Search This Blog

Saturday, 15 December 2018

Venadu Dargah History-వేనోళ్ల కొలిచే "వేనాడు" దర్గా!-144 అడుగుల పొడవున్న బాబా సమాధి - ఆసియా లోనే అతిపొడవైన సమాధి. ముస్లింలు పవిత్రంగా భావించే దర్గా అయినా, దాని నిర్వహణ చూసేది హిందువులు.సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కి ఇష్టమైన,అతను బాగోగులు చూసిన దర్గా ...రెహమాన్ హిందు నుంచి ఇస్లాం మతం మార్చుకున్న విధానం....

Venadu Dargah History-వేనోళ్ల కొలిచే   "వేనాడు " దర్గా! -  144 అడుగుల పొడవున్న బాబా సమాధి - ఆసియా లోనే అతిపొడవైన సమాధి- ముస్లింలు పవిత్రంగా భావించే దర్గా అయినా, దాని నిర్వహణ చూసేది హిందువులు...


ముస్లింలు పవిత్రంగా భావించే దర్గా అయినా, దాని నిర్వహణ చూసేది హిందువులు. హిందూ, ముస్లింలన్న భేదంలేకుండా అందరూ ఆ బాబా సమాధిని దర్శించుకుంటారు, మొక్కులు చెల్లించుకుంటారు. ఆసియాలోనే పొడవైన ఆ దర్గా తెలుగు నేలపైనే ఉంది.

నెల్లూరు జిల్లా తడ మండలం వేనాడులో ‘హజరత్‌ షేక్‌ దావూద్‌ షావలీ అల్లా  సమాధి కొలువైంది. 144 అడుగుల పొడవున్న బాబా సమాధి కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. ఇది ఆసియా లోనే అతిపొడవైన సమాధిగా చరిత్రకెక్కింది. స్థానికుల కథనం ప్రకారం... 600 ఏళ్ల క్రితం వేనాడు అడవిలో ఒక ఫకీరు తిరుగుతూ ఉండేవాడు. పశువుల కాపర్లు తెచ్చిన అన్నంతో ఆకలి తీర్చుకునేవాడు. గ్రామస్థులకు జబ్బుచేస్తే పసర్ల ద్వారా వైద్యం చేస్తూ నయం చేస్తుండేవాడు. అందరూ అతన్ని ‘బాబా’ అని పిలిచేవారు. ఒకానొక రోజు తనకు తనువు చాలించే సమయం దగ్గరైందనీ, తాను చనిపోయాక శరీరాన్ని ఇసుకతో కప్పేయమనీ పశువుల కాపర్లకు చెప్పి అదేరోజు చనిపోయాడు ఫకీరు. పశువుల కాపర్లు బాబాను మట్టితో కప్పేశారు. ఆరోజు సాయంత్రం గాలివాన మొదలైంది. విషయం తెలిసి గ్రామస్థులంతా మర్నాడు ఉదయమే ఆ ప్రదేశానికి వెళ్లి చూశారు. అక్కడ తవ్వే ప్రయత్నం చేయగా బాబా సమాధి అంతకంతకూ పెరిగి 144 అడుగులకు చేరింది. అప్పట్నుంచీ మహిమ గల బాబాగా ఆయనకు పూజలు ఆరంభమయ్యాయి.

హిందువులే నిర్వాహకులు 

బాబా సమాధి వద్ద ఉన్న శిలాఫలకం గురించి కొన్నాళ్ల కిందట స్థానికులు పురావస్తు శాఖకు సమాచారం అందించారు. ఆ శాఖ అధికారులు ఫలకాన్ని పరిశీలించి షేక్‌ దావూద్‌ అనే వ్యక్తి 1602లో జీవసమాధి అయినట్టు రాసుందని వెల్లడించారు. శిలాఫలకంలో ఉన్నది అరబిక్‌ లిపిగా తేల్చారు. ఇందులో తమిళం, అరబిక్‌ పదాలు ఉన్నట్టుగా చెప్పారు. వేనాడు గ్రామంలో ఒక్క ముస్లిం కుటుంబం కూడా లేదు. మొదట్నుంచీ దర్గా నిర్వహణా, ఉరుసు(గంధోత్సవం) ఏర్పాటూ హిందువులే చూసుకుంటూ వస్తున్నారు. ఏటా దర్గాలో జరిపే గంధోత్సవం హిందూ, ముస్లింల స్నేహభావానికి నిలువుటద్దంగా నిలుస్తోంది. ఆరోజు గ్రామపెద్దల ఇంటి నుంచే ప్రత్యేకంగా అలంకరించిన రథంపై వూరేగింపుగా దర్గాకు గంధం చేరుతుంది. గంధంతోపాటు గ్రామ మహిళలు సారెను సమర్పిస్తుంటారు. వూరేగింపుగా వచ్చిన గంధాన్ని గ్రామపెద్ద తలపై ఉంచుకుని బాబా సమాధి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. దర్గా వద్ద ఏర్పాటుచేసిన దీపం కొన్నేళ్లుగా వెలుగుతూనే ఉందని స్థానికులు చెబుతున్నారు. దర్గాలో భక్తులు సమర్పించే కొబ్బరికాయల నుంచి తీసిన నూనెతోనే ఆ దీపాన్ని వెలిగించడం సంప్రదాయంగా వస్తోంది.

