Thursday, 27 December 2018

janmabhoomi maavooru guidelines-6వ విడత జన్మభూమి-మా ఊరు (JBMV) మార్గదర్శకాలు-2019, జనవరి 2 నుండి 11 వరకు

6వ విడత జన్మభూమి-మా ఊరు (JBMV) మార్గదర్శకాలు
2019, జనవరి 2 నుండి 11 వరకు

6వ విడత జన్మభూమి-మా ఊరు (JBMV) మార్గదర్శకాలు-2019, జనవరి 2 నుండి 11 వరకు

1. జన్మభూమి-మా ఊరు (JBMV)
1.1 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల వద్దకు పాలనను తీసుకువెళ్ళడానికి, వారి ఇబ్బందులను నివారించడానికి మరియు అభివృద్ధి ప్రణాళికా రచన, అమలు మరియు పర్యవేక్షణలో ప్రజలను క్రియాశీల భాగస్వాములుగా చేసే ఉద్దేశ్యంతో ఐదు విడతల జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఐదు విడతలను 2014, అక్టోబరు 2 నుండి 20 వరకు, 2015లో జూన్ 3 నుండి 7 వరకు, 2016లోజనవరి 2 నుండి 11 వరకు, 2017లోజనవరి 2 నుండి 11 మరియు 2018 జనవరి 2 నుండి 11 వరకు నిర్వహించడం జరిగింది. గ్రామ మరియు కుటుంబ స్థాయిలో (అంటే, కుటుంబ వికాసం(KV), సమాజ వికాసం(SV) కొన్ని హామీలకు చెందిన సంతృప్త విధానంలో అభివృద్ధి మరియు సంక్షేమం యొక్క ఏకీకృత ధృక్పధాన్ని ప్రధానంగా తెలియచేయడానికి మరియు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు మరియు విజన్ 2029 క్రింద లక్ష్యాలను చేరుకోవడానికి కూడా 5వ విడత JBMVను నిర్వహించడం జరిగింది.
1.2 రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారాన్ని కొనసాగిస్తూ, రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు/వార్డులలో  2019, జనవరి 2 నుండి 11 వరకు 6వ విడత జన్మభూమి-మా ఊరు (JBMV) కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.
2. 6వ విడత JBMV కార్యక్రమ ప్రధాన అంశాలు– ప్రధాన లక్ష్యంగా తన ప్రజల సంక్షేమం మరియు సంతోషంతో సమ్మిళిత వృద్ది జరిగేలా చూడటానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. 6వ విడత JBMV కార్యక్రమ ప్రధాన అంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
2.1 ‘వయాడక్ట్’(VIADUCT) ద్వారా అభివృద్ది మరియు వృద్ధి ధృక్పధంపై చైతన్యాన్ని కలిగించడం -‘వయాడక్ట్’ (VIADUCT)కు విస్తరించేవిజన్, వినూత్న కల్పన, జవాబుదారీతనం, డిజిటలైజేషన్, ఊబరైజేషన్, సమగ్ర మరియు సాంకేతిక పరిజ్ఞాన రూపాంతరీకరణ.
2.2 2014 నుండి సాధించిన విజయాలపై అవగాహనను కల్పించడం -అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన  అన్ని సంపదలు మరియు లబ్ధిదారుల జాబితాను (తెలుగులో) ఆర్.టి.జి శాఖ ద్వారా ఏర్పాటు చేయబడిన ఒక ఆన్ లైన్ వేదిక ద్వారానూ మరియు సంబంధిత శాఖలన్నింటి సహాయంతో గ్రామం వారీగా ముందుగానే ముద్రించిన తగినన్ని ప్రతులను గ్రామ సభ ముందు ఉంచాలి. సమాజ వికాసం, కుటుంబ వికాసం మరియు ఎస్.డి.జి క్రింద పనితీరును కూడా గ్రామ సభ ముందు ఉంచాలి.
2.3 2019-24 కాలానికి గ్రామ/వార్డు అభివృద్ధి ప్రణాళిక (VDP/WDP)– గ్రామదర్శిని కార్యక్రమ సమయంలో అన్ని జిపిలు మరియు వార్డులు వచ్చే ఐదు సంవత్సరాలకు సంబంధించిన (2019-2024) VDP/WDPని తయారు చేయడమైనది.  ఆ రోజుటి ఇతివృత్తం ప్రకారం గ్రామ పంచాయతీ/వార్డు సందర్శన సమయంలో మండల స్థాయి టీంల ద్వారా మరియు గ్రామ పంచాయతీ/వార్డు స్టేషనరీ టీం ద్వారా JBMV కార్యక్రమంలోVDP/WDPను చర్చించి, దీనిని తుదిగా ఆమోదించి, గ్రామ పంచాయతీ/వార్డు స్థాయి స్టేషనరీ టీమ్ ద్వారా 2019 జనవరి 11 తేదీన JBMVఆఖరి రోజున విడుదల చేయాలి.
3. JBMV కార్యక్రమం 6వ విడత కార్యకలాపాలు–JBMV 6వ విడత కార్యక్రమంJBMV 5వ విడత మాదిరిగానే, రెండు సెట్ల కార్యకలాపాలను కలిగివుంటుంది.
3.1 కార్యకలాపం ‘A’–మండల స్థాయి బృందంసందర్శన-JBMV కార్యక్రమంలో మండల/మునిసిపల్ బృందం షెడ్యూల్ ప్రకారం గ్రామ పంచాయతీ/వార్డును సందర్శించి, గ్రామ సభలను నిర్వహించి మరియు మండల/మునిసిపాలిటీ యొక్క అన్ని గ్రామ పంచాయతీలు/వార్డులను సందర్శించాలి. మండల స్థాయి సందర్శన బృందానికి సంబంధించిన సూచిత అజెండాను 1వ అనుబంధంలో పొందుపరచడమైనది.
3.1.1 మండల స్థాయి బృందం సృష్టించిన ఆస్తులను సందర్శించి, మధ్యాహ్న సమయంలో గ్రామ నడకను నిర్వహించాలి మరియు మధ్యహ్న సమయంలో గ్రామ సభను నిర్వహించాలి. కల్పించిన మౌలిక సదుపాయాలు మరియు సంపదలను తనిఖీ చేసి, శంఖు స్థాపన చేయడానికి, ప్రారంభోత్సవాలు మొదలైనవి ఏవైనా ఉంటే వాటిని నిర్వహించడానికి ఈ గ్రామ నడకను నిర్వహించాలి. స్వచ్ఛ సంక్రాంతిని జరుపుకునేలా చూడటానికి ఓడిఎఫ్ మరియు ఓడిఎఫ్ +స్థితిని కూడా  గ్రామ నడక సమయంలో సమీక్షించాలి.
