Friday, 14 December 2018

Yaganti Temple- Kurnool district-Yaganti Caves యాగంటి : ఉమామహేశ్వర లింగ క్షేత్రం-యుగాంతంతో ముడిపడి ఉన్న క్షేత్రం -కలియుగాంతం రంకె వేసే నంది యాగంటి రహస్యం ! -అగస్త్య పుష్కరిణి- అగస్త్య ముని శాపం వలన కనిపించని కాకులు - యాగంటి క్షేత్రం - గుహలు -కాలజ్ఞానం రచించిన గుహ- యాగంటి క్షేత్ర వీడియో - యాగంటి వచ్చే మార్గం లో ఉన్న పాతపాడు నవాబు బంగ్లా (అరుంధతి బంగ్లా)


Yaganti Temple- Kurnool district-Yaganti Caves యాగంటి : ఉమామహేశ్వర లింగ క్షేత్రం-యుగాంతంతో ముడిపడి ఉన్న క్షేత్రం -కలియుగాంతం రంకె వేసే నంది యాగంటి రహస్యం ! -అగస్త్య పుష్కరిణి- అగస్త్య ముని శాపం వలన కనిపించని కాకులు  - యాగంటి క్షేత్రం - గుహలు -కాలజ్ఞానం రచించిన గుహ- యాగంటి క్షేత్ర వీడియో - యాగంటి వచ్చే మార్గం లో ఉన్న  పాతపాడు నవాబు బంగ్లా (అరుంధతి బంగ్లా)

యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతమున రంకె వేసేను అంటూ కాలజ్ఞానవేత్త పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి (బ్రహ్మంగారు) తన కాలజ్ఞానంలో చెప్పారనే విషయం చాలామంది వినే వుంటారు.  కర్నూలు జిల్లాలో ప్రకృతి ఒడిలో ఈ సుప్రసిద్ధ యాగంటి క్షేత్రం వుంది. చాలామందికి యాగంటి బసవన్న గురించి మాత్రమే తెలుసు....

ఆ బసవన్న ఎప్పటికప్పుడు ఆకారం పెంచుకుంటూ వుంటాడని కూడా తెలుసు. కలియుగాంతం అవుతున్న సమయంలో కనిపించే కొన్ని నిదర్శనాలలో యాగంటి బసవన్న రంకె వేయడం కూడా ఒకటి అని తెలుసు. అయితే ఈ యాగంటి క్షేత్రానికి సంబంధించిన విశేషాలు ఇంకా ఎన్నో వున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో వున్న అనేక సుప్రసిద్ధ క్షేత్రాల్లో తప్పకుండా సందర్శించాల్సిన అద్భుత పుణ్యక్షేత్రం ‘యాగంటి’.

ఉమామహేశ్వర లింగ క్షేత్రం

యాగంటి క్షేత్రం ఒక శైవ క్షేత్రం. ఇక్కడ ప్రధాన దేవాలయంలో ఉమామహేశ్వర లింగం కొలువై వుంది. శివపార్వతులు ఇద్దరూ ఒకే లింగంలో కనిపించడం విశేషం. యాగంటి క్షేత్రానికి రాగానే అక్కడ కనిపించే పెద్దపెద్ద పర్వతాలను చూడగానే ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. ప్రకృతి శిల్పి చెక్కినట్టుగా ఇక్కడి పర్వతాలు నిట్టనిలువుగా వుండి కనువిందు చేస్తాయి. సహజసిద్ధంగా ఏర్పడిన గుహలు, ఎవరైనా ఒక ప్లాన్ ప్రకారం చెక్కారా అనిపిస్తూ వుంటాయి. ఆ గుహల్లోకి వెళ్ళడానికి వందలాది మెట్లు వుంటాయి. యాగంటి క్షేత్రం మధ్యలో నిలబడి చుట్టూ చూస్తే మనం ఒక కొత్త ప్రపంచానికి వచ్చామా అనే అనుభూతి కలుగుతుంది.

యాగంటి శైవ క్షేత్రంగా ఎలా మారింది?

