Search This Blog

 • 🖨️ Inter Hall tickets NEW...
 • MORE TO VIEW

Sunday, 23 December 2018

The Christmas Story - Birth Of JESUS CHRIST -లోక రక్షకుడు జన్మించిన వేళ-క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు.. యేసుక్రీస్తు జన్మదిన సందర్భంగా జరుపుకునే ఈ పండుగ ఎంతో పవిత్రమైనది. క్రీస్తు జననం వెనుక కొన్ని అద్భుతాలు దాగున్నాయి...క్రిస్మస్ ట్రీ, స్టార్ (నక్షత్రం), దేవ దూతలు, క్యాండిల్స్, గొల్లలు, బెల్స్ (గంటలు),స్వాంటక్లాజ్ ప్రధాన మైన అంశాలు...తెలుసుకుందాం..

లాటిన్ భాషలో క్రిస్ట్ (Christ) అనగా క్రీస్తు, మాస్ (Mass) అనగా ఆరాధన. క్రీస్తుని ఆరాధించి ఆయనను కీర్తిస్తూ ఆనందించుటయే క్రిస్ట్మస్.

 యేసు అనగా గ్రీకుభాషలో రక్షకుడని, క్రీస్తు అనగా హెబ్రూ భాషలో అభిషిక్తుడని అర్థం. సమస్త లోక ప్రజల ఆకలి తీర్చే జీవాహారం ఇచ్చే క్రీస్తు ప్రభువు జన్మించిన ఊరిపేరు బెత్లహేమ్‌. ఆ మాటకు అర్థం- రొట్టెల గృహం....

యేసుక్రీస్తు జన్మదిన సందర్భంగా జరుపుకునే ఈ పండుగ ఎంతో పవిత్రమైనది. క్రీస్తు జననం వెనుక కొన్ని అద్భుతాలు దాగున్నాయి.

The Christmas Story - Birth Of JESUS CHRIST -లోక రక్షకుడు జన్మించిన వేళ-క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు.. యేసుక్రీస్తు జన్మదిన సందర్భంగా జరుపుకునే ఈ పండుగ ఎంతో పవిత్రమైనది. క్రీస్తు జననం వెనుక కొన్ని అద్భుతాలు దాగున్నాయి...తెలుసుకుందాం

రోమా సామ్రాజ్యాన్ని ఆగస్టస్ సీజర్ అనే చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. ఆయన తన రాజ్యంలో ఎంత మంది ప్రజలు ఉన్నారో లెక్కవేయించాలనుకున్నాడు. అందుకు వీలుగా ప్రజలందరు ఎవరి స్వగ్రామాలకు వాళ్ళు డిసెంబరు 25 తేదీలోగా వెళ్ళాలని ఆజ్ఞాపించాడు.( తెలంగాణలో జరిగిన సమగ్ర సర్వే-మాదిరిగా)అప్పుడు ‘ నజరేతు ‘ అనే పట్టణంలో మేరీ, జోసఫ్ అనే వాళ్ళు నివసిస్తున్నారు.అప్పటికే మేరీకి జోసెఫ్‌తో పెళ్ళికుదిరింది. ఇదిలా ఉండగా ఒక రోజున మేరీకి గాబ్రియేల్ అనే దేవదూత కనబడి ‘ఓ మేరీ! నీవు దేవుని వలన అనుగ్రహం పొందావు. నీవు కన్యగానే గర్భవతివి అవుతావు. నీవు ఒక కుమారుని కంటావు. అతనికి ‘యేసు’ అని పేరు పెట్టు. అతడు దేవుని కుమారుడు’ అని చెప్పి మాయం అవుతాడు.తర్వాత మేరీ గర్భవతి అవుతుంది.

