Saturday, 15 December 2018

Nemaligundla Ranganayaka Swamy Temple - History -శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం (జె. పుల్లలచెరువు , ప్రకాశం)- రంగ అనే చెంచులక్ష్మి వలెనే రంగనాయక స్వామిగా పూజలందుకుంటున్న శ్రీమహావిష్ణువు- మయూర మహర్షి - ముక్కుతో తవ్విన గుండమే నెమలి గుండ్ల - నెమలిగుండ్ల జలపాతం -

Nemaligundla Ranganayaka Swamy Temple - History -శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం (జె. పుల్లలచెరువు , ప్రకాశం)- రంగ అనే చెంచులక్ష్మి వలెనే రంగనాయక స్వామిగా  పూజలందుకుంటున్న  శ్రీమహావిష్ణువు- మయూర మహర్షి - ముక్కుతో తవ్విన గుండమే నెమలి గుండ్ల - నెమలిగుండ్ల జలపాతం .........

Nemaligundla Ranganayaka Swamy Temple - History -శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం (జె. పుల్లలచెరువు , ప్రకాశం)- రంగ అనే చెంచులక్ష్మి వలెనే రంగనాయక స్వామిగా  పూజలందుకుంటున్న  శ్రీమహావిష్ణువు- మయూర మహర్షి - ముక్కుతో తవ్విన గుండమే నెమలి గుండ్ల - నెమలిగుండ్ల జలపాతం -

ఆంధ్ర రాష్ట్రంలో ప్రకృతి సంపదలకు, జీవనదులకు ప్రాణప్రదమైన నల్లమల అడవుల పరీవాహక ప్రాంతంలో ఎన్నో మహిమాన్విత క్షేత్రరాజాలున్నాయి. వాటి వరుసలోనే భక్తులకు కొంగు బంగారమై నెమలిగుండ్ల ‘రంగనాయకస్వామి’ క్షేత్రము అలరారుచున్నది.
నెమలిగుండం రంగనాయక స్వామి ఆలయం - ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అతిపురాతనమైన ఆలయంగా పేర్కొంటారు. గర్భగుడిలో రంగనాథస్వామి నిజరూపంలో దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత. త్రేతాయుగం కాలం నుంచీ ఈ ఆలయంలో స్వామి పూజలు అందుకుంటున్నట్లు చెబుతారు. రంగనాయక స్వామి ఆలయం దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో కలదు.

ఆలయాన్ని శనివారం మాత్రమే తెరుస్తారు

దట్టమైన అడవిలో ఉన్న నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయాన్ని శనివారం మాత్రమే తెరుస్తారు. ఉదయం 6 గంటలకు తెరుచుకునే తలుపులు సాయంత్రం 6కు తిరిగి మూసుకుంటాయి. ఆ తర్వాత ఇక్కడ ఒక్కరంటే ఒక్కరూ ఉండరు. ఆ రోజు స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా బారులు తీరుతారు.
రంగనాయక స్వామి


ఇక్కడకు మన రాష్ట్రంనుండేగాక,ఇతర ప్రాంతాలనుండి వేలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం నుండి చైత్రమాసం పౌర్ణమినాడు విశేషంగా భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శించటం పరిపాటి. ఈ ప్రాంత ప్రజలు రంగడు, రంగమ్మ, రంగస్వామి అను పేర్లతో తమ సంతానాన్ని పిలుచుకోవడం అనాదిగా ఉందని అంటున్నారు.

నెమలగుండ్ల రంగనాయకస్వామి క్షేత్రము ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలో ఉంది. జెల్లివాని పుల్లల చెరువునకు పడమటి దిక్కున నాలుగుమైళ్ళ దూరం పెద్ద అడవి ఉంది. గుండ్ల బ్రహ్మేశ్వరము నందు పుట్టిన గుండ్లకమ్మనది, నల్లమల గిరులలో సుడులు తిరిగి ఉత్తర దిక్కున రెండు కొండల మధ్య జాలువారి నెమలిగుండ్లలోకి చేరుతుంది.ఈ క్షేత్రము గుండా ప్రవహిస్తూ గుంటూరు, ప్రకాశం జిల్లాల ద్వారా ప్రవహించి సముద్రములో సంగమించుచున్నది. ఈ క్షేత్రమునకు మూడు వైపులా ఉన్న కొండలను ‘శ్రీరంగం కొండల’ని పిలుస్తారు.