3.1.2 2014, జూన్ నుండి అన్ని శాఖల యొక్క అన్ని పథకాలకు చెందిన లబ్ధిదారుల జాబితాను తెలుగులో తయారు చేసి, దానిని మండల స్థాయి బృందం మరియు గ్రామ స్థాయి బృందానికి లభ్యంగా ఉండేటట్లు చేయాలి. మరియు దానిని పారదర్శకత మరియు చర్చ కోసం ప్రజల సమక్షంలో ఉంచాలి. జిల్లా కలెక్టరు ముందుగానే సరిపడినన్ని ప్రతులను ముద్రించి మరియు పంపిణీ చేసేలా చూడాలి.
3.1.3 సమావేశ సమయంలో చర్చించడం కోసం వివిధ కార్యక్రమాలపై జిపి/వార్డు స్థాయి సంతృప్తి సర్వే నివేదికను ఆర్.టి.జె.ఎస్ శాఖ సమకూర్చవలసి ఉంటుంది.
3.1.4 ప్రదర్శన– 2014 నుండి సాధించిన విజయాలను మరియు తదుపరి 5 సంవత్సరాలకు సంబంధించినVDP/WDPను ప్రధానంగా తెలియజేయడానికి మండల బృందం సందర్శించే రోజున ఒక ప్రదర్శనను నిర్వహించాలి.
3.2 కార్యకలాపం‘B’–గ్రామ పంచాయతీ/వార్డు లన్నింటిలో ఆ రోజుటి ఇతివృత్తంపై గ్రామ పంచాయతీ/వార్డు స్థాయి రోజువారీ చర్చ కోసంగ్రామ పంచాయతీ/వార్డుస్టేషనరీ టీమ్- ఈ కార్యకలాపాన్ని JBMV 5వ విడత సమయంలో ప్రారంభించడం జరిగింది. ఇది కొనసాగుతుంది. ఇందులో గ్రామ పంచాయతీ/వార్డు స్థాయిలో సంబంధిత అప్పగించిన ఇతి వృత్తాలపై ప్రతీ రోజూ చర్చించడమవుతుంది.
గ్రామ పంచాయతీ/వార్డు బృందం, JBMV కార్యక్రమం ఆసాంతం సంబంధిత గ్రామ పంచాయతీ/వార్డు స్థాయిలో ప్రతి రోజు సమావేశాలను నిర్వహించాలి మరియు ఆ రోజుకు చెందిన శ్వేత పత్రం ఇతి వృత్తంపై చర్చలు జరపాలి మరియు ప్రధాన సూచికలపై 2014, జూన్ నుండి సాధించిన విజయాలను, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (SDG), KV,SVమరియు శ్వేత పత్రం/రోజు వారీ ఇతివృత్తానికి సంబంధించి విజన్ 2029 లను సమీక్షించాలి. ప్రధాన సవాళ్ళు, కీలక అంశాలు, అత్యున్నత అభ్యాసాలు, జాతీయ/అంతర్జాతీయ అవార్డులు మరియు బెంచ్ మార్కులపై కూడా చర్చ కేంద్రీకరించాలి. సదరు చర్చను పర్సన్ ఇన్ ఛార్జ్ మరియు/లేదా గ్రామ కార్యదర్శి నిర్వహించాలి మరియు అట్టి ఇతివృత్తానికి విద్యార్ధులకు మరియు అనుబంధ గ్రామస్థాయి ఉద్యోగులు దానికి సహకరించాలి. శాఖలతో సంబంధం లేకుండా విఇఓ, విఆర్ఓ, ఉపాధ్యాయులు, వ్యవసాయ అధికారి, గ్రామ సహాయకుడు, పశువైద్యాధికారి, బిల్ కలెక్టరు, శానిటరీ ఇన్పెక్టరు వంటి గ్రామస్థాయి/వార్డు స్థాయి అధికారులందరూ ఆశా వర్కర్లు, ఎ.ఎన్.ఎం, ఎ.డబ్ల్యుడబ్ల్యు, సాధికార మిత్రాలు, ఎన్.ఆర్.టిలు మరియు ఇతరులు, సంబంధిత గ్రామ పంచాయతీ/వార్డులలో ఈ కార్యక్రమానికి రోజూ హాజరుకావాలి.
3.2.1 బహుళ రంగాలకు చెందిన బృందాలు (MDTs) -4 నుండి 5 గురు విద్యార్ధులు మరియు ఉన్నత విద్యా శాఖ మరియు ఏపిఎస్ సి.హెచ్.ఇ చే ఏర్పాటు చేయబడిన ఒక బృందంమరియు నాయకుడుగా ఉన్నట్టి ఫ్యాకల్టీ సభ్యునితో కూడుకొని ఉన్నట్టి బహుళ రంగాలకు చెందిన బృందాలు (MDTs) గ్రామ పంచాయతీ/వార్డు బృందాలకు సహాయపడతాయి.
3.2.2 రోజూవారీ తాత్కాలిక అజెండా 2వ అనుబంధంలో ఉంది. కాగా, చర్చను నడిపించడానికి బాధ్యత వహించే రోజువారీ ఇతివృత్తాలు, శాఖలు 3వ అనుబంధంలో ఉన్నాయి.
3.2.3 గ్రామ/వార్డు స్థాయిలో ఈ కార్యకలాపాన్ని సమన్వయపరచడానికి గాను ప్రతీగ్రామ పంచాయతీ/వార్డుకు ఒక కార్యక్రమ నిర్వహణ కమిటీని జిల్లా కలెక్టర్లు ఏర్పాటు చేయాలి. ఈ కార్యక్రమాన్ని సమన్వయపరచడానికి సీనియర్ ఉపాధ్యాయుని సేవలను కూడా తీసుకోవాలి.
3.2.4 సంబంధిత శాఖ, రోజువారీ ఇతివృత్తంపై చర్చకు వీలుకల్పించడానికి శ్వేత పత్రానికి సంబంధించిన అవసరమైన గత సమాచారం మరియు సారాంశాన్ని సమకూరుస్తుంది.
3.2.5 రోజువారీ ఇతివృత్తంపై గౌరవ ముఖ్యమంత్రి ప్రజలకు ప్రతి రోజూ ఒక ప్రత్యక్ష సందేశాన్ని ఇస్తారు. అందుచేత, ప్రతీ జిపిలోని వేదిక వద్ద ఒక తెరను ఏర్పాటు చేయాలని మరియు గౌరవ ముఖ్యమంత్రిగారి సందేశాన్ని ప్రత్యక్షంగా ప్రసారం చేయడానికి ఏర్పాటు చేయాలని ఆదేశించడమయింది. తెరను ఏర్పాటు చేసి, ప్రత్యక్ష ప్రసారాన్ని అనుసంధానం చేయడానికి ఏపి ఫైబర్ నెట్ కార్పొరేషన్ సహాయాన్ని అందించి, అవసరమైన ఏర్పాట్లను చేస్తుంది.
3.2.6 గ్రామ నడక - ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు, ఆస్తులను తనిఖీ చేయడానికి, శంఖుస్థాపనలు చేయడానికి ప్రారంభోత్సవాలు మొదలగు వాటి నిమిత్తం JBMV సమయంలో ప్రధానంగాగ్రామం/వార్డు బృందంతో పాటుగా మండల బృందం సందర్శించే రోజున గ్రామ నడకను చేపట్టాలి. స్వచ్ఛ సంక్రాతిని జరుపుకొనే ఉద్దేశంతో గ్రామ నడక సమయంలో ఓడిఎఫ్ మరియు ఓడిఎఫ్ + స్థితిని  కూడా సమీక్షించాలి.
