Sunday, 2 December 2018

Kumbhalgarh Fort , Rajasthan - The Great Wall of India - కుంభాల్ ఘర్ - .ఆరావళి ప్రాంతంలో సుమారు 36 కిలోమీటర్ల మేర వ్యాపించి ఉంది కుంభాల్‌ ఘర్‌ కోట..- ఈ కోట లోని 360 ఆలయాలు, 252 భవంతుల రక్షణలో.. ‘ఇండియన్ గ్రేట్ వాల్’! - ...కుంభాల్ ఘర్ ని చూస్తున్నామా అనేలా ఉండే యూట్యూబ్ వీడియో

Kumbhalgarh Fort , Rajasthan - The Great Wall of India - కుంభాల్ ఘర్ - .ఆరావళి ప్రాంతంలో సుమారు 36 కిలోమీటర్ల మేర వ్యాపించి ఉంది కుంభాల్‌ ఘర్‌ కోట..-  ఈ కోట లోని  360 ఆలయాలు, 252 భవంతుల రక్షణలో.. ‘ఇండియన్ గ్రేట్ వాల్’!....కుంభాల్ ఘర్ ని చూస్తున్నామా అనేలా ఉండే యూట్యూబ్ వీడియో

రాజస్ధాన్ లోని రాజసమండ్ జిల్లాలోని కుంభాల్ ఘర్ ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశం. ఈ ప్రదేశం రాష్ట్రంలో దక్షిణ భాగంలో కలదు. దీనిని కుంభాల్ మేర్ అని కూడా అంటారు. రాజస్ధాన్ రాష్ట్రంలో కుంభాల్ ఘర్ కోట రెండవ ప్రసిద్ధిచెందిన కోట.

 దీనిని 15వ శతాబ్దంలో రాణాకుంభ నిర్మించాడు.ఆరావళి ప్రాంతంలో సుమారు 36 కిలోమీటర్ల మేర వ్యాపించి ఉంది కుంభాల్‌ ఘర్‌ కోట. కోట మేవార్‌ నది ఒడ్డున ఉంది. ఈ భారీ కోట చుట్టూ 13 శిఖరాలు, వాచ్‌టవర్లు, బురుజులు ఉన్నాయి. కోట పైభాగం నుండి పర్యాటకులు చుట్టుపక్కట దృశ్యాలను చూడవచ్చు.

 ఈ కోటలో ఏకంగా 360 ఆలయాలు, 252 భవంతులతోపాటు  వీటికి రక్షణ గా  ఎత్తైన కోటగోడ శత్రువుల నుండి రక్షించుకునేందుకు నిర్మించబడింది. గ్రేట్‌వాల్‌ ఆఫ్‌ చైనా తర్వాత రెండో పొడవైన గోడగా ఇది ప్రసిద్ధి పొందింది. కోటకు ఏడు భారీ ద్వారాలు ఉన్నాయి. కర్తార్‌ ఘర్‌ అని పిలుచుకునే మరో కోటను కూడా కుంభాల్‌ ఘర్‌ ప్రధాన కోట లోపల చూడవచ్చు.



రాజస్ధాన్ లోని ఇతర ప్రదేశాలవలెనే, కుంభాల్ ఘర్ లో కూడా అందమైన ప్యాలెస్ లు ఉన్నాయి. వాటిలో బాదల్ మహల్ ఒకటి. దీనిని మేఘాల ప్యాలెస్ అని అంటారు. దీనిలోనే  గోపుర ప్యాలెస్‌  , మర్దనా మహల్ మరియు జనానా మహల్ అనేవి కలవు. ప్యాలెస్ లోని సుందరమైన గదులు రంగు రంగుల కుడ్య చిత్రాలచే అలంకరించబడ్డాయి. ఈ గదులు వారి ప్రత్యేక ఎయిర్ కండిషనింగ్ విధానాన్ని తెలుపుతాయి.

కుంభాల్ ఘర్ లో సైట్ సీయింగ్ ....