నల్లమల్ల కొండలలో ఇసుకగుండమనెచోట చెంచు జాతికి చెందిన బయన్న, బయ్యక్క దంపతులుండేవారు. వారి ఏకైక కుమార్తె పేరు రంగ (చెంచులక్ష్మి). ఒకానొక రోజు ఆమె తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేయడానికి సంకల్పించారు.కాని చెంచులక్ష్మి ( రంగ ) తనకు ఈ పెళ్లి వద్దని తాను శ్రీమన్నారాయణుని ప్రేమిస్తున్నానని ఆయననే వివాహమాడుతానని పట్టు పట్టడంతో వారి కుటుంబాన్ని కులసంఘం పెద్దలు వెలివేశారు.

పెళ్ళిడు కొచ్చిన రంగ తన కులాచారాన్ని దిక్కరించి, కులపెద్దలతో విభేదించి మహావిష్ణువును పెళ్ళడాలనీ తలంపుతో చెంచుగూడెం వదలి నెమిలిగుండం చేరుకొని తపమాచరిస్తున్న మయార మహర్షికి తన మనోగతాన్ని వెల్లడి చేసింది

ఆ సమయంలోనే శ్రీమన్నారాయణుని సేవించే ‘మయూర మహర్షి’ ఆమెకు  ‘నీ కోరిక తీరడానికి తపస్సే మంచిమార్గమని సెలవిచ్చారు.    శ్రీమన్నారాయణుని  సందర్శనము కోసం ‘మయూర మహర్షి’ , వివాహము చేసుకోవాలని చెంచులక్ష్మి (రంగ ) ఇరువురూ ఘోర తపస్సు కు పూనుకొన్నారు. వీరిరువురి అభీష్టములు నెరవేర్చడానికి వైకుంఠవాసుడే తరలి వచ్చాడు. చెంచులక్ష్మి భక్తిని మెచ్చిన  శ్రీమన్నారాయణుడు  ఆమెను వివాహమాడి ఈ నెమలిగుండ్లలోనే రంగనాయకస్వామిగా నివాసమేర్పరుచుకొన్నాడు.

             ఈ సంగతి తెలియక వైకుంఠుని ఉనికిని గుర్తించలేక వైకుంఠంలో లక్ష్మి చింతింతు రాలైంది. చివరకు స్వామిని వెదకడానికి పూనుకొంది. ఎట్టకేలకు చెంచు ప్రక్కన చేరిన నారాయణుని గుర్తించి అలుక పూనింది. నారాయణుడు చెంచులక్ష్మికూడా నీ సోదరినే అంటూ జరిగిన వైనాన్ని చెప్పగా ప్రసన్నురాలైన లక్ష్మి తాను నెమలి గుండ్లలో కొలువైంది.చెంచులక్ష్మి ని తన సోదరిగా భావించి స్వీకరించింది. శ్రీమన్నారాయణుడిని సేవించే మయూర మహర్షి కోరిక నిమిత్తమై తాను ఇక్కడే కొలువై భక్తుల కోరికలను తీరుస్తానని వరాల నిచ్చిన స్వామి శిలా రూపాన్ని పొందాడు.

               అంతేగాక ఈ ప్రదేశము రంగనాయక క్షేత్రముగా విరాజిల్లగలదని ఆశీర్వదించాడు. అపుడు శిలారూపాన్ని పొందిన స్వామియే మనకు రంగనాయకుల రూపముగా దర్శనం ఇచ్చేది. మయూర మహర్షి చే పూజలందుకొన్న శ్రీమన్నారాయణుడిని రంగస్వామి గా కీర్తిస్తూ అనంతర కాలంలో ఆ ప్రాంత వాసులు గుడిని నిర్మించారు. ఈ ఆలయమే నేటి నెమలి గుండ్ల రంగనాయక స్వామి ఆలయము.


