Search This Blog

 • 🖨️ Inter Hall tickets NEW...
 • MORE TO VIEW

Friday, 28 December 2018

Kopparapu Kavulu Biography- తెలుగుసాహిత్య అవధానంలో ప్రసిద్ధిచెందిన సోదరకవులు- కొప్పరపు సోదరకవులు - పద్యాల పరుగు వీరులు..! -కొప్పరపు సోదరకవుల గొప్పతనం ధార, ధారణ. తెలుగు సాహిత్యంలోనే కాదు ప్రపంచ సాహిత్య చరిత్రలోనే ఇవి ఎన్నదగినవి. కొప్పరపు కవుల పద్యధాటి నిరుపమానం. వారి వేగం అసమానం. వారి పద్యాల్లోని కవిత్వపు తేజం అనితరసాధ్యం. మహాశుకవులుగా ప్రసిద్ధిపొందారు..తెలుసుకుందాము

కొప్పరపు సోదరకవుల గొప్పతనం ధార, ధారణ. తెలుగు సాహిత్యంలోనే కాదు ప్రపంచ సాహిత్య చరిత్రలోనే ఇవి ఎన్నదగినవి. కొప్పరపు కవుల పద్యధాటి నిరుపమానం. వారి వేగం అసమానం. వారి పద్యాల్లోని కవిత్వపు తేజం అనితరసాధ్యం. మహాశుకవులుగా ప్రసిద్ధిపొందారు. మహావధానులుగా ప్రఖ్యాతమయ్యారు. కుప్పలు కుప్పలుగా పద్యాలను, గంటలు గంటలు మనోవేగంతో చెప్పుకుంటూ వెళ్లేవారు. ఆ కాలంలో వారి సభలకు బండ్లు కట్టుకుని మరీ విరగబడుతూ జనం విచ్చేసేవారు.
Kopparapu Kavulu Biography- తెలుగుసాహిత్య అవధానంలో ప్రసిద్ధిచెందిన సోదరకవులు- కొప్పరపు సోదరకవులు - పద్యాల పరుగు వీరులు..! -కొప్పరపు సోదరకవుల గొప్పతనం ధార, ధారణ. తెలుగు సాహిత్యంలోనే కాదు ప్రపంచ సాహిత్య చరిత్రలోనే ఇవి ఎన్నదగినవి. కొప్పరపు కవుల పద్యధాటి నిరుపమానం. వారి వేగం అసమానం. వారి పద్యాల్లోని కవిత్వపు తేజం అనితరసాధ్యం. మహాశుకవులుగా ప్రసిద్ధిపొందారు..తెలుసుకుందాము
కొప్పరపు సోదర కవులు- కొప్పరపు సుబ్బరాయ శర్మ (12-11-1885 - 29-3-1932) -కొప్పరపు వేంకట రమణ శర్మ (30-12-1887 - 21-3-1942)

ఈ జంటకవులు 1905 నుండి 1927 వరకు 22 ఏళ్లపాటు అవధానాలు, ఆశుకవిత్వం దిగ్విజయంగా నడిపించారు. రాజధాని నగరంతో మొదలు పెట్టి పల్లె టూళ్ల వరకూ కవితా జైత్రయాత్రను సాగించారు. కొప్పరపు కవులు ప్రదర్శనలు నెరపిన అసాధారణ కవితా వేదికలపైన దిగ్గజాలవంటి పండితవరులు పాల్గొనేవారు. కావ్యకంఠ గణపతిముని, వావికొలను సుబ్బారావు, శతఘంటము వెంకటరంగాశాస్త్రి, చెన్నా ప్రగడ భానుమూర్తి, ముదిగొండ నాగలింగశాస్త్రి, వేదం వేంకటరాయశాస్త్రి, వేటూరి ప్రభాకరశాస్త్రి, వసురాయ కవీంద్రుడు, జయంతి రామయ్య పంతులు, కొక్కొండ, కొమర్రాజు లక్ష్మణరావు.. వంటి ధీమాన్యులు కొప్పరపు కవుల అవధానాలలో, ఆశుకవితా ప్రదర్శనలలో ప్రత్య క్షంగా పాల్గొని, ఆ అద్భుతాల్ని కనులారా వీక్షించిన వారే.

