⚡ FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్⚡

MORE TO VIEW

Sunday, 23 December 2018

Madan Mohan Malaviya (25 డిసెంబర్ 1861 -నవంబర్ 12,1946 )-Biography - భారత రత్న పండిట్ మదన్ మోహన్ మాలవీయ-గొప్ప విద్యావేత్త, కర్మయోగి,"సత్యమేవ జయతే" అనే నినాదాన్ని వ్యాపింపచేసాడు-నేటి సమాజం తెలుసుకోవాల్సిన మహోన్నత వ్యక్తి. స్వాత్రంత్ర సమరయోధుడు,

‘భారత రత్న’ మదన్ మోహన్ మాలవ్యా… నేటి సమాజం తెలుసుకోవాల్సిన మహోన్నత వ్యక్తి.  స్వాత్రంత్ర సమరయోధుడు, గొప్ప విద్యావేత్త, కర్మయోగి,"సత్యమేవ జయతే" అనే నినాదాన్ని వ్యాపింపచేసాడు, భగవద్గీతను జీవితంలో ఆచరించి చూపిన మహనీయుడు. ఆయన గౌరవంగా "పండిట్ మదన్ మోహన్ మాలవీయ"గా కూడా పిలువబడుతున్నారు. ఆయన "మహాత్మా"గా కూడా గౌవరింపబడ్డాడు.
Madan Mohan Malaviya-Biography  - భారత రత్న పండిట్ మదన్ మోహన్ మాలవీయ - (25 డిసెంబర్ 1861 -నవంబర్ 12, 1946 )-గొప్ప విద్యావేత్త, కర్మయోగి,"సత్యమేవ జయతే" అనే నినాదాన్ని వ్యాపింపచేసాడు-నేటి సమాజం తెలుసుకోవాల్సిన మహోన్నత వ్యక్తి.  స్వాత్రంత్ర సమరయోధుడు,

మాలవ్య 1861,డిసెంబర్ 25న  అలహాబాదు లో ఒక నిష్టులైన హిందూ కుటుంబములో జన్మించారు.ఆయన తల్లిదండ్రులు మూనాదేవి మరియు బ్రిజ్ నాథ్ లు. వారి పూర్వీకులు మధ్యప్రదేశ్ లోని మాల్వా నుండి వచ్చారు. అందువలన వారు "మాలవీయ"గా పిలువబడతారు.అందువల్ల వారి యింటిపేరు  "వ్యాస్"గా అయింది. మాలవ్యాలు బెనార్స్ లోని అగర్వాల్ వర్తకులకు ఇంటిపురో హితులు గా యున్నారు.ఆయన తండ్రి సంస్కృత గ్రంథములను అభ్యసించేవాడు. ఆయన శ్రీమద్బాగవతమును చెప్పి ధనం సంపాదించే వాడు. మాలవ్యా సంప్రదాయకంగా రెండు సంస్కృత పాఠశాలలో విద్యాభ్యాసం చేశాడు. ఆ తరువాత ఆయన ఆంగ్ల పాఠశాలలో తన విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు. మాలవ్యా తన విద్యాభ్యాసాన్ని హరదేవా ధర్మ జ్ఞానోపదేశ పాఠశాలలో కొనసాగించాడు. అచట ఆయన ప్రాథమిక విద్యను పూర్తిచేశాడు.ఆ తరువాత ఆయన వైద వర్థిని సభ నదుపుతున్న పాఠశాలలో చేరాడు. ఆ తరువాత అలహాబాదు జిల్లా పాఠశాలలో చేరారు. అచట ఆయన "మకరంద్" అనే కలం పేరుతో కవిత్వం వ్రాయడం ప్రారంభించాడు. ఆ కవితలు వివిధ జర్నల్స్ మరియు మ్యాగజెన్లలో ప్రచురితమైనాయి.

