Search This Blog

Monday, 17 December 2018

Ashfaqulla khan Biography-( 22 అక్టోబర్ ,1900 - 19 డిసెంబర్ 1927 )అష్ఫాకుల్లా ఖాన్ - దేశంకోసం 27 ఏళ్లకే అమరుడైన స్వాతంత్ర్య సమరయోధుడు! "నా దేశ స్వాతంత్రం కోసం ఉరికంభమెక్కిన ప్రప్రధమ ముస్లింనైనందుకు నేను గర్వపడు తున్నాను" .అన్నది ఈయన చివరి సందేశం

Ashfaqulla khan Biography-( 22 అక్టోబర్  ,1900 - 19 డిసెంబర్ 1927 )అష్ఫాకుల్లా ఖాన్ - దేశంకోసం 27 ఏళ్లకే అమరుడైన స్వాతంత్ర్య సమరయోధుడు! "నా దేశ స్వాతంత్రం కోసం ఉరికంభమెక్కిన ప్రప్రధమ ముస్లింనైనందుకు నేను గర్వపడు తున్నాను" .అన్నది ఈయన చివరి సందేశం 

Ashfaqulla khan Biography-( 22 అక్టోబర్  ,1900 - 19 డిసెంబర్ 1927 )అష్ఫాకుల్లా ఖాన్ - దేశంకోసం 27 ఏళ్లకే అమరుడైన స్వాతంత్ర్య సమరయోధుడు! "నా దేశ స్వాతంత్రం కోసం ఉరికంభమెక్కిన ప్రప్రధమ ముస్లింనైనందుకు నేను గర్వపడు తున్నాను" .అన్నది ఈయన చివరి సందేశం




నామాతృభూమిని ఆంగ్లేయుల శృంఖలాల నుంచి విముక్తం చేయాలను కున్నాను. నా త్యాగం వృథా కాదు. మరెందరో త్యాగధను లకు స్ఫూర్తినిస్తుంది. నా హిందూస్థాన్ స్వేచ్ఛా వాయు వులు పీలుస్తుంది. చాలా త్వరగా బానిస సంకెళ్ళు తెగి పోతాయి. దేశంలోని ఏడు కోట్ల ముస్లింలలో దేశ స్వాతంత్య్రం కోసం ఉరికం బాన్ని ఎక్కబోతున్న మొట్ట మొదటి అదృష్టవంతుడుగా గర్వపడుతు న్నాను" అంటూ అష్ఫాఖుల్లా ఖాన్ ఉరితాడు ను ముద్డాడి మెడలో తానే వేసుకున్నాడు.


నా దేశ సోదరులారా! మీరు మొదట భారతీయులు. ఆ తర్వాతే వివిధ మతాలవారు. మీరే మతం వారైనప్పటికీ పరస్పరం కలహించుకోకండి. ఐక్యమ త్యం తో ఆంగ్లేయుల ను ఎదిరించండి. దేశ విముక్తే మన లక్ష్యం కావాలి"

అష్ఫాఖుల్లా ఖాన్ భారతమాత స్వేచ్ఛ కోసం సర్దార్ భగత్‌సింగ్, రాజగురు, సుఖదేవ్‌ల కంటే నాలుగు సంవత్స రాల ముందే ఉరిశిక్షపడిన దేశభక్తుడు అష్ఫాఖుల్లా ఖాన్

అష్ఫాఖుల్లా ఖాన్

బాల్యము

అష్ఫాకుల్లా ఖాన్ ఉత్తర ప్రదేశ్ లోని షాజహాన్‌పూర్ లో 22  octob 1900
జన్మించాడు. ఈయన తండ్రి షఫీకుర్ రెహమాన్ పొలీసు శాఖలో పనిచేసేవాడు. తల్లి పేరు మజ్హరున్నీసా. అష్ఫాకుల్లా ఈ దంపుతుల ఆరుగురు సంతానములో చివరివాడు. మహాత్మా గాంధీ సహాయనిరాకరణోద్యమము ప్రారంభించినప్పుడు అష్ఫాక్ పాఠాశాలలో చదువుతున్నాడు.

