Search This Blog

 • 🖨️ Inter Hall tickets NEW...
 • MORE TO VIEW

Monday, 10 December 2018

Bhairavakona Temple - History, Waterfalls -అందాల హ‌రివిల్లు భైర‌వకోన‌ - అద్భుత గుహాలయాలు -అష్ట శివలింగాల పుణ్య క్షేత్రం - దారితప్పిన వారికీ అడవిలో దారి చూపే కాలభైరవుడు- 200 మీటర్లు ఎత్తునుంచి దూకే భైరవకోన జలపాతం - HM TV Youtube History of Bhairavakona Temple(Prakasam District)

Bhairavakona Temple - History, Waterfalls -అందాల హ‌రివిల్లు భైర‌వకోన‌  - అద్భుత గుహాలయాలు -అష్ట శివలింగాల పుణ్య క్షేత్రం - దారితప్పిన వారికీ  అడవిలో దారి చూపే కాలభైరవుడు- 200 మీటర్లు ఎత్తునుంచి దూకే భైరవకోన జలపాతం 

అందాల హ‌రివిల్లు భైర‌వకోన‌
భైరవకోన - అద్భుత గుహాలయాలు !
అష్ట శివలింగాల పుణ్య క్షేత్రం
అడవిలో దారి చూపే కాలభైరవుడు

భైరవ కోన 9వ శతాబ్దానికి చెందిన ఓ అద్భుత శివాలయం.
ప్రకాశం జిల్లాలోని చంద్రశేఖరపురం మండలం, కొత్తపల్లి గ్రామానికి దగ్గరలో ఈ ఆలయం  ఉంది.

పల్లవులకాలంనాటి అద్భుత శిల్పకళకు నిలువుటద్దం  భైరవకోన .  పురాతన గుహలకు నెలవు  ఈ ప్రాంతం.
సుమారు 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నల్లమల అరణ్యంలో ఎక్కడచూసినా దేవీదేవతల శిలారూపాలే కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఓ కొండలోనే ఎనిమిది ఆలయాలు చెక్కిన వైనం ఎంతో అపురూ పంగా అనిపిస్తుంటుంది.
కొండల్ని తొలిచి ఆలయాలుగా చెక్కడం అన్నది ప్రాచీనకాలంనుంచి ఉన్నదే. ఆంధ్రప్రదేశ్‌ లో వీటి జాబితా చాలానే ఉంది. గుంటుపల్లి, ఉండవల్లి, మొగల్రాజపురం (విజయవాడ), బొజ్జనకొండ, శ్రీపర్వతం, లింగాలమెట్ట గుహలన్నీ ఈ కోవకు చెందినవే. అయితే ఈ  భైరవకోన గుహలకు పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యం ఉంది.

ఒకే కొండరాతిలో చెక్కిన ఎనిమిది  గుహాలయాలు. వీటిలో అడుగడుగునా పల్లవ శిల్పకళ కనిపిస్తుంటుంది. ఒకే కొండలో మలిచిన ఎనిమిది శివాలయాలనూ ఏకకాలంలో ఇక్కడ దర్శించుకోవచ్చు. వీటిలో ఏడు దేవాలయాలు తూర్పుముఖంగా, ఒక్కటి మాత్రం ఉత్తర ముఖంగా చెక్కబడ్డాయి. అన్నీ శివాలయాలు.  అవి శశినాగ, రుద్రేశ్వర, విశ్వేశ్వర, నగరికేశ్వర, భార్గేశ్వర, రామేశ్వర, మల్లికార్జున, పక్షమాలిక లింగాలు.  గుహలంటే మరీ లోతుగా వుండవు.  మనం లోపలకు వెళ్ళక్కరలేకుండానే దైవ దర్శనం చేసుకోవచ్చు.  ఆ గుహాలయాల వెలుపల అందమైన శిలా మూర్తులు.   భారత దేశంలో ఎక్కడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఒకే చోట పూజించే ఆలయాలు వున్నట్లు లేదు.  కానీ ఇక్కడ మాత్రం, త్రిమూర్తులు ఒకే చోట కొలువైవున్నారు.  శివునికోసం చెక్కిన ఈ గుహాలయాలలో శివుడు మధ్యన గర్భగుడిలో లింగరూపుడై పూజలందుకుంటుంటే, ఆలయ ప్రవేశ గోడమీద బ్రహ్మ, విష్ణువుల విగ్రహాలు చెక్కి వున్నాయి.  ప్రతి ఆలయానికి ముందు ఎడమవైపు  విఘ్నేశ్వరుడు, కుడివైపు ఆలయం చెక్కిన శిల్పి (పూజారులు చెప్పిన విషయం) విగ్రహాలుంటాయి.  ఈ ఆలయాలన్నీ ఒకే శిల్పి చేత చెక్కబడటం విశేషం.ఆ ఆలయాలన్నీ చెక్కిన శిల్పి సమాధి కూడా ఆ కోన లోనే  ఉంది.