ఇది తెలిసి జోసెఫ్ ఆమెను పెళ్లి చేసుకోకూడదని అనుకుంటాడు….అయితే ఒక రాత్రి కలలో అతనికి దేవదూత కనపడి’ మేరీని నీవు విడిచిపెట్టొదు….ఆమె దేవుని వరం వలన గర్భవతి అయింది. ఆమెకు పుట్టే కొడుకు దేవుని కుమారుడు. తనను నమ్మిన ప్రజలందరిని వాళ్ళ పాపాల నుండి కాపాడే లోక రక్షకుడతను.’ అని చెప్పి అదృశ్యమవుతాడు. తర్వాత జోసెఫ్ మేరిని పెళ్లి చేసుకుంటాడు.

జోసఫ్ స్వగ్రామం బెత్లేహం. అందుచేత వాళ్ళు రాజాజ్ఞను అనుసరించి బెత్లేహేముకు బయలుదేరారు. తీరా వాళ్ళు బెత్లేహేము చేరుకునే సరికి వాళ్ళకక్కడ ఉండటానికి వసతి దొరకలేదు. చివరకు ఒక సత్రపు యజమాని తన పశువుల పాకలో ఉండనిచ్చాడు. అక్కడే మేరీ ఒక శిశువుకు జన్మనిస్తుంది.

ఆ రాత్రి బెత్లేహం పొలాల్లో కొందరు పశువుల కాపరులు తమ గొర్రెల మందలను కాపలా కాస్తుండగా…. ఓ దేవదూత ఆకాశం నుంచి వారి ముందుకు దిగి వచ్చి, మీకొక సంతోషకరమైన శుభవార్త తీసుకొచ్చాను… ఇవ్వాళ బెత్లెహేములోని ఒక పశువులపాకలో, లోక రక్షకుడు పుట్టాడు. ఆయనే అందరికీ ప్రభువు. ఒక పసికందు పొత్తిగుడ్డల్లో చుట్టబడి, పశువుల తొట్టిలో పండుకొని ఉంటాడు. ఇదే మీకు గుర్తు. అతడే లోకరక్షకుడు అని చెబుతాడు అంతర్థానమవుతాడు. ఇది విన్న గొర్రెల కాపరులు హుటాహుటిన వెళ్ళి దేవదూత చెప్పిన పశువుల పాకను చేరుకున్నారు. అక్కడ పశువుల తొట్టిలో పడుకొని ఉన్న శిశువును, మేరీ, జోసెఫ్ లను చూశారు. వారు తాము చూచింది, దేవదూత తమకు చెప్పింది అందరికి తెలియజేశారు. అలా రెండు వేల సంవత్సరాల క్రిందట డిసెంబరు 24వ తేదీ అర్థరాత్రి యేసు క్రీస్తు జన్మించాడు. అందుచేత ఆ మరునాడు అంటే డిసెంబరు 25వ తేదీ క్రిస్మస్ పండుగ.

 క్రైస్తవులలో రోమన్ క్యాథలిక్, ప్రొటెస్టియన్స్‌గా రెండు తెగలు ఉన్నాయి. రోమన్ క్యాథలిక్‌లు మేరి మాతను, బాల ఏసును పూజిస్తే ప్రొటెస్టియన్లు ఏసు క్రీస్తును పూజించడం ఆనవాయితీ.

ఏసు అంటే...


ఏసు అనే పదానికి రక్షకుడు అనేది పర్యాయ పదం.క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం. నశించి పోతున్న మనుషులను వెదకి రక్షించడానికి వచ్చాడు కాబట్టే ఆయనను రక్షకుడు అని క్రైస్తవులు వ్యవహరిస్తారు. మానవాళి శాంతియుతంగా జీవించాలనేదే క్రిస్మస్ ముఖ్య సందేశం. ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే ఈ పండుగను ఇతర కుల, మతాల వారు కూడా పాలు పంచుకొని క్రిస్మస్ సంబరాలను ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమైనవి క్రిస్మస్ ట్రీ, స్టార్ (నక్షత్రం), దేవ దూతలు, క్యాండిల్స్, గొల్లలు, బెల్స్ (గంటలు),స్వాంటక్లాజ్ ప్రధాన మైన అంశాలు.