మాలవ్యా 1879 లో ముయిర్ సెంట్రల్ కాలేజీ నుండి మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. ఆ కళాశాల ప్రస్తుతం అలహాబాదు విశ్వవిద్యాలయంగా ప్రసిద్ధి చెందినది.హారిసన్ కాలేజి ప్రిన్సిపాల్ మాలవ్యాకు నెలసరి ఉపకార వేతనాన్ని అందించేవారు. మాలవ్యా కలకత్తా విశ్వవిద్యా లయం నుండి బి.ఎ.లో పట్టభద్రుల ైనారు. ఆయన సంస్కృతంలో ఎం.ఎ చేయాలనుకు న్నప్పటికీ ఆయన కుటుంబ పరిస్థితులు సహకరించలేదు. ఆయన తండ్రి ఆయనను కూడా తన వృత్తిలోనికి సహాయకునిగా తీసుకుని వెళ్ళేవాడు. జూలై 1884 లో మదన్ మోహన్ మాలవ్యా తన ఉద్యోగ జీవితాన్ని అలహాబాదు ఉన్నత పాఠశలలో ఉపాధ్యాయునిగా చేరి ప్రారంభించారు.

మదన్ మోహన్ మాలవ్యా దేశంలో విద్యకోసం అనేక సంస్థలను నెలకొల్పిన మహావ్యక్తి. ఆయన సమాజంలో వున్న కుల, మత భేదాలను రూపుమాపడానికి చేసిన కృషి ప్రతి భారతీయుడుకి ఎంతో ఆదర్శం. 1916లో వారణాసిలో బెనారస్ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి విద్యా వెలుగులు ప్రసరింపచేసిన విద్యాప్రదాత.

సంప్రదాయబద్ధమైన హిందూ కుటుంబంలో జన్మించిన మాలవ్యా బాల్యం నుంచే వేదాధ్యయనం చేశారు. యువకుడైన తర్వాత హిందీ భాషలో ‘హిందుస్తాన్’, ఇంగ్లీషు భాషలో ‘ది ఇండియన్ యూనియన్’ అనే రెండు పత్రికలను స్థాపించారు. అంతేకాకుండా, మదన్ మోహన్ మాలవ్యా ‘ది లీడర్’ అనే ఆంగ్ల పత్రికను కూడా నెలకొల్పారు.

సంపాదననూ వదులుకొని దేశసేవే లక్ష్యంగా స్వరాజ్య సమరంలో  పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. రాజకీయాలకి స్వస్తి చెప్పి, సామాజిక సమస్యలపై దృష్టి సారించారు. దేశ పౌరుల్లో జాతీయ విలువలు పెంపొందాలంటే చదువు అవసరమని విశ్వసించడంతో పాటు కోట్లాది మంది ప్రజలను పేదరికం నుంచి విముక్తుల్ని చేయాలంటే విజ్ఞాన శాస్త్రం వారి అవసరాలను తీర్చేలా ఉండాలని భావించి, అందుకోసం 1916లో వారణాసిలో బెనారస్ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి విద్యా వెలుగులు ప్రసరింపచేసిన విద్యాప్రదాత.

బెనారస్ హిందూ యూనివర్సిటి స్థాపించే పనిలో ఉన్నప్పుడు ఆయనను ఎన్నో సమస్యలు చుట్టుముట్టాయి. దీనికితోడు ఎన్నో ఆర్ధిక పరమైన ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. యూనివర్సిటి స్థాపించాలి అనే ధృడ నిశ్చయం ఉన్నవాడు కావడం చేత ఎన్నో ఊళ్లు తిరిగి, ఎంతో మందిని కలిసి విరాళాలు పోగుచేసి విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఈ విశ్వవిద్యాలయం ఆసియాలో అతిపెద్ద విశ్వవిద్యాలయంగా కీర్తి గడించి ఎంతో మంది విద్యావేత్తలను దేశానికి అందిస్తోంది.

సైమన్ కమిషన్‌ని లాలా లజపతిరాయ్, జవహర్ లాల్ నెహ్రూ, ఇతర స్వాతంత్ర సమరయోధులతో కలసి వ్యతిరేకించారు. 1931 సంవత్సరంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మహాత్మాగాంధీతో కలసి కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిథ్యం వహించారు. దేశ స్వాతంత్ర కోసం ఎంతో పోరాటం చేసిన ఆయన స్వాతంత్ర్యాన్ని చూడకుండానే నవంబర్ 12, 1946న వారణాసిలో శాశ్వతనిద్రలోకి జారుకున్నారు.

దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డును కేంద్ర ప్రభుత్వం మదన్ మోహన్ మాలవ్యాకు 2014లో ప్రకటించింది.

0 comments:

Post a Comment

Teachers INFO

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top