Search This Blog

 • అమ్మ ఓడి - లేటెస్ట్ అప్డేట్స్.. NEW...
 • MORE TO VIEW

Sunday, 30 December 2018

Budda Vengal Reddy (30 May 1822 – 31 December 1900) - Biography - అపర దానకర్ణుడు బుడ్డా వెంగళరెడ్డి- ఆస్తి మొత్తం దానధర్మాలకి వినియోగం - విక్టోరియా మహారాణి ఈయన సేవలను గుర్తించి బంగారు పతకాన్ని బహుమానం- డొక్కల కరువు ఈయన చేసిన సాయం ఆ ప్రాంతాల్లో ఇప్పటికి కధలు కధలు గా చెప్పుకొనే వైనం.....

కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడలో మద్దెల వంశానికి ఖ్యాతి తెచ్చిన ఘనుడు ఈశ్వరరెడ్డి. ఈయన కుమారుడు నల్లపరెడ్డి. భార్య అక్కమ్మ (వెంకటమ్మ). ఈ దంపతులు సంతానం కొరకు అనేక పుణ్య క్షేత్రాలు దర్శించారు. ఫలితంగా అక్కమ్మ కడుపు పండింది. 1822 సంవత్సరంలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాలుడి పేరే   బుడ్డా  వెంగళరెడ్డి. వెంగళరెడ్డి పెద్దగా చదవకపోయినా తల్లినుండి దానగుణాన్ని దాని గొప్పదనాన్ని తెలుసుకున్నారు.
రెడ్డిగారు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. కానీ ఒక్క భార్యకు కూడా సంతానం కలుగలేదు. అందువలన తన తమ్ముని కుమారుని దత్తత తీసుకున్నారు.


వెంగళరెడ్డిని చిన్నప్పుడు అందరూ ప్రేమగా ‘బుడ్డోడు’ అని పిలుచుకునేవారు. అందుకే అతని పేరు బుడ్డా వెంగళరెడ్డిగా మారిందని కొందరి అభిప్రాయం.

బుడ్డా వెంగళరెడ్డి బాల్యం నుండే పేద పిల్లలు కనిపిస్తే చాలు తన జేబులో ఉన్న నాణెలు, తినుబండారాలు ఇచ్చే ఉదార స్వభావం కలవాడు. వెంగళరెడ్డిలో వయసుతో పాటు దానగుణం, ఔదార్య గుణం పెరిగింది. బుడ్డా వెంగళరెడ్డి దాన, ధర్మాల గురించి ప్రజలు కథలు కథలుగా చెప్పుకునేవారు.
బుడ్డా వెంగళరెడ్డి చదువుకొన్నది తక్కువే. అయినా ఆయన చాలా విషయాలు తెలుసుకున్నాడు. ఆయనకు పాండిత్యంపై మక్కువ. నీతి, మానవత్వం వంటి విషయాల్లో ఆయనకు ఆయనే సాటిగా చెప్పవచ్చు. అందుకే ఆయన దగ్గరకు వచ్చిన యాచకుల అవసరాలలోని నిజాన్ని వెంటనే గ్రహించగలిగేవాడు. ఉయ్యాలవాడలో సంస్కృత పాఠశాలను ఏర్పాటు చేశాడు. వెంగళరెడ్డి ఉయ్యాలవాడలో పెద్దరికానికి వన్నె తెచ్చాడు. గ్రామ ప్రజల సంక్షేమం కోసం ఎన్నో మంచి పనులు చేశాడు. చెడు దారిలో నడిచే యువకులను గుర్తించి వారికి ఉపాధి కల్పించి, వారిని మంచి దారిలో నడిపించేవాడు.