              ఆనాటి నుంచి నేటి వరకు స్వామి లీలలను అనేకాలుగా ఈ క్షేత్రం దర్శించిన భక్తులకు అనుభవంలోకి వస్తునే ఉన్నాయ. ఈ పుణ్యక్షేత్రమున నీటి కొరత యుండదు. గండ్లకమ్మ నది నిండుగా ప్రవహిస్తుంటుంది. రంగనాయకుల యందు లీనమైన వారికి ఇచట ఒక అద్భుత దృశ్యము గోచరిస్తుంది.

ఆలయం వెలసిన ప్రాంతానికి నెమలిగుండ్లు అని పేరు రావడానికి సంబంధించిన గాథ: ఒకప్పుడు మయూరమహర్షి అనే ముని ఇక్కడ ఆశ్రమం నిర్మించుకొని విష్ణువును గూర్చి తపస్సు చేసేవాడు. అతడు ఒకనాడు తనముక్కుతో ఒక కొలను పటం గీచాడని, మరుసటి ఉదయం అక్కడ ఒక కొలను (గుండం లేదా గుండ్లు) వెలసిందని ప్రతీతి. ఆ కొలను మయూరం (నెమలి) ఆకారంతో ఏర్పడిందని, ఆకారణంగా నెమలిగుండం అని నెమలిగుండ్ల అని పేరు వచ్చిందని చెబుతారు. అక్కడ వెలసిన రంగనాయకస్వామి ఆలయం నెమలిగుండ్ల రంగనాయక క్షేత్రంగా పేరుపొందిందని చెబుతారు .

      
దేవాలయానికి ఎదురుగా నెమలి గుండము ఉంది. దీనినే తూర్పు పీట అని కూడా పిలుస్తుంటారు. ఈ తూర్పు పీటకు చివర రంగనాయకస్వామి వారి శంఖు, చక్ర, నామాలు కన్పిస్తుంటాయ. కాని ఈ దృశ్యాలన్నీ కూడా కేవలం భక్తితత్పరులకు మాత్రమే గోచరమవుతాయని అంటారు. భక్తులు తన్మయత్వంతో స్వామి నామస్మరణ చేస్తూ తప్పట్లు మోత, మైకుల సందడి, సన్నాయి, బ్యాండుమేళం రకరకాల వాద్యాల హోరుతో రంగస్వామి నామస్మరణ చేస్తూ కొండకి పయనమవుతారు.

ఇతరదైవాలు:

 నెమలిగుండ్ల ఆలయంలో రంగనాయక స్వామితోపాటు లక్ష్మి, గణపతి,శివుడు, వీరబ్రహ్మేంద్రస్వామి, సిద్దప్ప పూజలందుకొంటున్నారు. ఇంకా పార్వతీసమేత ఉమామహేశ్వరస్వామి, కుమారస్వామి, శ్రీలక్ష్మీవేంకటెశ్వర స్వామి విగ్రహాలకు కూడా భక్తులు పూజలు చేస్తుంటారు.

నాగుల పుట్ట: 

ఆలయంలో వెలసిన నాగుల పుట్ట ఎంతో విశిష్టమైనది మరియు పవిత్రమైనది. ఈ పుట్టకు ఎంతో మహత్యం ఉన్నదని , అది భక్తుల కోర్కెలను తీరుస్తునదని ప్రతీతి.

ఉత్సవాలు : 

రంగనాయకస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవం, కళ్యాణోత్సవం, తెప్పోత్సవం వైభవంగా జరుగుతాయి. చైత్ర శుద్ధ పున్నమ, బహుళ పాడ్యమి, విదియలలో మూడురోజుల పాటు ఉత్సవాలు జరుపుతారు.

వరాహ విష్ణువు

 ఆలయ గోపురంపై గంధర్వుల, గరుడ విగ్రహాలు ఉన్నాయి. వాటి మధ్య వరాహస్వామి విగ్రహాన్ని అమర్చారు. స్వామిని వరాహవిష్ణువని పిలిస్తూ పూజిస్తున్నారు.

నిష్ఠ తప్పితే తేనెటీగల దాడి!