3.2.7 స్థానిక బృందాలు, కళాజాత బృందాలను వినియోగించుకొంటూ ప్రతి గ్రామంలో ఒక రోజున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి. JBMV కార్యక్రమం సమయంలో అన్ని గ్రామ పంచాయతీలు, వార్డులలో చేయడానికి అవసరమైనన్ని కళాజాత బృందాలను పర్యాటక, సాంస్కృతిక శాఖ పంపాలి. పర్యాటక శాఖ కళాజాత బృందాల విషయాంశం,JBMV యొక్క ముఖ్యాంశాలకు సంబంధించినదై ఉండేలా చూడాలి.
3.2.8 గ్రామ స్థాయి పోటీలు: అంతేకాకుండా, విద్యా శాఖతో సంప్రదించి సాంస్కృతిక శాఖ ప్రతి గ్రామ పంచాయతీ/వార్డులో ముఖ్యంగాJBMV చివరి తేదీన అనగా, 2019, జనవరి 11 తేదీన చర్చ/వ్యాసరచన/చిత్ర లేఖనం/రంగోలి వంటి పోటీలను నిర్వహించాలి.
3.2.9 అవార్డులు : గ్రామ అభివృధి ప్రణాళికను గ్రామ దార్శనికత పత్రంగా చేపట్టడంతో పాటుగా పర్యాటక, సాంస్కృతిక శాఖ JBMV చివరి తేదీన అనగా 2019, జనవరి 11వ తేదీన వివిధ పోటీలలో గెలిచిన విజేతలకు అవార్డులను ఇవ్వాలి.
3.2.10 పుడ్ ఫెస్టివల్– పర్యాటక, సాంస్కృతిక శాఖ జారీ చేయనున్న మార్గదర్శకాల ప్రకారం ఒక రోజున పుడ్ ఫెస్టివల్ ను నిర్వహించాలి.
3.3 5 కె రన్– 2019, జనవరి 6రవ తేదీ, ఆదివారం ఉదయం 6:30 గంటల నుండి 7 :30 గంటల వరకు ప్రతి మండల ప్రధాన కార్యస్థానం మరియు మునిసిపాలిటీలో 5 కె రన్ ను నిర్వహించాలని నిర్ణయించడమయింది. ఈ రన్ కోసం జిల్లా కలెక్టర్లు అవసరమైన ఏర్పాట్లు చేయాలి.
3.4 ఫిర్యాదులు– సామాజిక, వ్యక్తిగత అంశాల రెండింటికి సంబంధించిన ఆర్థికేతర ఫిర్యాదులను JBMV కార్యక్రమం సమక్షంలోనే పరిష్కరించబడేలా చూడాలని అన్ని శాఖలను కోరడమయింది.
3.4.1 మండల బృందం సందర్శన కంటే ముందే గ్రామం/వార్డు స్థాయి బృందం ఇబ్బందులకు సంబంధించిన విజ్ఞప్తులను స్వీకరించడాన్ని ప్రారంభించి, సౌకర్యార్ధం వాటిని ముందుగానే అందుబాటులో వుండే విధంగా సంకలనం చేయాలని ప్రతిపాదించడమయింది.
3.4.2 సంబంధిత తహసీల్దారు/ఎంపిడిఓ(మండలం/వార్డు స్థాయి బృందం నాయకుడు) ఫిర్యాదులను స్వీకరించి, ప్రతి ఫిర్యాదులుకి సంబంధించిన దరఖాస్తును స్కాన్ చేసి, ఆర్.టి.జి శాఖ సమకూర్చిన వెబ్ పోర్టల్ లో అప్ లోడ్ అయ్యేలా చూడటానికి బాధ్యత కలిగివుంటారు. ఫిర్యాదులుకి సంబంధించిన దరఖాస్తులో దరఖాస్తుదారుని ఆధార్ సంఖ్యను తీసుకోవాలి.
3.4.3 రోజువారీ ప్రాతిపదికన (అదే రోజు సాయంత్రం) అన్ని ఫిర్యాదుల వివరాలను అప్ లోడ్ చేయాలి.
3.4.4 ఫిర్యాదుల పరిష్కారాన్ని రోజువారీ ప్రాతిపదికన పర్యవేక్షించడమవుతుంది. సంబంధిత శాఖలు, జిల్లా పరిపాలనాయంత్రాంగం ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించిన తదనంతర చర్యలను పరిశీలించాలి.
3.4.5 ఈ విషయంలో ఐటిఇ &సి శాఖ కార్యదర్శి/సిఇఓ ఆర్.టి.జి సవివర మార్గదర్శకాలను జారీ చేస్తారు.
3.4.6 జిల్లా పరిపాలనా యంత్రాంగం ప్రస్తుత JBMV కార్యక్రమం ప్రారంభానికి ముందే మునుపటి JBMV విడతలలో పెండింగులో ఉన్న అన్ని ఫిర్యాదులు పరిష్కరించబడేలా చూడాలి.
3.5 కార్య విధానపరమైన– మార్గదర్శకాలు
3.6 కార్యక్రమం కాలవ్యవధి– కార్యక్రమం కాలవ్యవధి 2019, జనవరి 2వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఉంటుంది. గ్రామ పంచాయతీ/వార్డు సందర్శనలు 2019, జనవరి 2వ తేదీన ప్రారంభమై 2019, జనవరి 11వ తేదీ వరకు కొనసాగుతాయి.
3.7 వర్తింపు – జిల్లా కలెక్టరు ప్రతి మండలం/మునిసిపాలిటీ కోసం ప్రతీ బృందం రోజుకు ఒక గ్రామ పంచాయతీ/వార్డు చొప్పున కార్యక్రమం సమయంలో అన్ని గ్రామపంచాయతీలు/వార్డులు సందర్శించడానికి అవసరమైన సంఖ్యలో బృందాలను ఏర్పాటుచేయాలి. చాల చిన్న గ్రామ పంచాయతీ/వార్డు ఉన్న అసాధారణ పరిస్థితులలో జిల్లా కలెక్టరు నిర్ణయించదగు విధంగా ప్రతీ బృందం/ రోజుకు రెండు గ్రామ పంచాయతీలు/వార్డుల చొప్పున కార్యక్రమాన్ని రూపొందించవచ్చు.
3.8 సందర్శన షెడ్యూలు – జిల్లా కలెక్టర్లు ప్రతి బృందం యొక్క షెడ్యూలును ముందుగానే తయారు చేయాలి. గ్రామపంచాయతీ/వార్డు సందర్శనల షెడ్యూలుకు విస్తృత ప్రచారాన్ని కల్పించాలి. అంతేగాక సంబంధిత గ్రామ పంచాయతీలు/వార్డులకు బాగా ముందుగానే తెలియజేయాలి. సమాచారం కోసం మరియు సందర్శనలను పర్యవేక్షించడం కోసం ఆర్.టి.జి యొక్క నిర్దేశిత వెబ్ సైట్ లో కూడా షెడ్యూలును అప్ లోడ్ చేయాలి.

