Tuesday, 4 December 2018

CHANDRAMPALEM,ZPHS Madhurawada,Visakhapatnam_Best govt school in Andhra Pradesh with highest strength of 3,316 students for well-rounded education- ఐదున్నర ఎకరాలు.. 3,316 మంది విద్యార్థులు 5 తరగతులు, 6 బ్లాక్‌లు, 42 సెక్షన్లు ...ఇదేదో కార్పొరేట్ స్కూల్ అనుకోకండి...110 మందితో మొదలై ఈ స్థాయికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ లోని ఓ ప్రభుత్వ పాథశాల ...రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పెద్ద సర్కారు బడి

ఐదున్నర ఎకరాలు.. 3,316 మంది విద్యార్థులు 5 తరగతులు, 6 బ్లాక్‌లు, 42 సెక్షన్లు ...ఇదేదో కార్పొరేట్ స్కూల్ అనుకోకండి...110 మందితో మొదలై ఈ స్థాయికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ లోని ఓ ప్రభుత్వ పాథశాల ...రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పెద్ద సర్కారు బడి...

CHANDRAMPALEM,ZPHS Madhurawada,Visakhapatnam_Best govt school in Andhra Pradesh with highest strength of 3,316 students for well-rounded education- ఐదున్నర ఎకరాలు.. 3,316 మంది విద్యార్థులు 5 తరగతులు, 6 బ్లాక్‌లు, 42 సెక్షన్లు ...ఇదేదో కార్పొరేట్ స్కూల్ అనుకోకండి...110 మందితో మొదలై ఈ స్థాయికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ లోని ఓ ప్రభుత్వ పాథశాల ...రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పెద్ద సర్కారు బడి
ZILLA PARISHAD HIGH SCHOOL, CHANDRAMPALEM
MADHURAWADA
VISAKHAPATNAM (RURAL)
ANDHRA PRADESH,
Pin Code:- 530048

బెత్తెడు చోటు దొరకని పరిస్థితుల్లో బడి కోసం ఐదున్నర ఎకరాల స్థలం! విస్తారమైన భవనాలు! ఐదు తరగతుల విద్యార్థుల కోసం ఆరు బ్లాకులు, 42 సెక్షన్లు! ప్రతి క్లాసు రూమ్‌కూ టెక్నాలజీ అనుసంధానం!


అవుట్‌ డోర్‌ క్రీడా విన్యాసాలతో కళకళలాడుతున్న మైదానం!.. ఈ వివరాలు వింటుంటే మన పిల్లలను అక్కడకు పంపాలని అనిపిస్తుంది కదూ! ఎక్కడ, ఊరికి ఎంత దూరం, ఫీజు స్ర్టెక్చర్‌ ఏమిటి, కార్పొరేటా, ప్రైవేటా.. అంటూ ఆత్రుతగా ఆరా తీయాలనిపిస్తోంది కదూ! నిజానికి, ఈ బడి కార్పొరేట్‌ లేక ప్రైవేటు యాజమాన్యంలో లేదు. పక్కా సర్కారు బడి.

చంద్రంపాలెం స్కూల్ గురించి ప్రస్తుత ఉపరాష్ట్రపతి  శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి ట్వీట్

విశాఖ జిల్లా మధురవాడలోని చంద్రంపాలెంలో నడుస్తున్న జడ్పీ పాఠశాల ఇది! టెక్నాలజీ అనుసంధాన తరగతి గదిపై ముఖ్యమంత్రి ఆలోచనలు, కలిసొచ్చిన దాతలు, స్థానికుల సాయంతో అనతికాలంలోనే ఆదర్శ బడిగా ఎదిగింది. షెడ్డులలో 1979లో మొదలయినప్పుడు 100 మంది విద్యార్థులు ఉన్నారు.
జిల్లాస్థాయి ఫుట్‌బాల్‌ పోటీల్లో సి ఎం కప్ కైవసం చేసుకున్న చంద్రంపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల 

ఇప్పుడు ఏకంగా 3,316 మంది చదువుకుంటున్నారు. ఇంతమంది విద్యార్థులు ఒక స్కూలులో చదవడం తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే ఒక రి కార్డు! ఈ విజయాలే చంద్రంపాలేన్ని ‘చదువుల చందమామ’గా నిలిపాయి. గుంటూరు జిల్లా మందడం జడ్పీ పాఠశాలలో ఈ నమూనాను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. నియోజకవర్గానికి ఒక ‘చంద్రంపాలెం’ స్కూలుని అందించడానికి సిద్ధమవుతోంది.