విశిష్ట భక్తులు-ఏఆర్‌ రెహమాన్‌

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ కుటుంబ సభ్యులు వేనాడు దర్గాకు మరింత ప్రాచుర్యం తెచ్చారు.

 20ఏళ్ల కిందట రెహమాన్‌ కుటుంబ సభ్యుల్లో ఒకరికి తీవ్ర అనారోగ్యం ఉన్నపుడు మత గురువు సూచనతో వేనాడు దర్గాను దర్శించారు. వారికి అనారోగ్యం నయంకావడంతో దర్గాపై ఆ కుటుంబానికి ఎనలేని నమ్మకం ఏర్పడింది. అప్పట్లో బాబా సమాధి ఇసుకతోనే ఉండేది. తర్వాత ఆ కుటుంబ సభ్యులే సమాధిని సిమెంటూ, ఇటుకలతో నిర్మించి 1995లో తొలి గంధోత్సవం(ఉరుసు) నిర్వహించారు. తర్వాత కూడా నాలుగు దఫాలు వాళ్ల ఆధ్వర్యంలోనే ఉరుసు జరిగింది. ఆ తర్వాత నుంచి గ్రామస్థులే గంధోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. గతేడాది కూడా రెహమాన్‌ దర్గాను దర్శించి వెళ్లారు. రెహమాన్‌ తల్లీ, చెల్లెళ్లూ తరచూ దర్గాను సందర్శిస్తారు. . గంధోత్సవానికి మతాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కేరళ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు.
ఇలా చేరుకోవచ్చు...
ప్రతినెలా అమావాస్య రోజున వేనాడు దర్గాను ఏడెనిమిది వేల మంది భక్తులు దర్శించుకుంటారు. భక్తులు సేదదీరేందుకు పెద్ద రేకుల షెడ్లు ఉన్నాయి. స్నానపానాదులకు ఏర్పాట్లు ఉన్నాయి. దర్గా ప్రాంగణంలో దుకాణాలూ ఏర్పాటయ్యాయి. భక్తులు వంట చేసుకునేందుకూ సదుపాయం ఉంది. ప్రస్తుతం అద్దెకిచ్చే గదుల నిర్మాణం జరుగుతోంది. వేనాడు దీవి కావడంతో పర్యటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. బాబా సేదతీరిన ప్రదేశంగా భావించే జువ్వి చెట్టు చుట్టూ ప్రహరీ నిర్మించి సుందరంగా తీర్చిదిద్దారు. పులికాట్‌ సరస్సు మధ్యలో ఏర్పాటైన రహదారి మీదుగా వేనాడు ప్రయాణం చక్కని అనుభూతినిస్తుంది. రెండువైపులా నీళ్లూ, అక్కడక్కడా పక్షుల గుంపులూ, నాటు పడవలూ, చేపల వేట సాగించే మత్స్యకారుల దృశ్యాలూ ఆకట్టుకుంటాయి. వేనాడు వచ్చేవారు నెల్లూరు నుంచి 100కి.మీ, చెన్నై నుంచి 80కి.మీ.ల దూరంలో ఉన్న సూళ్లూరుపేటకు రావాలి. అక్కణ్నుంచి శ్రీహరికోటకు వెళ్లే మార్గంలో 15కి.మీ.లు ప్రయాణించి అటకానితిప్ప గ్రామం నుంచి 10కి.మీ.లు వెళ్తే వేనాడుకు చేరుకోవచ్చు.