సహాయనిరాకరణోద్యమము

మహాత్మాగాంధీ, చౌరీ చౌరా ఉదంతము తర్వాత సహాయనిరాకరణోద్యమము నిలిపివేయడముతో అనేక మంది భారతీయ యువకులు నిరాశ చెందారు. అలాంటి యువకులలో అష్ఫాక్ ఒకడు. ఈయన భారతదేశాన్ని వీలయినంత త్వరగా పరాయి పాలన నుండి విముక్తము చేయాలన్న తపనతో, అతివాద ఉద్యమకారులతో చేరాడు. ఈ సమయములోనే ఈయనకు షాజహాన్‌పూర్ కు చెందిన ప్రముఖ ఉద్యమకారుడు రాంప్రసాద్ బిస్మిల్ తో పరిచయమేర్పడింది.

రాంప్రసాద్ బిస్మిల్ తో స్నేహము

హిందూ మతము యొక్క గొప్పతనము గురించి ఇతర మతస్థులకు భోధించడానికి వెనుకాడని ఆర్య సమాజ్ సభ్యుడైన రాంప్రసాద్ బిస్మిల్ తో సాంప్రదాయ ముస్లిం మతస్థుడైన అష్ఫాకుల్లా ఖాన్ యొక్క స్నేహము కొంత విభిన్నమైనదే. అయినా వారిద్దరి సమిష్టి లక్ష్యము ఒకటే, భారత స్వాతంత్ర్యము. దీనితో ఇద్దరు మంచి మిత్రులయ్యారు. ఇద్దరూ ఒకే రోజు, కాకపోతే వేర్వేరు జైళ్లలో భారతదేశ స్వాతంత్ర్యము కోసం ప్రాణాలు అర్పించారు.

కాకోరీ రైలు దోపిడి

తమ సాయుధ ఉద్యమానికి ఊపునివ్వడానికి, సాయుధ పోరాటానికి కావలసిన ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రి కొనుగోలు చేయడానికి ఉద్యమకారులు 1925, ఆగష్టు 8 న షాజహాన్‌పూర్లో ఒక సభను నిర్వహించారు. చాలా తర్జనబర్జనల తర్వాత ఆ సభలో రైళ్లలో రవాణా చేసే ప్రభుత్వ కోశాగారాన్ని దోచుకోవాలని నిర్ణయించారు. ఆగష్టు 9న అష్ఫాకుల్లా ఖాన్ మరియు రాంప్రసాద్ బిస్మిల్, రాజేంద్ర లాహిరి, ఠాకూర్ రోషన్ సింగ్, సచీంద్ర బక్షీ, చంద్రశేఖర్ ఆజాద్, కేశవ్ చక్రవర్తి, బన్వారీ లాల్, ముకుంది లాల్ మరియు మన్మధనాథ్ గుప్త లు కలిసి కాకోరీ గ్రామము వద్ద ప్రభుత్వ ధనమును తీసుకెళుతున్న రైలును దోచుకున్నారు.

సెప్టెంబర్ 26, 1925 ఉదయాన పొలీసులు రాంప్రసాద్ బిస్మిల్ ను పట్టుకున్నారు. అష్ఫాక్ మాత్రము పోలీసులకు దొరకలేదు. ఆయన అజ్ఞాతముaలో బీహార్ నుండి బనారస్ కు వెళ్లి అక్కడ 10 నెలలపాటు ఒక ఇంజనీరింగ్ కంపెనీలో పనిచేశాడు. అజ్ఞాతములో మరెంతో కాలము ఉండలేక దేశానికి ఉపయోగపడుతుందని విదేశాలకు వెళ్లి ఇంజనీరింగు చదవాలని నిశ్చయించి, దేశాన్ని వదిలి వెల్లడానికి మార్గాలు అన్వేషిస్తూ ఢిల్లీ చేరాడు. అక్కడ ఒక పఠాన్ స్నేహితున్ని ఆశ్రయించాడు. కానీ అదే స్నేహితుడు అష్ఫాక్ ను వెన్నుపోటు పొడిచి పోలీసులకు ఆయన జాడ తెలియజేసాడు ".

అష్ఫాకుల్లా ఖాన్‌ను ఫైజాబాద్ జైల్లో బంధించి కేసు నమోదు చేశారు. అష్ఫాక్ పెద్దన్న రియాసతుల్లా ఖాన్ చివరి వరకు అష్ఫాక్ తరఫు న్యాయవాదిగా వాదించాడు. జైలులో ఉండగా ఈయన ఖురాన్ పఠనము చేసేవాడు. కాకోరీ దోపిడి కేసు రాంప్రసాద్ బిస్మిల్, అస్ఫాకుల్లా ఖాన్, రాజేంద్ర లాహిరి మరియు రోషన్ లకు మరణ శిక్ష్, మిగిలిన వారికి జీవిత ఖైదు విధించడముతో ముగిసినది.