ఈ కోటలో ఆశ్చర్యానికి గురిచేసే ఎన్నో విశిష్టతలు దాగి వున్నాయి.
కోటలోని పురాతన గుహలో పరశురాం దేవాలయం వుంది. ఈ ఆలయంలో పరశురామ రుషి విగ్రహం ఉంటుంది. పురాణం మేరకు పరశురాముడు ఇక్కడ ధ్యానం చేశాడని, పిమ్మట శ్రీరాముడి ఆశీర్వాదం పొందాడని చెపుతారు.
కుంభాల్ ఘర్ లో ఉన్న అందమైన ప్యాలెస్ లలో ప్యాలెస్ ఒకటి. దీనినే మేఘాల ప్యాలెస్ అంటారు. ఈ ప్యాలెస్ లో రెండు అందమైన మహల్ లు ఉన్నాయి. చల్లటి గాలి లోనికి రావడం, వేడి గాలి బయటికి పోవడం వంటి విధానాలు ఇక్కడ గమనించవచ్చు.
కేవలం ఇవి మాత్రమే కాదు.. ఈ కోటలో చూపరులను కట్టిపడేసే మరెన్నో అద్భుతాలు దాగి వున్నాయి. ఈ కోటను సందర్శించాలంటే కేవలం ఒకరోజు సరిపోదు. 3500 అడుగుల ఎత్తులో వున్న ఈ కోట 36 కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి వుండటంతో.. దీనిని చూసేందుకు చాలా సమయం పడుతుంది.
అందమైన ప్రదేశాలే కాక కుంభాల్ ఘర్ లో దేవాలయాలు కూడా ఉన్నాయి. వాటిలో వేది దేవాలయం, నీలకంఠ మహదేవ దేవాలయం, ముచ్చల్ మహావీర్ దేవాలయం, పరశురాం దేవాలయం, మమ్మదేవ్ దేవాలయం మరియు రాణక్ పూర్ జరైన్ దేవాలయం ప్రసిద్ధి గాంచినవి.
కుంభాల్ ఘర్ వన్యప్రాణుల అభయారణ్యంలో నాలుగు కొమ్ముల జింక, చిరుతపులులు, అడవి, తోడేళ్ళు, ఎలుగు బంట్లు, నక్కలు, సాంబార్ లు, చింకారాలు, చిరుతపులులు, హైనాలు, అడవి పిల్లులు, మరియు కుందేళ్ళు వంటి వాటిని చూడవచ్చు. హల్ది ఘాటి మరియు ఘనేరావ్ కుంభాల్ ఘర్ ఇతర పర్యాటక ఆకర్షణలు.

వాతావరణం 
కుంభాల్ ఘర్ ఏడాది పొడవునా అనుకూల వాతావరణం అనుభూతిని కలిగిస్తుంది. అయితే, ఈ ప్రదేశం సందర్శించడానికి అనువైన సమయం అక్టోబరు నుంచి మార్చి నెలలు. ఈ సమయంలో పర్యాటకులు కుంభాల్ ఘర్ పర్యటన అధికంగా ఆనందించగలరు.

కుంభాల్ ఘర్ కు ప్రయాణ సౌకర్యాలు .... 

విమాన, రైలు, మరియు రోడ్డు మార్గాలలో కుంభాల్ ఘర్ కు చేరవచ్చు. ఉదయపూర్ లోని మహారాణా ప్రతాప్ విమానాశ్రయం మరుయు డబోక్ విమానాశ్రయం సమీప విమానాశ్రయాలు. విదేశీ పర్యాటకులు న్యూఢిల్లీ మహాత్మా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి కూడా చేరవచ్చు. ఫాల్నా జంక్షన్ రైల్వే స్టేషన్ కుంబాల్ ఘర్ కు సమీప రైలు స్టేషన్ . ముంబై, అజ్మీర్, ఢిల్లీ, అహ్మదాబాద్, జైపూర్, జోధ్ వంటి ప్రధాన గమ్యస్థానాలకు తరచుగా రైళ్లు కలవు. పర్యాటకులు కుంభాల్ ఘర్ చేరుకోవడానికి విమానాశ్రయం మరియు రైల్వే స్టేషన్ ల నుండి క్యాబ్ లు లభిస్తాయి. ప్రైవేటు మరియు ప్రభుత్వ బస్సులు ఉదయపూర్ అజ్మీర్, జోధ్పూర్ మరియు పుష్కర్ పట్టణాలనుండి అందుబాటులో ఉన్నాయి.

నీలకంఠ మహదేవ్ ( శివ) దేవాలయం 

నీలకంఠ మహదేవ్ దేవాలయం ఈ దేవాలయం కుంభాల్ ఘర్ కోట సమీపంలో కలదు. ఈ గుడిలో ఆరు అడుగుల శివలింగం ఉంది. ఇక్కడ ఇది ఒకే దేవాలయం. చరిత్ర మేరకు రాణా కుంభ రాజు దీనిని అర్చించే వాడు. అయితే, దురదృష్టవశాత్తూ ఒకసారి తాను లింగాన్ని అర్చించే సమయంలో తన స్వంత కుమారుడిచే వధించబడినట్లు చెపుతారు.
రానక్ పూర్ జైన దేవాలయం