మిడ్ నైట్ మాస్

 క్రిస్మస్ సాధారణంగా అర్ధరాత్రి మాస్ గా ప్రారంభమవుతుంది. యేసు క్రీస్తు అర్ధరాత్రి సమయంలో పుట్టారన్న సంగతి తెలిసిందే. కాబట్టి కిస్మస్ ప్రతి చర్చిలోను మిడ్ నైట్ మాస్ గా జరుగుతుంది.

క్రిస్మస్ ట్రీ విశిష్టత...

దేవుడు (ఏసుక్రీస్తు) ఈ భువిపై జన్మించిన సందర్భంలో సృష్టి ఏసు క్రీస్తును ఈ ప్రపంచానికి రారాజుగా భావించి దేవుని ఎదుట మోకరిల్లుతుంది. ప్రకృతిలోని ప్రతి వస్తువు, చెట్లు, సమస్త జీవులన్ని దేవుడిని ఆరాదిస్తాయి. అయితే ఈ సృష్టిలోని అన్ని చెట్లు తమకు పూసిన పూలతో, పండ్లతో దేవుడిని ఆరాధిస్తాయి. అయితే ఈ సమయంలోనే ఓక్ చెట్టు తన ద్వారా దేవుడికి సమర్పించుకోవడానికి ఎలాంటి పూలు, పళ్లు లేక పూత, కాత లేక ఉండిపోవడంతో వేదనకు గురవుతుంది. ఈ సమయంలోనే దైవ సృష్టితో ఓక్‌చెట్టుకు ఆకాశంలోని నక్షత్రాలు పూస్తాయి. రక రకాల చెట్ల పళ్లు, పూలు ఈ చెట్టుకు కాస్తాయి. దీంతో ఓక్ చెట్టు దేవుడిని ఆరాధించి తన కృతజ్ఞతలను తెలుపుకుంటుంది. కనుక ఓక్‌చెట్టుకు అప్పటినుంచి ప్రాశస్థం ఉన్నట్లు చెబుతారు. ఈ చెట్టునే ప్యారడైజ్ ట్రీగా కూడా వ్యవహరిస్తారు. క్రిస్మస్ వేడుకలు జరుపుకునే క్రైస్తవులందరూ పండుగ సందర్భంలో క్రిస్మస్‌ట్రీని ప్రత్యేకంగా అలంకరించుకోవడం ఆనవాయితీ.

క్రిస్మస్ చెట్టుకూ ఓ చరిత్ర ఉంది 
కిస్మ్రస్‌ చెట్టుగా పచ్చని 'కొనిఫెరన్‌'ను ఉపయోగించటం ఆనవాయితీగా వస్తోంది. 16వ శతాబ్ధంలో జర్మనీలోనూ, 15వ శతాబ్ధంలో లివోనియా (ప్రస్తుతం ఈస్తోనియా, లాత్వియా)లో మొదట క్రిస్మస్‌ చెట్టును అలంకరించడం అనే సంప్రదాయం మొదలైందంటారు. క్రిస్మస్‌ రోజుల్లో ఈ చెట్టుని ఇంటికి తెచ్చి కొవ్వొత్తులు లేదా విద్యుద్దీపాలతో, రకరకాల వస్తువులతో అందంగా అలంకరిస్తారు. క్రిస్మస్‌ చెట్టు పైభాగంలో నక్షత్రా (స్టార్‌) న్ని ఏర్పాటు చేస్తారు.

