Thursday, 13 December 2018

Mark Elliot Zuckerberg -మనసున్న మారాజు!...మార్క్‌ జుకెర్‌బర్గ్‌... వయసు 31ఏళ్లు. సంపద... 3.47లక్షల కోట్లు....కుమార్తె పుట్టిన ఆనందంలో మొత్తం దానం..ఆ సందర్భంగా ఈ ఫేస్‌బుక్‌ ఆద్యుడి గురించిన ఆసక్తికర విషయాలు కొన్ని...

Mark Elliot Zuckerberg is an American technology entrepreneur and philanthropist. He is known for co-founding and leading Facebook as its chairman and chief executive officer. 

మనసున్న మారాజు!
వయసు... 31ఏళ్లు. సంపద... 3.47లక్షల కోట్లు. ఆ మొత్తాన్ని సంపాదించడానికి పట్టిన సమయం... కేవలం పదేళ్లు. ముమ్మాటికీ మామూలు విషయం కాదు. మరి, దాన్నంతా ఒక్కసారిగా దానం చెయ్యాలని నిర్ణయించుకోవడం... అంతకు మించిన గొప్ప విషయమని చెప్పాల్సిన పన్లేదు. అందుకే, ఇప్పుడు ప్రపంచం మొత్తం జుకెర్‌బర్గ్ ‌కి నీరాజనాలు పలుకుతోంది. ఆ సందర్భంగా ఈ ఫేస్‌బుక్‌ ఆద్యుడి గురించిన ఆసక్తికర విషయాలు కొన్ని...

పిల్లలు పుడితే వారికి ఎంత సంపాదించి ఇవ్వాలా అని ఆలోచించేవాళ్లెందరో. కానీ మార్క్‌ జుకెర్‌బర్గ్‌ అందరికన్నా భిన్నంగా ఎంత దానం చెయ్యాలా అని ఆలోచించాడు. కూతురు ‘మ్యాక్స్‌’ పుట్టిన ఆనందంలో మరెంతోమంది కళ్లలో ఆనందాన్ని చూడాలనుకున్నాడు. అందుకోసం ఏకంగా తన ఫేస్‌బుక్‌ షేర్లలో 99శాతం సేవాకార్యక్రమాల కోసం వినియోగించనున్నట్లు ప్రకటించాడు. వాటి విలువ మూడు లక్షల కోట్లరూపాయలు.

* 2004లో ప్రారంభించిన ఫేస్‌బుక్‌ 2007 సంవత్సరానికి, 23ఏళ్ల వయసులో మార్క్‌ను బిలియనీర్‌ని చేసింది.

* భూమ్మీదున్న ప్రతి ఏడుగురిలో ఒకరు ఫేస్‌బుక్‌ని వాడుతున్నారట. రోజుకు ఎనిమిది వందలకోట్లకు పైగా వీడియోలను ఫేస్‌బుక్‌ ద్వారా చూస్తున్నారు. 30 ఏళ్లకే అతడు ప్రపంచాన్ని అంతగా ప్రభావితం చేశాడు.

* పాఠశాలలో చదువుకుంటున్నప్పుడే మార్క్‌ కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని చూసి తండ్రి ఎడ్వర్డ్‌ అతడిని కంప్యూటర్‌ కోర్సులో డిగ్రీ చేయించడానికి దగ్గర్లో ఉన్న కళాశాలలో చేర్పించాడట. మొదటి రోజు ఆయన మార్క్‌ని తరగతి గదిలోకి తీసుకెళ్తుంటే మీరు మాత్రమే లోపలికి రండి పిల్లల్ని తీసుకురాకూడదు అన్నాడట ఉపాధ్యాయుడు. దాంతో ఎడ్వర్డ్‌ విద్యార్థి తాను కాదు, తన కొడుకని చెప్పాడట.