ఎ. ఆర్. రెహమాన్

రెహ్మాన్‌ అసలు పేరు ఎ. ఎస్‌. దిలీప్‌ కుమార్‌. తండ్రి ఆర్. కె. శేఖర్, తల్లి కస్తూరి. శేఖర్ సంగీత దర్శకుడు. ఆలయాల్లో భజన పాటలు పాడేవాడు. రెహమాన్ కు ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్ళు. అక్క కొడుకు జి. వి. ప్రకాష్ కూడా ప్రముఖ సంగీత దర్శకుడిగా ఎదిగాడు. నాలుగేళ్ళ వయసు నుంచే తండ్రి దగ్గర పియానో వాయించడం నేర్చుకున్నాడు. తొమ్మిది సంవత్సరాల ప్రాయంలోనే తండ్రి మరణించాడు. ఆ సమయంలో ఇంట్లోని సంగీత పరికరాల్ని అద్దెకిస్తూ కుటుంబాన్ని పోషించేది తల్లి. తల్లి, ముగ్గురు అక్కచెల్లెళ్ళు- పేదరికం. 11 సంవత్సరాల ప్రాయంలో కుటుంబ బాధ్యతలు నెత్తిపై వేసుకొని తల్లికి చేదోడుగా ఉంటూ గిటార్‌, హార్మోనియం, పియానో, కీబోర్డు ప్లేయర్‌గా ఇళయరాజా, రమేష్ నాయుడు, రాజ్ కోటి లాంటి పలు సంగీత దర్శకుల ట్రూప్‌లో పనిచేస్తూ జీవితం ప్రారంభించాడు. దూరదర్శన్వండర్ బెలూన్ అనే ఒక కార్యక్రమంలో ఒకేసారు నాలుగు కీబోర్డులు వాయిస్తూ కనిపించాడు.

పనిలో పడి బడికి సరిగా వెళ్ళలేక పోయాడు. సంగీత దర్శకులు కూడా సొంత పరికరాలు కొనుక్కోవడంతో వీరి అద్దె వ్యాపారానికి గిరాకీ తగ్గింది. దాంతో తల్లి కూడా అతన్ని చదువు మానేసి సంగీతం మీదనే దృష్టిపెట్టమని చెప్పింది. మొదట్లో చదువుకోలేకపోయినందుకు అసంతృప్తి చెందినా తరువాత జీవిత పాఠాలు నేర్చుకున్నందుకు సంతోషపడ్డాడు. 1987 లో చెన్నై లోని కోడంబాకం లోకి వచ్చిన రెహమాన్ కుటుంబం అప్పటి నుంచీ అక్కడే ఉంటోంది. అమెరికాలోని లాస్ ఏంజిలెస్ లో కూడా రెహమాన్ కు ఓ ఇల్లుంది. పని ఒత్తిడి నుంచి బయటపడ్డానికి, సాధారణ జీవితం గడపడానికి అక్కడికి వెళుతూ ఉంటాడు.

తల్లి నగలు అమ్మి ఆధునిక హంగులతో ఇంట్లోనే ఒక స్టూడియో ప్రారంభించాడు.రెహమాన్ తల్లికి ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ. ఇంట్లో హిందూ దేవుళ్ళతోపాటు మేరీమాత, మక్కా మదీనా చిత్రాలు కూడా ఉండేవి. భర్త చనిపోయిన తర్వాత ఆమె ప్రశాంతత కోసం నెల్లూరు జిల్లా, తడ దగ్గరలోని సూఫీ ప్రవక్ర కరీముల్లా షా ఖాద్రీ బోధనలకు ఆకర్షితులై వీరి కుటుంబం 1989వ సంవత్సరంలో ఇస్లామ్‌లోకి మారింది. ఇది జరగక మునుపే చెల్లెలు పెళ్ళి కోసం ఓ జ్యోతిష్కుడి దగ్గరకు వెళ్ళారు. అప్పటికే దిలీప్ అనే పేరు అంతగా నచ్చని రెహమాన్ తనకు పేరు మార్చుకోవాలని ఉందని ఆయన్ను అడిగాడు. ఆయన అబ్దుల్ రహీమ్ కానీ అబ్దుల్ రెహమాన్ కానీ పేరు మార్చుకుంటే అంతా మంచే జరుగుతుందని సలహా ఇచ్చాడు. రెహమాన్ అనే పేరు నచ్చడంతో అప్పటి నుంచి అలాగే పేరు మార్చుకున్నాడు. తల్లి ఆ పేరు ముందు అల్లా రఖా అనే పేరును చేర్చింది. ఆమె కూడా తన పేరును కరీమా గా మార్చుకుంది. ఈయన కడప లోని పెద్ద దర్గా, కసుమూరు దర్గా, నెల్లూరు జిల్లాలోని వేనాడు దర్గాలను తరచూ సందర్శిస్తారు.

0 comments:

Post a Comment

AP UPDATES

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top