ప్రస్థానం ఇలా..
డ్రాపవుట్‌లు, టీచర్ల కొరత, అరకొర బోధన, అంతంతమాత్రం వసతులకు సంబంధించిన కథలే సర్కారు బడుల్లో వినిపిస్తుంటాయి. అలాంటిది చంద్రంపాలెం పాఠశాలలో 30 మరుగుదొడ్లు కనిపించాయి. ఒక క్లాసుకు 10కి పైగా సెక్షన్లు ఏర్పాటుచేశారు. నిజానికి, ఇన్నాళ్లుగా సాధించిన ప్రగతి ఒక ఎత్తు.

ప్రస్తుత విద్యా సంవత్సరంలో అందుకున్న పురోగతి మరో ఎత్తు. ఇటీవలి దాకా 36 మంది టీచర్లు పిల్లలకు బోధిస్తున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలు బాగా కలిసివచ్చాయి. ఇప్పుడు ఇక్కడ 88 మంది బోధిస్తున్నారు. తెలుగు మీడియంకు సమాంతరంగా ఇంగ్లిష్‌ని ప్రోత్సహిస్తున్నామని హెడ్‌మాస్టర్‌ ఎం. రాజబాబు తెలిపారు.

మంచి పనికి కలిసొచ్చారు.
చంద్రంపాలెంలోని చెరువు కట్టపై తాటాకు షెడ్డులో తొలి పాఠశాల ఏర్పాటయింది. పేరుకే చెరువు. నీళ్లు లేకపోవడంతో పిచ్చిమొక్కలు, జిల్లేళ్లు అల్లుకుపోయాయి. పాముల భయంతో పిల్లలు వచ్చేవారు కాదు. పిల్లలు బడికి దూరం అవడం కొంతమంది స్థానిక పెద్దలను బాధించింది. అధికారులతో మాట్లాడి, పాడుబడిన చెరువులో చాలాభాగం పూడ్చించి.. బడి విస్తీర్ణం పెంచారు.

పక్కా భవనాల నిర్మాణం తలపెట్టారు. రిటైర్డ్‌ అడిషనల్‌ ఎస్పీ టి.ఎస్.ఆర్‌. ప్రసాద్‌ రూ. 10 లక్షలతో క్రీడా మైదానం అభివృద్ధిని చేపట్టారు. వరల్డ్‌ విజన్‌, అవెంటల్‌, విశాఖపట్నం పోర్ట్‌ ట్రస్ట్‌, స్టీల్‌ ప్లాంట్‌, ఎన్‌ఎండిసి, హెట్రో ల్యాబ్స్‌, సీఎంఆర్‌ ఆర్గనైజేషన్‌, ఓల్డ్‌ స్టూడెంట్‌ ఆర్గనైజేషన్‌.. సాయం అందించాయి. రాష్ట్ర భ్రుత్వం రూ. 1.5 కోట్లతో టాయిలెట్‌ సదుపాయం, డిజిటల్‌ పాఠాల బోధన, శుద్ధ జలాలను పిల్లలకు అందుబాటులోకి తెచ్చింది. ’భవనమే అధ్యయన ఉపకరణం (బిల్డింగ్‌ యాజ్‌ లెక్నింగ్‌ ఎయిడ్‌)’ పథకానికి ఎంపిక చేసింది.

ఫలితాలు కనిపించాయి..
పదో తరగతిలో ఉత్తీర్ణతాశాతం ఏ ఏడాది కూడా 60 శా తానికి తగ్గలేదు. ఇక్కడ నుంచి ట్రిపుల్‌ ఐటీకి ఎంపిక కావడం ఇటీవల పెరిగింది. గత ఐదేళ్ల కాలంలో ఎనిమిది మంది మంచి ర్యాంకులతో ప్రతిష్ఠాత్మకమైన ట్రిపుల్‌ ఐటీ సంస్థల్లో చోటు దక్కించుకొన్నారు. బాస్కెట్‌బాల్‌, తైక్వాండో, ఫుట్‌బాల్‌ వంటి అంశాలలో 50 నుంచి 60 మంది విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో విజేతలుగా నిలిచారు.

Honble CM Interaction with ZPH School children Chandrampalem, on dt.05-02-2016




MOCK Assembly ZPHSchool Chandrampalem visakha patnam




చంద్రంపాలెం హై స్కూల్ స్ఫూర్తి తో రెవిన్యూ డివిజన్ కి ఒక మోడల్ స్కూల్ ఏర్పటుకు ఉత్తర్వులు
Establishment of one High School of Excellences in each Revenue division in the  State ,Rc.830,Dt.30/11/18

1 comment:

ADD

AP UPDATES

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

  • Know your 10th PRC Arrears with your Treasury IDLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top