⚡ FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్⚡

MORE TO VIEW

Saturday, 15 December 2018

papikondalu Tour boat journey bambo huts- పాపికొండలు-పాపికొండల మధ్యలో మరుపురాని ప్రయాణం ! - అసలు పాపి కొండల కి ఈ పేరు ఎలా వచ్చింది- గోదావరి నది మధ్యలో ఉండే పట్టిసం వీరభద్ర స్వామి ఆలయం-దెందూరు పోచమ్మ అమ్మవారు- దేవీ పట్నం గ్రామంలో అల్లూరి సీతారామరాజు చరిత్ర జ్ఞాపకాలు - శ్రీరాముని వాకిటం అనే ఆశ్రమం,ఇందులోనే శివాలయం-యాత్ర ప్రారంభమైన ఐదు గంటలకు పాపికొండలు -పేరంటాలపల్లి గ్రామం- బాలానంద స్వామి కొలువుతీరిన శ్రీరామకృష్ణ మునివాటంలో శివుని దర్శనం,మునివాటం జలపాతం-రెండో భద్రాద్రిగా పేరొందిన శ్రీరామగిరి పుణ్యక్షేత్రం- వాలి, సుగ్రీవుల గుట్టలు

పాపికొండలు-పాపికొండల మధ్యలో మరుపురాని ప్రయాణం ! - అసలు పాపి కొండల కి ఈ పేరు ఎలా వచ్చింది- గోదావరి నది మధ్యలో ఉండే పట్టిసం వీరభద్ర స్వామి ఆలయం-దెందూరు పోచమ్మ అమ్మవారు- దేవీ పట్నం గ్రామంలో అల్లూరి సీతారామరాజు చరిత్ర జ్ఞాపకాలు - శ్రీరాముని వాకిటం అనే ఆశ్రమం,ఇందులోనే శివాలయం-యాత్ర ప్రారంభమైన ఐదు గంటలకు పాపికొండలు -పేరంటాలపల్లి గ్రామం- బాలానంద స్వామి కొలువుతీరిన శ్రీరామకృష్ణ మునివాటంలో శివుని దర్శనం,మునివాటం  జలపాతం-రెండో భద్రాద్రిగా పేరొందిన శ్రీరామగిరి పుణ్యక్షేత్రం- వాలి, సుగ్రీవుల గుట్టలు

గోదావరి నది, బాగా దట్టం గా ఉండే అడవులు..పూర్తిగా పల్లెటూరి వాతావరణం..ఇప్పటికీ దగ్గర్లో దొరికే కలపతోనే వంటలు చేసే కొంతమంది జనం..ఒక ఆహ్లాదకరవాతావరణాన్ని చూడాలి అని అనుకునేవారందరికీ పాపికొండలుస్వాగతం చెప్తాయి..
పాపికొండలు, తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన పర్వత శ్రేణి. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నడుమ, మరియుతెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా లను ఆనుకొని ఉన్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాదు నగరానికి 410 కిలోమీటర్ల దూరంలోను, ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విజయవాడ నుండి 157 కిలోమీటర్లు, విశాఖపట్నం నుండి 192 కిలోమీటర్లు,  రాజమండ్రి నగరానికి 60 కిలోమీటర్ల దూరంలోను పాపికొండల ప్రాంతం ఉంది. ఈ ప్రాంతం జాతీయ పార్కుగా గుర్తించబడింది.

పాపికొండలు ఒక్కటే కాదు అక్కడే ఉండే పేరంటాలపల్లి..కొల్లూరు బేంబూ హట్స్,పోలవరం ప్రాజెక్ట్,కొరటూరు కాటేజెస్ అన్నీ చూడాల్సిన ప్రదేశాలే..ఇంకా ఇక లాంచీలమీద ప్రయాణం మర్చిపోలేని మధురానుభూతినిస్తుంది..

ఇవన్నిటికోసం అసలు ప్రయాణం ఎలా మొదలుపెట్టాలి.. పాపికొండలకి రెండు మార్గాలున్నాయి ఒకటి రాజమండ్రినుండి ..రెండు హైద్రాబాద్ నుండి..

రాజమండ్రి నుండి చూద్దాం..