కుదురుగా ఒక చోట కూర్చుని, ఒక గంటలో వంద పద్యాలను తప్పుల్లేకుండా చూసి చదవడమే కష్టం. వాటిని భట్టీయం వేసినా, అరవైనిమిషాల్లో పొల్లుపోకుండా అప్పగించడమూ కఠినకార్యమే. అలాంటిది, అప్పటికప్పుడు, అడిగినవెంటనే, తడువులేకుండా, రసస్ఫోరకంగా, ‘‘ఉల్కాపాత సమానవేగమున’’ అన్నట్టుగా మహోన్నత కావ్యాలల్లిన మహాకవులు, మన తెలుగు వెలుగులు కొప్పరపు సోదరకవులు. గంట వ్యవధిలో ఆరేడు వందల పద్యాలను ఆశుధారగా కురిపించి పండిత సభలను ప్రభావిభాసితం చేసిన కారణజన్ములు కొప్పరపు సోదరకవులు. ఆంధ్ర భాష ఉద్ధతిని విస్పష్టం చేసేలా, తెలుగుపద సౌరభాలను నలుదిశలా వ్యాపింపజేసేలా పద్యవిద్యను ప్రదర్శించినవారు కొప్పరపు కవులు. ‘‘కవిత పుట్టిల్లు - సోదర కవుల ఇల్లు’’ అని నాటికాలాన పెద్దలెందరో ఆ కవిద్వయాన్ని ప్రశంసించింది అందుకే. ‘‘పలికిన పలుకులన్నియు పద్యములే’’ అని కూడా వారిని ప్రస్తుతించిన వారు కోకొల్లలు.
Kopparapu Kavulu Biography- తెలుగుసాహిత్య అవధానంలో ప్రసిద్ధిచెందిన సోదరకవులు- కొప్పరపు సోదరకవులు - పద్యాల పరుగు వీరులు..! -కొప్పరపు సోదరకవుల గొప్పతనం ధార, ధారణ. తెలుగు సాహిత్యంలోనే కాదు ప్రపంచ సాహిత్య చరిత్రలోనే ఇవి ఎన్నదగినవి. కొప్పరపు కవుల పద్యధాటి నిరుపమానం. వారి వేగం అసమానం. వారి పద్యాల్లోని కవిత్వపు తేజం అనితరసాధ్యం. మహాశుకవులుగా ప్రసిద్ధిపొందారు..తెలుసుకుందాము

                  కొప్పరపు వేంకటరాయ, సుబ్బమాంబ దంపతులకు వేంకట సుబ్బరాయ కవి 1885 నవంబర్‌ 12న జన్మించారు. వారి సోదరుడు వేంకట రమణ కవి 1887 డిసెంబర్‌ 30న భూమ్మీదపడ్డారు. గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలోని కొప్పరం గ్రామం వీరి జన్మస్థలం. కళ్లు తెరచిన నాటినుంచీ తమ పెద్దలు చెప్పే కవిత్వాన్ని వింటూ, ఆ కవితాసారాన్ని గ్రహిస్తూ పెరిగారు సోదరకవులు. అందుకేనేమో వారి సప్తధాతువుల్లోనూ సారస్వతమే నిండిపోయింది. ఎనిమిదేళ్లకే శతకం చెప్పారు. పన్నెండేళ్ల ప్రాయంలో అష్టావధానం చేశారు. పదహారేళ్లకు అందరూ అచ్చెరువొందేలా శతావధానాన్ని నిర్వహించారు. ఇరవై సంవత్సరాల వయసులో కావ్యాలను రచించారు. అవధానాలు ఒకవైపు. ఆశుకవిత్వం మరోవైపు. జంటకట్టి, గంటకొట్టి జైత్రయాత్ర మొదలెట్టారు. ‘అనుజా వేంకటరమణా ఘనకవితా భరణా’ అని తమ్ములుంగారయిన శ్రీ రమణకవిని తూరుపుతెల్లారగానే అన్నగారు పలకరించేవారు. వెనువెంటనే ‘సుబ్బరాయ కవిరాయా వేగ పద్యాశ్రయా’ అంటూ ఆ తమ్ముడు, అన్నగారి పాదాలకు నమస్కరించేవారు. అదీ ఆ సోదరకవుల నిత్య వ్యవహారం. వారి నడుమ మాటలన్నీ పద్యాలుగానే పొంగిపొరలేవి.
                  సోదరకవుల గొప్పతనం ధార, ధారణ. తెలుగు సాహిత్యంలోనే కాదు ప్రపంచ సాహిత్య చరిత్రలోనే ఇవి ఎన్నదగినవి. కొప్పరపు కవుల పద్యధాటి నిరుపమానం. వారి వేగం అసమానం. వారి పద్యాల్లోని కవిత్వపు తేజం అనితరసాధ్యం. మహాశుకవులుగా ప్రసిద్ధిపొందారు. మహావధానులుగా ప్రఖ్యాతమయ్యారు. కుప్పలు కుప్పలుగా పద్యాలను, గంటలు గంటలు మనోవేగంతో చెప్పుకుంటూ వెళ్లేవారు.
సోదరకవుల పద్యవేగానికి వ్రాయసకాళ్లు నిరుత్తరులైపోయి, కలాలు దించేసి, కాగితాలు పారేసి, కైమోడ్పులు చెల్లిస్తూ, వారి ముఖాలకేసి చూస్తూ ఉండిపోయేవారు.