వీటన్నింటిలోనూ గర్భాలయాలూ, వరండాలూ స్తంభాలూ అన్నీ ఆ కొండ రాయితోనే మలచగలగడం విశేషం. శివలింగాలను మాత్రమే గ్రానైట్‌ శిలలతో చెక్కి ప్రతిష్ఠించారు. ఈ గుహాలయాల్లో నెలకొన్న ప్రధానదైవం భర్గేశ్వరుడు. ఈ ప్రాంతానికి క్షేత్రపాలకుడు భైరవుడు.ఆయనపేరుమీదే దీన్ని భైరవక్షేత్రంగా పిలుస్తున్నారు.అయితే ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని కాలభైరవుడు అనే చక్రవర్తి పాలించాడనీ అందుకే ఇది భైరవకోన అయిందనీ అంటారు. అందుకు సాక్ష్యంగా ఈ ప్రాంతం చుట్టూ కోటల ఆనవాళ్లు  కనిపిస్తుంటాయి.
ఇక్కడున్న దుర్గాంబ ఆలయంలో అమ్మవారి విగ్రహం మీద కార్తీకపౌర్ణమి రోజున చంద్రకిరణాలు పడటం భైరవకోనకున్న మరో విశేషం. అందుకే ఆరోజున భక్తులు విశేషంగా ఇక్కడకు తరలివస్తుంటారు. శివరాత్రికి పక్కనే ఉన్న జలపాత సేలయేటిలో స్నానంచేసి శివరూపాల్ని దర్శించుకుంటారు.
ఇక్కడ కొలువుతీరిన శివలింగాలు సుప్రసిద్ధ క్షేత్రాల్లోని శివలింగాల్ని పోలి ఉండటంతో వీటిని కూడా ఆ పేర్లతోనే పిలుస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని అమరనాథ్‌లో కన్పించే శశినాగలింగం, మేరు పర్వత పంక్తిలోని రుదల్రింగం, కాశీగంగాతీరంలోని విశ్వేశ్వరలింగం, తిరుమల కొండల్లోని నగరికేశ్వ రిలింగం, భర్గేశ్వరలింగం (ఇక్కడి ప్రధానదైవం) రామనాథపురం సముద్రతీర ప్రాంతంలోని రామే శ్వరలింగం, శ్రీశైలంలోని మల్లికార్జునలింగం, మందరపర్వతంలోని పక్షఘాతలింగం పేర్లతో వీటిని ఆరాధిస్తున్నారు.


ఒక కొండమీదకి మెట్లు ఎక్కి వెళితే ఒక  దుర్గాలయం ఉంది.  ఇంకో చిన్న కొండమీదకి మెట్లు..లక్ష్మీ, అన్నపూర్ణాలయాలనే బోర్డు ఉంటుంది  పైకి వెళ్తే చిన్ని గుహ, మనిషి కూర్చుని వెళ్ళాలి లోపలికి..లోపల ఇద్దరు / ముగ్గురు  కూర్చోవచ్చు.  లోపల లక్ష్మీదేవి, అన్నపూర్ణేశ్వరీదేవి చిన్న విగ్రహాలు ఉంటాయి. అక్కడ పూజారిగారు శ్రీ కాశీరెడ్డి నాయనగారి శిష్యులు.

ఇక ఈ క్షేత్రాన్ని దర్శించడం కోసం అడవిలో ప్రవేశించి దారితప్పిపోయిన వాళ్లు ఎందరో ఉన్నారు. అలా దారి తప్పిన వాళ్లు మరింత ప్రమాదకరమైన అడవిలోకి వెళ్లేవాళ్లు. అలాంటి పరిస్థితుల్లో చిక్కుబడిన భక్త బృందాలు తిరిగి ఆలయం దగ్గరికి క్షేమంగా చేరుకునేవి. ఓ కుక్క దారి చూపడం వలన తాము క్షేమంగా తిరిగి రాగలిగామని వాళ్లు తమ అనుభవాలను చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ కుక్క రూపంలో భక్తులకు సాయపడుతూ వస్తున్నది సాక్షాత్తు భైరవుడేనని అందరూ విశ్వసిస్తుంటారు


