Search This Blog

 • 🖨️ Inter Hall tickets NEW...
 • MORE TO VIEW

Monday, 31 December 2018

Panuganti Lakshmi Narsimha Rao(నవంబర్ 2,1865 - జనవరి 1, 1940)- ఆంధ్రుల అభినవ కాళిదాసు `పానుగంటి లక్ష్మీనరసింహ రావు - పానుగంటి సాక్షి వ్యాసాలు -కొందరు ఆయనను "ఆంధ్రా అడిసన్" అంటారు.. మరికొందరు ఆయనను "ఆంధ్రా షేక్స్పియర్" అంటారు.తెలుసుకుందాం...

కొందరు ఆయనను "ఆంధ్రా అడిసన్" అంటారు.. మరికొందరు ఆయనను "ఆంధ్రా షేక్స్పియర్" అంటారు. గ్రాంథిక భాషలో సామాజిక రుగ్మతలను ఎండగడుతూ ఆయన రాసిన సాక్షి వ్యాసాలు తెలుగు సాహితీ వినీలాకాశంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయనడంలో అతిశయోక్తి లేదు. ఆయన రాసిన నాటకాలు కూడా ఆనాటి సాహితీ అభిమానుల ఆదరణను పొందాయి. " పానుగంటి సాక్షి వ్యాసాలు చదవడం మాననంటి.. ఎంచేతనంటే వాటిలో పేనులాంటి భావానికాయన ఏనుగంటి రూపాన్నియ్యడం నేనుగంటి" అని శ్రీశ్రీ సైతం కొనియాడిన మేటి సాహితీ శిఖరం పానుగంటి.
Panuganti Lakshmi Narsimha Rao(నవంబర్ 2,1865 - జనవరి 1, 1940)- ఆంధ్రుల అభినవ కాళిదాసు `పానుగంటి లక్ష్మీనరసింహ రావు - పానుగంటి సాక్షి వ్యాసాలు -కొందరు ఆయనను "ఆంధ్రా అడిసన్" అంటారు.. మరికొందరు ఆయనను "ఆంధ్రా షేక్స్పియర్" అంటారు.తెలుసుకుందాం...

నవంబరు 2, 1865వ తేదీన రాజమహేంద్రవరం తాలూకా సీతానగరంలో రత్నమాంబ, వెంకటరమణయ్య దంపతులకు జన్మించారు పానుగంటి లక్ష్మీ నరసింహారావు. తన బి.ఏ డిగ్రీ పూర్తి చేశాక పెద్దాపురం హైస్కూలులో ఉపాధ్యాయుడిగా చేరిన పానుగంటి, ఆ రోజుల నుండే తన రచనా వ్యాసంగాన్ని ప్రారంభించారు. అయితే ఉపాధ్యాయుడిగా తన సంపాదన చాలకపోవడంతో తొలుత లక్ష్మీనరసాపురం సంస్థానంలో దివానుగా చేరారు. ఆ తర్వాత ఉర్లాం, అనెగొంది, పిఠాపురం మొదలైన సంస్థానాల్లో కూడా  పనిచేశారు.


అలాంటి సందర్భంలో ఓ పర్యాయం పిఠాపురం మహారాజు సూర్యారావు బహదూర్ పానుగంటి వారి రచనల గురించి వినడం జరిగింది. ఆయన వాటిని చదివి, ముగ్ధుడై పానుగంటివారిని తన ఆస్థానంలో నాటకకవిగా నియమించారు.  వారి పుస్తకాలను కూడా వారే అచ్చువేయడం ప్రారంభించారు.
పానుగంటి వారి రచనలల్లో ప్రముఖమైనవి సాక్షి వ్యాసాలు. ఈ వ్యాసాలన్నీ అచ్చమైన గ్రాంథిక భాషలో ఉన్నా, వ్యవహారానికి దగ్గరగా ఉండే శైలితో రాయడం రచయిత ప్రత్యేకత.  వినోద ప్రధానశైలిలో రాస్తూ.. ఆనాటి సామాజిక రుగ్మతలను ఎండగట్టడం ఈ వ్యాసాల ప్రధాన ఉద్దేశం.

1711 - 12 లో స్పెక్టేటర్ అనే ఆంగ్ల పత్రికలో జోసెఫ్ అడ్డిసన్, రిచర్డ్ స్టీల్ వ్రాసిన స్పెక్టేటర్ పేపర్స్ వ్యాసాలతో ప్రేరణ పొందిన పానుగంటి ఈ వ్యాసాలను రాశారంటారు. ఈ వ్యాసాలలో కాలాచార్యుడు, జంఘాల శాస్త్రి, వాణీదాసు, బొర్రయ్య శెట్టి అనే పాత్రల ద్వారా సామాజిక విషయాలపై చర్చలను పెడతారు రచయిత. వారి సంభాషణల ద్వారా పాఠకుడికి అందాల్సిన సందేశాన్ని అందిస్తారు. "సాక్షి వ్యాసాలు" పుస్తకంగా వచ్చాక, అనతికాలంలోనే పానుగంటి వారి పేరు ఆంధ్రదేశంలో మారుమ్రోగిపోయింది. ఆ వ్యాసాలు విశేష పాఠకాదరణ  పొందాయి.