రానక్ పూర్ జైన దేవాలయం అధినాద్ దేవునికి చెందిన ఈ దేవాలయం ఆరావళి పర్వత శ్రేణులలో పశ్చిమ ప్రాంతంలో ఉంది. లేత రంగు పాలరాతితో నిర్మింఛినా ఈ కట్టడం ఎంతో అందంగా కనబడుతుంది. ఈ దేవాలయ౦ 48,000 చదరపు అడుగుల మేర విస్తరించి ఉంది.
కుంభాల ఘర్ వన్యప్రాణుల అభయారణ్యం సఫారి క్యాంపు

కుంభాల ఘర్ వన్యప్రాణుల అభయారణ్యం కుంభాల ఘర్ వన్యప్రాణుల అభయారణ్యం లో నాలుగు కొమ్ముల జింక లేదా చిరుతపులులు, అడవి, తోడేళ్ళు, ఎలుగు బంట్లు, నక్కలు, సాంబార్ లు, చింకారాలు, చిరుతపులులు, హైనాలు, అడవి పిల్లులు, మరియు కుందేళ్ళు వంటివి చూడడానికి చక్కటి ప్రదేశం.
బాదల్ మహల్(మేఘాల ప్యాలెస్)

బాదల్ మహల్ రాజస్ధాన్ లోని ఇతర ప్రదేశాలవలెనే, కుంభాల్ ఘర్ లో కూడా అందమైన ప్యాలెస్ లు ఉన్నాయి. వాటిలో బాదల్ మహల్ ఒకటి. దీనిని మేఘాల ప్యాలెస్ అని అంటారు. దీనిలోనే మర్దనా మహల్ మరియు జనానా మహల్ అనేవి కలవు. ప్యాలెస్ లోని సుందరమైన గదులు పేస్టెల్ రంగు కుడ్య చిత్రాలచే అలంకరించబడ్డాయి.

ఘనే రావు అనేక చిన్న పెద్ద హిందూ దేవాలయాలు గల గ్రామం ఘనే రావు. ఈ ప్రాంతంలో గల 11 జైన దేవాలయాలలో ముచ్చల్ మహావీర్ దేవాలయం, గజానంద్ దేవవాలయం ఈ రెండు ఎంతో ప్రసిద్ది చెందాయి. గజానంద దేవాలయం లో గణేశ దేవుడు, రిద్ధి, సిద్ది దేవతల అందమైన విగ్రహాలను భక్తులు చూడవచ్చు.
మమ్మాదేవ్ దేవాలయం 

మమ్మాదేవ్ దేవాలయం ఈ దేవాలయాన్ని రాణా కుంభ రాజు 1460లో నిర్మించారు. ఈ గుడి కుంభాల ఘర్ కోట కింది భాగంలో కలదు. పర్యాటకులు దీనిపై మేవార్ చరిత్రను శిలా శాసన రూపంలా వ్రాసి ఉండటం గమనిస్తారు. ఇక్కడ వ్రాసిన శాసనం మేరకు చరిత్ర గుహిల్ కాలం నుండి రాణా కుంభ పాలన వరకు కలదు.

ముచ్చల్ మహావీర్ దేవాలయం

ముచ్చల్ మహావీర్ దేవాలయం రాజస్థాన్ లోని పాలి జిల్లా లో మహావీర భగవానునికి చెందిన ముచ్చల్ మహావీర్ దేవాలయం ఉంది.ఘనే రావు కు 5 కి.మీ. దూరంలో కు౦భాల్ ఘర్ అభయారణ్యంలో ఈ దేవాలయం కలదు. ఈ దేవాలయంలో శివుడికి మీసాలు కల్గి ఉన్న విగ్రహ౦ ఉంటుంది.

పరశురాం దేవాలయం 

పరశురాం దేవాలయం ఈ దేవాలయం పురాతన గుహలో కలదు. దీనిలో పరశురామ రుషి విగ్రహం ఉంటుంది. పురాణం మేరకు పరశురాముడు ఇక్కడ ధ్యానం చేశాడని, శ్రీరాముడి ఆశీర్వాదం పొందాడని చెపుతారు. ఈ గుహను చేరాలంటే పర్యాటకులు సుమారు 500 మెట్లు కిందకు దిగాలి.
వేది దేవాలయం

వేది దేవాలయం కుంభాల్ ఘర్ కోటలోని హనుమాన్ పోల్ కు సమీపంలో కలదు. ఈ జైన దేవాలయాన్ని రాణా కుంభ నిర్మించాడు. మహారాణా ఫతే సింగ్ తర్వాతి కాలంలో పునరుద్ధరించాడు.

Kumbhalgarh Fort video



View the video of Kumbhalgarh Fort
 

0 comments:

Post a Comment

ADD

AP UPDATES

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

  • Know your 10th PRC Arrears with your Treasury IDLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top