Wednesday, 12 December 2018

Best Places To Celebrate Christmas In India- క్రిస్మస్‌ పండుగను మధురంగా మార్చే ప్రాంతాలు

క్రిస్మస్‌ పండుగను మధురంగా మార్చే  ప్రాంతాలు

ఇండియాలో క్రిస్మస్ వేడుకలు జరుపుకొనే ప్రదేశాలు ఎక్కడైనా ఉన్నాయా అంటే అవి పోర్చుగీసు వారు పాలించిన ప్రాంతాలు అని చెప్పవచ్చు. ఆ ప్రదేశాల్లో చర్చీలను క్రిస్మస్ రోజున ఎప్పుడూ లేనంత అందంగా ముస్తాబు చేస్తారు. క్రిస్మస్ రోజున ఉదయాన్నే చర్చీలన్నీ కీర్తనలతో మారుమ్రోగుతుంటాయి.

క్రైస్తవులు తమ దేవుడైన యేసుక్రీస్తు పుట్టినరోజును స్మరించుకుంటూ జరుపుకునే క్రిస్మస్‌ వారికి ఎంతో ముఖ్యమైన పండుగ. డిసెంబర్‌ ప్రారంభమవగానే చర్చ్‌లు, ఇళ్లు, పలు దుకాణాలు క్రిస్మస్‌ హడావిడితో నిండిపోతాయి. శాంటా క్లాస్‌ (క్రిస్మస్‌ తాత) దుస్తులతో, విద్యుద్దీపాలతో అలంకరించిన క్రిస్మస్‌ చెట్లు, వీధివీధికి రకరకాల రంగులతో నిలిచే క్రిస్మస్‌ స్టార్‌లతో (నక్షత్రాలతో), యేసుక్రీస్తు పుట్టిన ప్రదేశానికి గుర్తుగా తయారు చేసే పశువుల పాక వంటి వాటితో నెలంతా సందడి నెలకొంటుంది. బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటుగా, ప్రత్యేక బహుమతులను అందించి క్రిస్మస్‌ ఆనందాన్ని పంచుకుంటారు. చాలాసార్లు ఒకే చోట క్రిస్మస్‌ పండుగ జరుపుకొని కొత్తదనం కొరవడితే ఇండియాలోని కింది ప్రాంతాలు మీకు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి.

గోవా

గోవాలో అప్పుడే క్రిస్మస్ సందడి మొదలైనది. దేశ విదేశాల్లో స్థిరపడ్డ గోవా ప్రజలు సైతం క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనటానికి వస్తున్నారు. చర్చీలన్నీ అప్పుడే విద్యుద్దీపకాంతుల్లో మునిగితేలాయి. గోవా లోని ప్రధాన షాపింగ్ ప్రదేశాలన్నీ పర్యాటకులతో కిటకిటలాడుతున్నాయి. గోవా లోని చర్చీలన్నీ కూడా పోర్చుగీసువారి పాలనలో నిర్మించినవే.

అత్యధికంగా కతోలిక క్రైస్తవులు నివసిస్తున్న ప్రాంతం కావడంతో డిసెంబర్‌ మొదటి వారంలో వచ్చే ఆడ్వెంట్‌ నుంచే ఇక్కడ సంబరాలు మొదలవుతాయి. పట్టణమంతా క్రిస్మస్‌ పూలతో (పోయిన్‌సెట్టియా), రంగురంగుల విద్యుద్దీపాలతో, అలంకరిస్తారు. చర్చ్‌లు అన్నింటి మీదా పెద్ద స్టార్‌లను అమరుస్తారు. బీచ్‌ల దగ్గర హోటళ్లు, రెస్టారెంట్లు క్రిస్మస్‌ గంటల మ్యూజిక్‌తో పాటు పలు రకాల క్రిస్మస్‌ వంటకాలను తయారుచేస్తారు. క్రిస్మస్‌ ముందు రోజు రాత్రంతా చర్చిలలో ప్రత్యేక ఆరాధనలు, ప్రార్థనలు నిర్వహిస్తారు.

పాండిచ్చేరి 

పాండిచ్చేరి దక్షిణ భారత దేశంలో ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం. ఈ ప్రదేశాన్ని పోర్చుగీసు వారు పాలించారు కనుకనే దీనిని పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి అని పిలుస్తుంటారు. ఇక్కడ కూడా క్రిస్మస్ వేడుకలు అధికారికంగా నిర్వహిస్తుంటారు. చర్చీలన్నీ కూడా ఆ సమయంలో అందంగా అలంకరించబడి ముస్తాబు చేస్తారు, చర్చీలలో ప్రత్యేకమైన ప్రార్థన లు నిర్వహిస్తారు. ఇక్కడి చర్చీలలో ప్రధానమైనది చర్చ్ అఫ్ సేక్రేడ్ హార్ట్ అఫ్ జీసస్. ఏసుక్రీస్తు జీవిత చరిత్రను, కాలాన్ని తెలిపే అద్దాలు, కిటికీలను ఇక్కడ గమనించవచ్చు.

గోవాలాగే పుదుచ్చేరి కూడా క్రైస్తవులు అధికంగా ఉన్న ప్రాంతం కావడంతో పట్టణంతా డిసెంబర్‌ ప్రారంభం నుంచే క్రిస్మస్‌ సందడి అలుముకుంటుంది. ఈ ప్రాంతం మీద ఫ్రెంచ్‌వారి ప్రభావం ఎక్కువగా ఉండడంతో సహజంగానే వారి ఆచారాలు, వంటకాలు కొన్ని ఇక్కడ కనిపిస్తాయి. ఇతర ప్రదేశాలతో పోలిస్తే పుదుచ్చేరిలో క్రిస్మస్‌ ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న యేసు తిరుహృదయ బసిలికా దేవాలయంలో క్రిస్మస్‌ సంబరాలు అంబరాన్ని అంటుతాయి.

