Search This Blog

Friday, 28 December 2018

white paper - శ్వేత పత్రం అనే పదాన్ని తరచూ మనం వింటుంటాం..శ్వేత పత్రం అంటే ఏమిటి...ఈ భావన ఎక్కడ మొదలయింది...ఉపయోగాలు... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క విద్యా శాఖ శ్వేతపత్రం 90 పేజీలు

శ్వేత పత్రం అనే పదాన్ని తరచూ మనం వింటుంటాం. ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి, ఫలానా అంశంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది అనే వార్తలు మనం చూస్తుంటాం.

ప్రభుత్వం ఏదైనా ఒక అంశంపై విడుదల చేసే సాధికారిక నివేదికను లేదా మార్గదర్శక పత్రాన్ని శ్వేతపత్రంగా చెప్పొచ్చు. అంటే ఒక అంశంపై ప్రభుత్వం యొక్క అధికారిక సమాచారం, వాస్తవ నివేదికగా దాన్ని భావించాలి.


ఏదైనా ఒక అంశంపై ప్రభుత్వం తన విధానాలను తెలియపరుస్తూనే, అభిప్రాయాలను ఆహ్వానించడం కూడా శ్వేతపత్రం ద్వారా చేయోచ్చు. అలాగే, ఒక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడాని కంటే ముందు దాని వివరాలను శ్వేతపత్రం ద్వారా విడుదల చేసి ప్రజలకు సమాచారం అందించవచ్చు.

శ్వేతపత్రం భావన మొదటిసారి....

శ్వేతపత్రం అనే భావన పాలన నిర్వహణ నుంచి ఆవిర్భవించింది.
బ్రిటన్ ప్రభుత్వం తొలిసారిగా ఈ పదాన్ని ఉపయోగించింది. 1922లో చర్చిల్ ప్రభుత్వం విడుదల చేసిన నివేదికను తొలి శ్వేతపత్రంగా చెబుతుంటారు.
యూదులపై పాలస్తీనా హింసపై ఆ దేశంలోని తొలి బ్రిటీశ్ హైకమిషనర్ సర్ హెర్‌బర్ట్ శ్యాముల్ రూపొందించిన ముసాయిదా పత్రాన్ని తొలి శ్వేతపత్రం (చర్చిల్ మోమోరాండం)గా పేర్కొంటారు.

బ్రిటన్ పార్లమెంట్ నిర్వచనం ప్రకారం 'ప్రభుత్వ విధానాలను, చట్టపరమైన ప్రతిపాదనలను, బిల్లు రూపం దాల్చడానికి ముందు జరిగే వ్యవహారాలను, ఒక్కోసారి ప్రజల అభిప్రాయలను సేకరించే ప్రభుత్వ నివేదకను శ్వేతపత్రంగా పేర్కొంటారు. '

బ్రిటన్ నుంచి ఈ శ్వేతపత్రం భావనను తీసుకొని భారత్, కెనడా, అమెరికాలతో పాటు అనేక దేశాలు తమ పాలనలో భాగం చేసుకున్నాయి.
కొన్ని దేశాల్లో వైట్ పేపర్‌తో పాటు గ్రీన్ పేపర్ విధానం కూడా అమలులో ఉంది.
వివిధ అంశాలపై ప్రభుత్వం శ్వేతపత్రాని కంటే ముందు గ్రీన్ పేపర్‌ను విడుదల చేస్తుంది.
ఒక అంశానికి సంబంధించిన ప్రతిపాదనలు, చర్చల సారాంశం, సలహాలు ఇతర విషయాలపై ప్రభుత్వం విడుదల చేసే సూత్రప్రాయి నివేదికను గ్రీన్ పేపర్‌గా పిలుస్తారు.
శ్వేతపత్రాలు వల్ల ప్రభుత్వ విధాన నిర్ణయాలు, అంశాల గురించి ప్రజలు తెలుసుకోగలగుతున్నారు.
అలాగే, ప్రభుత్వ పనితీరును అవగాహన చేసుకొని సూచనలు చేసే అవకాశం కలుగుతోంది.
ప్రభుత్వ విధానాలను, నిర్ణయాలను ప్రజలు తెలుసుకోడానికి శ్వేతపత్రాలు చక్కగా ఉపయోగపడుతాయి.

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ పైన ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయడం జరిగింది .
ఈ శ్వేతపత్రాన్ని మన ముఖ్యమంత్రి గారు మన విద్యాశాఖ సాధించిన ప్రగతిని తద్వారా పాఠశాలలకు అందించిన మౌలిక సదుపాయాల గురించి తెలియ పరచడం జరిగింది.
 దీనికి సంబంధించిన వివరాలను ఈ క్రింది లింక్ లో ఉంచడం జరిగింది.
Download.... School Education white paper

0 comments:

Post a Comment

AP UPDATES

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top