Friday, 21 December 2018

Sangameswara Temple- History- సప్తనదులలో కొలువుదీరిన సంగమేశ్వర ఆలయం -శ్రీశైలం డ్యామ్ నిర్మాణం తరువాత 23 ఏళ్లపాటు నీటిలోనే మునిగిపోయిన సంగమేశ్వర ఆలయం -ఎనిమిదినెలలు నీటిలో ఉండి నాలుగునెలలు మాత్రమే కనిపించే గుడి-నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ది చెందుటకు కారణం ...?? పాండవుల వనవాసం సమయంలో భీముడు ప్రతిష్టించిన భీమలింగం .

Sangameswara Temple- History- సప్తనదులలో కొలువుదీరిన సంగమేశ్వర ఆలయం -శ్రీశైలం డ్యామ్ నిర్మాణం తరువాత 23 ఏళ్లపాటు నీటిలోనే మునిగిపోయిన  సంగమేశ్వర ఆలయం -ఎనిమిదినెలలు నీటిలో ఉండి నాలుగునెలలు మాత్రమే కనిపించే గుడి-నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ది చెందుటకు కారణం ...?? 
పాండవుల వనవాసం సమయంలో భీముడు ప్రతిష్టించిన భీమలింగం .
Sangameswara Temple- History- సప్తనదులలో కొలువుదీరిన సంగమేశ్వర ఆలయం -శ్రీశైలం డ్యామ్ నిర్మాణం తరువాత 23 ఏళ్లపాటు నీటిలోనే మునిగిపోయిన  సంగమేశ్వర ఆలయం -ఎనిమిదినెలలు నీటిలో ఉండి నాలుగునెలలు మాత్రమే కనిపించే గుడి-నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ది చెందుటకు కారణం ...??   పాండవుల వనవాసం సమయంలో భీముడు ప్రతిష్టించిన భీమలింగం .

అది వేలసంవత్సరాల చరిత్ర కలిగి వున్న ఆధ్యాత్మిక స్థలం.. ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయమిచ్చిన పవిత్ర ప్రాంతం.. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఏకంగా ఏడు నదులు (తుంగ, భద్ర, క్రిష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి) కలిసే అద్భుతమైన ప్రదేశం..

తుంగ, భద్ర, క్రిష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి అనే సప్తనదులలో భవనాసి నది మాత్రమే పురుషుడి పేరున్న నది కాగా మిగిలినవన్నీ స్త్రీ పేర్లున్న నదులు, అలాగే భవనాసి తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే, మిగిలిన నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పుకు ప్రవహిస్తాయి..ఈ నదులన్నీ కలసి జ్యోతిర్లింగం ఉన్న శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలసిపోతాయి..దేశంలో ఏ ప్రాంతంలో కనిపించని విధంగా ఈ ఏడు నదులు ఒకే చోట కలుస్తాయి. అందుకే దీన్ని సప్త నదుల సంగమేశ్వరం అంటారు.
ఏడాదిలో 8 నెలలపాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు భక్తులకు దర్శనభాగ్యం కలిగించే ఆలయం. వేలసంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్రస్థలం. ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయమిచ్చిన ప్రాంతం. అదే కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం.

కర్నూలు నుంచి 55 కిలోమీటర్ల దూరం లో ఉన్న సంగమేశ్వరం , నందికొట్కూరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది, నందికొట్కూరుకు 16 కిలోమీటర్ల దూరంలో వున్న ‘మచ్చుమర్రి’ గ్రామానికి బస్సులద్వారా చేరుకుని , అక్కడినుంచి 6 కిలోమీటర్ల దూరంలో వున్న సంగమేశ్వరానికి ఆటోలు, జీపులలో వెళ్ళవచ్చు. కర్నూలు జిల్లా ‘ఆత్మకూరు’ నుంచి ‘కపిలేశ్వరము’నకు బస్సులో చేరుకుని అక్కడి నుంచి 5 కిలో మీటర్ల దూరంలోవున్న ఈ క్షేత్రానికి ఆటోలు, జీపులలో చేరవచ్చు.  తెలంగాణ ప్రజలు మహబూబ్ నగర్ నుంచి సోమశిల వరకు బస్సులో ప్రయాణించి అక్కడి నుంచి బోటు ద్వారా సంగమేశ్వరం చేరుకోవచ్చు.

స్థలపురాణాన్ని పరిశీలిస్తే .. 

పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని, ఆ సమయంలో దక్షుడు తన భార్యను అవమానించడంతో... ఆమె యజ్ఞ వాటికలో పడి మరణించిందని స్థల పురాణం చెబుతోంది. సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ది కెక్కింది.
మరో కథనం ప్రకారం
 ప్రజల పాప ప్రక్షాళన చేసిన ,పాపులను పునీతులుగా మారుస్తూఉన్న  గంగా నదికి కాకి రూపం వచ్చిందని,ఆ రూపం పోగొట్టుకోవడానికి సమస్త తీర్ధాలలో జలకమాడుతూ తిరుగుతున్న ఆవిడ ఇక్కడ ఈ సంగమంలో స్నానం చేసి  హంస రూపం పొందిందని కథనం.ఆవిడ పాప నివృత్తి అయినందున  దీనికి నివృత్తి సంగమేశ్వరం అని పేరొచ్చిందని ఒక కథనం.