రాజమండ్రిలోని పట్టిసీమ రేవు, పోలవరం రేవు, పురుషోత్తపట్టణం రేవు నుండి పాపికొండల యాత్ర మొదలుపెట్టచ్చు ..ఇక్కడ బోట్ ఎక్కితే పోలవరం ప్రాజెక్ట్, గండిపోచమ్మ గుడి మీదుగా దేవీపట్నం, పాపికొండలు, కొరటూరు కాటేజెస్,కొల్లూరు బాంబూ హట్స్ ను దాటుకుంటూ ఖమ్మం జిల్లాలోని పేరంటాల పల్లి దగ్గర ఆగుతుంది.లేదంటే రాజమండ్రిలో బయల్దేరి డైరెక్ట్ గా ‘పట్టిసం’ అదే ‘పట్టిసీమ’ వెళిపోయి అక్కడ గోదావరిదగ్గర బోట్ ఎక్కి వెళ్ళచ్చు ..

రాజమండ్రి నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టిసీమ లేదా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పురుషోత్తమ పట్నం వరకు ట్రావెల్ ఏజెన్సీ లేదా APSRTC బస్సులు లేదా మినీ వ్యానుల్లో ప్రయాణం చేస్తే, అక్కడ నుండి గోదావరి నదిలో లాంచిలో పాపికొండలు యాత్ర మొదలౌతుంది.

వీలైనంతవరకు ఉదయం 9:00 గంటల లోపుగా అక్కడికి చేరుకోవలసి ఉంటుంది. టిఫిన్, మధ్యాహ్న భోజనం లాంచీ లోనే ఏర్పాటు చేస్తారు నిర్వాహకులు..


అసలు పాపి కొండల కి ఈ పేరు ఎలా వచ్చిందంటే..

కొండల మధ్య ప్రవహించే గోదావరి మనం జుట్టుకు తీసుకునే పాపిడిలా వుంటుందని పాపిడి కొండలు అన్నారట. అలా అలా పాపికొండలయ్యిందని అంటారు...
.
గోదావరి నది మధ్యలో ఉండే పట్టిసం వీరభద్ర స్వామి ఆలయం చాలా ప్రసిధ్ధి చెందింది. ఇక్కడ ఎన్నో తెలుగు సినిమాలు చిత్రీకరణ చేశారు. పురుషోత్తం పట్నం దాటినా తరువాత కుడివైపు దెందూరు అనే గ్రామం దగ్గర లాంచీ మొదటి సారి ఆగుతుంది.

 ఇక్కడ గట్టుమీద వున్న గండి పోచమ్మ అమ్మవారి దర్సనం తరువాత మరల యాత్ర సాగుతుంది.

ఆ తరువాత వచ్చే దేవీ పట్నం గ్రామంలో అల్లూరి సీతారామరాజు చరిత్రలో వినిపించే పోలీసు స్టేషన్లు కనిపిస్తాయి. గట్టు మీద కనిపించే రెండు గులాబీ రంగు భవనాలు కొత్త పోలీసు స్టేషను, క్వార్టర్లు .. వాటి మధ్య కనిపించే పాత పెంకుటిల్లు బ్రిటిషు కాలంనాటి పాత పోలీసు స్టేషను.
Alluri Sitha Rama Raju Attacked the Old Police Station at Devipatnam area

యాత్ర ప్రారంభమైన ఐదు గంటలకు పాపికొండలు చేరుకుంటాము. పాపికొండల ప్రాంతంలో సాధారణంగా చెట్లు ఆకులు రాల్చవు. ప్రశాంతమైన, సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశము. వేసవి కాలంలోలో కూడా పాపికొండల ప్రాంతం చల్లగానే ఉంటుంది.

పాపికొండల అడవుల్లో పెద్ద పులులు, చిరుతపులులు, నల్లపులులు, అడవిదున్నలు (గొర్ర గేదెలు), జింకలు, దుప్పులు, నక్కలు, తోడేళ్ళు, కొండచిలువలు, వివిధ రకాల కోతులు, ఎలుగుబంట్లు, ముళ్ళ పందులు, అడవి పందులు, వివిధ రకాల పక్షులు, విష కీటకాలు ఉంటాయి. అలాగే వేలాది రకాల ఔషధ వృక్షాలు, మొక్కలు ఉంటాయి.

ఇక్కడ శ్రీరాముని వాకిటం అనే ఆశ్రమం ఉంది. ఇందులోనే శివాలయం కూడా ఉంది. 1800 శతాబ్ధంలో రాజమండ్రి నుంచి ఒక మునీశ్వరుడు లాంచీపై బయలు దేరి భద్రాచలం వస్తూ పేరంటాలపల్లి వద్ద రాత్రి కావడంతో అక్కడ బస చేశారు. ఆయన కలలో భగవంతుడు కనిపించి ఇక్కడ ఆలయాన్ని నిర్మించమని ఆదేశించడంతో అందుకు అనుగుణంగా ఆయన ఇక్కడే నివాసం ఉండి ఆ ఆలయాన్ని నిర్మించినట్లు ఈ ప్రాంతవాసులు చెబుతారు

పాపికొండల వెనుక భాగానికి పశ్చిమ గోదావరి జిల్లాలో కొయ్యలగూడెం, కన్నాపురం, పోలవరం, శింగన్నపల్లి, వాడపల్లి, ఛీడూరు మీదుగా కొరుటూరుకు ఘాట్ రోడ్డు మార్గం కూడా ఉంది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం వద్ద కట్టబోతున్న ఇందిరా సాగర్ ప్రాజెక్టు వలన ఈ ఘాట్ రోడ్డు మార్గం కనుమరుగు అవబోతున్నది.