చారిత్రకంగా క్రిస్మస్‌ చెట్టుని పరిశీలిస్తే ఈ సంప్రదాయం 1781లో బెన్షివిక్‌ సైనికుల ద్వారా కెనడాలోకి ప్రవేశించిందంటారు. 'జనరల్‌ ఫెడరిక్‌ అడాల్ఫ్‌ రెడిజిల్‌' అనే సైనికాధికారి ఇచ్చిన క్రిస్మస్‌ విందులో అతిథులను అబ్బురపరచటం కోసం 'ఫర్‌' చెట్టుని కొవ్వొత్తులతో, పండ్లతో అలంకరించాడట! 19వ శతాబ్ద ప్రారంభంలో ఈ సంప్రదాయం ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత రష్యాలాంటి దేశాల్లోనూ సంపన్న కుటుంబాలవారు క్రిస్మస్‌ చెట్టుని ఉపయోగించటం మొదలుపెట్టారు.
1816లో 'నస్సావో-విల్‌బర్గ్‌' యువరాణి 'హెన్‌రేటా' క్రిస్మస్‌ చెట్టుని వియన్నా దేశానికి పరిచయం చేసింది. ఆతర్వాత కాలంలో ఈ సంప్రదాయం ఆస్ట్రియాకి విస్తరించింది. ఫ్రాన్స్‌ దేశంలోకి 1840లో డచ్‌ వారి ద్వారా ఈ చెట్టు వచ్చింది. బ్రిటన్‌ దేశంలోకి 19వ శతాబ్ద ప్రారంభంలో క్రిస్మస్‌ సంప్రదాయంలో భాగమైంది.రాణి విక్టోరియా.. తనకు చిన్నప్పటి నుంచి ఈ చెట్టుతో అనుబంధం ఉన్నట్లు ఒక పత్రికలో పేర్కొన్నారు. ఆ తర్వాత కాలంలో ప్రపంచవ్యాప్తంగా కిస్మస్‌చెట్టు ప్రసిద్ధిచెందింది.
ఈ క్రిస్మస్‌ చెట్టు చరిత్ర ఇలా వుంటే మరో కథ ఒకటి చెప్తారు.
 ఆ కథేంటంటే.. ''చాలా ఏళ్ళ క్రితం క్రీస్తు పుట్టినరోజున చర్చికి వెళ్లి, రకరకాల బహుమతులు ఇచ్చే సంప్రదాయం ఉండేది. అలా ఒక ఊరిలో ఉండే ప్లాబో అనే పేద పిల్లవాడికి ఏమివ్వాలో తెలియలేదు. ఏది కొనాలన్నా చేతిలో పైసా లేదు. ఏం చేయాలో తోచని ప్లాబో తన ఇంటిముందు ఓ అందమైన మొక్క కనిపించింది. దానిని తీసి, ఓ చిన్న కుండీలో పెట్టుకుని చర్చికి తీసికెళ్లాడు. అక్కడ ఎన్నో విలువైన కానుకలతో వచ్చిన వారంతా ప్లాబో చేతిలోని కుండీని చూసి ఎగతాళి చేశారు. ప్లాబో సిగ్గుపడుతూనే దానిని క్రీస్తు ప్రతిమ దగ్గర పెట్టాడు. ఆశ్చర్యంగా.. ఆ చిన్న మొక్క అప్పటికప్పుడు పెద్ద మొక్కగా ఎదిగి, బంగారు వృక్షంగా మారిపోయిందట! ప్రేమతో ఆ పేద బాలుడు తెచ్చిన కానుకే విశిష్టమైనది అయ్యింది. అందరూ ఆ బాలుడిని ఎగతాళి చేసినందుకు సిగ్గుపడ్డారు. మంచి మనస్సుతో ఇవ్వడం ముఖ్యమని అందరూ తెలుసుకున్నారు. ఇక అప్పటి నుంచి ప్రతిఏటా అందరూ క్రిస్మస్‌ చెట్టుని అలకరించడం మొదలుపెట్టారంట!''

స్టార్ (నక్షత్రం)...

దైవ సందేశాన్ని మానవాళికి అందించేందుకు దేవుడు సృష్టించిన జ్ఞానులను బెత్లహేం వరకు నడిపించడానికి నక్షత్రం తోడ్పడిందిగా క్రైస్తవులు విశ్వసిస్తారు. జ్ఞానులతో పాటు గొల్లలకు దారి చూపిన దివ్య నక్షత్రాన్ని క్రైస్తవులు క్రిస్మస్‌కు ఇళ్లపై అలంకరించుకోవడంతోపాటు వ్యాపార సంస్థల్లో, చర్చిల్లో కూడా స్టార్‌లను అలంకరించుకోవడం ఆనవాయితీగా మారింది.

దైవ దూతలు....

