Tuesday, 18 December 2018

December 19 ,1961 Operation Vijay was launched to liberate Goa from Portuguese 451 years control- ఆపరేషన్ విజయ్ --451 సంవత్సరాల పోర్చుగీసు వారి సుదీర్ఘ పాలన నుంచి గోవా కు విముక్తి కలిగించిన ఈ సైనికచర్య...గోవా పూర్తీ వివరాలు

December 19 ,1961 Operation Vijay was launched to liberate  Goa from Portuguese 451 years control- ఆపరేషన్ విజయ్ --451 సంవత్సరాల పోర్చుగీసు వారి  సుదీర్ఘ పాలన నుంచి గోవా కు విముక్తి కలిగించిన ఈ సైనికచర్య...గోవా పూర్తీ వివరాలు 


December 19 ,1961 Operation Vijay was launched to liberate  Goa from Portuguese 451 years control- ఆపరేషన్ విజయ్ --451 సంవత్సరాల పోర్చుగీసు వారి  సుదీర్ఘ పాలన నుంచి గోవా కు విముక్తి కలిగించిన ఈ సైనికచర్య...గోవా పూర్తీ వివరాలు


గుంపులు గుంపులుగా నల్లని మబ్బులు…రోజంతా మసక మసకగా ముసురు కమ్మిన వాతావరణం….కాసేపు జోరువాన….కాసేపు నులివెచ్చని ఎండ. …ఎటు చూసినా చిత్తడి నేలలూ….చుట్టూ పరచుకున్న పచ్చదనం….మంద్రంగా వినిపించే సముద్ర హోరు… ఎగసిపడే అలలు, బారులు తీరిన పక్షులు…పర్యాటకుల కేరింతలతో ఎప్పుడూ అందంగా కనిపిస్తుంది గోవా. సముద్రం పొడవునా కొబ్బరి తోటలు, పచ్చని పంటపొలాలు …స్వచ్ఛమైన గాలి…సందర్శకులను మైమరిపింపజేస్తారుు. ఆ ప్రశాంతమైన వాతావరణం భూతల స్వర్గాన్ని తలపిస్తుంది. నిత్యం పిల్లలు, పెద్దలతో బీచ్‌ వాతావరణమంతా సందడిగా ఉంటుంది. ఇంకో విషయం ఏమిటంటే… గోవాను వర్షాకాలంలోనే చూడాలి. ఈ వింటర్‌ టైంలో విదేశీ టూరిస్టులతో కిటకిటలాడుతుంటుంది. అర్థరాత్రి వరకూ సాగే మ్యూజిక్‌ పార్టీలతో, జల్సాగా …బుసబుస పొంగే బీరులా ఉంటుంది గోవా… ఇంతటి అందాల గోవాకు  విదేశీయులైన పోర్చుగీస్‌ వారి నుండి 451 సంవత్సరాల సుదీర్ఘ పాలన తరువాత విముక్తి కలిగింది.భారత ప్రభుత్వం  ‘ఆపరేషన్‌ విజయ్‌’ పేరుతో గోవా, దామన్‌ దీవులను భారతదేశంలో విలీనం చేసింది… ఈ సైనికచర్య. ఈ ఆపరేషన్‌ను పూర్తి చేసిన ఇవాళ్టి రోజే డిసెంబర్ 19న … 1961లో జరిగింది.
December 19 ,1961 Operation Vijay was launched to liberate  Goa from Portuguese 451 years control- ఆపరేషన్ విజయ్ --451 సంవత్సరాల పోర్చుగీసు వారి  సుదీర్ఘ పాలన నుంచి గోవా కు విముక్తి కలిగించిన ఈ సైనికచర్య...గోవా పూర్తీ వివరాలు

గోవా వివరాలు......

విస్తీర్ణం : 3,702 కిలోమీటర్లు
రాజధాని : పనాజి
ఆపరేషన్‌ విజయ్‌కు నాయకత్వం :
Rajendra Prasad
Jawaharlal Nehru
commandars
Maj.Gen. K. P. Candeth
AVM Elric Pinto
V. K. Krishna Menon