అంతేకాదు ఈ ప్రాంతం అనేక ఔషధ మొక్కలకు పుట్టినిల్లు కూడా. ఆయుర్వేద వైద్యానికి అవసరమైన ఎన్నో మూలికల్ని ఇక్కడనుంచే సేకరిస్తుంటారు.
ఈ ఆలయాల నిర్మాణం ఏడో శతాబ్దం నుంచి చాళుక్యులకాలం వరకూ అంటే 11వ శతాబ్దంవరకూ కొనసాగి ఉంటుందని అంచనా.
భైరవకోనకు వెళ్లాలంటే ప్రకాశం జిల్లా అంబవరం...  కొత్తపల్లి చేరుకుంటే  ఉదయం నుంచి రాత్రి 10 గంటలవరకూ బస్సు సౌకర్యం ఉంటుంది. అటవీప్రాంతం కాబట్టి నిర్వాకులు ఇక్కడ నిత్యాన్నదానాన్ని ఏర్పాటుచేశారు. ఓ చిన్న అతిథి గృహం కూడా ఉంది. అంతకు మించి వసతులు లేవు. తప్పని సరిగా చూడాల్సిన క్షేత్రమిది.

భైరవకోన జలపాతం 

భైరవకోన లో కొండల మధ్య నుంచి దూకే జలపాతం యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తుంది.
 200 మీటర్ల ఎత్తునుంచి దూకే జలపాతం.  జలపాతంలో నీరు వున్నా వేసవికాలంలో నీరు అతి తక్కువగా వుంటుంది.  కొండలమీదనుంచి కారే ఆ అతి తక్కువ నీరు కిందనిర్మింపబడ్డ పెద్ద సిమెంటు టబ్ లలో చేరుతాయి.  వచ్చినవారందరూ అక్కడ స్నానం  చేస్తున్నారు.    ఈ జల ప్రవాహం తను పయనించే దోవలో వున్న వివిధ  వైద్య మూలికలను ఒరుసుకుని ప్రవహించటంతో ఆ నీటిలో స్నానం చేసినవారికి అనేక రుగ్మతలనుంచి విముక్తి లభిస్తుందిని ఇక్కడివారి నమ్మకం.  అందుకే నీరు ఎంత తక్కువ వున్నా వచ్చినవారిలో చాలామంది స్నానం చేస్తుంటారు. ఈ జలపాతం కింద పిల్లలు, పెద్దలు తడుస్తూ ఆనందించవచ్చు. నింగిని తాకేలా వృక్షాలు, పక్షులకిలకిలారావాలు, ఆహ్లాదభరితవాతావరణం తప్పక ఉత్సాహాన్ని కలిగిస్తాయి.


పూర్వం ఈ ప్రాంతాన్ని అభివృధ్ధి పరచినవారిలో శ్రీ అన్నకావిళ్ళ సుబ్బయ్యతాత అనే ఆయన ముఖ్యులు.  ఈయన విగ్రహం ఇక్కడ వున్నది.  ఇక్కడ అన్నపూర్ణేశ్వరీమాత కొలువైవుండటానికికూడా ఆయనే కారణం.  ఆయన శివ భక్తుడు.  శివుడు స్వప్న దర్శనమిచ్చి నిన్ను కరుణిస్తానన్నాడట కానీ ఎన్నాళ్ళకూ కనికరించలేదుట.  అప్పుడాయన అమ్మతో మొరబెట్టుకున్నాడుట.  అమ్మ ఆయన ఆర్తి గమనించి అన్నపూర్ణేశ్వరీ రూపాన కనిపించినదట. మరి నిన్ను నేను కరుణిస్తే నాకేమిస్తావని భక్తుడికి పరీక్షపెట్టినదట.  అప్పుడా భక్తుడు నాదగ్గరకొచ్చినవాళ్ళకి నేను మంచి చెయ్యాలి.  అలా నాకు వరమివ్వు.  నేను బతికున్నంతకాలం నీకు ఏదోవిధంగా నైవేద్యం పెడతానని చెప్పాడుట.  ఆయన పరోపకార తత్వాన్ని గ్రహించిన జగజ్జనని ఆయన్ని అనుగ్రహించటమేగాక అన్నపూర్ణాదేవిగా అక్కడే స్ధిరపడ్డది.
కాలచక్ర భ్రమణంలో కొంతకాలం  మరుగునబడిన ఈ ప్రదేశం తిరిగి 1932లో బయటపడింది.  1949లో శ్రీ కాశీరెడ్డినాయన ద్వారా అందరికీ తెలిసింది.  అద్భుతమైన పర్యాటకప్రాంతంగా అభివృధ్ధి చెయ్యటానికి అన్నివిధాలా తగిన ప్రదేశం ఇది.

History of Bhairavakona Temple(Prakasam District)

0 comments:

Post a Comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top