లోక రక్షకుడైన ఏసుక్రీస్తు ఈ భువిపై అవతరిస్తున్నాడని ముందుగా దేవుడు సృష్టించిన దైవ దూతలు దేవుడికన్నా ముందే ఈ లోకానికి వచ్చి చాటి చెప్పారని నమ్మకం.

క్యాండిల్స్ (కొవ్వొత్తులు)...

చీకటిని పారదోలి అనగా పాపపు క్రియలు జరిగే స్థలంలో వెలుగునిచ్చి పాపాలను నివృత్తి చేసేవిగా కొవ్వొత్తులను వెలిగించడం క్రిస్మస్ వేడుకల్లో ఒక ముఖ్యమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు. దేవుడిని స్మరించుకునేందుకు ఈ కొవ్వొత్తులను వెలిగించడం క్రైస్తవుల సంస్కృతిలో భాగమైంది. పాపభీతితో అంధకారం అలముకున్న ప్రపంచానికి వెలుగులివ్వడంలో కొవ్వొత్తులు ప్రాముఖ్యమైనవని భావిస్తారు.

గొల్లలు...

దైవ దూతలు చెప్పిన వార్తను ఇరుగు, పొరుగు వారికి తెలియచెప్పి బహుమతులతో ఏసు క్రీస్తును చూసేందుకు వెళ్లిన వారే గొల్లలు. పశువుల పాకలో జన్మించిన ఏసు క్రీస్తును ముందుగా దర్శించుకున్నది గొల్లలు కావడం విశేషం. తాము పెంచి పోషించే పశువుల పాకలో ఏసు క్రీస్తు జన్మించి ఈ లోకానికి తమ విశిష్టతను కూడా చాటి చెప్పాడని గొల్లలు భావిస్తారు.

బెల్స్ ...

జయ జయ ధ్వనులు కలిగించే గంటలను క్రిస్మస్ వేడుకల్లో ప్రధానంగా వినియోగిస్తారు. ఈ గంటలను మోగించి దేవుడిని స్మరించుకోవడం ద్వారా దేవునికృపకు పాతృలవుతారని క్రైస్తవుల నమ్మకం.

సాంట క్లాజ్ (క్రిస్మస్ తాత)....

క్రిస్మస్  ముందు రోజు రాత్రి శాంతా క్లాజ్ ఆకాశం నుంచి ధృవపు జింకలు లాగే బండిలో వచ్చి పిల్లలకు బహుమతులు ఇచ్చి వెళ్తాడని నమ్ముతారు. అందుకోసం పిల్లలు తమ మేజోళ్లను వేలాడదీసి ఉంచుతారు. ఇలా ఉంచితే శాంతా క్లాజ్ వాటిలో బహుమతులను వేసి వెళ్తాడని నమ్మకం.

శాంతా యొక్క అసలు పేరు శాంతా క్లాజ్ బహుశా క్రిస్మస్ తో ముడిపడి ఉందనేది ఒక భ్రమ. ఎరుపు రంగు దస్తులు, అందమైన మరియు పాత మనిషి వాస్తవానికి పిల్లలు ప్రేమించే సెయింట్ నికోలస్ అనే ఒక వ్యక్తి.


క్రిస్మస్ వేడుకల్లో ఆకర్షణీయంగా నిలిచేది క్రిస్మస్ తాత. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనే చిన్నారులకు బహుమతులను అందించి వారిని సంతోష పరచడం క్రిస్మస్ తాత ముఖ్య కర్తవ్యం. రక రకాల చాక్లెట్లు, చిన్న చిన్న బహుమతులు ఇచ్చి చిన్నారులను ఆకర్శింపచేస్తాడు. చర్చీల్లో ప్రార్థనలో పాల్గొనేందుకు వచ్చే క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపడంలో కూడా క్రిస్మస్ తాత ముం దుంటాడు. క్రిస్మస్ తాత నుంచి శుభాకాంక్షలు స్వీకరించడానికి క్రైస్తవులు ఉబలాట పడుతారు. క్రిస్మస్ తాతను హిందీలో క్రిస్మస్ బాబా, కేరళ భాషలో క్రిస్మస్ పాప అంటారు.

0 comments:

Post a Comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top