మొదట యాగంటిలో వేంకటేశ్వర స్వామిని ప్రతిష్టించాలని అనుకున్నారన్న కథనం ఒకటి ప్రచారంలో వుంది. ఇక్కడి దేవాలయంలో ప్రతిష్ఠించడానికి వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా చెక్కారట. అయితే విగ్రహం కాలిలో లోపం కనిపించడంతో ఆ విగ్రహానికి ప్రతిష్ఠార్హత లేదని భావించారట. ఆ ప్రాంతంలో స్వయంభూవుగా వెలసిన ఉమామహేశ్వర లింగాన్ని తెచ్చి దేవాలయంలో ప్రతిష్ఠించారట. అలా వైష్ణవ క్షేత్రం కావలసిన యాగంటి శైవ క్షేత్రంగా మారిందట. అలాగే మరో కథనం కూడా ప్రచారంలో వుంది. తిరుమల వేంకటేశ్వరాలయం కట్టిన సమయంలో అక్కడ ప్రతిష్ఠించడానికి విగ్రహాన్ని యాగంటిలోనే చెక్కించారట. అయితే విగ్రహం కాలిని చెక్కడంలో లోపం ఏర్పడటంతో ఆ విగ్రహాన్ని ఇక్కడే విడిచిపెట్టేశారట. ఇప్పటికీ ఆ వేంకటేశ్వర విగ్రహం యాగంటిలో పూజలు అందుకుంటూ వుండటం విశేషం.

అగస్త్య పుష్కరిణి


యాగంటి ఉమామహేశ్వరాలయంలో వున్న పుష్కరిణికి ‘అగస్త్య పుష్కరిణి’ అనే పేరు వుంది. మునీశ్వరుడైన అగస్త్యుడు ఈ కోనేరులో స్నానం చేశాడని, అందుకే ఈ కోనేరుకు ఆ పేరు వచ్చిందని స్థలపురాణం పేర్కొంటోంది. ఈ  పుష్కరిణిలోకి నీరు అక్కడున్న ఓ నంది నోటి నుండి వస్తూ వుంటుంది.

ఎక్కడో పుట్టిన జలధార పర్వతాల్లోంచి ప్రవహించి నంది నోటి ద్వారా పుష్కరణిలోకి చేరుతుంది. మండే ఎండల్లో అయినా, ముంచెత్తే వర్షాల్లో అయినా పుష్కరణిలో నీరు ఒకే మట్టంలో వుండటం విశేషం. ఈ పుష్కరిణిలో నీటికి ఔషధ గుణాలు వున్నాయని చెబుతారు.

కాలజ్ఞానం రచించిన గుహ

పర్వతం మీద వున్న వివిధ గుహలకు,  ఆలయాలకు చేరడానికి ఉన్న మెట్ల మార్గాలు చూడ్డానికి చాలా బాగుంటాయి.  యాగంటిలో ప్రధాన గోపురం ఐదు అంతస్తులు కలిగి వుంటుంది. ఈ గోపురాన్ని దాటగానే రంగ మంటపం, ముఖ మంటపం, అంతరాలయం, గర్భాలయంలో లింగరూపంలో వున్న ఉమా మహేశ్వరుల రూపాలు దర్శనమిస్తాయి.

 ఇక్కడే వుండే ఒక గుహలో కూర్చుని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారని, శిష్యులకు కాలజ్ఞానం చెప్పారని అంటారు. ఆ గుహను శంకర గుహ, రోకళ్ళ గుహ అని పిలుస్తూ వుంటారు.

కాకులు కనిపించవు

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే శనిగ్రహ బాధలతో బాధపడే వారు ఈ ఆలయంలో దీపం వెలిగిస్తే శనిగ్రహ బాధలు తొలిగిపోతాయని గట్టి నమ్మకం.
ఆంధ్రప్రదేశ్‌లో కోటప్పకొండ లాంటి శైవ క్షేత్రాల్లో కాకులు కనిపించవు. యాగంటి క్షేత్రంలో కూడా కాకులు కనిపించవు. దీనికి సంబంధించి కూడా ఒక కథ ఇక్కడ ప్రచారంలో వుంది. ఇక్కడ వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అగస్త్య ముని సంకల్పిస్తే, విగ్రహం కాలిలో ఉన్న లోపం కారణంగా ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి వీలు లేకుండా పోయింది. అగస్త్యుడి ఇలా జరిగిందేమిటా అని ఆలోచిస్తూ, కారణాంతరాన్ని అన్వేషించడం కోసం తపస్సు ప్రారంభించాడట. అదే సమయంలో అక్కడ చేరిన కొన్ని కాకులు గోలగోలగా అరిచి అగస్త్యుడికి తపోభంగాన్ని కలిగించడంలో ఆయన ఆగ్రహించారట. ఈ క్షేత్రంలో కాకులకు ప్రవేశం లేదని శపించారట. ఈ కారణం వల్లే ఇక్కడ కాకులు కనిపించవని అంటారు.