సాక్షి వ్యాసాల రాసిన తర్వాత పిఠాపురం జమీందరు ప్రేరణతో ఇంకా అనేక రచనలు చేశారు పానుగంటి. సారంగధర చరిత్ర, వృద్ధ వివాహము, రాధాకృష్ణ, నర్మదా పురుకుత్సీయము, సరస్వతి, దుష్టప్రధాని, ఆనందనాథ, కల్యాణరాఘవము, కంఠాభరణము, విజయరాఘవము, కోకిల, విప్రనారాయణ చరిత్ర, బుద్ధబోధసుధ, వీరమతి, పూర్ణిమ అందులో ప్రముఖమైనవి. ఆయన రాసిన నాటకాలే పానుగంటి వారి అభినవ కాళిదాసు బిరుదును పొందేలా చేశాయి.
తన రచనల వలన తొలినాళ్లలో పానుగంటివారు విశేషంగా ధనమార్జించినా.. అవసానదశలో పేదరికానికి, ఋణబాధకు గురవడం గమనార్హం. సంస్థానం అందించే గౌరవ వేతనంపైనే ఆయన ఆధారపడాల్సి వచ్చింది. "నాకెవరును దానధర్మము చేయనక్కరలేదు. తగ్గింపు ధరలకు నూటయాభై సెట్ల పుస్తకాలు యాభై మంది కొని, నా మానుషమును కాపాడినను, నాకు సివిలు ఖైదు తప్పును" అని తన చివరిదశలో ఆ మహారచయిత వాపోయాడంటేనే అతని పరిస్థితి అప్పుడు ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత అనారోగ్యం కూడా అతన్ని బాగా కుంగదీసింది. అక్టోబరు 7న, 1940న తెలుగు సాహితీలోకాన్ని విడిచి తిరిగి రాని లోకాలకు పానుగంటి వారు వెళ్లిపోయినా, ఆయన రచించిన సాక్షి వ్యాసాలు మాత్రం చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోయాయి. ఇప్పటికీ తెలుగు విద్యార్థుల పాఠ్యాంశాలలో ఈ వ్యాసాలను ప్రచురించడం ఆయనకు దక్కిన గొప్ప గౌరవమే అని చెప్పుకోవచ్చు.

వీరి రచితగ్రంథములు

సారంగధర చరిత్ర, వృద్ధ వివాహము, రాధాకృష్ణ, నర్మదా పురుకుత్సీయము, సరస్వతి, దుష్టప్రధాని, ఆనందనాథ, కల్యాణరాఘవము, కంఠాభరణము, విజయరాఘవము, కోకిల, విప్రనారాయణ చరిత్ర, విచిత్ర సమావేశము, విచిత్ర మరణము, బుద్ధబోధసుధ, వీరమతి, పూర్ణిమ, ప్రచండ చాణక్యము (ఇత్యాది నాటకములు). హాస్యవల్లరి, పతనము, మంజువాణి, జగన్నాథమూర్తి, మోసము, జలజ, సాక్షి (6 భాగములు)

కొన్ని రచనలు

సాక్షి వ్యాసాలు (వికీసోర్స్‌లో కొన్ని పూర్తి వ్యాసాలున్నాయి), విప్రనారాయణ చరిత్ర, పాదుకా పట్టాభిషేకం, కాంతాభిరామము, రాతి స్తంభము, కళ్యాణ రాఘవము, విజయ రాఘవము, వనవాస రాఘవము, ముద్రిక, నర్మదా పురుకుత్సీయము, సారంగధర, ప్రచండ చాణక్యము, రాధాకృష్ణ, కోకిల, బుద్ధబోధ సుధ, వృద్ధ వివాహము, కంఠాభరణము, పూర్ణిమ, సరస్వతి, వీరమతి,
చూడామణి (నాటకం) - చూడామణి నాటక ఇతివృత్తాన్ని కల్హణుడు రచించిన కాశ్మీర రాజతరంగిణి నుంచి వినయాదిత్యుడనే రాజు, దామోదరశర్మ అనే మంత్రిల యదార్థగాథను స్వీకరించి పెంచి రచించారు.
పద్మిని, మాలతీమాల, గుణవతి, మణిమాల, సరోజిని, విచిత్ర వివాహము, రామరాజు, పరప్రేమ, మనోమహిమము, ఆనంద వాచ పుస్తకం

0 comments:

Post a Comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top