Search This Blog

 • అమ్మ ఓడి - లేటెస్ట్ అప్డేట్స్.. NEW...
 • MORE TO VIEW

Monday, 10 December 2018

December 11- Hindu Widows' Remarriage in Andhra -- ఆంధ్ర దేశం లో మొదటి వితంతు వివాహము జరిగిన రోజు .....

వితంతు వివాహం అనగా భర్త మరణించిన ఆడవారికి మళ్ళీ పెళ్ళి లేదా వివాహం చెయ్యటము.పునర్వ అంటే మళ్ళీ అని అర్ధము
వితంతువు అనగా భర్త మరణించిన స్త్రీ.
పూర్వం భర్త మరణించిన ఆడవారికి సతీ సహగమనం అనే సాంఘిక దురాచారం అమలులో ఉండేది.దీని ద్వారా భర్త చితి మీద భార్యను సజీవంగా దహనం చేసేవారు.దీనిని కందుకూరి వీరేశలింగం వంటి సంఘ సంస్త్కర్తలు అడ్డుకొని వితంతు వివాహాలను ప్రోత్సహించారు.

 ఆంధ్ర దేశం లో మొదటి వితంతు వివాహము జరిగిన రోజు డిశంబర్ 11 న 1881లో .....

 సరిగ్గా137 సంవత్సరాలక్రితం జరిగిన ఆ సంఘటన చరిత్ర గతినే మలుపు తిప్పింది. దీనికంతటకు ఆధ్యుడు సంఘసంస్కర్త కందుకూరి----
ఆయన ఇల్లు...
మన రాజమహేంద్రి..
ఆ విషయాలు కూలంకషంగా......


కందుకూరి వీరేశలింగం చేసిన ఇతర సంస్కరణ కార్యక్రమాలొక ఎత్తు, వితంతుపునర్వివాహాలొక ఎత్తు.

అప్పటి సమాజంలో బాల్యంలోనే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసేవారు. కాపురాలకు పోకముందే భర్తలు చనిపోయి, వితంతువులై, అనేక కష్టనష్టాలు ఎదుర్కొనే వారు.

దీనిని రూపుమాపేందుకు వితంతు పునర్వివాహాలు జరిపించాలని ప్రచారం చేసాడు.

1881 డిసెంబరు 11న తమ ఇంట్లో మొట్టమొదటి వితంతు వివాహం చేశాడు. తొమ్మిదేళ్ళ బాల వితంతువు గౌరమ్మ తిరువూరు తాలూకా రేపూడికి చెందిన పిల్ల. వరుడు గోగులపాటి శ్రీరాములు . ఈ పెళ్ళి పెద్ద ఆందోళనకు దారి తీసింది. పెళ్ళికి వెళ్ళిన
వాళ్ళందరినీ సమాజం నుండి వెలి వేశారు.

గౌరమ్మను రేపూడినుండి రాజమండ్రీ తరలించడానికి చాలా కష్టపడ్డాడు వీరేశలింగం. సుమారు 12రోజుల ప్రయానంతరం ఆపిల్లను రాజమండ్రీలో తనఇంటకు చేర్చి పెద్ద ఊరేగింపుతో  పెళ్లి చేసారు కందుకూరి.ఈ పెళ్ళిలో పెద్దఎత్తున బ్రీటీషుఅదికారులు పాల్గోని తమ మద్దత్తు ప్రకటించారు.పెళ్ళితంతు శాస్త్రయుక్తంగా 4రోజులపాటు జరపారు.
ఈ పెళ్ళి చేసిన 4 రోజులకే మరో వితంతు పునర్ వివాహం అలా అలా సమాజం నుండి ఎంతో ప్రతిఘటన ఎదురైనా పట్టుబట్టి సుమారు 40 వితంతు వివాహాలు జరిపించాడు.
పైడా రామకృష్ణయ్య, ఆత్మూరి లక్ష్మీ నరసింహం, బసవరాజు గవర్రాజు వంటి మిత్రులు, మరియు ఆయన విద్యార్థులు వీరేశలింగానికి అండగా నిలిచారు. ఆయన భార్య కందుకూరి రాజ్యలక్ష్మమ్మ (పెళ్ళయ్యాక బాపమ్మకు అత్తగారు రాజ్యలక్ష్మి అని తన తల్లి పేరు పెట్టుకున్నారు) భర్తకు బాసటగా ఉంది. వంటవాళ్ళు, నీళ్ళవాళ్ళు వారి ఇంటికి రావడానికి నిరాకరించినపుడు రాజ్యలక్ష్మమ్మ స్వయంగా గోదావరికి వెళ్ళి నీళ్ళు తెచ్చి, పెళ్ళివారికి వంట చేసిపెట్టింది...
(భారత దేశం లో మొదటి వితంతు వివాహం 1856 లో కలకత్తా లో ఈశ్వరచంద్ర విద్యా సాగర్ గారి ఆద్వర్యం లో జరిగింది)