3.9 సందర్శన బృందాలు
3.9.1 మండల స్థాయి సందర్శన బృందం – బృందానికి ఎంపిడిఓ, తహసీల్దార్ మొదలగువంటి సీనియరు మండల స్థాయి అధికారులు నేత్రుత్వం వహించాలి. క్షేత్ర స్థాయి ఆవశ్యకతను బట్టి జిల్లా కలెక్టరు మండల స్థాయి అధికారులను అర్ధవంతంగా బృందాల మధ్య పంపిణీ చేయాలి. ఆ విధంగా ఏర్పాటు చేయబడిన బృందాలు అన్ని ముఖ్యమైన శాఖలకు మండలస్థాయి బృందాల రెండింటికి (అన్నింటికీ) ప్రాతినిధ్యం వహిస్తాయి. గ్రామ స్థాయి అధికారులైన పంచాయతీ కార్యదర్శి, వి.ఇ.ఓ, వి.ఆర్.ఓ, వ్యవసాయ అధికారి, పశువైద్య అధికారి అందరూ సంబంధిత గ్రామ పంచాయతీలలోని జెబి కార్యక్రమానికి హాజరుకావాలి. అధికారులతో పాటుగా ఆశావర్కర్లు, ఎఎన్ఎం, ఎడబ్ల్యుడబ్ల్యు, స్మార్ట్ విలేజ్ పార్ట్¬నర్లు, సాధికార మిత్రాలు, ఎన్.ఆర్.టిలు మరియు  జిల్లా కలెక్టరు అవసరమని అభిప్రాయపడినట్లుగా ఎవరేని ఇతర సిబ్బందిని బృందంలో చేర్చుకోవచ్చును.
3.9.2 మండల స్థాయి బృందం సభ్యులందరూ ఆయా సందర్భాన్నిబట్టి ఎంపిడిఓ లేదా తహసీల్దారు ఆధ్వర్యంలో కలిసికట్టుగాపంచాయతీలన్నింటిని, గ్రామాలన్నింటిని సందర్శిస్తారు.
3.9.3 పట్టణ బృందం – జిల్లా కలెక్టర్లతో సంప్రదించి మునిసిపల్ కమీషనర్లు కార్యక్రమం సమయంలో ప్రతి మునిసిపాలిటీలో గల వార్డులన్నింటిన సందర్శించడానికి అవసరమైనన్ని బృందాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది.
3.9.4 మునిసిపల్ వార్డు /మునిసిపల్ కార్పొరేషను కమిటీ కూడా కార్యక్రమంలో పాల్గొంటుంది. వార్డు సభ్యుడు, బిల్లు కలెక్టరు, శానిటరీ ఇన్పెక్టరు, జూనీయరు ఇంజనీరు, స్మార్ట్ వార్డు పార్ట్¬నర్లతో కూడిన బృందం సభ్యులు మరియు సంబంధిత ఇతర అధికారులు మునిసిపల్ కమీషనరు నాయకత్వంలో కలిసినట్లుగా మునిసిపల్ పట్టణాలలోని వార్డులన్నింటిని సందర్శిస్తారు.
3.10 ఇతి వృత్తం ఆధారిత చర్చ కోసం గ్రామపంచాయతీ/వార్డు స్థాయి స్టేషనరీ బృందం- గ్రామ కార్యదర్శి/పర్సన్ ఇన్ ఛార్జ్ గ్రామ స్థాయిలో అనుబంధంలో పేర్కొన్న విధంగా ఇతివృత్త అనుసంధాన వ్యక్తుల చర్చను సమన్వయపర్చాలి. జిల్లా కలెక్టరు సంబంధిత లైను శాఖల గ్రామ/వార్డు స్థాయి అధికారులు గ్రామపంచాయతీ/వార్డు స్థాయిలో కార్యక్రమాన్ని సమన్వయపర్చేలా చూడాలి.
3.10.1 ఆ రోజున గల ఇతివృత్తంపై చర్చ జరపడానికి ప్రధానోపాధ్యుడు లేదా ఉపాధ్యాయుడు లేదా ఎండిటి సభ్యుడు లేదా శాఖ స్థాయి అధికారి రిసోర్స్ పర్సన్ గా వ్యవహరహించాలి. ఈ రిసోర్స్ పర్సన్¬కు సంబంధిత శాఖలు ముందుగా శిక్షణ ఇవ్వాలి. శ్వేత పత్రం సంక్షిప్తిని నేపధ్యాంశంగా ఉపయోగించుకోవాలి.
3.10.2 మండల స్థాయి సందర్శన బృందం కార్యక్రమం మరియు గ్రామ స్థాయి ఇతి వృత్త ఆధారిత చర్చ మధ్య అతివ్యాప్తంగా ఉంటుంది. కార్యకలాపాల రెండింటి అజెండాకు తగిన వర్తింపు ఉండేలా చూస్తూ ఏకకాలంలో జరపడానికి ఈ రెండు కార్యక్రమాలను సమన్వయపరచవలసినదిగా కొరడమైనది.
4. వివిధ స్థాయిలలో బాధ్యత గల అధికారులు
4.1 జిల్లా పంచాయతీ అధికారి మరియు JBMV కార్యక్రమం సమన్వయం కోసం ఏర్పాటయిన జిల్లాల స్థాయి కమిటీ మద్దతుతో జిల్లా స్థాయిలో కార్యక్రమానికి జిల్లా కలెక్టరు బాధ్యత వహిస్తారు.
4.2 సాధారణ పరిపాలన శాఖచే నియమించబడిన సీనియర్ అధికారులు నిర్దేశిత రెవెన్యూ డివిజను స్థాయిలో కార్యక్రమం నిర్వహణ కోసం బాధ్యత వహిస్తారు.
4.3 సంబంధిత మండలాల స్థాయిలో JBMV కార్యక్రమం నిర్వహణ కోసం మండల అభివృద్ధి అధికారి మరియు మునిసిపాలిటీ స్థాయిలో JBMV కార్యక్రమం నిర్వహణ కోసం మునిసిపల్ కమీషనరు బాధ్యత వహిస్తారు. ఈ అధికారులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మరియు విజయవంతంగా నిర్వహించడానికి అన్ని విధాలా బాధ్యతవహిస్తారు.
4.4 జిల్లా కలెక్టరు జన్మభూమి – మా ఊరు కార్యక్రమంలో ప్రతిరోజూ పై కార్యక్రమాలలో పాల్గొనడానికి విద్యావేత్తలు, ప్రముఖ వ్యక్తులు/విషయాంశ నిపుణులను ఆహ్వానించేలా చూడాలి.
4.5 జిల్లా కలెక్టరు JBMV కార్యక్రమంలో క్రియశీలక భాగస్వామ్యం కోసం ఎన్.ఆర్.టిలు/ఎన్.ఆర్.ఐలను ఆహ్వానించేలా చూడాలి.
4.6 ఇతి వృత్తాలు మరియు శ్వేత పత్రాలపై చర్చ కోసం నేపధ్య అంశాన్ని సంబంధిత శాఖలు సమకూర్చాలి. గ్రామ స్థాయిలో చర్చ కోసం శ్వేత పత్రం సంక్షిప్తిని తెలుగులో 2/3 పుటలలో శాఖ సమకూర్చాలి మరియు గ్రామ స్థాయి రిసోర్స్ పర్సన్¬కు శిక్షణను ఇచ్చేలా  కూడా చూడాలి.
4.7 సంబంధిత జిల్లా కలెక్టరు మరియు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/ ముఖ్యకార్యదర్శి జన్మభూమి కార్యక్రమ సమయంలో ఆరోగ్య శిబిరాలు మరియు పశువైద్య శిబిరాలు నిర్వహించేలా చూడాలి.
4.8 పర్యాటక సాంస్కృతిక శాఖ కార్యదర్శి అన్ని గ్రామపంచాయతీలు/వార్డులలో సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఇతర పోటీలను మరియు నిర్ణయించిన స్థాయిలో ఆ మేరకు పుడ్ ఫెస్టివల్స్ ను సమన్వయపర్చేలా చూడాలి.
4.9 ముఖ్యకార్యదర్శి/సిఇఓ ఆర్.టి.జి శాఖ JBMV నిర్వహణకు సంబంధించిన రోజువారీ సమాచారం సేకరణ కోసం వేదికను ఏర్పాటు చేసి, ఆస్తులు, లబ్ధిదారుల జాబితాను సవివరంగా సంగ్రహపర్చడం జరుగుతుంది.
4.10 ఉన్నత విద్యా శాఖ MDT మరియు ఫ్యాకల్టీ సభ్యుల నియామకం, శిక్షణ, సమన్వయం కోసం బాధ్యత వహిస్తుంది.
4.11 యువజనాభ్యుదయం, క్రీడల శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి క్రీడా కార్యక్రమాలను సమన్వయపర్చాలి.
4.12 పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి VDP గ్రామస్థాయి చర్చ మరియు ఆఖరి రోజున దాని పాటింపు కోసం బాధ్యత వహిస్తారు.
4.13 MA&UD శాఖ ముఖ్యకార్యదర్శి WDP వార్డు స్థాయి చర్చ మరియు ఆఖరి రోజున దాని పాటింపు కోసం బాధ్యత వహిస్తారు.
5. JBMV కార్యక్రమాన్ని పర్యవేక్షించడం.