బుడ్డా వెంగళరెడ్డికి పందెం ఎద్దులంటే చాలా ఇష్టం. వెంగళరెడ్డి ఒక ఎద్దును చూసి ముచ్చటపడి డబ్బును కంతుల వారీగా చెల్లించే పద్దతిలో ఒప్పందం కుదుర్చుకొని కొనుక్కున్నాడు. చివరి కంతు ఆలస్యమయింది. ఏమైందో తెలుసుకుందామని ఆ ఎద్దు యజమాని ఉయ్యాలవాడ గ్రామానికి బయలుదేరాడు. దారి మధ్యలో బుడ్డా వెంగళరెడ్డి అతనికి ఎదురయ్యాడు. తానేదో పనిమీద పొరుగు ఊరికి వెళుతున్నానని, ఇవ్వవలసిన పైకం ఫలానా చోట, వెదురు గొట్టంలో పెట్టి ఉంచానని, తీసుకోవాలని చెప్పి వెళ్లిపోయాడు. ఆ యజమాని వెంగళరెడ్డి ఇంటికి వచ్చి ఆ విషయం చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటికే వెంగళరెడ్డి చనిపోయి ఐదు మాసాలయింది. యజమాని డబ్బు కోసం అబద్దాలాడుతున్నాడని అందరూ అతన్ని అవమానించారు. ‘లేదు నాకు ఆయన కనబడింది నిజమే’ అని ఎద్దు యజమాని వారితో గొడవ పెట్టుకున్నాడు.
‘కావాలంటే వెంగళరెడ్డి గారు ఒక ప్రదేశంలో డబ్బులు ఉన్నాయని చెప్పారు కదా. అక్కడ డబ్బులు ఉంటే నా మాట నిజమే అవుతుంది కదా? అక్కడ వెతకండి. లేకపోతే వెళ్లిపోతాను. నాకు ఎటువంటి డబ్బు అవసరం లేదు’ అన్నాడు ఆ ఎద్దు యజమాని. వెంగళరెడ్డి కుటుంబీకులు ఆ ప్రదేశంలో వెతకగానే ఇవ్వాల్సిన కిస్తు డబ్బులు కనిపించాయి. దాంతో అందరూ ఆశ్చర్యపోయారు. వెంగళరెడ్డి ఏ లోకంలో ఉన్నా ఇచ్చిన మాట తప్పడు అనడానికి ఈ సందర్భం ఒక ఉదాహరణ మాత్రమే.


బుడ్డా వెంగళరెడ్డి దగ్గరికి ఒకసారి ఇద్దరు బ్రాహ్మణులు వచ్చి (ఆదిశేషయ్య, వెంకటాచారి) వివాహం నిమిత్తం ఒక బంగారు మొలతాడు ఇవ్వమని అడిగారు. వారి పని అయిపోగానే తిరిగి తెచ్చిస్తామని చెప్పారు. రెడ్డి ఆలోచించకుండా వారికి ఒక బంగారు మొలతాడు తీసి ఇచ్చాడు. ఆ బ్రాహ్మణులు సంతోషంగా వెళ్లారు. తర్వాత ఒకరోజు పగటి పూట వచ్చి వెంగళరెడ్డికి బంగారు మొలతాడు తిరిగి ఇవ్వబోయారు ఆ బ్రాహ్మణులు. దానికి రెడ్డి నవ్వుతూ ‘స్వామీ! నాకు ఇవ్వడమే తెలుసు కాని, తిరిగి తీసుకోవడం తెలీదు. మీరు ఎండలో వచ్చారు. కాస్త మజ్జిగ తాగి వెళ్లండి’ అని వారితో చెప్పి తన త్యాగ గుణాన్ని మరోసారి చాటుకున్నాడు.
వెంగళరెడ్డి ఇంటికి ప్రతిరోజు మధ్యాహ్నం అనేక మంది ప్రజలు మజ్జిగ తాగేందుకు వచ్చేవారు. ఒకరోజు ఒక వృద్ద మహిళ చల్ల తాగేందుకు వెంగళరెడ్డి ఇంటికి వచ్చింది. కాని ఆ సమయానికే ఇంట్లో చల్ల అయిపోయింది. ఈ విషయాన్ని వెంగళరెడ్డి సతీమణి ఆమెకు చెప్పడంతో ఆమె నిరాశగా వెనుతిరిగిరది. అదంతా గమనించిన వెంగళరెడ్డి ఆమెతో ‘అమ్మా! నువ్వు నిరుత్సాహపడకు. ఈ బర్రెను తీసుకెళ్లి పెంచుకో’ అని తాను పెంచుకునే బర్రెను దానం చేసిన దానకర్ణుడు బుడ్డా వెంగ వెంగళరెడ్డి.