తెలుగువారి వెలుగు దారి కందుకూరి

తన దేహము తన గేహము / తన కాలము తన ధనంబు తన విద్య జగ / జ్జనులకే వినియోగించిన / ఘనుడీ వీరేశలింగకవి జనులార! రాజమహేంద్రవరంలో ఉన్న కందుకూరి వీరేశలింగం పంతులు గారి సమాధి మీద ఈ పద్యం కనిపిస్తుంది. దీనిని రాసింది చిలకమర్తి లక్ష్మీ నరసింహ కవి. వీరేశలింగం తన జీవిత కాలంలో చేసిన కృషికి ఈ పద్యం ఒక చక్కని నివాళి. ఆయన జీవితానికి ఒక సంక్షిప్త ముక్తాయింపు!

తెలుగు నాట మూఢాచారాలు, కులమత భావబేధాలూ, కుతర్క కుహనా విలువలూ రాజ్యమేలుతున్న తరుణంలో- ప్రచండ భాస్కరుడిలా ప్రభవించాడు వీరేశలింగం. పుట్టటమే సంఘ సంస్కరణ కోసం పుట్టాడా అన్నట్టు జీవితమంతా ఆ దిశగా అవిరళమైన, అసామాన్యమైన కృషి చేశాడు. ఎవరు నిరసించినా, ఎందరు అవహేళన చేసినా పట్టించుకోలేదు. తాను చేస్తున్నది సమాజానికి మేలు చేసేదని బలంగా నమ్మాడు. అదిలింపులకు, బెదిరింపులు తలవొంచలేదు. అసలు సిసలు కార్యవాదిగా ముందుకు దూసుకుపోయాడు. జీవితాంతం అదే ఒరవడి.
వీరేశలింగం 1848 ఏప్రిల్‌ 16న రాజమండ్రిలో పున్నమ్మ, సుబ్బారాయుడు దంపతులకు జన్మించారు. నాలుగేళ్ళ వయసులో తండ్రి చనిపోయాడు. పెదతండ్రి, నాయనమ్మల పెంపకంలో అల్లారు ముద్దుగా పెరిగాడు. ఐదో ఏట బడిలో చేరి, బాల రామాయణం, ఆంధ్ర నామ సంగ్రహం, అమరం, రుక్మిణీ కళ్యాణం, సుమతీ శతకం, కృష్ణ శతకం వంటివి నేర్చుకున్నాడు. పన్నెండో ఏట రాజమండ్రి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు చదువులో చేరాడు. చిన్నప్పటి నుంచి అన్ని తరగతుల్లో ప్రథమ శ్రేణిలోనే ఉండేవాడు. తన పదమూడో ఏట ఎనిమిదేళ్ల రాజ్యలక్ష్మమ్మతో బాల్యవివాహం జరిగింది. పెద్దయ్యాక వీరేశలింగం ఇటువంటి దురాచారాల నిర్మూలనకే కృషి చేశాడు.
1867లో పెదనాన్న మరణంతో ప్రభుత్వోద్యోగంలో చేరాలని ప్రయత్నించాడు. కానీ లంచం ఇవ్వనిదే ఉద్యోగం రాదని తెలిసి, ఆ ప్రయత్నం విరమించాడు. కొన్నాళ్లు న్యాయ వాద వృత్తి పట్ల ఆసక్తి చూపినా, అందులోనూ అవినీతి, అబద్ధాలూ ప్రబలంగా ఉన్నాయని భావించి, అదీ మాను కున్నాడు. ఆఖరికి బోధనా వృత్తిని స్వీకరించాడు. ఉపాధ్యా యుడిగా పిల్లలకు పాఠాలతో పాటు, సంఘ సంస్కరణ భావాలను బోధించాడు. సమాజంలోని దురాచారాలపై తన భావాలను వ్యాప్తి చేయడానికి 1874 అక్టోబరులో 'వివేక వర్థని' పత్రికను ప్రారంభించాడు. 