* చిన్నతనంలోనూ జుకెర్‌బర్గ్‌కి కంప్యూటర్‌ శిక్షణ ఇప్పించేందుకు ఓ ఉపాధ్యాయుడిని నియమించగా ఆయన ‘మీ అబ్బాయి కంప్యూటర్‌ పరిజ్ఞానం నన్ను మించిపోయింది. నేను శిక్షణ ఇవ్వలేను’ అని ఎడ్వర్డ్ ‌కి చెప్పి వెళ్లిపోయాడట.

* తండ్రి దంత వైద్యశాలలోని కంప్యూటర్లను ఇంటి దగ్గరున్న కంప్యూటర్‌కు అనుసంధానిస్తూ 13 ఏళ్లకే ‘జుక్‌నెట్‌’ పేరుతో మార్క్‌ ఓ ప్రోగ్రామ్‌ను రూపొందించాడు.

* హైస్కూల్లో చదువుతున్నప్పుడే ఏఓఎల్‌, మైక్రోసాఫ్ట్‌ కంపెనీలు ఉద్యోగం ఇస్తాం రమ్మంటూ జుకెర్‌ని ఆహ్వానించాయి. అప్పటికే అతడు ‘సినాప్స్‌’ పేరుతో ఓ మ్యూజిక్‌ ఆప్‌ను రూపొందించాడు మరి. దానికి వచ్చిన స్పందన చూసి మైక్రోసాఫ్ట్‌ పదిలక్షల డాలర్లకు ఆ ప్రోగ్రామ్‌ని కొనడానికి ముందుకు రావడంతో పాటు మార్క్‌ని తమ కంపెనీలో చేరమని కోరింది. కానీ చదువుకి ఇబ్బందవుతుందని ఆ కంపెనీలో చేరలేదు.

* ఫేస్‌బుక్‌ చాలా వరకూ నీలి రంగులో ఉండడానికి కారణం, జుకెర్‌బర్గ్‌కి వర్ణాంధత్వం ఉంది. దాంతో అతనికి ఎరుపు, ఆకుపచ్చ రంగులు కనిపించవు.

* అమెరికాలోని 40 ఏళ్లలోపు ఎంట్రప్రెన్యూర్లలో అందరికన్నా ధనవంతుడు మార్కే.

* అంత ఆస్తి ఉన్నా జుకెర్‌ ఎక్కువగా బూడిదరంగు టీషర్టులోనే కనిపిస్తుంటాడు. రోజుకోరకం దుస్తులను ఎంపిక చేసుకుని వేసుకునేంత తీరికలేకపోవడమే అందుక్కారణమంటాడు.

* జుకెర్‌బర్గ్ ‌కి ఏటా ఓ కొత్త లక్ష్యాన్ని పెట్టుకునే అలవాటుంది. అలా 2011లో మాంసాహారాన్ని తినకూడదనే నియమాన్నీ 2013లో ప్రతిరోజూ ఓ కొత్త వ్యక్తిని కలవాలనీ 2015లో నెలకు రెండు పుస్తకాలు చదవాలనీ లక్ష్యాలను పెట్టుకున్నాడు.

* మార్క్‌ పేరుతో 50 పేటెంట్లున్నాయి.

* ట్విట్టర్‌లో జుకెర్‌ బర్గ్‌ పేజీకి 3.75 లక్షలకు పైగా అభిమానులున్నారు. కానీ అతడు ఇన్నేళ్లలో చేసింది కేవలం 19ట్వీట్లే.

* ఒకప్పుడు మార్క్‌ నాస్తికుడు.