5.1 జిల్లా స్థాయి కంట్రోలు రూం – జిల్లా కలెక్టర్లు ఆర్.టి.జి తో సంప్రదించి జిల్లా స్థాయిలో కమాండ్ కంట్రోలు రూమ్ ను ఏర్పాటు చేయాలి. ఇది JBMV కార్యక్రమం వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు/వార్డులలో బృందాల కార్యకలాపాలను నిశితంగా పర్యవేక్షిస్తూ, సందదర్శనలను సమన్వయపరుస్తుంది. సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి మరియు డేటాను సాఫీగా ప్రసారం చేయడానికి ప్రతి జిల్లా స్థాయి కంట్రోలు రూమ్ కు ఆర్.టి.జి ఒక వ్యక్తిని నామినేటు చేయాలి.
5.2 ఉన్నత విద్యాశాఖ ఒక జిల్లా అనుసంధాన అధికారిని నామినేటు చేయాలి. ఈయన MDTల ఏర్పాటు, శిక్షణ మరియు MDTల కార్యకలాపాలను సునిశితంగా పర్యవేక్షిస్తారు. జిల్లా అనుసంధాన అధికారి జిల్లా కలెక్టరుకు రిపోర్టు చేయాలి.
5.3 రాష్ట్ర స్థాయి కంట్రోలు రూం : ప్రణాళిక శాఖ, ఆర్.టి.జి.ఎస్ శాఖల నుండి అధికారులతో ఆర్.టి.జి కేంద్రంలో (మొదటి అంతస్తు, బ్లాక్-I, సచివాలయం) ఒక రాష్ట్ర స్థాయి కంట్రోలు రూంను ఏర్పాటు చేయడమవుతుంది. ఇతి వృత్తులన్నింటికి చెందిన శాఖలను నిర్ధిష్ట తేదిన రాష్ట్ర స్థాయి కంట్రోలు రూంకు ఒక సీనియరు అధికారిని పంపవలసిందిగా కోరడమయింది. ప్రణాళిక, ఆర్.టి.జి శాఖ సిబ్బందిని సంప్రదించవలసిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
1. ఎ. కాళీ ప్రసాద్, జూయింట్ డైరెక్టర్ – ప్రణాళిక శాఖ-9849901508
2. డి. శ్రీనివాసరావు, డిప్యూటీ డైరెక్టర్– ప్రణాళిక శాఖ – 9989774481
3. కె. సత్యనారాయణ, అసిస్టెంట్ డైరెక్టర్– ప్రణాళిక శాఖ – 9100797133
4. ఎస్. భీమరాజు, రీసెర్చ్ ఆఫీసర్ – ప్రణాళిక శాఖ – 9948227721
5. ప్రణాళిక శాఖ మెయిల్ ఐడి –planning7department@gmail.com
6. ఎస్. ఇందు వరప్రసాద్, ప్రాజెక్టు మేనేజరు – ఆర్.టి.జి.ఎస్ –seerla.indhu@gmail.com
7. జె. రామ్, ప్రాజెక్టు కోఆర్డినేటర్ –ram.janyavula@gmail.com
8. కాల్ సెంటర్ (ఆర్.టి.జి) : 1100
6. ప్రచారం–ప్రభుత్వ కార్యక్రమాలలో సాధించిన విజయాలను  మరియు పంచాయతీ/వార్డులలో VDP/WDPలను అన్ని గ్రామ పంచాయతీలు/వార్డులలో గోడ వ్రాతలు /ప్లెక్సీలు, శ్వేత పత్రాలపై చర్చకు సంబందిత మెటీరియల్ మరియు ఇతర కరపత్రాల ముద్రణ, పంపిణీI&PR శాఖ బాధ్యత వహిస్తుంది. రాష్ట్ర స్థాయి ప్రభుత్వ విజయాలను సైతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ ప్రదేశాలలో ప్రదర్శించడమవుతుంది.
7. బడ్జెట్ సంబంధ మద్దతు –JBMV కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం ప్రతి జిల్లాకు రూ.1.00 కోటి మొత్తాన్ని సమకూర్చడమయింది.
8. డేటా సేకరణ, ప్రసారం– ఆర్.టి.జి శాఖ సవివర మార్గదర్శకాలు, కార్యవిధానాలను విడిగా జారీ చేయడమవుతుంది. ఏమైనప్పటికీ డేటా సంక్షిప్తిని రోజూ సాయంత్రం 6 గంటలకు అప్ లోడ్ చేయాలి. ఆర్.టి.జి శాఖ JBMV కార్యక్రమం పనితీరు ఆధారంగా గ్రామ పంచాయతీ/వార్డును వర్గీకరిస్తుంది.
9. సాధారణ సూచనలు
9.1 జన్మభూమి – మా ఊరు కార్యక్రమంపై శాఖలన్నింటికి జిల్లా స్థాయిలో పునఃశ్చరణ కార్యక్రమాన్ని నిర్వహించడమవుతుంది.
9.2 జిల్లా కలెక్టర్,SDG, SV, KV, గ్రామాభివృద్ధి ప్రణాళికలు, సన్నాహక కార్యకలాపాలు, ఇబ్బందుల నివారణ మున్నగువంటి రోజువారీ ఇతి వృత్త ఆధారిత చర్చకు సన్నద్ధత కోసం పట్టణ స్థాయి / మండల స్థాయి బృందాలన్నింటికి గ్రామ స్థాయిలో జన్మభూమి – మా ఊరు కార్యక్రమంపై శిక్షణ నిర్వహించాలి.
9.3 జన్మభూమి ప్రస్తుత విడత యొక్క ముఖ్యాంశాలు మరియు వారి పాత్ర, బాధ్యతలపై అవగాహన కల్పించడానికి గ్రామం/వార్డు అధికారులందరికీ మండల / మునిసిపల్ స్థాయిలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించేలా కూడా జిల్లా కలెక్టరు చూడాలి.
9.4. జిల్లా కలెక్టరు గ్రామ పంచాయతీయ వార్డు కోసం మండల స్థాయిలో రిసోర్స్ పర్సన్¬ను గుర్తించడమవుతుంది. మండల స్థాయిలో ఇతర నోడల్ అధికారులతో పాటుగా సంబంధిత శాఖలచే ఇతి వృత్తాలు/శ్వేత పత్రాలపై శిక్షణను ఇవ్వడమవుతుంది.
9.5 వ్యయాన్ని అభిలషణీయంగా వినియోగించుకోవడానికి వీలుగా తగిన పరిమాణంలో మండలం/మునిసిపల్ బృందం ఒకే ఒక వ్యాన్/వాహనంలో ప్రయాణించాలి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం నెలలో సందర్శన కోసం అవసరమైన వాహనాలను అద్దెకు తీసుకోనగలరు.
9.6 కార్యక్రమం సమయంలో ఇబ్బందులు మరియు ఇచ్చిన ఏవేని అభ్యర్ధనలను పరిష్కరించడానికి అవసరమైన ఏదేని ఆర్థిక అవసరతను సాధారణంగా సంబంధిత శాఖల రెగ్యులరు బడ్జెట్ ల నుండి మాత్రమే వ్యయాన్ని భరించడమవుతుంది.
9.7 జిల్లా కలెక్టర్లందరూ కార్యక్రమం నిర్వహణపై రోజూవారీగా ఆ రోజు ముగింపు సమయానికి సమాచారాన్ని ఈ ఉద్దేశం కోసం అభివృద్దిపర్చిన వెబ్ సైట్ లో సమకూర్చడానికి ఏర్పాట్లు చేయాలి.
9.8 లక్ష్యాలను సాకారం చేసుకోవడానికి, కార్యక్రమం ఇతివృత్తం, విషయంశాలను అనుసరించాలని మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగ అయిన సంక్రాంతి పండుగగా పరిణమిస్తున్నట్టిపండుగ స్పూర్తితో కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్లందరికి సలహా ఇవ్వడమయింది. ప్రజలు, ప్రజా ప్రతినిధులు, గ్రామ స్థాయి అధికారులు మొదలగు వారందరిని తగురీతిగా భాగస్వాములను చేస్తూ అన్ని గ్రామపంచాయతీలు/ వార్డులలో కూచిపూడి, రంగోలి, ఫుడ్ పెస్టివల్స్, గ్రామీణ క్రీడలు మొదలగువాటిని నిర్వహించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ సుసంపన్నమైన సంప్రదాయం, సంస్కృతిని ప్రతిబింబింపచేయాలి.
అనిల్ చంద్ర పునేఠ
                                                                           ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి


అనుబంధం –I
కార్యకలాపం –A క్రింద మండల/మునిసిపల్ స్థాయి సందర్శన బృందం కోసం సూచిత అజెండా
(ఎ) గ్రామ నడకన
(బి) ఈ క్రింద సూచించిన ఎజెండా ప్రకారంగా గ్రామ సభ.
వరుస సంఖ్య
అజెండా
కాల వ్యవధి
1
ప్రార్ధన
5 నిమిషాలు
2
కార్యక్రమం యొక్క ఎజెండా రూపు రేఖ
5 నిమిషాలు
3
గౌరవ ముఖ్యమంత్రి సందేశం
10 నిమిషాలు
4
JBMV ప్రతిజ్ఞ
5 నిమిషాలు
5
లబ్ధిదారులు మరియు సృష్టించిన ఆస్తుల జాబితాను ప్రకటించడంతో పాటు వివిధ కార్యక్రమాల క్రింద ప్రభుత్వం సాధించిన లక్ష్యాల ప్రగతి
30 నిమిషాలు
6
రోజువారి ఇతి వృత్తం, శ్వేత పత్రాలకు సంబంధించిన చర్చ
30 నిమిషాలు
7
గ్రామీణాభివృద్ధి ప్రణాళిక/వార్డు అభివృద్ధి ప్రణాళికపై చర్చ
30 నిమిషాలు
8
కార్యక్రమం సంతృప్తి సర్వే నివేదిక
10 నిమిషాలు
9
ఫిర్యాదులపై (ATR) తీసుకున్న కార్యాచరణ నివేదిక
10 నిమిషాలు
10
వివిధ శాఖలలో సాధించిన లక్ష్యాలపై ప్రదర్శన