మరణము

అష్ఫాకుల్లా ఖాన్ ను 1927, డిసెంబర్ 19 న ఉరితీశారు. షాజహాన్‌పూర్ లోని ఈయన సమాధి ఇప్పుడు ఒక స్మారక స్థలమైనది.


 కొందరు చరిత్రకారులు అష్ఫాకుల్లా ఖానే రాజద్రోహ నేరముపై ఉరితీయబడిన తొలి ముస్లిం అని భావిస్తారు. ఈయన దేశానికి తన చివరి సందేశములో "నా దేశ స్వాతంత్రం కోసం ఉరికంభమెక్కిన ప్రప్రధమ ముస్లింనైనందుకు నేను గర్వపడుతున్నాను" అని రాశాడు. "ఓ నా మాతృదేశమా సదా నీకు సేవ చేస్తూనే వుంటాను ఉరిశిక్ష పడినా,జన్మఖైదు విధించినా, బేడీల దరువుతో నీనామ స్మరణ చేస్తూనే వుంటాను" [హే మాతృభూమీ తేరి సేవా కియా కరూంగా, ఫాంసీ మిలే ముజే,యా హో జన్మఖైద్ మెరీ, బేడీ బజా బజా కర్ తేరా భజన్ కరూంగా"]--అష్ఫాకుల్లా ఖాన్ (ఉరి వేదిక మీద నుండి).

ఇదే రోజు ....

" 1927 డిశంబరు 19..భారతదేశచరిత్రలోనే అత్యంత విషాదకరమైన రోజు....భారత్ లోనే తొలి విప్లవసంస్థ అయిన"హిందూస్తాన్ సోషలిష్టు అసోషియేషన్ " సంస్థకు సంబంధించిన వ్యవస్థాపకుడైన రామ్ ప్రసాద్ బిస్మల్ , కార్యదర్శి అష్ఫాకుల్లాఖాన్ , సభ్యులు రోహన్ సింగ్ ,రాజేంద్రలహరిలను నిర్ధాక్షణ్యంగా "ఉరి"తీసినరోజు...
         రామ్ ప్రసాద్ బిస్మల్..కలం ఒక అగ్గ్నిగుండం. ప్రతి అక్షరం అగ్గ్నికణం. ఆయన దేశభక్తి కవితలే రాసారు..అతని కవితలు చదివి అష్ఫాకుల్లాఖాన్ ,చంద్రశేఖర్ అజాద్ ,భగత్ సింగ్ ,శివరాజ్ గురు,సుఖదేవ్ థాపర్ ,రోహన్ సింగ్ ,రాజేంద్రలహరి లాంటి యువకులు ఆయనను గురువుగా భావించారు. ఎందరో యువకులు విప్లవమార్గం వైపు మళ్ళారు.

అష్ఫాకుల్లాఖాన్ " దేశభక్తి అణువణువునా నింపుకున్న యువకుడు. మతస్థుల నుండి ఎన్ని అభ్యంతరాలు వచ్చినా చలించని యువకుడు.మతం వేరు,దేశం వేరు...మతం కంటే దేశమే గొప్పదని ధైర్యంగా బదులిచ్చిన సాహసవంతుడు..స్వాతంత్రపోరాటంలో ఉరిశిక్షను ఆహ్వానించిన తొలి ముస్లిమ్ .

రోహన్ సింగ్ ...ఇతను నేరం చేయకపోయినా మాతృభూమి స్వేచ్ఛకోసం ఆనందంగా ఉరికొయ్యకు వ్రేలాడిన యువకుడు.

రాజేంద్రలహరి- దేశస్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను ఆనందంగా అర్పించిన 26 యేండ్ల యువకుడు...

వీరు ప్రయాణించిన మార్గం విమర్శించవచ్చేమో గానీ,, వారి దేశభక్తిని శంకించనవసరంలేదు.వారు కూడా దేశ బానిసత్వసంకెళ్ళను తొలిగించడానికే ఉద్యమించారు.. వీరు ఏ మతానికి,కులానికి,ప్రాంతానికి సంబంధించినవారుకాదు...వారు భారతీయులు.మనస్వేచ్ఛకోసం అసులుబాసిన అమరులు...చరిత్ర వారిని గుర్తించకపోవచ్చుగానీ
మనం తప్పక గుర్తించాలి.
    "అమర రహే....అమరవీరులారా!!! అందుకోండి మా లాల్ సలామ్ లు"""

0 comments:

Post a Comment

AP UPDATES

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top