                  తెలుగునాట గతశతాబ్దపు తొలినాళ్లలో దాదాపుగా ఇరవైయ్యేళ్లపాటు వారి పద్యయాత్ర కొనసాగింది. గద్వాల, పిఠాపురం, చెన్నపట్టణం, బొబ్బిలి తదితర సంస్థానాల్లో వారికి విలువైన సత్కారాలు జరిగాయి. కొన్ని చోట్ల గజారోహణాలు, గండపెండేర గౌరవాలూ దక్కాయి. బొబ్బిలి ఆస్థానంలో అయితే, రెండు చేతులూ ముందుకు చాచి ఆశువుగా కవిత్వం చెప్పడం మొదలెట్టారట సోదరకవులు. తమ గొంతు ఆగిపోతే చేతులు నరుక్కోవచ్చునని ప్రకటించారట. దండనాయకుడు ఎత్తిన కత్తిని అలాగే పట్టుకుని ఉండిపోవాల్సి వచ్చింది. వీరి ఆశుధార మటుకు ఆగనే లేదు. దరిమిలా ఈ కవులకు సన్మానాలు జరిపించి, ప్రణతులు చెల్లించి ప్రభువులు పునీతులయ్యారట.
 
                  కొప్పరపు కవులు ఎంతటి విద్వత్సంపన్నులో అంతటి సచ్ఛీలురు కూడా. రుజువర్తన, క్రమశిక్షణ వీరికి ఆరోప్రాణం. సంస్కారవంతమైన జీవితం, ఆథ్యాత్మిక వర్తన వీరి సొంతం. ఆశుకవిత్వానికి, అవధానాలకే పరిమితం కాకుండా అద్భుతమైన రచనలు చేశారు. వీరు రచించిన దైవసంకల్పం, సాధ్వీ మహాత్మ్యం(కుశలవ నాటకం), శ్రీకృష్ణకరుణాప్రభావం, సుబ్బరాయ శతకం తదితర గ్రంథాలు ఏ తరంలోనయినా తెలుగుభాషను పరిరక్షించే మహాకావ్యాలే. దురదృష్టవశాత్తూ కొప్పరపు సోదరకవుల్లో అగ్రజుడైన సుబ్బరాయ కవి చిన్న వయసులోనే, అంటే నలభై ఆరేళ్లకే ఇహలోకయాత్ర చాలించారు. ఆయన పోయాక తమ్ముడు రమణకవి కూడా జీవమున్నా లేనట్టుగానే కొన్నాళ్లు జీవించారు. ప్రస్తుతానికయితే, ఆ మహాకవుల దౌహిత్రుడు మాచవరం వేంకట చెంచురామ మారుతీ సుబ్బరాయ శర్మ (మా శర్మ) తన తాతల విభవాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కొప్పరపు కవుల కళాపీఠం పేరిట సంస్థను స్థాపించి, సోదరకవుల గ్రంథాలను పునర్ముద్రించడంతో పాటుగా, వారి విగ్రహాలను విశాఖలో ప్రతిష్టించేలా శ్రమించారు. ఆ కవుల పేరిట ప్రతిభామూర్తులకు ప్రతీ ఏటా పురస్కారాలు అందజేస్తున్నారు.
వ్యాస రచయిత
  చింతకింది శ్రీనివాసరావు 

0 comments:

Post a Comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top