వెంగళరెడ్డి తల్లి ‘నాయనా ఈ విధంగా దానధర్మాలు చేస్తే మనం పేదవాళ్ళం అవుతాం’ అని ఎంత చెప్పినా ఆయన వినిపించుకునేవాడు కాదు. ఒకరోజు వెంగళరెడ్డి తన తల్లిని తీసుకొని ఒక నది దగ్గరికి వెళ్లాడు. తాగునీటి కొరకు ఒక చలిమె తీసి దానిలోని నీటిని కుండలోకి తోడాడు. ఎంత తోడినా అందులోకి నీరు ఊరుతూనే ఉంది. అప్పుడు వెంగళరెడ్డి తన తల్లితో ‘అమ్మా దాన, ధర్మాలు చేయడం కూడా ఇలాంటిదే. మనం ఎంత దానం చేస్తే మనకు అంత మంచి జరుగుతుంది’ అన్నాడు. వెంగళరెడ్డి గురించి ఇలాంటి విషయాలన్నీ చెప్పుకుంటూ పోతే ఒక మహాకావ్యమే అవుతుంది. ఆ మహాదాత 1900 సంవత్సరం డిసెంబరు 31న మరణించారు

డొక్కల కరువు..

బుడ్డా వెంగళరెడ్డి (1840 - 1900) 1866 కాలంలో సంభవించిన డొక్కల కరువు కాలంలో తన ఆస్తినంతా ధారపోసి ఎంతోమంది ప్రాణాల్ని కాపాడిన మహా దాత.
1866 కాలంలో వీరి కీర్తి ప్రతిష్టలు విన్న పేద ప్రజలు బళ్ళారి, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల నుండి తండోపతండాలుగా ఉయ్యాలవాడ చేరి రెడ్డిగారిని ఆశ్రయించారు. వారి దీనస్థితిని అర్ధంచేసుకున్న రెడ్డిగారి ఇంట్లో ఉన్న ఆరు పుట్ల ధాన్యాన్ని గంజి కాయించి వేలాది కుటుంబాల ఆకలిని తీర్చారు. పూటకు ఎనిమిది వేలకు తక్కువ కాకుండా ఈ కరవు కాలంలో బుడ్డా వెంగళరెడ్డి కరవు పీడితులైన ప్రజలకు మూడు నెలల పాటూ అన్న వస్త్రాలు ఇచ్చి కన్నతండ్రిలాగా కాపాడాడు. రాయలసీమలో పుట్టిన అపర దానకర్ణుడు వెంగళరెడ్డి. రాయలసీమ ప్రజలు ఇప్పటికి ఇతని దాతృత్వాన్ని గురించి చెప్పుకుంటారు. వంటమనిషి గంగన్న ఆకాలంలో చేసిన సేవలకు మెచ్చిన రెడ్డిగారు అతనికొక బంగారు కడియం తొడిగి సత్కరించారు. అనంతర కాలంలో స్వగ్రామంలో పాఠశాలను నెలకొల్పి శివరామశాస్త్రి అనే పండితుని కుటుంబాన్ని పోషిస్తూ విద్యాదానం చేశారు.

