన తన ఆచరణతో గాఢంగా ప్రభావితం చేశారు. కృష్ణా జిల్లా ఒక్కనూరు గ్రామంలో 1885, జనవరి 22న జన్మించిన మాడపాటి ఆంధ్ర మహాసభ నేతృత్వంలో సాగిన ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. మాడపాటి గ్రంథాలయోద్యమంలో నిర్వహించిన భూమిక ఎన్నదగినది.

పాత్రికేయునిగా కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. బాలికల కోసం ఆయన ఎన్నో పాఠశాలలను నెలకొల్పారు. ఆయన పేర ఈనాటికీ హైదరాబాద్‌ నగరంలోని నారాయణగూడలో ప్రసిద్ధ పాఠశాల మనుగడలో ఉంది. హైదరాబాద్‌లోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం, హన్మకొండలోని రాజరాజనరేంద్ర ఆంధ్ర గ్రంథాలయం మాడపాటి చల్లని నీడన ఎదిగినవే. 1951లో ఆయన హైదరాబాద్‌ నగర మేయర్‌గా ఎన్నికయ్యారు. 1958లో శాసనమండలి తొలి అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు.

మాడపాటి 1970, నవంబర్‌ 11న 85వ ఏట కన్నుమూశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆయనను గౌరవ డాక్టరేట్‌తో, భారత ప్రభుత్వం ‘పద్మ భూషణ్‌’ బిరుదుతో గౌరవించాయి. ‘ఆంధ్ర పితామహ’గా ఖ్యాతినొందిన మాడపాటి తెలుగువారందరికీ ప్రాతఃస్మరణీయుడు.

0 comments:

Post a Comment

ADD

AP UPDATES

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top