 కేరళ

చర్చ్‌లకు పుట్టినిల్లుగా పిలిచే కేరళలో క్రిస్మస్‌ను ఘనంగా నిర్వహిస్తారు. యేసుక్రీస్తు శిష్యులలో ఒకరైన సెయింట్‌ తోమాస్‌ రాక తర్వాత ఇక్కడ ఈ పండుగ జరపడం ప్రారంభమయిందని చరిత్రకారులు చెబుతున్నారు.

ప్రతి వీధిలో ప్రత్యేక దీపాలను వెలిగిస్తారు. తమ ఇళ్ల మీద కూడా స్టార్‌లను అమర్చి అందులో రంగులను చిమ్మే లైట్లను అమరుస్తారు. చర్చ్‌లలో కారోల్స్‌ నిర్వహిస్తారు. ప్రత్యేక ప్రార్థనలతో పాటు ప్రత్యేక గంటలను మోగిస్తారు. ప్లమ్‌ కేక్స్‌ను క్రిస్మస్‌ ప్రత్యేక వంటకంగా తయారు చేసుకుంటారు. పలు హోటళ్లలో ప్రత్యేక రాయితీలను అందిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తారు.

షిల్లాంగ్ 

తూర్పు స్కాట్లాండ్ గా పిలువబడే షిల్లాంగ్ మేఘాలయ రాజధాని. ఇక్కడ షిల్లాంగ్ యొక్క అద్భుత కట్టడం అయిన కేథడ్రాల్ కాథలిక్ చర్చి ఉన్నది. అధికారికంగా క్రైస్తవులు మేరీ సహాయ కేథడ్రల్ అని అంటారు.

 సుమారు 3,00,000 పై చిలుకు మందికి పైగా కాథలిక్కులు కేథడ్రల్ లో ప్రార్థన లు చేస్తారు. క్రీస్తు యొక్క కథనాలతో చిత్రకళా శిలువతో 14 కేంద్రాలు ఉన్నాయి. కిటికీలు కూడా అనేక రంగులలో పేయింట్ చేసి ఉంటాయి. కేథడ్రాల్ పై భాగం నుండి చర్చి శిలువ వంటి ఆకృతి చూడవచ్చు. క్రిస్మస్ సమయంలో ఈ చర్చి ఎంతో ముస్తాబుగా అలంకరించబడి ఉంటుంది.

మనాలి

మంచు కురిసే ప్రదేశంలో క్రిస్మస్‌ (వైట్ క్రిస్మస్‌) జరుపుకోవాలన్నది మీ కోరికా..! అయితే మనాలి బెస్ట్‌ ఛాయిస్‌గా నిలుస్తుంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతం తెల్లని మంచుతో పండుగను వేరే దేశంలో జరుపుకున్న అనుభూతిని అందిస్తుంది.
మనాలి లో హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న ఒక టూరిస్ట్ స్పాట్. ఇక్కడ క్రిస్మస్ వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు. మంచుచే కప్పబడిన ఈ ప్రదేశంలో మంచుతో మనిషి బొమ్మలను, బంతులను తయారు చేసుకొని ఆనందించవచ్చు

ఇక్కడకు క్రిస్మస్‌కు వచ్చేవారు తమ మిత్రులు, కుటుంబ సభ్యుల మీద మంచు ముద్దలు విసురుకొని ఆనందిస్తుంటారు. పండుగ అర్ధరాత్రి జరిగే ప్రార్థనల్లో పాల్గొనడం మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. చలికాలంలో మనాలికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ క్రిస్మస్‌ను జరుపుకోవాలి అనుకునే వారు ముందుగానే హోటళ్లను బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

.డామన్ మరియు డయ్యు

 డామన్ మరియు డయ్యు రెండు ప్రాంతాల కలయిక. ఇక్కడ కూడా క్రిస్మస్ వేడుకలను వైభవంగా నిర్వహిస్తారు.

ఆ సమయంలో డయ్యు లోని సెయింట్ థామస్ చర్చి, సెయింట్ పాల్ చర్చి లో ప్రత్యేకమైన ప్రార్థన లు జరుపుతారు. డామన్ లోని రెమిడీస్ లేడి ప్ర్రార్థనాలయం, రోసరీ లేడి ప్రార్థనాలయం, బోమే జీసస్ చర్చి మరియు అంగుస్థీఅస్ లేడి ప్రార్థనాలయంలో క్రిస్మస్ సందర్భంలో ప్రత్యేకమైన ప్రార్థన లు నిర్వహిస్తారు

 దాద్రా నాగర్ హవేలీ

 దాద్రా నాగర్ హవేలీ ఒక కేంద్ర పాలిత ప్రాంతం. భారత దేశానికి పశ్చిమం వైపున అరేబియా సముద్రానికి దగ్గరిలో ఉన్న సిల్వస్సా దీనికి రాజధాని.

ఇక్కడ ఉన్న రోమన్ క్యథలిక్ చర్చి దేశంలో ప్రసిద్ధి చెందినది. దీనిని క్రీ.శ.1886 - 1889 మధ్యలో నిర్మించినారు. ఈ చర్చి యొక్క వైభవోపేతమైన నిర్మాణం మరియు బాహ్య వంపులు దాని కళాత్మకంగా రూపొందించిన తీరు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. క్రిస్మస్ సమయంలో ఈ చర్చి కి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు.

1 comment:

  1. Christmas celebrations ...very nice article qnd good information

    ReplyDelete

AP UPDATES

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top