'సంఘం లోని అవకతవక లను ఎత్తిచూపడం, దురాచారాల నిర్మూలన, ప్రభుత్వ వ్యవస్థలో ప్రబలంగా ఉన్న అవినీతిని ఎత్తిచూపి, అవినీతిపరు లను సంఘం ముందు పెట్టడం' లక్ష్యాలుగా పత్రిక నడిపాడు. ఎంతోమంది అవినీతిపరుల బాగోతాలను సోదాహరణంగా బయటపెట్టి, ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిజానికి కూడా ఆయనే తొలి అడుగు వేశాడు. తరువాత 'హాస్య సంజీవిని' అనే హాస్య పత్రికను ప్రారంభించాడు. తెలుగులో మొట్టమొదటి ప్రహస నాన్ని ఈ పత్రికలోనే ప్రచురించాడు.
కందుకూరి ఇటు సంఘ సంస్కరణకు, అటు సాహిత్య సృజనకూ సమ ప్రాధాన్యం ఇచ్చి, ఎంతో సేవ చేశారు. అనేకనేక రంగాల్లో ఆయన ప్రజ్ఞాశాలి, కార్యవాది. అందుకనే తెలుగు జాతి నవయుగ వైతాళికుడిగా పేరొందాడు. చెప్పటం కన్నా చేయటమే పనిగా పెట్టుకున్న మహా మనీషి ఆయన. స్త్రీవిద్యకై ఉద్యమించి, ప్రచారం చెయ్యడమే కాక, బాలికల కోసం పాఠశాలను ప్రారంభించాడు. మగపిల్లలతో ఆడపిల్ల లు కలిసి చదువుకునే సహ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు. అన్ని కులాల పిల్లలూ ఒకే చోట కూర్చొని విద్యాభ్యాసం చేసే మార్పుకు శ్రీకారం చుట్టాడు. అంటరాని కులాలుగా సమాజం దూరం పెట్టిన వారికి చదువు చెప్పడంతో పాటు పలకా బలపం, పుస్తకాలూ సమకూర్చారు. అప్పటి సమాజంలో బాలికలకు చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేస్తే- వారు కాపురాలకు పోకముందే భర్తలు మరణిస్తే- వితంతువులై అనేక కష్టనష్టాలు ఎదుర్కొనేవారు. వారికి మరొక వివాహం నిషిద్ధం. అది దురాచారమని చెప్పటమే కాదు; ఎన్నో సాహసా లకు తెగించి, విమర్శలకు తలొగ్గి వితంతు పునర్వివాహాలకు పూనుకున్నాడు వీరేశలింగం. తొలుత ఆయన వెంట నడిచిన మిత్రులు అనేకమంది తరువాత తప్పుకున్నారు. అప్పటి కుల కట్టుబాట్లకు జడిచి, వెనక్కు మళ్లారు. అయినా, వీరేశలింగం వెనుదిరిగి చూడలేదు. కుల బహిష్కరణను ఎదుర్కొన్నాడు. సామాజిక వెలిని బేఖాతరు చేశాడు. వ్యక్త్తిత్వాన్ని దెబ్బ తీసే దుష్ప్రచారం ఎంత చేసినా చలించలేదు. ఒకానొక దశలో వితంతు పునర్వివాహాలు చేస్తున్నప్పుడు- ఊళ్లో అందరూ సహాయ నిరాకరణ చేసినా- పనులన్నీ ఆయనా, ఆయన జీవసహచరి రాజ్యలక్ష్మమ్మ చక్కబెట్టారు. గోదావరి నది నుంచి నీళ్లు మోసి వీరేశలింగం సదాశయాన్ని నెరవేర్చటంలో రాజ్యలక్ష్మమ్మ అడుగడుగునా తోడుగా నిలిచారు.