అప్పటి పోర్చుగీస్‌ గవర్నర్‌ :  జనరల్‌ మాన్యువెల్‌  "ఆంటోనియో డిసిల్వ"
ఆపరేషన్ విజయ్‌ నాటికి జనాభా    : 6.37 లక్షలు
ప్రస్తుత జనాభా : 15 లక్షలు
పెద్ద నగరం : వాస్కోడిగామా
జిల్లాలు         : రెండు
భాష         : కొంకిణి
ప్రత్యేక రాష్ట్రం  : 30 మే 1987 నుండి
అసెంబ్లీ స్థానాలు : 40
అడవుల విస్తీర్ణం : 1224.38 చ.కి.మీ.
దేశంలోని పశ్చిమతీరాన అరేబియా సముద్రం అంచున ఉన్న ఈ గోవాను ‘‘కొంకణ’’ తీరమంటాం . 16వ శతాబ్దంలో పోర్చుగీసు వర్తకులు గోవాలో స్థావరం ఏర్పరుచుకుని కొది ్దకాలంలోనే అధికారాన్ని బలవంతంగా హస్తగతం చేసుకున్నారు. 451 సంవత్సరాల తరువాత 1961లో భారత ప్రభుత్వం గోవా ను తన అధీనంలోకి తీసుకుంది. 450 సంవత్సరాలు పోర్చు గీసుల పాలనలో సాగిన ప్రాంతం కాబట్టి… గోవాలో ఆ సంస్కృ తి ఇంకా మనకు అడుగడుగునా దర్శనమిస్తుంది.

గోవా ‘పోర్చుగీసు వారి హస్తగతం

1498లో వాస్కోడ గామా కేరళలో కోజికోడ్‌లో అడుగు పెట్టాడు. తరువాత అతడు గోవా చేరాడు. సుగంథ ద్రవ్యాల వ్యాపరమే పోర్చుగీసు వారి అప్పటి లక్ష్యం. కానీ 1501లో తిమ్మయ్య అనే స్థానిక రాజు తరపున పోరాడి అల్పోంసోడి అల్బుకర్క్‌ అనే పోర్చుగీసు అడ్మిరల్‌ బహుమనీ రాజులను ఓడించాడు. గోవాను తమ నావలకు స్థావరంగా చేయాలనేది వారి అభిమతం. బ్రిటీష్‌ వచ్చిన తరువాత పోర్చు గీసు అధికారం గోవాకు, మరికొద్ది స్థలాలకు పరిమితమైంది. పోర్చుగీసు వారికి గోవా విలువైన విదేశీ స్థావరమైంది. పోర్చు గీసు నుండి వచ్చిన వారు అక్కడే స్థిరపడడం, స్థానికులను పెళ్ళిళ్లు చేసుకోవడం జరిగింది. 1843లో రాజధాని పాత గోవా నుండి పనాజీకి మార్చారు.
జనరల్‌ మాన్యువెల్‌  "ఆంటోనియో డిసిల్వ

పోర్చుగీస్  పయనం 


1947లో భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా గోవాను వదులుకోవడా నికి పోర్చుగీసువారు ఒప్పుకోలేదు. 1961 డిసెంబరు 12న భారత సైన్యం గోవాలో ప్రవేశించి, గోవాను ఆక్రమించింది. కొద్దిపాటి ఘర్షణ తరువాత డామన్‌, డయ్యులు కూడా భారత దేశం ఆధీనంలోకి వచ్చాయి. కానీ 1974 వరకూ పోర్చుగీసు ప్రభుత్వం గోవాను భారతదేశంలో అంతర్భాగంగా అంగీకరిం చలేదు. 1987 మే 30న గోవాను కేంద్రపాలిత ప్రాంతంగా కాకుండా ప్రత్యేక రాష్ట్రము గా  ఏర్పరచారు. ఇది దేశంలో 25వ రాష్ట్రము  అయ్యింది.

చరిత్ర

గోవా చరిత్ర విషయానికి వస్తే మౌర్యులు, శాతవాహనులు, బాదామి చాళుక్యులు, సిల్హర వంశ స్తులు, దక్కన్‌ నవాబులు పాలించారు. 1312లో ఢిల్లీ సుల్తానుల వశమైంది. 1370లో విజయ నగర రాజు మొదటి హరిహర రాయులు గోవాను జయించాడు. 1469లో బహమనీ సుల్తానులు దీనిని కైవసం చేసుకున్నారు. తరువాత బీజాపూర్‌ నవాబు ఆదిల్‌షా తన రెండవ రాజధానిగా చేసుకున్నాడు. గోవా నివాసిని ఇంగ్లీషూలో గోవన్‌ అని… కొంకిణిలో గోయెంకర్‌ అని, పోర్చు గీసు భాషలో మగవారిని గోయోస్‌ అని ఆడవారిని గోయోసా అని అంటారు. ప్రస్తుతం ఇక్కడి జనాభా 15 లక్షలు. ప్రస్తుతం ఇక్కడ గోవా తాలుకాలు ఉత్తర, దక్షిణ గోవాలు. ఉత్తరగోవాకు పానాజీ జిల్లా కేంద్రంగా ఉంటే, దక్షిణ గోవాకు మార్గోవా జిల్లా కేంద్రం. ఈ రెండు జిల్లాలను మొత్తం 11 తాలుకాలుగా విభజింజారు.