కరవు బారిన పడిన పేదలకు తన ఆపన్న హస్తం చాచి కడుపు నిండా అన్నం పెట్టి కలియుగ దానకర్ణుడని పేరుపొందిన బుడ్డా వెంగళరెడ్డి. తనకు ఉన్నాదంతా దానం చేసిన ఈ మహానుభావుని దాతృత్వానికి పరాయి పాలకులకు సైతం ఆశ్చర్యం వేసింది. అందుకే విక్టోరియా మహారాణి ఈయన సేవలను గుర్తించి బంగారు పతకాన్ని బహుమానంగా ఇచ్చింది. ప్రభుత్వం ఈయన్ను ప్రొవిన్సియల్ జ్యూరీ యొక్క సభ్యునిగానూ, మద్రాసు గవర్నరు కౌన్సిల్ యొక్క గౌరవ సభ్యునిగానూ చేసి గౌరవించింది. ఈ సన్మాన సభ ఢిల్లీలో 1877 జనవరి 1వ తేదీన జరిగింది. ఆ బంగారు పతకముపై క్రింది విధంగా చెక్కబడినది. "1866వ సంవత్సరంలో సంభవించిన క్షామకాలమందు, నిరాధారముగా నుండిన, తన స్వదేశస్థుల పట్ల జరిపించిన ఉత్కృష్ట ఔదార్యమునకు గాను, హర్ మైజెస్టి రాణిగారి వల్ల చేయబడిన శ్రేష్టమైన గణ్యతకు ఆనవాలుగా బుడ్డా వెంగళరెడ్డిగారికి బహుమానమివ్వబడినది."
ఈ బంగారు పతకం నేటికీ ఉయ్యాలవాడ గ్రామంలో ఉంది. మహాదాత అయిన వెంగళరెడ్డి కరువు సమయంలో రైతులు చేసిన అప్పులను తీర్చుటకు తన పంట పొలాలన్ని అమ్మేశాడు. తన వల్ల తన వంశానికి అపకీర్తి రాకూడదని భావించి ఆ ఏర్పాటు చేయడం అలనాటి రఘువంశ సాంప్రదాయాన్ని అద్దంలా చూపుతుంది. వెంగళరెడ్డి దానగుణాలను, త్యాగశీలతను గురించి నాడు చాలా మంది రచయితలు కథలుగా కూడా రాశారు.
రెడ్డిగారు ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు స్వగ్రామంలోని అగస్తేశ్వర దేవాలయంలో ఉత్సవాలు జరిపి, పండితులను సత్కరించి, అన్నదానాలు చేసేవారు.
మహాదాతగా పేరుగాంచిన వెంగళరెడ్డి గారు డిసెంబరు 31 1900 తేదీన శివసాయుజ్యాన్ని పొందారు. ఆతని కీర్తి ఆచంద్రతారార్కం నిలుస్తుంది. అతన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలు వివిధ జానపద కళలలో అతన్ని కీర్తిస్తుంటారు.

Budda Vengal Reddy (30 May 1822 – 31 December 1900) - Biography - అపర దానకర్ణుడు బుడ్డా వెంగళరెడ్డి- ఆస్తి మొత్తం దానధర్మాలకి వినియోగం - విక్టోరియా మహారాణి ఈయన సేవలను గుర్తించి బంగారు పతకాన్ని బహుమానం- డొక్కల కరువు ఈయన చేసిన సాయం ఆ ప్రాంతాల్లో ఇప్పటికి కధలు కధలు గా చెప్పుకొనే వైనం.....
1800-1900 ప్రాంతాల్లో రేనాటి సీమను ఇద్దరు మహనీయులు పునీతం చేశారు। ఇద్దరు కర్నూలు జిల్లా నొస్సం మండలం ఉయ్యాలవాడ వాస్తవ్యులే కావడం కూడ విశేషమే.ఒకరు కంపెనీ పాలన మీద కత్తి దూసి స్వేచ్చకోసం పోరాడి ఉరికొయ్యకు బలీయిపోయి తరువాతి స్వాత్రంత్ర ఉద్యమానికి ప్రేరణ ఇచ్చిన వాడు। చైతన్యం నింపినవాడు. స్వాతంత్ర కాంక్షను రగిలించి మండే సూర్యుడయ్యాడు. అందుకే రేనాటి సూర్యుడు- విప్లవసింహం ఉయ్యాలవాడ నారసింహరెడ్డి. మరొకరు కరవు బారిన పడిన పేదలకు తన ఆపన్న హస్తం చాచి కడుపు నిండా అన్నం పెట్టి కలియుగ దానకర్ణుడని పేరుపొంది రేనాటికి చల్లని వెన్నెల పంచిన చంద్రుడు -- బుడ్డా వెంగళరెడ్డి.
వీరిద్దరి గుర్తుగా రేనాటి సూర్యచంద్రుల స్మారక సమితిని స్థాపించారు. వీరిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీన స్మారక సభ సమావేశం నిర్వహిస్తారు.

0 comments:

Post a Comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top