ఆంధ్రదేశంలో ఆయనే 'బ్రహ్మ సమాజం' స్థాపించాడు. యువజన సంఘాల స్థాపన కూడా ఆయనతోనే మొదల యింది. సమాజసేవ కోసం 1905లో హితకారిణి సమాజం నెలకొల్పి, తన యావదాస్తిని దానికి ఇచ్చేశాడు. తెలుగు పండితుడిగా 25 ఏళ్ల పాటు పాటు రాజమండ్రిలో, ఐదేళ్ల పాటు మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో పనిచేశాడు. 130కి పైగా గ్రంథాలు రాశాడు. అనేక సాహిత్య ప్రక్రియలకు ఆయనే ఆద్యుడు. తొలి తెలుగు నవల 'రాజశేఖర చరిత్ర'ను రాశాడు. అప్పటివరకూ కథల్లో దేవుడో, రాజాధిరాజులో కథానాయకులైతే - రాజశేఖర చరిత్రలో సామాన్యుడే కథానాయకుడు. ప్రహసనాలు పేరిట సమాజంలో మూఢా చారాలను, దురాచారాలను దుయ్యబట్టారు. తన రచనలతో ఛాందసవాదుల వాదనలను పూర్వపక్షం చేస్తూ, ఆధునిక ఆలోచనాపరుల్లో చైతన్యం నింపారు. అనేక ఇంగ్లీషు, సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు. పిల్లల కోసం వాచకాలు తయారు చేశాడు. ఆయన వెలువరించిన 'ఆంధ్ర కవుల చరిత్ర' ప్రత్యేక ఖ్యాతి గడించింది. ఆయన ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉన్నా- ఎక్కడా ఏ విషయంలోనూ జాప్యం చేసి ఎరగడు. పగటివేళ సంఘ సంస్కరణ, రాత్రుళ్లు గ్రంథరచన చేసేవాడు.
పత్రికారచనలోనూ వీరేశలింగానికి కొత్త ఒరవడే! 'వివేక వర్థని' పత్రిక ద్వారా అవినీతిపరులపై యుద్ధం సాగించి వారిని హడలెత్తించాడు. సంఘంలోని ఇతర దురాచారాలపై ప్రజలను చైతన్యవంతులను చేయడానికి పత్రికను ఆయుధంగా వాడుకున్నాడు. 1881 డిసెంబరు 11న తమ ఇంట్లో మొట్టమొదటి వితంతు వివాహం చేశాడు. ఈ పెళ్ళి పెద్ద ఆందోళనకు దారి తీసింది. పెళ్ళికి వెళ్ళినవాళ్ళందరినీ సమాజం నుంచి వెలి వేశారు. అయినా, పట్టువదలని వీరేశ లింగం తరువాతి కాలంలో సుమారు 40 వితంతు వివాహాలు జరిపించాడు. మూఢ విశ్వాసాలు, సనాతనాచారాలపై ఆయన జరిపిన పోరాటం చిరస్మరణీయం, ఇప్పటికీ అనుసరణీయం. ఆయన కాలక్షేపం కోసం చేసిన రచన ఒక్కటీ లేదు. అన్నీ సంఘ సంస్కరణ, ఉద్ధరణ కోసమే! సమాజం మార్పు కోరే ప్రతి ఒక్కరికీ వీరేశలింగం జీవితం ఒక పాఠ్యపుస్తకం. ఉన్న సమాజాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు యథాతథవాదులు, స్వార్థపరులూ అనేక రూపాల్లో ఆటంకాలు కల్పిస్తారు. అపప్రథలకు గురి చేస్తారు. అయినా, లక్ష్యపెట్టక ముందుకు వెళ్లటమే- కార్యశీలుర లక్షణం. అదే వీరేశలింగం జీవిత సందేశం.

0 comments:

Post a Comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top