నాసిక్ దగ్గర పుట్టిన గోదావరి 1600 కి.మీ.లు ప్రయాణంచేసి, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వద్ద సముద్రంలో కలుస్తుంది. రాజమండ్రి దగ్గర 5 నుంచి 6 కి.మీ.ల వెడల్పు వుండే గోదావరి పాపి కొండల మధ్య 200 నుంచి 500 మీటర్ల వెడల్పు మాత్రమే ఉండి  రెండు కొండల మధ్య ప్రవహిస్తూ, ఆ వాతావరణానికి మరింత రమణీయతను తెచ్చి పెడుతుంది.

రామయ్యపేట దగ్గర పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మొదలయింది. గోదావరికి ఒక గట్టుమీద వున్న రామయ్యపేటనుంచి ఇంకో గట్టుమీద వున్న చిన్న కొండదాకా డామ్ నిర్మాణం జరుగుతుంది. ఇది పూర్తయితే 235 గిరిజన గ్రామాలు, పాపి కొండలు సగం 100 అడుగుల పైగా మునిగిపొతాయి. 7.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందటమేగాక విద్యుదుత్పాదన కూడా జరుగుతుంది. అంతేకాక త్వరలోనే పాపికొండలు, ఆ కొండలమధ్యలో ప్రశాంతంగా ప్రవహించే గోదావరి అందాలు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ కారణంగా కనుమరుగు కాబోతున్నాయి.


పాపికొండలు దాటిన తరువాత సుమారుగా ఒక గంట ప్రయాణం తరువాత వచ్చే ప్రదేశం పేరంటాలపల్లి గ్రామం,  ఇది గతంలో ఖమ్మం జిల్లాలో ఉంది కాని ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో చేర్చారు. భోగరాముడు కొలువై ఉన్న శ్రీరామగిరిని కలుపుకొని రహదారి మార్గంలేని ఎన్నో గిరిజన గ్రామాలను అభయారణ్యాలను కలుపుకొని మూడు జిల్లాల సంగమమైన పాపికొండలలతో మిళితమైన పేరంటాలపల్లి గ్రామంలో బాలానంద స్వామి కొలువుతీరిన శ్రీరామకృష్ణ మునివాటంలో శివుడిని దర్శించి పచ్చని ఎత్తయిన కొండలపై నుంచి జాలువారే జలపాతాలను, గుడివెనుక రాళ్లనుంచి పారే నీటి పరవళ్లు, ఇసుక తిన్నెలు, పిల్లలు, పెద్దలను కేరింతలు కొట్టిస్తాయి.

పేరంటాలపల్లి చేరుకోవటంతో యాత్ర ముగిసి తిరుగు ప్రయాణం మొదలౌతుంది. పట్టిసం నుండి పాపికొండలు యాత్ర, తిరుగు ప్రయాణం సమయం సుమారుగా 9:30 నుండి 10:00 గంటలు ఉంటుంది.

చుట్టూ గోదారమ్మ పరవళ్లు... పచ్చని ప్రకృతి సోయగాలు... కనుచూపు మేర పచ్చటి పర్వత పంక్తులు... గిలిగింతలు పెట్టే చలిగాలులు... కొండల మధ్య మధ్య అందమైన సూర్యో దయం, అంతే అందమైన సూర్యాస్తమయం... రాత్రిళ్లు వెదురు గుడిసెల్లో బస... మధ్యలో క్యాంప్‌ఫైర్‌... గోదారమ్మ ఒడిలో స్నానం..! ఇవి చాలు పాపికొండల ప్రత్యేకతలు వివరించడానికి! యాంత్రిక జీవనానికి విసిగి వేసారిన జనాలకు చక్కటి ఆహ్లాదాన్ని పంచే పాపికొండల నడుమ పడవ ప్రయాణం అద్భుత జ్ఞాపకాలను మిగుల్చుతోంది.