యాగంటి క్షేత్రం - గుహలు 

ప్రధాన ఆలయానికి పక్కనే సహజ సిద్ధంగా ఏర్పడ్డ మూడు గుహలు యాత్రికులను ఎంతగానో ఆశ్చర్యపరుస్తాయి . వీటి వద్దకి చేరుకోవాలంటే మెట్ల వల్లే అవుతుంది.

ఆగస్త్య మహర్షి వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్టించిన గుహను వెంకటేశ్వర గుహ అని పిలుస్తారు. ఇక్కడే పక్కన ఉన్న మరో గుహలో శివలింగాన్ని ప్రతిష్టించినాడు దీనినే రొకళ్ల గుహ అని పిలుస్తారు. మీరు మరో గుహ, శంకర గుహ గమనించవచ్చు. వీరబ్రహ్మేంద్ర స్వామి తన శిష్యులకి జ్ఞానోపదేశం ఇక్కడే చేసాడని చెబుతుంటారు.


గంటి కర్నూలుకు వంద కిలోమీటర్ల దూరంలో వుంది. కర్నూలు, బనగానపల్లి, నంద్యాల నుంచి యాగంటికి బస్సు సౌకర్యం వుంటుంది. యాగంటిలో వసతి సదుపాయం వుండదు. అందువల్ల కర్నూలు, నంద్యాల, బనగానపల్లిలోనే వసతి ఏర్పాటు చేసుకుని యాగంటి క్షేత్రానికి వెళ్ళవలసి వుంటుంది. యాగంటి క్షేత్రాన్ని దర్శిస్తే కలిగే అనుభూతిని మాటల్లో చెప్పలేం. ప్రత్యక్షంగా తెలుసుకోవాల్సిన అనుభూతి అది

యాగంటి చేరుకోవడం ఎలా 

యాగంటి  బనగానపల్లె కు చేరువలో ఉన్నది. కర్నూలు నుండి బనగానపల్లె 75 కిలోమీటర్లు. ప్రతి రోజూ అరగంట కొకసారి కర్నూలు బస్ స్టాండ్ నుండి బనగానపల్లె కు ఎ పి ఎస్ ఆర్ టి సి బస్సులు తిరుగుతుంటాయి
రోడ్డు మార్గం లో ఎస్ ఆర్ బీ సి కాలువ దాటినా తరువాత పాతపాడు అనే గ్రామం వస్తుంది. ఈ గ్రామంలో చూడవలసిన స్థలం ఒకటుంది. అది కూడా రోడ్డు పక్కనే గుట్ట మీద ఉన్నది. అదే పాతపాడు నవాబు బంగ్లా.

 పాతపాడు నవాబు బంగ్లా (అరుంధతి బంగ్లా)



నవాబు బంగ్లాలో సినిమా షూటింగ్ లు జరుపుతారు. అరుంధతీ, అధినాయకుడు వంటి చిత్రాలను ఇక్కడే షూటింగ్ తీసారు. కోట కొంత భాగం శిధిలమైనప్పటికీ, వన్నె తగ్గలేదు. కోట అందాలను బయటి వైపునుండి చూడాలే తప్పనిచ్చి లోనికి ప్రవేశించరాదు. కోటని కాపలా కాస్తూ ఒక ముసలావిడ ఉంటుంది.
అరుంధతి (పాతపాడు) బంగ్లా కర్నూలు జిల్లాలోని యాగంటి సమీపంలో ఉన్న పాతపాడు బంగ్లా అపురూపమైన కట్టడం. బనగానపల్లె నవాబుల కాలంలో ఇది నిర్మితమయింది. ఎటువైపు చూసినా ఒకేలా ఉండేలా ఉండడం దీని ప్రత్యేకత. నిత్యం సందర్శకులతో కళకళలాడే ఈ బంగ్లా సినిమా షూటింగ్‌లకు కూడా పేరుపొందింది. 'అరుంధతి' తదితర చిత్రాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకొన్నాయి.

అందరీ దీన్ని నవాబు వేసవి విడిది అనుకుంటారు కానీ ఇది నవాబు ఉంపుడుగత్తె కు కట్టించి ఇచ్చిన కోటగా స్థానికులు చెబుతారు. కోట మొత్తం 9 గదులు, పెద్ద హాలు కలిగి కింద నేలమాలిగా ఉన్నట్లు ఉంటుంది. నవాబు బంగ్లా నుండి కుడివైపు తిరిగితే సరాసరి యాగంటికి చేరుకోవచ్చు.

యాగంటి గుడి రహస్యం || Mystery of Yaganti Temple || Eyeconfacts






Yaganti Temple Indicates End Of The World | కలియుగాంతాన్ని సూచిస్తున్న యాగంటి ఆలయం


0 comments:

Post a Comment

AP UPDATES

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top