ఏడు నదులు కలిసే చోటున ఉన్న ఇక్కడి శివుడి ప్రతిరూపమైన వేప లింగాన్ని సందర్శిస్తే నరకలోక ప్రవేశం నుంచి తప్పించుకోవచ్చునని భక్తులు నమ్ముతారు. అందువల్లే ఈ ఆలయ సందర్శన కోసం భక్తులు ఎదురుచూస్తుంటారు.

భీమలింగం

పాండవుల వనవాసం సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించాడు. ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్లిన భీముడు .. ప్రతిష్ట సమయానికి రాలేదు. ఋషుల సూచన మేరకు వేపమొద్దుని శివలింగంగా మలిచి ప్రతిష్టించి పూజలు చేశాడు ధర్మరాజు. తల మీద,రెండు బాహువుల్లో రెండు చొప్పున మొత్తంగా ఐదు లింగాలు తెచ్చిన భీముడు ఆగ్రహంతో వాటిని విసిరెయ్యగా అక్కడ మల్లేశ్వరం,అమరేశ్వరం,సిద్దేశ్వరం,కపిలేశ్వరం,సంగమేశ్వరం పేరుతో పంచేశ్వరాలు ఏర్పడ్డాయని కథనం. భీముడిని శాంతింప జేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్టించి, భీమలింగంగా దానికి పేరు పెట్టాడు. భక్తులు భీమేశ్వరున్ని దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరున్ని దర్శించుకోవాలని సూచించినట్లు స్థల పురాణం చెప్తోంది.

ఆలయ సముదాయం ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆలయం క్రమంగా శిథిలమై పోయింది. ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం స్ధానిక ప్రజలు నిర్మించారు. సుమారు లక్షా ఇరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయంతో పాటు, చుట్టూ ప్రాకారం నిర్మించినట్లు శిథిలాలను చూస్తే అర్ధమవుతుంది. ఈ ప్రాకారానికి ఉత్తరాన గోపురద్వారం, పశ్చిమ దక్షిణ ద్వారాలపై మండపాలు నిర్మింపబడి ఉండేవని చరిత్ర చెబుతోంది. కానీ, ప్రస్తుతం అవేమీ కనిపించవు.
గర్భాలయం ప్రస్తుతం కనిపించే ప్రధాన ఆలయం అత్యంత సాదాసీదాగా ఉంటుంది. ముఖమండపం పూర్తిగా శిథిలమై పోగా... అంతరాలయం, గర్భాలయాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. గర్భాలయంలో సంగమేశ్వరుడు పూజలందుకుంటున్నాడు. శివుడి వెనుక వైపున ఎడమ భాగంలో శ్రీలలితాదేవి, కుడి వైపున వినాయకుడు దర్శనమిస్తారు. అంతకు ముందు వారిద్దరికీ వేరు వేరు ఆలయాలు ఉండేవి. అయితే, అవి శిథిలమై పోవడంతో లలితాదేవి, గణపతులను గర్భాలయంలో ప్రతిష్టించారు.
ఆలయం వద్ద భక్తులు అన్ని ఆలయాల్లోలాగా ఈ క్షేత్రంలో నిత్య పూజలు జరుగవు. ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో మునిగివుండడమే కారణం. మరో విషయం వేల సంవత్సరాల క్రితం సంగమేశ్వరాలయంలో ప్రతిష్టించిన వేపలింగం ఇప్పటికీ చెక్కుచెదరకపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగించక మానదు.

తరలి వెళ్ళిన దేవతామూర్తులు 

ఆలయం ప్రాంగణంలోని అనేక ఉపాలయాల్లో దేవతా మూర్తులు పూజలందుకునే వారు. ఆ ఆలయాలన్నీ శిథిలమవడంతో కర్నూలు జిల్లాలోని అనేక ఆలయాలకు వాటిని తరలించారు. వాటితో పాటు పల్లవ సాంప్రదాయంలో నిర్మితమైన రథం కూడా ఉండేది. దాన్ని పురాతత్వ శాఖ వారు జగన్నాథ గుట్టకు తరలించారు.
ఈ ఆలయం మొదట నది ఒడ్డున ఉండేది. శ్రీశైలం డ్యామ్ నిర్మాణం తరువాత సంగమేశ్వరాలయం 23 ఏళ్లపాటు నీటిలోనే మునిగిపోయింది. అసలు ఇక్కడ ఆలయం ఉందనే విషయాన్ని కూడా జనం మర్చిపోయారు. 2003 తరువాత శ్రీశైలం డ్యామ్ నీటిమట్టం పడిపోయిన కాలంలో మాత్రమే ఆలయం నీటి నుంచి బయటపడుతుంది . అప్పటి నుంచి తిరిగి ఆలయంలో పూజలు ప్రారంభమయినాయి
Mannam Srinivas: మార్చి లేదా ఏప్రిల్‌నెల మొదలుకొని జూన్‌ నెలవరకు ఆలయం నీటినుంచి బయటపడుతుంది. ఈ సమయంలో దేవాలయాన్ని దర్శించే వీలుంటుంది. ఈ సమయంలోని సోమవారాలు, మాసశివరాత్రులలో స్వామివారికి ప్రత్యేకపూజలు చేస్తారు. ఒక్కోసారి ‘మహాశివరాత్రి’ కే ఆలయం నీటినుంచి బయటపడుతుంది.అప్పుడు శివరాత్రి ఉత్సవాలను కూడా నిర్వహిస్తారు.


చరిత్ర తెలుపు వీడియో .....




డ్రోన్ వీడియో....గగన తలం నుంచి తీసిన వీడియో

0 comments:

Post a Comment

ADD

AP UPDATES

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top