కార్యక్రమానికి సమాంతరంగా
11
i. ఆరోగ్య శిబిరాలు
కార్యక్రమానికి సమాంతరంగా

ii. పశువైద్య శిబిరాలు


అనుబంధం –II
కార్యరూపం –Bక్రింది జిపి/వార్డు స్థాయి బృందం సూచిత అజెండా.
వరుస సంఖ్య
అజెండా

రోజువారీ కార్యకలాపం
1
ప్రార్థన
2
గౌరవ ముఖ్యమంత్రి సందేశం  (ప్రత్యక్ష ప్రసారం)
3
రోజువారీ ఇతివృత్తం మరియు శ్వేతపత్రంపై చర్చ మరియు  రోజువారీ ఇతివృత్తానికి సంబంధించి లబ్దిదారునితో చర్చ

జనవరి 11, 2019 తేదీన ఒకసారి 6వ విడత JBMV
1
సాంస్కృతిక కార్యక్రమం
2
చర్చ/వ్యాసరచన/చిత్ర లేఖనం వంటి గ్రామ పంచాయతీ/వార్డు స్థాయి పోటీలు
3
ముగ్గుల పోటీలు







అనుబంధం –III
02-01-2019 నుండి 11-01-2019 వరకు 2019 మా ఊరు  6వ విడత జన్మభూమి – ప్రతిపాదిత అంశాలు
వరుస సంఖ్య
తేదీ
విషయం
విషయ కో-ఆర్డినేటరు / మద్ధతు శాఖలు
1
02-01-2019
VIADUCTరాష్ట్ర పునర్ వ్యవస్థీకరణపై కరపత్రాల విడుదల
·         రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ విషయాలు
శ్రీ ప్రేమ చంద్రారెడ్డి, ముఖ్యకార్యదర్శి (ఇ.ఓ) ఎస్.ఆర్
2
03-01-2019
రాష్ట్ర ఆర్థిక విషయాలు, ఆర్థిక వృద్ధి
·         రాష్ట్ర ఆర్థిక అంశాలు
·         ఆర్థిక వృద్ధి
కార్యదర్శి,ప్రణాళిక శాఖ,
ఆర్థిక శాఖ కార్యదర్శి (ఇఓ)
3
04-01-2019
ప్రజల సంతృప్తిని పెంచడంతో పాటు సాంఘిక సాధికారత మరియు సంక్షేమం.
ప్రత్యక్ష ప్రయోజనం
·         100 శాతం రేషను
·         ఎన్.టి.ఆర్ భరోసా పింఛనులు
·         చంద్రన్న బీమా
·         చంద్రన్న పెళ్లికానుక
·         గృహనిర్మాణం
·         స్కాలర్ షిప్పులు, హాస్టళ్ళు
·         జన్మభూమి
·         ఆదరణ
సేవలు
·         అన్న క్యాంటీన్లు
·         మధ్యాహ్న భోజనాలు
·         పేదరికం పై గెలుపు
·         ఎస్.సి/ఎస్.టి కుటుంబాలకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్తు
సాంఘిక సంక్షేమ ముఖ్య కార్యదర్శి మరియు ఇతర సంక్షేమ శాఖల కార్యదర్శులు,

సిఇఓ ఎస్.ఇ.ఆర్.పి గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి.