ఆర్థికంగా

ఓడలపై రవాణా గోవాలో ఒక ముఖ్యమైన జీవనోపాధి. చపోరా నదిపై చేపలు పట్టడం ఇక్కడ వృత్తి. ప్రజల తలసరి సగటు ఆదా యం మిగిలిన దేశంలో కంటే గోవాలో ఒకటిన్నరెట్లు ఎక్కువ. పర్యాటక రంగం గోవా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. మన దేశా నికి వచ్చే విదేశీ యాత్రికులలో 15 శాతం మంది గోవాను సంద ర్శిస్తారు. ముఖ్యంగా తీరప్రాంతంలో యాత్రికులు ఎక్కువ. అలాగే ఇక్కడ ముడి ఇనుము, బాక్సైటు, మాంగనీసు, సిలికా వంటి ఖనిజాలు బాగా ఉన్నాయి. వ్యవసాయం కూడా చాలా మంది జీననోఫాది. వరి, జీడిమామిడి, పోక కొబ్బరి ప్రధాన వ్యవసాయో త్తత్తుపలు. వ్యవసాయం రెండవ ఆదాయపు వనరు. మిగిలినవారు మత్య్స పరిశ్రమ ఆధారంగా జీవిస్తున్నారు.

గోవా పేరు…

గోవా లేదా గోమాంటక్‌ అని పిలిచే ఆ రాష్ట్రానికి ఆ పేరు… మాత్రం మహాభారతంలోనూ, ఇతర ప్రాచీన గంథ్రాలలోనూ గోపరాష్ట్రము , గోనరాష్ట్రం, గోపకపురి, గోపక పట్టణం, గోమంచాల, గోనపురి వంటి పేర్లు వాడబడ్డాయి.

గోవా… మరో ప్రపంచం

కొత్తలోకం, కొత్త మనుషూలు, కొత్త అచారాలు, అందమైన ప్రకృతి, ఇవన్నీ ఒక్క గోవా సొంతం. ఇక మన దేశంలో సముద్ర తీరాలంటే మనకు బాగా గుర్తుకు వచ్చేది గోవా బీచే. చెప్పలేనంత అందాన్ని దాచుకుని మనసు ఊరిస్తుంటాయి గోవా తీరాల అందాలు. అరేబియా సముద్ర అలల అల్లరులు, లయకు స్వరం తప్పకుండా నాట్యం చేసే తాటిచెట్లు… ఎవరికి మాత్రం ఇష్టం ఉండవు? వాటితో కలసి తాము ఆడుకోవాలని మనసు ఉవ్విళ్లూరుతూంది. చక్కని బీచ్‌లు, పొడవైన సముద్రతీరం, ప్రత్యేకమైన కట్టడాలు, విశిష్టమైన వనసంపద అవన్నీ కలిపి గోవా మంచి పర్యాటక కేంద్రంగా మారింది.

గోవా ప్రత్యేకతలు

ఇక్కడ మోటారు సైకిల్‌ టాక్సీ అనేది గోవాకు ప్రత్యేకమైన అద్దె టాక్సీ ఇవి పసుపు, నలుపు రంగుల్లో ఉండే మోటారు సైకిళ్ళు వీటిని నడిపేవారిని ‘పైలట్లు’ గా పిలుస్తారు. ప్రయాణీ కుడు వెనుక సీటులో కూర్చుంటాడు. వరి అన్నం, చేపల కూర ఇక్కడ ప్రత్యేకత. కొబ్బరి, మసాలా, జీడిమామిడి, మిర్చిలు వాడి తయారుచేసే ఎన్నో రుచికరమైన వంటలు గోవా ప్రత్యేకం. జీడిమామిడి పండు నుంచి కొబ్బరి కల్లు నుంచి తయారు చేసే ‘ఫెని’’ అనే మద్యం గోవాలో అత్యంత సామాన్యం.

0 comments:

Post a Comment

AP UPDATES

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top