* ఫేస్‌బుక్‌ ప్రారంభమైన తొలినాళ్లలో ఆపిల్‌ వ్యవస్థాపకుడు స్టీవ్‌ జాబ్స్‌ సలహా మేరకు జుకెర్‌బర్గ్‌ ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌కు దగ్గర్లో ఉన్న కైంచి ధామ్‌ ఆశ్రమాన్ని సందర్శించాడట. ఈమధ్య మన ప్రధాని నరేంద్రమోదీ అమెరికాలోని ఫేస్‌బుక్‌ కార్యాలయానికి వెళ్లినపుడు అతడే ఆమాట చెప్పాడు. అన్నట్లూ అప్పట్నుంచీ కైంచి ధామ్‌ను స్థానికంగా జుకెర్‌బర్గ్‌ ఆలయంగా పిలిచేస్తున్నారు.

* ‘అదృష్టం ఎప్పుడూ ధైర్యవంతుల వైపే ఉంటుంది...’ ఇది మార్క్ ‌కి నచ్చిన కొటేషన్‌.

* జుకెర్‌ పెంపుడు కుక్క బీస్ట్‌ ఫేస్‌బుక్‌ పేజీకీ 22 లక్షలకు పైగా లైక్‌లున్నాయి.

* జుకెర్‌బర్గ్ ‌ను దగ్గరివాళ్లు జుక్‌ అని పిలిస్తే, అతని తల్లి ‘ప్రిన్స్‌లీ’ అంటుంది.

* అతడి భార్య ప్రిసిలా చాన్‌ చైనా దేశీయురాలు, బోస్టన్‌లో చదువుకునేది. విచిత్రం ఏంటంటే ఓ పార్టీలో బాత్‌రూమ్‌ దగ్గర క్యూలో నిలబడినపుడు మార్క్‌కి ఆమెతో పరిచయం ఏర్పడింది. ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడ్డానికి ఇబ్బందిగా ఉందని జుకెర్‌ చైనా భాష మాండరిన్‌ను కూడా నేర్చుకున్నాడు.

* జుకెర్‌ కూతురు ‘మాక్సిమా’ పేరుకి అర్థం ‘చాలా గొప్ప, అద్భుతమైన పనితనం ఉన్న వ్యక్తి’ అని. అమెరికాలో గత 15ఏళ్లలో ఈ పేరుని 150మంది పిల్లలకు మాత్రమే పెట్టారట.

* 2013లో రూ.33వేల కోట్ల విలువైన ఫేస్‌బుక్‌ షేర్లను సిలికాన్‌ వ్యాలీ స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వడంతో పాటు ఎబోలా వ్యాధి నివారణకు రూ.1600 కోట్లనూ న్యూయార్క్‌ పబ్లిక్‌ స్కూళ్ల కోసం రూ.661 కోట్లనూ విరాళంగా అందించాడు.

* శాన్‌ఫ్రాన్సిస్కో జనరల్‌ హాస్పిటల్‌కు ఈమధ్యే ప్రిసిలా, మార్క్‌జుకెర్‌బర్గ్ ‌ల పేరును పెట్టారు. ఈ ఆసుపత్రి అభివృద్ధి కోసం జుకెర్‌ దంపతులు 500కోట్ల రూపాయలకు పైగా విరాళాలను అందించారు. అందుకు కృతజ్ఞతగా ఆసుపత్రికి వారి పేర్లను పెట్టారు.

* వారెన్‌బఫెట్‌, బిల్‌గేట్స్ ‌తో పాటు జుకెర్‌బర్గ్‌ కూడా ఆస్తిలో సగం వాటాను సేవా కార్యక్రమాలకోసం వినియోగిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. కానీ ఇప్పుడు దాదాపుగా మొత్తం ఆస్తిని ఇవ్వడానికి ముందుకొచ్చాడు.

సంపాదించే తెలివి తేటలే కాదు, ఆ సంపాదనను ఉదారంగా సమాజంతో పంచుకోగల మంచి మనసు కూడా మార్క్‌ జుకెర్‌బర్గ్‌ సొంతం అని చెప్పడానికి ఇంతకన్నా మంచి నిదర్శనం ఏముంటుంది...!

0 comments:

Post a Comment

ADD

AP UPDATES

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top