ఎంఎ &యుడి ముఖ్య కార్యదర్శి.

ఎండి మెప్మా

ఎల్.టి.ఇ &ఎఫ్ ప్రత్యేక ప్రదాన కార్యదర్శి.
4
05-01-2019
రైతుల సంక్షేమం ఆహార భద్రత, అదనపు విలువ మరియు సరఫరా పరంపర
·         రైతుల సంక్షేమం
·         జెడ్.బి.ఎన్.ఎఫ్
·         వ్యవసాయ, అనుబంధ (వ్యవసాయ, ఉద్యానవన, పశుగణ మరియు మత్య పరిశ్రమలు) రంగాలు
·         ఊబరైజేషన్ & డంగ్
·         ఆహార ప్రాసెసింగ్
వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి.
ఉద్యానవన శాఖ కార్యదర్శి/ఎ.హెచ్.డి.డి & ఎఫ్ ముఖ్యకార్యదర్శి
ఆహార ప్రాసెసింగ్ కార్యదర్శి
5
06-01-2019
సహజ వనరుల నిర్వహణ, నీటి భద్రత, జీవన & హరిత దృక్పధం యొక్క నాణ్యత
·         భూగర్భ జలంతో కలుపుకొని నీటిని నిర్వహణ
·         హరిత విస్తృతి
·         పునర్ వినియోగ ఇంధనం
·         కాలుష్యం (గాలి, నీరు, శబ్ధం)
·         వాతావరణ మార్పు
·         పర్యావరణ కార్యక్రమాలు (ఇ-వాహనాలతో కలిపి)
జల వనరుల శాఖ కార్యదర్శి
ఇ.ఎఫ్.ఎస్ &టి ముఖ్య కార్యదర్శి
ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి
6
07-01-2019
మానవ వనరుల అభివృద్ధి మరియు రాష్ట్ర జ్ఞాన విద్య ఆరోగ్యం మరియు పౌష్టికాహారం పిపిపి తోపాటు ఐఎంఆర్, ఎంఎంఆర్, అనిమియ, పోషకాహార లోపం మరియు ఇతర ఆరోగ్య సంబంధిత సేవలు.
పాఠశాల విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి,
ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి,
మహిళా, శిశు సంక్షేమ శాఖ కమీషనరు
7
08-01-2019













సంతృప్తత ప్రాతిపదిక మౌలిక సదుపాయాలు, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలు
·         10 మరియు 9 స్టార్ రేటింగ్ ప్రోగ్రెస్
·         ఘన వ్యర్ధాల నిర్వహణ
·         ద్రవ వ్యర్ధాల నిర్వహణ
·         ఎల్.ఇ.డి బల్బ్ లు, వీధి దీపాలు
·         మురుగు కాలువలు
·         ఫైబర్ గ్రిడ్
·         రోడ్ కనెక్టివిటీ
·         త్రాగునీరు
·         గ్యాస్ కనెక్షన్
·         పారిశుద్ధ్యం (ఓడిఎఫ్)
·         విద్య మౌలిక సదుపాయం
పి.ఆర్ & ఆర్.డి ముఖ్య కార్యదర్శి మరియు ఎంఎ & యుడి ముఖ్య కార్యదర్శి

8
09-01-2019
ఇంధన మరియు ట్రంక్ మౌలిక సదుపాయాలు
·         విద్యుత్తు
·         ఓడరేవులు & అంతర్జాతీయ జల మార్గాలు
·         విమానాశ్రయాలు
·         అమరావతి-రాజధాని నగరం
·         రోడ్లు
ఇంధన మరియు ఐ & ఐ శాఖ ముఖ్య కార్యదర్శి
(ఆర్ & బి) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
9
10-01-2019
పరిశ్రమలు, ఉపాధి నైపుణ్యాభివృద్ధి
·         తయారీ
·         ఎం.ఎస్.ఎం.ఇ
·         ఆర్థికాభివృద్ధి నగరాలు
·         నైపుణ్యాభివృద్ధి
·         ముఖ్యమంత్రి యువనేస్తం
·         వినూత్న కల్పన సర్వీసు రంగ అభివృద్ధి
·         ఐ టి/ఐటిఇఎస్ ఫిన్ టెక్/ఎవిజిసి మొదలైనవి
·         పర్యాటకం
పరిశ్రమల శాఖ కార్యదర్శి యువజనాభ్యుదయం, క్రీడల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి.
ఎల్ఇటి &ఎఫ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక, నూత్నకల్పనల శాఖ కార్యదర్శి, ఐటిఇ & సి శాఖ ముఖ్య కార్యదర్శి
పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి.
10
11-01-2019
గవర్నెన్స్ (పరిపాలన)
·         ఆర్.టిజి/ఇ-ప్రగతి/ఇ-గవర్నెన్స్
·         శాంతి భద్రతలు, ఆబ్కారీ
జిఎ (జిపిఎం&ఎఆర్) ముఖ్య కార్యదర్శి
ఆర్.టి.జి.ఎస్ ముఖ్యకార్యదర్శి
సిఇఓ ఆర్.టి.జి.ఎస్/ఇ-ప్రగతి

గమనిక : చివరి గడులలో హైలైట్ చేయబడిన కార్యదర్శులు సంబంధిత అంశాలకు సమన్వయకర్తగా వ్యవహరిస్తారు.

0 comments:

Post a Comment

ADD

AP UPDATES

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top