మయూరుడనే మహర్షి శ్రీమహావిష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి తదేక దీక్షతో తప్పస్సును ఆచరించి... తన ముక్కు పుటంతో గుండం తవ్వారని, అందుకే ఈ క్షేత్రానికి ‘నెమలిగుండం’ అనే పేరు వచ్చిందని చెబుతారు. ఈ ఆలయానికి వెళ్లే భక్తులు అత్యంత నియమ నిష్ఠలు పాటించాలి. అంటు, ముట్టు ఉన్న వారు వెళితే స్వామి దర్శనం లభించదని చెబుతారు. ఇలాంటి వారు క్షేత్రం దరిదాపులకు రాగానే తేనేటీగలు కుడతాయని, బయటికి తరుముతాయని చెబుతారు. అలా ఎంతోమంది స్వామి దర్శనం కాకుండానే వెనక్కి వెళ్తుంటారు. మరోసారి మరింత నిష్ఠతో స్వామిని దర్శించుకుంటారు.  అందువల్లనే ఈ క్షేత్రంలో దొంగతనాలు, దోపిడీలు లాంటి చర్యలు కూడా ఇక్కడ జరుగవని భక్తులు చెబుతున్నారు.కొందరికి దేవుడు ఆవహించి వారుచేసిన తప్పులను వివరించి దానికి శిక్షలు వేస్తుంటారని కూడా ఇక్కడి వారు చెబుతుంటారు.

అఖిలాండేశ్వరుడైన ఈ స్వామివారిని వర్గ కుల మత భేదాలు లేకుండా సర్వులూ ఈ స్వామిని కొలుస్తారు. అడవులలో నివసించే హరిజన కుటుంబాలు తండోపతండాలుగా ఇక్కడ స్వామిని దర్శించి తన్మయత్వంతో రంగడి స్మరణతో తమ గృహాలకు తిరిగి వెళ్తుంటారు. అందుకే భక్తుల కొంగు బంగారం నెమలిగుండ్ల రంగనాయకుడు. ఇక్కడ ఉన్న తూర్పుపీట లోని శంఖు చక్రనామాలు దర్శించినవారికి ‘శ్రీరంగం శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే’ అంటారు. ఇలా ప్రసిద్ధి పొందిన దివ్యక్షేత్రం అందరూ చూసి తీరాల్సింది.

ఉపవాసాలు 

ఈ ప్రదేశాన్ని లక్ష్మణ వనంగా పిలుస్తారు. ఏ క్షేత్రంలో కనిపించని అరుదైన పవిత్రత గొప్పదనం నెమలిగుండ రంగనాయక స్వామికి వుంది. గత కొన్ని సంవంత్సరాలుగా ప్రతి ఎటా చైత్ర మాసంలో బహుళ పాడ్యమి, విదియ, తదియలో మూడు రోజుల పాటు ఉపవాసాలు నిర్వహిస్తారు.
సాయంత్రం 6 అయ్యిందంటే  ఎవ్వరినీ అనుమతించరు. ఆలయాన్ని శని మాత్రమే తెరుస్తారు

నెమలిగుండ్ల జలపాతం


గుండ్ల బ్రహ్మేశ్వరము నందు పుట్టిన గుండ్లకమ్మనది, నల్లమల గిరులలో సుడులు తిరిగి ఉత్తర దిక్కున రెండు కొండల మధ్య జాలువారి నెమలిగుండ్లలోకి చేరుతుంది ఏడాది పొడవునా ఈ జలపాతం జాలువారుతూనే ఉంటుంది. ఎత్తైన కొండలు, జాలువారే జలపాతం, ప్రకృతి సౌందర్యం అద్భుతంగా ఉంటుంది.

 నెమలిగుండం వెళ్లాలంటే 

గిద్దలూరు, మార్కాపురం, నంద్యాల ప్రాంతాల నుండి ప్రతి శనివారాలలో బస్సులు ఉంటాయి. కానీ చాలా తక్కువగా నడుతాయి. అయితే గిద్దలూరు నుండి ప్రవేట్ ఆటోలు ఉంటాయి. ప్రయాణ సమయం : గంట లేదా గంటన్నర. గిద్దలూరు లో రైల్వే స్టేషన్ కలదు.

VIDEO- Nemaligundla ranganayakula swami


0 comments:

Post a Comment

ADD

AP UPDATES

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top