హైదరాబాద్ వైపు నుంచి

తెలంగాణా రాష్ట్రం వైపు ఖమ్మం జిల్లా కూనవరానికి 17 కిలో మీటర్ల దూరంలో ఉన్న పోచవరం నుంచి లాంచీపై వెళితే రెండు గంటల్లో పేరంటపల్లి చేరుకోవచ్చు.
ఖమ్మం జిల్లాలోని వరరామచంద్రాపురం(వి.ఆర్‌.పురం)మండలం శ్రీరామగిరిగ్రామం నుంచి సుమారు 3 గంటల పాటు నది ప్రయాణం చుట్టూ చూడచక్కని గిరిజన గ్రామాలు మధ్య సాగుతూ పేరంటపల్లి చేరుకోవచ్చు.

పేరంటాలపల్లి గ్రామంలో బాలానందస్వామి కొలువుదీరిన మునివాటంలో శివుడిని దర్శించవచ్చు. రెండో భద్రాద్రిగా పేరొందిన శ్రీరామగిరి పుణ్యక్షేత్రం వద్ద యాత్రికులకు శ్రీ సుందర సీతారాములవారి దర్శనం కలుగుతుంది. ఎత్తైన కొండల మధ్య సుమారు 170మెట్లు ఎక్కిన తర్వాత సుమారు 500 సంవత్సరాల కిందట మాతంగి మహర్షి ప్రతిష్టించిన శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలను దర్శించవచ్చు. ఇక్కడ పక్కనే ఉన్న రెండు ఎతైన పర్వతాలను వాలి, సుగ్రీవుల గుట్టలుగా పిలుస్తారు.

శ్రీరామగిరి నుంచి బయలుదేరిన లాంచీ రెండు గంటలపాటు ప్రయాణించి గోదావరి తీరాన ఉన్న గిరిజనులైన కొండరెడ్ల ప్రజలను పలకరిస్తుంది.మూడు గంటలపాటు లాంచీ ప్రయాణం అనంతరం ప్రసిద్ధి చెందిన పాపికొండల సోయగాలు కనపడగానే యాత్రికులు తన్మయత్వానికి గురవుతారు. పాపికొండల వద్ద గోదావరి ప్రవాహం చాలా ఇరుకుగా ఎంతో లోతుగా ఉంటుంది. మునివాటం వద్ద ఉన్న శివాలయం పరిసర ప్రాంతాల్లో కొండలపై నుంచి జాలువారే జలపాతం, చుట్టూ పనస, పోక చెక్క లాంటి మొక్కలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. భద్రాచలం వద్ద సుమారు రెండు కిలోమీటర్ల వెడల్పు ఉన్న గోదావరి పాపికొండల ఒంపుసొంపుల మధ్య చిన్న ఏరులా కనిపిస్తుంది. ఇక్కడ ఎత్తైన కొండల మధ్య ఒంపు తిరిగి ప్రవహించే గోదావరిని చూస్తే అద్భుతమైన అనుభూతి కలుగుతుంది.
 గోదావరి, శబరి నదులలో సంగమమైన శ్రీరామగిరి గ్రామం నుంచి లాంచీలో ప్రయాణిస్తే పేరంటాలపల్లి అక్కడి నుంచి లాంచీలో పాపికొండలకు చేరుకోవచ్చు.

మూడు జిల్లాల సరిహద్దుల్లో ఉన్న పాపికొండల అందాలు చూడాల్సిన పర్యాటకప్రదేశం..పాపికొండల వెనుక భాగానికి అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో కొయ్యలగూడెం, కన్నాపురం, పోలవరం, శింగన్నపల్లి, వాడపల్లి, ఛీడూరు మీదుగా కొరుటూరుకు ఘాట్ రోడ్డు మార్గం కూడా ఉంది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం దగ్గర కట్టబోతున్న ఇందిరా సాగర్ ప్రాజెక్టు వలన ఈ ఘాట్ రోడ్డు మార్గం కనుమరుగు అవ్వచ్చు..

ఇక పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నారు కాబట్టి 7.5 లక్షల ఎకరాలకు సాగునీరు విద్యుదుత్పాదన లక్ష్యం గా కడుతున్నా ఈ ప్రాజెక్ట్ వల్ల పాపి కొండలు సగం అంటే 100 అడుగుల మేర మునిగిపోవచ్చని ఒక అంచనా ఐతే ఉంది..

చుట్టూ గోదావరి, పచ్చని ప్రకృతి సోయగాలు కనిపించే కొండలు చల్లటిగాలి ఇవన్నీ వర్ణించలేనివి… ఎవరికివారు అనుభవించి తీరాల్సిందే

Papikondalu Complete Tour - Rajahmundry - ComeTube Exclusive Video


0 comments:

Post a Comment

Teachers INFO

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top